అగ్ని మహా పురాణము
260 - అథ యజుర్విధానం
పుష్కర ఉవాచః
పుష్కరుడు పలికెను. పరశురామ ! ఇపుడు భుక్తిముక్తి ప్రదమగు యజుర్విధానమును చెప్పెదను వినుము. ఓంకార యుక్తములగు మహావ్యాహృతులు సకల పాపనాశ కములు, సర్వకామప్రదములు. బుద్ధిమంతుడు వీటితో నూరు హోమములు చేసి దేవతలను ఆరాధించవలెను. దీని వలన మనోవాంఛితములగు కోరికలు తీరును శాంతికాముడు యవలతోను పాపవినాశనమును కోరువాడు తిలలతోను, హోమము చేయవలెను. ధాన్యములతోను తెల్లఆవాలతోను హోమము చేసినచో సర్వకామములు సిద్ధించును. పశుకాముడు ఉదుంబరమిధలతో హోమము చేయవలెను. అన్న కాముకు పెరుగుతోను శాంతి కాముడు పాలతోను, అధికసువర్ణకాముడు ఆపామార్గసమిధలతోను హోమము చేయవలేను కన్యకను కోరు వాడు రెండేసి చొప్పున కట్టిన, నేతితో తడిపిన జాతిపుష్పములను హోమము చేయవలెను. కామము కోరువాడు తిలలను తండులములను హోమము చేయవలెను. వశీకరణ కర్మయందు శాకోట - వస - అపామార్గ - సమిధలను హోమము చేయవలెను. ఓ భార్గవా! రోగనాశనిమిత్తము విషర క్షములతో తడిపిన సమిధలు హోమము చేయవలెను. శత్రువధ కోరువాడు క్రోధపూర్వక మగ పైసమిధలను హోమము చేయవలెను. ద్విజుడు అన్ని ధాన్యములతో ఒక రాజప్రతిమను నిర్మించి దానిని వేయిసార్లు హోమము చేసినచో రాజు వశమగును. వస్త్రకాముడు పుష్పములను హోముమచేయలేను. “దూర్వా” హోమము వ్యాధి వినాశకము. బ్రహ్మతేజము కోరువాడు ఉత్తమ వస్త్రమును ఆర్పించవలెను. విద్వేషణకర్మయందు ప్రగ్యంగిరోక్త విధానానుసారముగ స్థాపించిన, ఆగ్నియదు పొల్లుముల్లు, భస్మము, కాకి ఈకలు, గుడ్లగూబ ఈకలు హోమము చేయవలెను. చంద్రగ్రహణసమయమున కపిలధేను ఘృతమును, హోమముచేసి ఆఘృతమునందు వూనా చూర్ణమును కంపి “సుపాతము” అనే ఆహుతినిచ్చి, మిగిలిన వసను తీసుకొని వెయ్యిసార్లు గాయత్రిచే ఆభిమంత్రించి, ఆవసను తిన్నచో వేధావియగును. పదకొండు అంగుళముల లోహశంకువుకాని ఖదిర వృక్షపు శంకువు కాని “ద్విషతోవధోఽసి” (1.25 , అను మంత్రమును జపించుచు శత్రువు ఇంటిలో పాతవలేను. ఈ విధముగా శత్రువినాశక మగు కర్మను నీకు చెప్పితిని. “చక్షుష్యా” (2.16) ఇత్యాది ముత్రమును జపించుటచే పోయిన చూపువచ్చును. “ఉపయుంజతే” ఇత్యాది అనువాకము అన్న మునుఇచ్చును. “తనూనపాగ్నేఽసి” (3-17) ఇత్యాదిమంత్రముతో దూర్వాహోమము చేసినచో సంక ఎములు దూరమగును. “భేషజమసి” (3-59) ఇత్యాది మంత్రముతో పెరుగు, నెయ్యి హోమము చేసినచో పశువునకు వచ్చు మహామారి రోగములు తొలగిపోవును. “తియంబకం యజామహే” (3-60) అను మంత్రము చేత చేసినహోమము సౌభాగ్యవృద్దీకరము కన్య యొక్క పేరు చెప్పికాని కన్యనుద్దేశించిగాని ఈ మంత్రముతో జపహోమములు చేసినచో ఇది కన్యాలాభమనకు ఉత్తమ సాధనము. భయములు వచ్చినపుడు నిత్యము ఈ మంత్రమును జపిచువాడు భయవిముక్తుడగును, ఈ మంత్రముతో మృతమిశ్ర తత్తూర పుష్పములను హోమము చేసినవాడు సర్వకామములను పొందును. ఈ మంత్రమతో “గుగ్గులు” హోమము చేసిన వాడు స్వప్నమునందు శంకరుని చూచును. “యుంజలేమనః” (5-14) అను అనువాకమును జపించినవాడు దీర్ఘాయుర్దాయమును పొందును. “విష్ణోరరాటమసి” అను మంత్రము సకల బాధలను నివారించును. రాక్షసులను నశింపచేయును. ఇది కీర్తి వర్ధకమ విజయప్రదము. “ఆయంనోఅగ్నిః” (5-37) ఇత్యాది మంత్రము యుద్ధమునందు జయప్రదను. “ఇదమాపః ప్రవహత” (6-17) ఆను మంత్రము జపించుచు స్నానము చేసినచో పాపనాశ కము. పది అంగుళముల పొడవైన ఇనుప ఊచను “విశ్వకర్మన్ హవిషా” (17-22) అను మంత్రముచే అభిమంత్రించి యేకన్యకయొక్క ద్వారమువద్దః పాతేదరో ఆ కన్యను మరెవరికీ ఇవ్వజాలరు. “దేవసవితః” (11–7) అనువంత్రముతో హోమము చేసినవాడు అన్నవంతుడగును.
బల కామడగు ద్విజుడు “అగ్నౌ స్వాహా” ఆనుమంత్రముతో తింలు యవలు, ఆపామార్గ సమిధలు తండులములు హోమము చేయవలెను. ఈ మంత్రమతో వెయ్యిపర్యాయములు అభిమంత్రించిన గోరోచనమును తిలకనగా ధరించినచో లోకప్రియుడగును. రుద్రమంత్రముల జపము సర్వపాప వినాశకము. వానితో చేసిన హోమము సర్వకర్మ సాధకము. అంతటన శాంతిప్రదాయకము. మేకలు, గొఱ్ఱెలు, ఈర్రములు, ఏనుగులు, గోవులు, ఇష్యులు, రాజులు, బాలురు, స్త్రీలు, గ్రామములు, నగరసలు, దేశము, వివిధోపద్రవ పీడితులై రోగగ్రస్తులై నను మహామారీ భయము కాని శత్రుభయము కాని వచ్చివన మృతదితమగు పాయసముతో రుద్రదేవతనుద్దేశించి హోమము చేసినచో గొప్పశాంతి లభించును. ఓ నరశ్రేష్ఠా! రాత్రియంద మాత్రమే సక్తువులు యవల గంజి భిన్నము భుజించుచు ఒక మాసమపాటు బయటమో నమ చేయావాడు బ్రహ్మహత్యా పాపవిముక్తుడగును. “మధువాతా” (13-17) ఇత్యాది మంత్రమతో హోమాదులు చేసిన సర్వపు లభించును. “దధిక్రాప్ణో” (23-32) అను మంత్రముచే హోమముచేయు గృహస్థుడు నిస్సంశయమగా పుత్రులను పొందును. “మృతవతీ భవనానామభి” (34-45) అను మంత్రముతో మృతహోమతి చేసినచో ఆయుర్వృద్ధి కలుగును. “స్వస్తినః ఇంద్రః” (25-19) అను మంత్రపు సమస్త భాధలను నశింపచేయును. “ఇవగావః ప్రజాయద్వం” అను పుష్టి వర్ధక మాత్రలో వెయ్యి మృతిహోమములు చేసినచో దారిద్ర్యము నశింతన. “దేవస్యత్వా” అను మంత్రముతో సృవపతో అపామార్గ సమిధలను, తండులవలన హోమము చేసినవాడు శీఘ్రమగా అభిచారవిషక్తుడగును. సంశయము లేదు “రుద్రయత్తే” (10-20) అను మంత్రమతో పలాశ సమిధలను హోమము చేసినచో సువర్గము లభించును. ఆగి ప్రమారస కల్గినపుడు “శివోభవ” (11-45) అమమంత్రముతో ప్రీహి హోమము చేయవలయును. “యా సేనా!' అని పుత్రస చోరథయము తొలగించును. “యో ఆస్మభ్యమరాతీయాత్” (11-80) అను మంత్రముతో వెయ్యి తిల హోమములు చేయువాడు భయంకరమగు అలిచారము నుండి విముక్తుడగున “అన్నపతే” (11-83) అను మంత్రముతో అన్నహోమమున చేసినవారికి అన్నము లభించును. నీటిలో నిలచి “హంసః శచిషత్” (11-24) అను మంత్రమును జపించి నచో శర్వపాపములు నశించును. నీటిలో నిలచీ “చత్వారికృంగా” (17-91) అను మంత్రమును జపించినచో సర్వపాపము నశించును. “దేవాయజ్ఞ మతవ్వత” (19-12) అను మంత్రమును జపించువాడ బ్రహ్మలోకమును పూజితుడగును. “వసంతోఽస్యాసీత్” (31-14) అనుమంత్రముతో ఆజ్యహోమము చేయువానికి సూర్యడు వరముల నిచ్చను. “సువర్ణోఽసీ (17-22) అనుమంత్రమతో వ్యాహృతి మంత్రమంలో చేసినట్లే కర్మ చేయవలెను. “నమస్వాహా” ఇత్యాది మంత్రమును మూడు పర్యాయములు జపించినవాడు బంధవిముక్తుడగును. నీటిలో నిలచి “దృపదాదివ” (20-20) అనుమంత్రమును మూడు పర్యాయములు చెప్పువాడ సర్వపాపవిముక్తుడగును.
“ఇహగావః ప్రజాయధ్వం” అను మంత్రమతో నెయ్యి, పెరుగు, పాలు లేదా పాయసము హోమము చేసినచో బుద్ధి వృద్ధి చెందును. “శంన్నో దేవీ!” అను మంత్రముతో పలాశఫలములను హోమము చేసినవానికి ఆరోగ్యమ, లక్మి చిరజీవనము లభించును. “ఓషధీఃప్రమోదధ్వం” (12-17) అను మంత్రముతో విత్తనములు చల్లునపుడు, పంటకోయు వపుడు హోమము చేసినచో ఆర్గప్రాప్తి కలుగును. “అశ్వావతీః” (34-40) అను మంత్రముతో పాయస హోమము చేసిన శాంతి లభించును. “తస్మాఅరం” (36-16) ఇత్యాది మంత్రముతో హోమము చేసినచో బందియైన వాడు విడువ బడును. “యువాసువాసా” (తై!! దా!! 3-6-18) అను మంత్రముతో హోమము చేసిన వస్త్రము లభించుడి. “ముంచన్తు మాశపథ్యాత్” (12-90) ఇత్యాది మంత్రముతో హోమము చేసినచో శాపాదులు నశించును. “మామాపాలసీవితాః” (12-102) అను క్షంత్రముతో మృతమిశ్రతిలలు హోమముచేయగ శత్రువులు నశింతురు. “నమోఽస్తు సర్వేభ్యః” (13-6) అనుమంత్రవ్వలో మృత హోమము “కృణుర్వంరాజ” అను మంత్రముతో పాయసమున హోమము చేసినచో ఆభిచారము, నశించును. “కాఁడాత్కాండాత్” (13-20) అను మంత్రముతో దూర్వా కాండమలను వెత్యూయములు హోమము చేసినచో గ్రామములో గాని జనపదములోగాని వ్యాపించిన మహామారి శాంతించును. రోగపిడితుడు. రోగవిముక్తుడగును, దుఃఖితుడు దుఃఖవిముక్తుడగును. “మధుమాన్నొవనస్పతిః” (13-29) అను మంత్రముతో వెయ్యి ఉదుంబర సమిధలు హోమము చేయుటచే ధనము గొప్ప సౌభాగ్యము, వ్యవహారములో విజయము లభించును. “ఆపాంగర్బంసీద” (వా!! 13-30) అనుమంత్రముతో హోమముచేయువాడు తప్పక పర్ధన్య దేవునిచే వర్షము కుర్పింప చేయును “ఆపపిబన్” (14-8) ఇత్యాది మంత్రముతో దధిఘృత మధువులను హోమము చేసినచో వెంటనే గొప్పవర్షము కురియును “నమస్తేరుద్ర (16-1) అను మంత్రము సర్వోపద్రవవాశకము, సర్వశంతికరము, మహాపాతకములను నశింపచేయును. “అధ్యవోచ దధివక్త” (16-5) అను మంత్రముతో హోమముచేసినచో వ్యాధిగ్రస్తుడు రక్షింపబడును రాక్షసులు నశింతురు, యశస్సులు లభించును. చిరాయువు సష్టివృద్ధికలుగును. ఈమంత్రము చదువుతూ మార్గమునందు తెల్లఆవాలను చల్లు బాటసారి సుఖ వంతుడగును, “అసౌయప్తామ్రః” (16-6) అనుమంత్రమును చదువుచూ, నిత్యము సాయం ప్రాతఃకాలములందు. ఆలస్య రహితుడు సూర్యోపస్థానము చేయుడు అక్షయమైన అన్నమును, దీర్ఘాయువును పొందును “ప్రముంచరస్వది” (16-9-14) ఇత్యాదిమంత్ర షట్కముతో ఆయుధములను అభిమంత్రించినచో యుద్ధమునందు శత్రువులకు భయము కలుగును. ఈ విషయ మున మరియొక విధముగా అలోచింప పనిలేదు. “మానోమహాపాతం” (16-15) అను మంత్రము బాలలకు శాంతికారకము. “నమోహిరణ్యవాహవే” అను ఏడు అనువాకములతో తైలము కలిపిన రాజికలను హోమము చేసినచో శత్రువులు నశింతురు. “నమోవకిరికేభ్యః” (16-46) అను మంత్రముతో ఒక లక్ష కమలములను హోమము చేసినవాడు రాజ్యలక్ష్మిని, ఒక బిల్వ ఫలముల హోమము చేసినవాడు, సువర్ణ రాశిని పొందును. “మారుద్రాయ” (16-48) ఆనుమంత్రముతో తిలహోమము చేసినచో ధనములభించును. ఈ మంత్రముతోనే దూర్వాహోమము చేసినచో సర్వవ్యాధులు నశించును. “అశుఃశిశానః” (17-33) అను మంత్రముతో ఆయుధములకు రక్ష, యుద్ధములందు సర్వ శత్రువినాశము కలుగును. “వాజశ్చమే” (18-15-19) ఇత్యాది మంత్రపంచకమతో ఆజ్యాహుతులు వెయ్యి చేసినచో నేత్రరోగములనుండి విముక్తుడగును.
“శంనో వనస్పతే” (19-38) అనుమంత్రముతో గృహమునందు హోమము చేసినచో వాస్తుదోషములు నశిచును. “అగ్న ఆయానాం” (19-38) అనుమత్రముతో ఆజృహోమము చేయువానికి ఎవ్వరితోను వైరముండదు. “ఆంపాంఫేనేన” (19-71) అను మంత్రముతో లాజహోమము చేసినవాడు విజయము పొందును. “భద్రాహుత” (14-39) అను మంత్రమును జపించిన ఇంద్రియహీనుడు, లేనా దుర్బలేంద్రియుడు ఇంద్రియశక్తి సంపన్నుడగును. “ఆశ్చిపృథివీచ” (26-1) అను మంత్రము గోప్ప వశీకరణ మంత్రము. “ఆధ్వనా” (5-33) ఆనుమంత్రమును జపించువాడు వ్యవహారమున జయమును పొందును. కార్యప్రారంభమున “బ్రహ్మక్షత్రంపవతే” (19-5) అనుమత్రముమ జపించినచో కార్యసిద్ధి కలుగును. “సంవత్సర్మోసి” అను మంత్రముతో లక్ష ఆజ్యహోమములు చేసిన వాడు రోగ విముక్తుడగును. “కేతుంకృణ్వన్” (29-37) అను మంత్రము యుద్ధమునందు జయవర్ధకమ. “ఇంద్రోఽగ్నిధర్మః” అనుమంత్రము యుద్ధమునందు ధర్మ సమ్మతమైన విజయము నిచ్చును. ధనుస్సును ధరించువును “ధవ్వనాగా” (29-39) అను మంత్రమును జపించుట ఉత్తమము. “యజీత అను మంత్రముచే ధనుస్సునభిమంత్రించవలెను. “ఆహిరివ” (29-51) అను మంత్రముచే బాణములను ఆభిమంత్రించ వలెను. “వహ్నినాంపితః (29-42) అను మంత్రముతో తూణీరమును అభిమంత్రించవలెను. “యుంజన్త్యస్యా” (23-61) అను మంత్రమును చదువుచు గుర్రములను రథములకు కట్టవలెను. యాప్రారంభ సమయమున “ఆశువుగిశానః” (17-35) అను మంత్రమును చదువవలెను. రథారోహణసమయమున “విష్ణోఃక్రమోసి” (12-5) అను మంత్రమును గుర్రములను తొలిసారిగా తోయినపుడు “ఆజంఘన్తి” (29-50) అను మంత్రమును, శత్రుసేనఎదుట “యాస్సే వాఅభిత్వరీః” (11-77) అను మంత్రమును, దుందుభివాయించునవుడు “దుందుభ్యః” అను మంత్రమును పఠించవలెను. ముందుగా ఈమంత్రములతో హోమముచేసి, తరువాత ఈ విధముగ చేసినచో విజయము లభించును. “యమేనదత్తమ్” (29-13) ఆను మంత్రముతో కోటిహోమములు చేసినచో యుద్ధమునందు వెంటనే విజయమునిచ్చు రథము ఆవిర్భవించును, “ఆకృష్ణన” అను మంత్రముతో వ్యాహృతులతో చేసిన కర్మల వంటికర్మలను చేయవలయును. “యజ్ఞాగత్రః” (34-1) ఇత్యాది శివసంకల్ప మంత్రములను జపించుటచే మనస్సుకు ఏకాగ్రత లభించును. “పంచనద్యః” (34-11) అను మంత్రముతో ఐదులక్షల హోమము చేసినవాడు లక్ష్మీని పొందును. “యదాబధ్నన్ దాక్షాయణాః” (34-52) అను మంత్రముతో వెయ్యి పర్యాయములు అభిమంత్రించిన సువర్ణమును ధరించినచో ఆది శత్రునివారణము. “ఇమంజీవేభ్యః” (35-15) అనుమంత్రమును చదువుచు. రాళ్లుగాని, మట్టిపెడ్డలు గాని అభిమంత్రించి ఇంటినలు వైపుల విసిరినచో రాత్రిచోర భయము వుండదు. “షరిమేగామనేషత్” (35-18) ఉత్తమమైన. వశీకరణ మంత్రము చంపుటకు వచ్చినవాడు.. కూడ లొంగిపోవును ఓడర్మజుడా! ఈ మంత్రముతో అభిమంత్రించిన భక్ష్యములు తాంబూలములు పుష్పములు, మొదలగు నవి ఎవనికై న ఇచ్చినచో వాడు శీఘ్రముగా వశమై పోవును “శంనోమిత్రః” (36-9) అను మంత్రము అంతటను ఎల్ల వేశలను శాంతిప్రదము “గణానాంత్వాగణపతిం” (23-19) ఆను మంత్రముతో చతుష్పదమునందు సర్వధాన్యములను హోమము చేసినవాడు జగత్తునంతను వశము చేసుకొనును. సందేహము లేదు. అభిషేక సమయమున “హిరణ్య వర్ణాః శుచయే” అను మంత్రమును పఠించవలెను. “శంనోదేవీరభీష్టయే” అను మంత్రము పరమ శాంతికారకము. ఏకచక్ర ఇత్యాడిమంత్రముతో ఆజ్యభాగపూర్వకముగ గృహమునకు ఆజ్యహోమము చేసినచో గ్రహముల అనుగ్రహము శాంతి లభించును. సందేహములేదు. “గావపావతావం” (33-29) “భగ పణేతః” (34-36-37) అనుమంత్రత్రయముచే ఆజ్యహోమము చేసినవానికి గోవులు లభించును. “ప్రవాదాంశఃసోవత్” అను మంత్రమును గృహయజ్ఞమున ఉపయో గించవలేను “దేవేభ్యోవనస్పతే” ఇత్యాదిమంత్రములను వృక్షయజ్ఞములందు వినియోగించవలెను. గాయత్రి విష్ణురూప మెనదని తెలుసుకొనవలెను సమస్తపాపములను శమింపచేయునది, సమస్తకామములను తీర్చునదియగు విష్ణపరమపదము కూడ గాయత్రియే.
ఆగ్ని మహాపురాణమునందు యజుర్విధానమను రెండువందల అరువదవ అధ్యాయము సమాప్తము.
