అగ్ని మహా పురాణము

Table of Contents

116 - గయాశ్రాద్ధర్థవిధి

ఆగ్ని రువాచః-

ఆగ్ని దేవుడు పలికెను :- మహానదిలో గాయత్రీమంత్రముతోచనే స్నానము చేసి సంధ్యోపాసన చేయవలెను. ప్రాతకాలమునందు గాయత్రీ సంముఖమున శ్రాద్ధ పిండదానములు అక్షయము లగున సూర్యోదయ సమయమునందు, మధ్యాహ్నకాలమునందును స్నానము చేసి గీతవాద్యాదులతో సావిత్రి ఉపాసన చేసి, తత్సంముఖమునే సంధ్యా వందన మాచరించి నదీతటమున పిండదానము చేయవలెను. పిదప అగస్త్యపదమున పిడదానము చేసి, యోనిద్వారమున ప్రవేశింభి జైటకు రావలెను. ఇట్లు చేసినవాడు మరల మాతృయోనియందు ప్రవేశించడు; అతనికి పునర్జన్మ ఉండదు. పిదప ఆకశిలపై బలి ఇచ్చి కార్తికేయునకు నమస్కారము చేయవలెను. స్వర్గద్వార “సోమకుండ పాయుతీర్ధములందు పిండ దానము చేయవలెను. పిదప ఆకాశగంగా - కపిలాతటములపై 'పిండదానము చేయవలెను: ఆచట కపిలేశ్వరుడగు శివునకు నమస్కరించి అమోఘపద గదాలోల - వాసరక గోప్రచార తీర్థములందు పిండప్రదానము చేయవలెను. వైతరణియందు గోవుకు నమస్కారము చేసి, పిండదానము చేసినవాడు ఇరువదియొక్క తరములను ఉద్దరించును. పై తరణి తీరముపై శ్రాద్దపిండదానములు చేసి 'పిదప క్రౌంచపాదమున పిండదానము చేయవలెను. తృతీయాతిథియందు విశాలా- నిశ్చిరా - ఋణమోక్ష - పాపమోక్షములందు పిండప్రదానము చేయవలెను. భస్మకుండమునందు భస్మస్నానము చేసినవాడు సర్వపాపవిముక్తుడగును. ఆచట జనార్దనునకు నమస్కరించి ఈ విధముగ ప్రార్థించవలెను. జనార్ధనా! ఈ పిండమును నీ చేతిలో ఉంచుచున్నాను. నా కిది పరలోకమునందు అక్షయరూపమున లభించుగాక. సాక్షాత్ విష్ణుమూర్తియే గయలో పితృదేవతారూపమున విరాజిల్లు చున్నాడు. ఆ పుండరీకాక్షుని దర్శనము చేసికొనినవాడు ఋణత్రయవిముక్తుడగును. పిదప మార్కండేయేశ్వరునకును గృద్రేశ్వరునకును నమస్కారము చేయవలెను. మహాదేవుని మూలవేత్ర మైన ధారలో పిండ ప్రదానము చేయవలెను. గృధ్ర కూట - గృధ్రవట - గౌతపాదములందు కూడ పిండ ప్రదానము చేయవలెను. పుష్కరిణి కర్దమాల - రామ తీర్థ ముందు పిండప్రదానము చేసి, ప్రభాసేశ్వరునకు నమస్కరించి, ప్రేతశిలపై పిండ ప్రదానము చేయవలెను.

ప్రేతశిల దేవరూపమైన దగుటచే పరమ పవిత్ర మైనది. గయలో ఆ కిల్ల దేవమయి. గయలో ఎవరి ఈ పిండదానము చేసినను అది అతనిని సనాతన బ్రహ్మమునందు ప్రతిష్ఠింపచేయును. ఫల్వీశ్వర ఫల్గుచఁఢీ-అంగారకేశ్వ లకు నమస్కరించి మతంగ ముని స్థానమునందు పిండ ప్రదానము చేయవలెను. పిదప భరతాశ్రమమునందు కూడ ఏండ్ల ప్రదానము చేయవలెను. అదే విధముగ హంసతీర్థ-కోటితీర్థములందు గూడ చేయవలెమ, పాండుశిలానద మున్న స్థానము నందు అగ్ని ధారా-మధుక్రవాతీర్థములందు పిండదానము చేయవలెను. పిదప ఇంద్రేశ్వర-కిలకిలేశ్వర-వృద్ధివినాయకులకు నమస్కరించి, ధేనుకారణ్యమున పిండ ప్రదానము చేసి ధేనుపదమునందు గోవుకు నమస్కారము చేయవలెను. అందరు పితరులును ఉద్ధరింపబడుదురు. పిదప సరస్వతీతీర్థమునకు వెళ్ళి పిండప్రదానము చేయవలెను. సాయంకాలమన సంధ్యోపాసన చేసి సరస్వతీదేవికి నమస్కరించవలెను. ఇట్లుచేయువాడు త్రికాలసంధ్యావందనము చేయు, వేదవేదాంగపారంగతుడైన బ్రాహ్మణుడు అగును. గయాప్రదక్మిణము చేసి అక్కడ నున్న బ్రాహ్మణులను ఫ్లూజించుటచే గయాతీర్థములో చేసిన్ల అన్న దానాదిక పుణ్యము ఆక్షయ మగును. గదాధరుని స్తుతించి ఈ విధముగా ప్రార్థించ వలెను. “ఆదిదేవుడును, గదాధారియు గయానివాసియు, పితరులకు సద్గతినిచ్చువాడును, యోగ దాతయు అగు గదాధరునకు ధర్మార్థకామమోక్షప్రాప్తికై నమస్కరిం చుచున్నాను. అతడు దేహేంద్రియమనోబుద్ది ప్రాణాహంకారశూన్యుడు. నిత్యశుద్ద.బుద్ద-ముక్త-స్వభావుడు, ద్వైతశూన్యుడు దేవదానవాదివంగీతడు దేవతలను, దేవీగణమును కూడ సర్వదా ఆయన ప్రేవ జేయుచుందురు. నేమ ఆతనికి నమస్కరించు చున్నాను; అతడు కలికల్మషములను, కలిపిడను తొలగించువాడు. అతని క్షంఠమున క్షనమాల ప్రకాశించచున్నది; సకలలోకపాలకులను పోలించువాడు కూడ ఆతడే. అందరి కులములను ఉద్ధరించుటకై నిశ్చయించుకొని యున్నవాడు. ఈ స్వరూపమును వ్యక్తావ్య క్షరూపము అగు అన్ని వస్తువులందును విభజించి యున్నను అతడు వాస్తవమున అవిభక్త స్వరూపుడు. అత్యంతస్థిరుడు సారభూతుడు; భయంకరము లగు పాపములను తొలగించువాడు. నేను అతని చరణములకు నమస్కరించు చున్నాను. దేవా! గదాధరా! నేను నా పితరులకు శ్రాద్దము చేయుటకై గయకువచ్చినాను. నీవే ఈ విషయమున సాక్షిగా నుండుము. నే నీనాడు ఋణత్రయవిముక్తుడ నైతిని. బ్రహ్మరుద్రాదిదేవతలు నాకు సాక్షులుగా ఉందురుగాక. గయ వచ్చి నేను పితరులను ఉద్దరించితిని. శ్రద్దాది సమయముందు ఈ గయామాహాత్మ్యమును పలికించుటచే మానవుడు బ్రహ్మలోకము కకు పోవును. గయలో చేసిన పికృశాద్ధము, తక్షయము. అక్షయబ్రహ్మలోకము నిచ్చును.

అగ్నిమహాపురాణమునందు గయాశ్రాద్ధర్థవిధి యను నూటపదునారవ అధ్యాయము సహస్తము.