అగ్ని మహా పురాణము

Table of Contents

314 - అథ త్వరితాజ్ఞానమ్

అగ్ని రువాచః

ఆగ్ని దేవుడు పలికెను. ఓం హ్రీం హ్రూం ఖే, ఛే, క్షః , స్త్రీం, హ్రూం క్షే హ్రీం వట్ త్వరితాయై నమః యను మంత్రముతో న్యాస పూర్వకముగ ద్విభుజ లేదా అష్ట భుజ యగు త్వరితా దేవిని ధ్యానించుచు పూజించవలెను. సింహాసన మును దానిపై వున్న త్వరితాదేవిని ఆ దేవి నాల్గు వైపుల హృదయాద్యంగ ములను పూజించవలెను. పూర్వాదిక్కులందు హృదయాద్యంగములను పూజించి మండలము పై గాయత్రిని ప్రణీతాదేవిని పూజించవలెను. ఎనిమిది దశముల పై హుంకారీ, ఖేచరీ చండా, భేదినీ, షేపణీ, స్త్రీ హుంకారీ, క్షేమంకరులను పూజించి, మధ్య యందు పట్కారోణి పూజించవలెను. దేవికి ఎదురుగా మన్న ద్వారము యొక్క ఔషణ వామ పార్శ్వము లందు జయ విజయలను ద్వారాగ్రమున కింకరుని పూజించ వలెను. తిల హోమములు చేసినచో సకలాభీష్ట వస్తువులు నశించును. దేవికి అలంకారములగు ఎనిమిది నాగులను నా మో చ్చారణ పూర్వకముగ పూజించవలెను. ఆనంతాయ నమః సాహా. కులికాయ నమః స్వధా, వాసుకీ రాజాయ స్వాహా, శ లఖ పాలాయ వౌషట్, తక్షకాయ వషట్ , మహాపద్మాయ నమః కర్కోట నాగాయ స్వాహా, పద్మాయ నమః ఫట్ . ఇవి వాగ పూజా మంత్రములు.

పదినిలువు రేఖలు, పది అడ్డ రేఖలు, గీసినచో, ఎనుబది యొక్క పదములు ఏర్పడును, ఇది నిగ్రహ చక్రము, దీనిని వస్త్రము పై గాని, వేదిక పై గాని, భూర్జ వృక్షత్వక్కు పై గాని, శిలా పట్టము పై గాని, యష్టి కరిపై గాని, వ్రాయ వచ్చును. మధ్యవర్తికోష్టము నందు పేరు ప్రాయవలెను. దాని పార్శ్వ భాగమున పూర్వాది దిక్కుల యందు నాలుగు వట్టికలపై భ్రూం, క్రూ, భ్రూం, హ్రూం, యను నాలుగు బీజములు వ్రాసి ఈశానాది కోణములందు లోపలి వైపున కాళరాత్రి మంత్రమున వ్రాసి వెలుపలి వైపున యమరాజ మంత్రము వ్రాయవలెను. “కాళీ, మార మొదలు ఆక్షర" వరకును మూలో క్షమైనది. కాళీ మంత్రము యమావాట, మొదలు రీటట, వరకువున్న మూలోక మంత్రము యమ మంత్రము. యమ మంత్రము వెలుపల నలువైపుల రం వ్రాసి దాని క్రింద యం వ్రాయవలెను. దీనిచే మారణాత్మక నిగ్రహ మంత్రము ఏర్పడును. వేపచిగురు మజ్జ ర క్తము, విషము కలిపిన సిరాలో కొంచెము చితాబొగ్గు నూరి కలిపి దానిని పింగళ - వర్ణమగు సిరా బుడ్డిలో వుంచి, కాకి ఈక కలముతో నిగ్రహ మంత్రము వ్రాసి దానిని శ్మశాన భూమి దుందుకాని, చతుష్పథము నందుగాని, గోతిలో క్రిందికి పాతవలెను. లేదా పుట్టయందు వుంచవలెను. లేదా విభీతక దుమశాఖ క్రింద పాతవలెను. ఇట్లు చేయుటచే శత్రువు లందరును నశింతురు.

            శుక్ల పక్షమున భూర్ణ పత్రము నందును నేల పైనను గోడ పైనను లాక్షార సముతో గాని, కుంకుమతో గాని ఖడికా చందనముతో గాని అనుగ్రహ చక్రము వ్రాయవలెను. - మధ్యకోష్టమున, వ్యక్తి పేరు తం, ఠం, యను అక్షరముల మధ్య వ్రాసి పూర్వాది వీథియందు, జూం, స, వషట్, యనువది వ్రాసి, ఈశాన్యముతో ప్రారంభించి వీథిని విడ చుచు ఆగ్నేయము పర్యంతము లక్ష్మీ మంత్రమును వ్రాయవలెను. ఇది పై నాలుగు పంక్తులందును పూర్తి యగును. క్రింది నాలుగు పంక్తులలో అన్ని టికంటెను క్రిందనున్న నైఋతి కోణస్థ కోష్టము నందు ప్రారంభించి, కుడి పంక్తి తరవాత పై పంక్తి కూడ ఎడమనుండి కుడికి ప్రాయవలెను. ఈ విధముగా నాలుగు పంక్తులలో లక్ష్మీ మంత్రము పూర్తి యగును "శ్రీసా" మొదలు "జ్ఞేయ”  వరకును మూలోక్త మగునది లక్ష్మీ మంత్రము. చక్ర బహిర్భాగమున నలువై పుల త్వరిలా మంత్రము ప్రతిదిక్కువందును ఒక పర్యాయము చొప్పున వ్రాయవలెను. ఈచతురశ్ర చక్రమును గోళ్ళరేఖతో, ఆదికలశ లోనికి వెళ్ళునట్లు చుట్టి కలశ క్రింద ఇక కమలము ఏర్పరచి దాని పై కమలమును స్థాపించవలెను. కమలముపై స్థాపించిన పద్మ చకమును వ్రాసి, దానిని ధరించినచో మృత్యువు తొలగును, స్వర్గము లభించును. ఆది శాంత సాధనమునకు కూడ ఉపయోగించును. సౌభాగ్యాదులను ఇచ్చును.

పదకొండు నిలువురేఖలు పదకొండు ఆడ్డ రేఖలు గీసికూడ ఇరువది ఒక్క కోష్ఠములు ఏర్పరచి మద్య కోము నందు పేరు వ్రాయవలెను. ఈశాన్య కోష్ఠముతో ప్రారంభించి ప్రదక్షిణ క్రమమున పండ్రెండు పర్యాయములు త్వరితా విద్యారములను హీం, విడచి వ్రాయవలెను. రేఖాగ్ర భాగములందు త్రిశూల చిహ్నము వుంచవలెను. త్వరితా విద్యా వర్ణములను క్రమముగానే వ్రాసి అంతమున క్రింది వైపు వషట్, చేర్చవలెను. ఇది సర్వకామార్థ సాధకమగు ప్రత్యంగిరా విద్య ఎనుబది యొక్క కోశములు గల చక్రముపై త్వరితా విద్యాక్షరములను మొదటి అక్షరముతో ప్రారంభించి వ్రాయ వలెను, ఆరు పర్యాయములు మంత్రములు వ్రాసిన పిమ్మట అంతములందు మిగిలిన కోత్తముని పై పేరు ప్రొసి చివర  వషట్ చేర్చవలెను. యిడి రెండవ ప్రత్యంగిరా విద్య. సర్వార్థసాధికా ఆరువది నాలుకోష్టములుగల చక్రముపై గూడ నిగ్రహచక్రమును, అను గ్రహ చక్రమున వ్రాయవచ్చును. ఇది అమృతా విద్య. దీని మధ్య కోష్టమున క్రీతి, సః, హు'0, యనియు పేరును ప్రాయవలెను. బాహ్యభాగమున కమలము ఏర్పరచి దాని దళములపై విలోమ క్రమమున త్వరిలా విద్యను వ్రాయవలెను. దానిని హీం కారయుక్తములగు మూడు వృత్తాకార పంక్తులతో ష్టించి కుంభాకారము యంత్రము లోపల లిఖితములగు ఈ విద్యను ధరించుటచే సర్వ శత్రువులు నశింతురు. సర్వము లభించును. రోగి చెవిలో దీనిని జపించినచో సర్పాది విషయాలు శాంతించును. దీని ఆక్షరములతో చిహ్న తములగు దండ ములతో శరీరము పై కొట్టి నచో విషము శమించును.

అగ్ని మహాపురాణమాన త్వరితా మంత్రనిరూపణమను మూడువందల పదునాలుగవ అధ్యాయము సమాప్తము.