అగ్ని మహా పురాణము

Table of Contents

272 - అథ దానాదిమాహాత్మ్యమ్

పుష్కర ఉవాచః

పుష్కరుడు పలికెను. పూర్వము మరీచికి చేప్పిన ఏబదివేల శ్లోక ములుగల బ్రహ్మపురాణమును వ్రాసి, బ్రాహ్మణం నకు దానము చేయవలెను. స్వర్గకాముడు వైశాఖ పూర్ణిమనాడు జలధేనువుతో కూడ బ్రహ్మ పురాణ దానము చేయవలెను. పన్నెండువేల శ్లోక పాలుగల పద్మపురాణమును ధేనువుతో జ్యేష్ట మాసమున దానము చేయవలయును. పరాశరుడు, వరాహకల్పవృత్తాంతమును, ఇరువదిమూడువేల శ్లోకములుగల విష్ణుపురాణముగ రచించెను. దీనిని ఆషాఢమాసమున జలధేనువుతో దానము చేసినవాడు విష్ణుపదమును పొందును, పదునాలుగువేల శ్లోకములుగల హాయుపురాణము హరికి ప్రియమైనది. దీనిలో వాయుదేవుడు శ్వేత కల్పప్రసంగముచే ధర్మమును చెప్పెను. ఈ పురాణమును వ్రాయించి శ్రావణమాసమున గుడ ధేనువుతో బ్రాహ్మణునకు దానము చేయవలయును. గాయత్రిని ఆధారముగ తీసుకుని విస్తృతముగ భాగవత ధర్మములు బోధించిన సారస్వత కల్ప సంబద్ధమగునదియు, వృత్రా సురవధ కలదియగు భాగవతమున పదునెనిమిదివేల శ్లోకములు వున్నవి. దీనిని బంగారు సింహాసనముతో భాద్రపద మాసమున దానము చేయవలయును. బృహత్కల్పమునకు సంబంధించిన ధర్మములను దేనియందు బోధించెనో ఇరువది ఐదువేల శ్లోకములుగల ఆపురాణము నారదపురాణము. దీనిని ధేను సహితముగ ఆశ్వీయుజ మాసమున దానముచేసిన వాడు పరిపూర్ణసిద్ధిని పొందును, ఏపురాణమున పక్షులు ధర్మాధర్మ విచారణచేసినవో నవసహస్ర శ్లోకములుగల ఆ మార్కండేయ పురాణమును కార్తీకమాసమున దానము చేయవలయును. ఆగ్ని విషిష్ణునకు చెప్పినపురాణము ఆగ్నేయము. దీనిని వ్రాసి మార్గశీర్షమున బ్రాహ్మణునకు దానము చేసినచో సర్వఫలము లభించును. దీనిలో పన్నెండువేల శ్లోకములున్నవి. అన్ని విద్యలును బోధించును. భవిష్యపురాణము సూర్యసంభవము. పదువాలుగువేల శ్లోకములుగలది. శివుడు మనువునకు చెప్పెను. పుష్యమాసమన గుడాదులతో దీనిని దానము చేయవలయును.

సావర్ణి బ్రహ్మవైవర్త పురాణమును పారదునకు చెప్పెను దీనిలో రథంతర కల్ప వృత్తాంతము వున్నది. పదునెనిమిది వేల శ్లోకములుగల దీనిని మాఘమాసమున దానము చేయవలయును. వరాహచరితము చెప్పు వరాహ పురాణమును కూడి మాఘమాసమన దానము చేసినవాడు బ్రహ్మలోకము పొందును. ఆగ్ని మయమగు లింగము నందున్న మహేశ్వరుడు ఆగ్నేయకల్పము నందలి వృత్తాంతములతో కూడిన ధర్మమును బోధించిన పన్నెండు. వేల శ్లోకములుగల లింగ పురాణమును తిలధేనుసహితవపంగ ఫాల్గుణమాసమున దానము చేసినవాడు శివలోకమును పొందును. విష్ణువు భూదేవికి మానవ ప్రవృత్తిమొదలు వరాహచరితమును, చెప్పిన వరాహపురాణమున ఇరువది నాలుగువేల శ్లోకములు వున్నవి. చైత్రమున సువర్ణముతో గరుడపురాణమును దానము చేసినవాడు విష్ణుపదమును పొందును. స్కంద పురాణమున ఎనుబది నాలుగువేల శ్లోకములున్న వి. కుమారస్వామి తత్పురుష కల్పకథను శైవమతమును ఆధారముగ గొని ఈ పురాణమును చేప్పేను. దీనిని కూడ చేత్రమున దానము చేయవలయును. పది వేల శ్లోకములున్న వామన పురాణమున ధోమక ల్పము నందలి విష్ణు చరిత్రమును బోధించబడినది. దానిని పూర్ణిమనాడు విషవసంక్రాంతి సమయమున దానము చేయవలయును. ఇది ధర్మార్థాదిబోధకము., కూర్మపురాణమున ఎనిమిదివేల శ్లోకములున్నవి. కూర్మమూర్తియగు విష్ణువు ఇంద్రద్యుమ్న కథా ప్రసంగమున దీనిని పాతాలమునందు చెప్పెను. సువర్ణఖచ్చమతో దీనిని దానము చేయవలెను. మత్స్యరూపియగు విష్ణువుకల్పాదియందు పదమూడువేల శ్లోకములుగల మత్స్యపురాణమును మనువుకు చెప్పెను. బంగారముతో నిర్మి ముత్యముతో కలిపి దీనిని దానము చేయవలెను. శ్రీఆర్య కల్పమునందు ఎనిమిదివేల శ్లోక ములుగల గరుడపురాణమును బోధించేను. విశ్వాండమునుండి గరుత్మంతుని పుట్టుకకు సంబధించిన కథ దీనిలో చెప్పబడినది. దీనిని స్వర్ణహంసతో కూడ దానము చేయవలెను, బ్రహ్మ దేవుడు బ్రహ్మాండ మాహాత్మ్యమును గూర్చిచెప్పిన పండ్రెండువేల శ్లోకములుగల బ్రహ్మాండ పురాణమును గూడ బ్రాహ్మణునకు దానము. చేయవలయును.

మహాభారత శ్రవణ సమయమున ప్రతి పర్వ సమాప్తి యందును వస్త్రగంధ మాల్యాదులతో ముందుగా పౌరాణికుని పూజించవలయును. పిదప బ్రాహ్మణులకు పాయసముతో భోజనము పెట్టవలెను. ఒక్కొక్క పర్వము పూర్తియే నపుడుగో, భూమి, గ్రామ సువర్ణాదులను దానము చేయవలయును. మహాభారతము పూర్తియైన పిమ్మట బ్రాహ్మణునకును మహాభారత సంహితకును పూజ చేయవలయును. గ్రంథమును పవిత్ర స్థానందుంచి దానికి పట్టు వస్త్రంచుట్టి హజించవలెను. పిదప నరనారాయణులను పుష్పాదులతో పూజించవలయును. గో, అన్న, భూమి, సువర్ణాదుల, దానముచేసి బ్రాహ్మణు లకు భోజనము పెట్టి కమా ప్రార్థన చేయవలయును. పౌరాణికులకు మహాదానములు వివిధ రత్నములు ఇవ్వవలేను ప్రతి మాసమునందును ఆతనికి రెండు లేక మూడు మాషముల సువర్ణమును ఇచ్చి, ఆయన ప్రారంభమున కూడ ముందుగా ఆతనికి సువర్ణ దానము చేయవలయును. ఓద్విజ  శ్రేష్ఠా శ్రోతలందరును కూడ పౌరాణికుని పూజించవలయును. ఇతి హాసములను పురాణములను పూజించి దానము చేయువాడు ఆయురారోగ్య స్వర్గ మోక్షములను పొందును.

అగ్ని మహాపురాణమున పురాణదానాది మాహాత్మ్య కథవమను రెండువందల డెబ్బది రెండవ అధ్యాయము సమాప్తము.