అగ్ని మహా పురాణము

Table of Contents

312 - అథ త్వరితావిద్యా

అగ్ని రువాచః

అగ్ని దేవుడు పలికెను. ఇపుడు ధర్మ కామాది సిద్ది ప్రదమగు విద్యా ప్రస్తారమును చెప్పెదను, నవకోష్ఠ విభాగ ముచే విద్యా భేదము లభించును. అనులోమ విలోమ యోగము సమస్త వ్వ స యోగము కర్ణావి కర్ణయోగము ఆధఊర్ధ్వ విభాగ యోగము త్రిత్రిక యోగము వీటిచే ఎవని శరీరముకు దేవీరక్ష ఏర్పరుపబడునో ఆతడు సిద్ధిదాయకములగు మంత్రము లను ఆనేక ములను ప్రస్తార మును తెలుసుకోగలుగును. ప్రతి శాస్త్రము నందును మంత్రములు చేపబడినవి కాని వాటి వాటి ప్రయోగము దుర్లభము మొదటి వర్ణము గిరుపు యగును. సర్వము దాని వర్ణనము చెప్పబడలేదు. దాని ప్రస్తార ముచే ఏకాక్షర ద్వక్షర త్ర్యక్షర మంత్రములు ఏర్పడును. నిలువుగను ఆడ్డముగను నాలుగేసి రేఖలు గీయ తొమ్మిది కోష్ఠ ములగును. మద్యకోష్ఠముతో ప్రారంభించి ప్రదక్షిణ క్రమమున మంత్రాక్షరములు వాటిపై వ్రాసి ప్రస్తార భేదనము చేయవలెను. ప్రస్తార క్రమయోగ మందే ప్రస్తారమును పొందగలిగిన సాధకుని చేతిలో అన్ని సిద్ధుఁలుండును. మూడులోకములను ఆతని పాదము పై వంగును ఆతడు నవ ఖండ విభక్తయగు భూమిని పొందును. కపాలము పై గాని, శ్మశాన వస్త్ర ముపై గాని అన్ని వైపులను శివతత్త్వమును వ్రాసి మత్ర వేత్తదాని మధ్య భాగము నందలి కర్ణిక పై తానుదలచిన వ్యక్తి పేర భూర్జ పత్రముపై వైసిపుంచవలెను. అచిర వృక్షము యొక్క బొగ్గులతో భూర్జపత్రమును వెచ్చచేసి రెండు పాదముల కింద తొక్కి వుంచవలెష. ఈ ప్రయోగమాచే ఒకేసప్తాహము నందు సచరాచర ములగు మూడు లోకములను తన పాదముల పై పడ వేయగలు గుస. వజ్ర సంపుట గర్భయుక్తమగు ద్వాదళార చక్రము మద్యయందు శత్రువు పేరు వ్రాసి, దానిని సదాశివ మతము చెప్పుచు దర్భలతో మార్జనము చేయవలెను. పైన చెప్పిన ద్వాదళార చక్రమును నామాధికరణము లను పశుపుతో గోడ పైగాని పీఠ పైగాని, శిలా పట్టం పైగాని వ్రాయవలెను. ఇట్లు చేయుటచే శత్రువున ముఖ స్తంభము, గీతి స్తంభము, సైన్య స్తంభము కలుగును.

శ్మశాన వస్త్రము పై విష మిశ్రిత మగు ర క్తముతో షట్కోణ చక్రము వ్రాసి దాని మధ్య శత్రువు పేరు వ్రాయవలెను. చక్రము నలువైపుల శ క్తి బీజములు వ్రాసి దాని పై దండము ఉంచవలెను. స్మశాన భూమి పై వుంచబడిన ఆ శత్రువుపై శీఘ్రముగా దండ ప్రహారము చేసినచో శత్రు రాజు యొక్క రాష్ట్రము ఖండితమై పోవును. చక్రాకార మండలము ఏర్పరచి దాని మధ్య భాగమున శత్రు నామము వ్రాసి చక్రధార యందు శ క్తి బీజ న్యాసము చేసి శత్రువు పేరు ఉచ్చరించుచు చక్రధారతో వాటిని కొట్టుచున్నట్లు భావవ చేసినచో శత్రువు నశించును. ఖడ్గ మధ్య భాగమున గరుడ బీజముతో శత్రువు నామ ధేయము వ్రాసి దర్భతో మార్జనము చేయవలెను. పేరు వ్రాయుటకు స్మశానము నందు బొగ్గు ఉపయోగించవలెను. దాని పై చితాభస్మముతో ప్రహారము చేయవలెను. ఇట్లు చేసిన సాధకుడు. ఒక్క వారంలో శత్రు దేశమును జయించును. భేదవ భేదన మారణవం లందు అతడు శివుని వలె శ క్తిశాలి యగును. తారక మునకు (నట్) నేత్రమని పేరు. దీనిని శాంతి పుష్టికరముల యందు వినియోగించవలెను. ఈ దహశాది ప్రయోగము శాకినిని కూడ ఆకర్షించువ. పైచేప్పిన నూరు చక్ర ములలో మధ్య నున్న మంత్రాక్షరము మొదలు పశ్చిమ దిక్కునందన్న కోష్టము వరకు నున్న రెండు అక్షరములను “వక్ర తుండ” మంత్రములు జపించుటచే కష్టాది చర్మరోగములన్నియు నశించును. సందేహము లేదు. మధ్య కోష్టము నుండి ఉత్తర కోష్టము వరకు వున్న రెండక్షరముల మంత్రములను కరాళి బంధముతో జపించినచో ఆద్వ్యక్షరీ విద్య సాక్షాత్తు శివుడే ప్రతి వాదియైనను రక్షణము నిచ్చును. పశ్చిమమునందున్న మంత్రాక్షర మను మొదట వుంచి ఉత్తర కోష్టము వరకు వున్న మంత్రాక్షరము లను వక్రతుండ మంత్రములతో జపించినచో చివర కాసాదులు శమించును. ఉత్తర కోష్టము మొదలు మధ్యకోష్టము వరకునున్న మంత్రాక్షరములను జపించినచో వట బీజమునందు కూడ గురుత్వమును కల్గించ కలు గును. సర్వాది మధ్యమాంత పక్షముల జపము వెంటనే లఘుత్వమును కల్గించును. భూర్జపత్రముపై గోరోచనముతో వజ వ్యా ప్తమగు భూపుర చక్రమును నిర్మించి మంత్ర బీజములను క్రమముగ వ్రాసి దానిని ధరించినచో శరీరరక్ష కలుగును. దానిని సువర్ణము చుట్టి ధరించినచో ఆర ఇ యంత్రము మృత్యువును రానీయదు. విఘ్న పాప శత్రువులను అణచి సౌభాగ్య దీర్ఘాయువులను ఇచ్చును. జూదము నందును, యుద్ధము నందును విజయమును ఇచ్చును. ఇందుని సేనతో యుద్ధము చేయ వలసి వచ్చినను విజయము నిచ్చును. సందేహము లేదు వలధ్య శ్రీలకు పుత్రుల నిచ్చును. ఇది రెండవ చింతామణి వంటిది. పర రాష్ట్రముల పై అధికారమును పొందును. రాజ్యమును భూమిని జయించును. వట్ క్రీం, శ్రీం, హూం అను మంత్రమును లక్ష్మపర్యాయములు జపించినచో యవాదులు కూడ వశమగుదురు.