అగ్ని మహా పురాణము

Table of Contents

96 - అథ అధివాసనవిధిః

            పరమేశ్వరుడు చెప్పెను. పురోహితుడు స్నానమాచరించి, ప్రాతః కాలమధ్యాహ్న కాల కృత్యములు నెరవేర్చు కొని మూర్తి రక్షకులగు బ్రాహ్మణిలతో కలిసి యజ్ఞ మండపము, చేరుకొనవలెను. వెనుకటి వలెనే శాంత్యాదిద్వారపూజ క్రమముగా చేసి, ద్వారముల రెండు శాఖలందును, ప్రదక్షిణమున, ద్వారపాలపూజ చేయవలెను పూర్వదిక్కున ద్వారపాలు లైన నందీ-మహాకాలులను దక్షిణమున భృంగి-వినాయకులను, పశ్చిమమున - వృషభస్కందులను, ఉత్తరమున దేవీ చండులను పూజించవలెను. ద్వారకామూలములందు, పూర్వాదిక్రమమున రెండేసి కళలను పూజించవలెను. పూర్వదిక్కున నున్న కలశల పేర్లు ప్రత-శిబిరములు, డక్మిణమున వర్ణన్య.ఆశోకములు, పశ్చిమమున భూతసంజీవన.ఆమృతములు, ఉత్తరమున ధనద తీవ్రమలు. ఈ రెండేసి కలశలను క్రమముగా పూజించు విధానము చెప్పబడినది. వీటి పేర్ల ప్రారంభమున ఓంకౌరము, అంతమున 'నమః' చేర్చి చతుర్యంతరూపము ఉంచవలెను. ఇవే దీని పూజామంత్రములు. ఉదా ప్రశాస్త శిశీరాభ్యాం నమః  మొ. యజ్ఞమండపమునందలి ప్రత్యేక ద్వారమునందును రెండు లోకములు, రెండు గ్రహ ములు, ఇద్దరు వస్తువులు, ఇద్దరు ద్వారపాలురు, రెండు నదులు, ముగ్గురు సూర్యులు, ఒక యుగము, ఒక వేదము, లక్ష్మి, గణేశుడును ఉండును, విఘ్నములమ తొలగించి యజమును రక్షించుట వీరి కర్ణవ్యము. పూర్వాదిదిక్కులు ఫదింటియం దును వజ.శ క్తి-దండ ఖడ్గ.పాశ-ధ్వజ-గదా-త్రిశూల నక్ర-కమరములను పూజించి, ఒక్కొక్క దిక్కునందును దిక్పాలక పలకా పూజ చేయవలెను. “ఓం హం హః హూం ఫట్” ‘ఓం హూం హిః శక్తయే హుం ఫట్’ ఇత్యాధులు మంత్ర ములు కుముద.కుముదాక్ష -పుండరీక వామనశంకుకర్ణ-సర్వనేత్ర. సుముఖ-సుప్రతిష్టితు లను ఎనమండుగురు ధ్వజదేవతలను కోటికోటి భూతములతో పూజించవలైను, “ఓం కుం కుముదాయ నమః” ఇత్యాదులు పూజామంత్రములు హేరుక-త్రిపురత్న - శక్తి-యమజిహ్వ-కాల ఎకరాలీ ఏకాంఫ్రీ-భీము లను ఎనమండుగురు క్షేత్రపాలులను పూర్వాదిదిక్కులందు బలి-పుష్పధూపాదులతో పూజిలచి సంతుష్టులను చేయవలెను.

పిడత్తమతృణములపైన, లేదా, వెదురు స్తంభములపై పృథ్విడి వంచతత్త్వములను స్థాపించి, సద్యోజాతీమంత్ర వంచకముతో వాటిని పూజించవలెను. పతాక తోడమ, శక్తితోడను యుక్త మగు సదాశివవవవ్యాపి మైన మండపము శంక రుని స్థానము అని తాత్వికదృష్టితో చూడవలెను. వెనుకటి వలె ద్యులోకాన్తరిక్షలోకభూలోకములలో నున్న విమ్నములను, తొలగించి ఈ్చమద్యారమున ప్రవేశించి ఇతర ద్వారముల, చర్శనము చేయవలెను.  ప్రదక్షిణక్రమమున మండపములోని కి ప్రవేశించి, వేదీదంణభాగమున ఉత్తరాభిముఖముగ కూర్చుండి, వెనుకటి వలె భూతశుద్ది చేయవలెను. ఆంతర్యాగవిశేషార్ఘ్య.మంత్రద్రవ్యాదిశోధన-స్వాత్మపూజన-పంచగవ్యాదికము వెనుకటి వలె చేయవలెను. ఆచట ఆరశ క్షిప్రతిష్టా సర్వకముగ కలశ స్థాపనము చేయవలెను. - వీళేషించి శివధ్యానము చేయవలెను. పిడత మూడుతత్త్వముల చింతనము చేసి, రిలాటమత శివతత్త్వమును, స్కంధదేశమునందు విద్యతత్త్వమును పాదాక్షభాగమునందు ఆత్మతత్త్వమును - భావన చేయవలెను. శివతత్త్వమునకు- రుద్రుడ, విద్యాతత్వమునకు నారాయణుడు, ఆత్మతత్త్వమునకు బ్రహ్మది దేవతలు, వీరిని వారి వారి వామమంత్రములలో పూజించవలెను. వరసగ ఈ తత్వముల ఆదిబీజములు “ఓం ఈ ఆం” అనునవి (ఓం హం హం ఆనవి), మూర్తులన్యుమూ ర్తీశ్వరులమ వెనుకటి వలెనే స్థాపించి, వాటిమీద వ్యాసక్కువుని సాంగపూజ చేసి, ఖముపై శివహ సమును ఉంచవలెము - బ్రహ్మరంధ్రమునుండి ప్రవేశించి తేజస్సుచే తన లోపలన్న బైటను ఉన్న ఆంధ కారరాశి నష్ట మైనట్లు భావన చేసి, ఆత్మస్వరూపమే సంపూర్ణదిజ్మండలమును ప్రకాశింపచేయుచున్న దని భావన చేయ వలెను. . మూర్తిపాలకులతో పాటు తనను గూడ వస్త్ర-మకుట్లాదులతో అలంకరించుకొని, “నేనే శివుడను” అని చింతించుచ బోధ ఖడ్గమును ఎత్తివలెను.

చతుష్పదాంత సంస్కారములతో యజ్ఞమండపసంస్కారము చేసి, చల్లవలసిన వస్తువులు వేలుమూలల చల్లి, కుక కుంచితో వాటినన్నింటిని ప్రోగుచేయవలెను. వాటిని ఆసనము క్రింద నుంచి, వర్ధమీజలముతో వెనుకటీ వరి పాస్త్వాండి. పూజ చేయవలెను. శివకుంభాస్త్రమును, ఇద్దనిని సుస్థిరాసనమును, కూడ హజించవలెను. వారి వారి కలకల పైనున్న ఇంద్రాది దిక్పాలకులను క్రమముగ ఆయుర పరివారాది సహితముగ పూజించవలెను. తూర్పున, ఐరావతము నెక్కి, రము పై కిరీటమును, హస్తమున వజ్రమును ధరించిన సహస్రాకు డైన ఇంద్రుని ధ్యానించవలెను. ఆగ్నేయమున జ్వాలామయము లగు ఏడు జిహ్వలు కలిగి, అక్షమాలాకుడలములు ధరించి, ఆజారూఢుడై న జ్వాలాపరివృతు డైన అగ్నిదేవుని ధ్యానించ. వలెను. ఆతని హస్తమునందు శయడముండును. దక్షిణమున మహిషారూడుడును, దండధారియ, కాలాగ్ని వలే ప్రకాశించువాడును అగు యముని ధ్యానించవలెను. నైరృతియందు ఖరారూఢుడై, ఖడ్గము ధరించి, ఎట్టిని నేత్రములు గల నైరృతిని ధ్యానించవలేను. వచ్చిమమున, మకరారూడుడును, శ్వేతవర్ణుడును, నాగపాశధారియ ఆగు వరుణుని ధ్యానించి వలెను. వాయవ్యమునందు లేడి నెక్కిన, నీలవర్లు డైన వాయువును, ఉత్తరమునందు గొర్రెనెక్కిన కుబేరుని, ఈశాన్యమున త్రిశూలధారియు, వృషభారూఢుడును ఆగ ఈశానని, నేరృతి_పశ్చిమముల మధ్య కచ్చపారూడుడును చక్రధారియు తెగ అనంతుని, ఈశాన-పూర్వదిజ్మధ్యములందు నాలుగు ముఖములు, నాలుగు భుజములును, గల హంసవాహనుడైన బ్రహ్మను ధ్యానించవలెను. స్తంభమూలమునం దున్న కలశములందును, వేదియందును ధర్మాదులను పూజించవలెను. కొందరు అన్ని దిక్కులందును ఉన్న కలకలపై అనంతాడను పూజింతురు. పిదప శివాజ్ఞ వినిపించి, కలములను తన పృష్టభాగము వరకును త్రిప్పవలెను. పిదప, ముండగ కలశము, తరువాత వర్థనిని, వాటి స్థానములం దుంచవలెను. స్థిరాసనము గల శివుని కలశమునందును, శస్త్రము నిమిత్తన ధ్రువాసనమున వెనుకటి వలే పూజించి ఉద్భవముద్రతో స్పృశించవలెను. అపుడు “జగన్నాధా! నీ భ క్తుపై కృనతో ఈ నీ యజ్ఞమును రక్షించుము” అని ప్రార్థించి కలశమునందు అడసావేశ చేయవలెను. 'దీవా స్థాపనాసమయములందు, కలకయందు గాని, వేది. పైగానీ, మండలముపై గానీ పని పూజించవలెను. మండలమునందు దేవేశ్వరుడగు పుని పూజించి, కుండము దగ్గరకు వెళ్ళవలెను.

            కుండనాభిని ముందు ఉంచుకొని కూర్చున్న మూర్తి ధారులగు పురుమలు గురువు ఆజ్ఞ ననుసరించి తమతమ కుండములను సంస్కరించుకొనవలెను. జపముచేయు బ్రాహ్మణులు, సంఖ్యారహితముగ జపము చేయవలెను. ఇతరులు సంహితాపాఠము చేయవలెను. వేదపారంగతులగు బ్రాహ్మణులు తమతమ శాఖల ననుసరించి శాంతిపాఠము చేయవలెను, ఋగ్వేదులగు బ్రాహ్మణులు తూర్పున శ్రీసూక్త - పావమానీఋక్ - మైత్రేయబ్రాహ్మణ- వృషాకపి మంత్రములను పఠించ వలెను.  సామవేదవేత్తలు దక్షిణమున దేవవ్రత - భారుండ - జ్యేష్ఠసామ - రథంతరసామ - పురుషగీతగానము చేయ వలెను. - యజుర్వేదులు, పశ్చిమమున, రుద్రసూక్త - పురుషసూక్త - శ్లోకాధ్యాయములను, ప్రధానముగ బ్రాహ్మణము లను పఠించ వలెను. అథర్వవేదులు, ఉత్తరమున, నీలరుద్ర, స్మూ సూక్ష్మ - అథర్వశీరములను శ్రద్ధతో పఠించ వలెను, ఆచార్యుడు ఆగ్ని ని పుట్టించి, అన్ని కుండములందును స్థాపింపచేయవలెను. అగ్నికి పూర్వాభాగములందు పూర్వకుండాది క్రమమున ధూప దీప చరువులకొరకై ఆగ్యుద్ధారము చేయవలెను. మొదట చెప్పిన విధముగ పరమేశ్వరుని పూజించి, శివాగ్నియందు మంత్రతర్పణము చేయవలెను. దేశ కాలాది సంపన్నత్వము కొరకును, దుర్నిమిత్త శాంతికొరకును, మంత్రజు డగు ఆచార్యుడు హోమము చేసి, మంగళకరమగు పూర్ణాహుతి ఇచ్చి వెనుకట్టి వలె చరువును వండి, దానిని ఒక్కొక్క కుండము నందును నివేదన చేయవలెను. యజమానునిచే వస్త్రాభూషణాదులతో సత్కరింపబడిన మూర్తిపాలకు లగు బ్రాహ్మణులు స్నానమండపమునకు వెళ్ళి, శివ ప్రతిమను . థగ్రపీఠము పై స్థాపించి, తాడన-ఆవకుంఠన క్రియను చేయ వలెను. పూర్వవేదిక పై పూజచేసి మట్టి, కషాయ జలము, గోమయము, గోమూత్రము - వీటితోను. మధ్య మధ్య జలముతోను భగవత్రతిమకు స్నానము చేయించవలెను. పిదప భస్మముతోను, సుగంధిజలముతోను స్నానము చేయించవలెను. పిదప ఆచార్యుడు “అస్త్రాయ ఫట్” అను మంత్రముతో అభిమంత్రించిన జలముతో మూర్తిపాటంతో పాటు తన హస్తములు కూడ కడిగిని, కవచ మంత్రాభిమంత్రిత పరుగు పీతాంబరముతో మూర్తిని ఆచ్ఛాదించి, శ్వేతపుష్పముతో పూజించవలెను. పిదప దానిని ఉత్తర వేదిమీదకు తీసికొని వెళ్ళవలెను.

అచట ఆసనయుక్త మగు శయ్యపై పరుండ బెట్టి కుంకుమరంగు పూసిన దారముతో అంగవిభాజనము చేసి, ఆచార్యుడు సువర్ణశలాకతో ప్రతిమయందు నేత్రములను గుర్తించవలెను. ఈ పని ప్రక్రియ ద్వారా జరుగవలెను. చిహ్నములు చేసిన గురువును ముందుగ నేత్ర చిహ్నమును ఆంజసాంకితము చేయగా, పిమ్మట, మూర్తి నిర్మాణము చేసిన శిల్పి శస్త్రముతో ఆ నేత్రచిహ్న స్థానమును చెక్కివలెను. ఆ మూర్తియందు, మూడు అంశములకంటె తక్కువగా గాని, నాల్గవ వంతు గాని, అర్ధ భాగమునందు గాని, సంపూర్ణ కామసిద్ధి కొరకై , కథ చిహ్న ములను ఉంచవలెను. శివలింగము పొడవున మూడుచే భాగించి, ఒక భాగము విడువగా ఎంత ప్రమాణము వచ్చునో అదే లింగముయొక్క లక్ష్మదేహమునకు అన్ని వైపుల నుండి విస్తారము కావలెను. హస్తమాణ మగు శిలయందు గీయు లక్ష్మరేఖల. లోతు. వెడల్పులు వయొక్క తొమ్మిది భాగములలో ఒక దానిని విడిచి ఎనిమిది గ్రహించి నంత ఉండవలెను. - ఇదే విధముగ ఒకటిన్నర లేదా రెండు హస్తములు మొదట ప్రమాణము గల శివలింగము మొదలు, తొమ్మిది హస్తముల ప్రమాణము గల లింగము వరకును, క్రమముగ ఎనిమిదవ వంతు పెంచుచు చిహ్న రేఖలు గీయవలెను. ఈ విధముగ తొమ్మిది హస్తముల లింగమునందు ఎనిమిది యవల లోతు వెడల్పులు గల చిహ్న రేఖ లుండవలెను. పరస్పరాంతరముతో ఉత్తరోత్తరము పాదవృద్ధి గల శివలింగమున లక్ష్మ దేహ విస్తారము ఒక్కొక్క యవ పెరుగుతూ పోవలెను. లోతు. వెడల్పుల పెరుగుట ననుసరించి, రేఖ మూడవ వంతు పెరుగుచుండును. అన్ని శివలింగములందును దాని పై భాగమే దాని సూక్ష్మశిరము చిహ్నచేత్రమును ఎనిమిది భాగములు చేసి, రెండు భాగములు శిరస్సునం దుడు నట్లు చేయవలెను. మిగిలిన ఆరు భాగములలో క్రింది రెండు బాగములను విడచి మద్యయందు మిగిలిన భాగములందు మూడు రేఖలు గీసి, వాటిని పృష్ణదేశమునకు తీసికొని వెళ్ళి విడువవలెను. రత్న మయలింగము లైనచో లక్షణోద్ధారము - ఆవశ్యకము కాదు. భూమినుండి స్వతః ఆవిర్భవించిన లింగములకు గాని, నర్మదాదినదులు దుద్భవించిన లింగములకు గాని లక్ష్మీద్ధార మ పేడితము కాదు. రత్నమయ లింగముల రత్నములం దున్న నిర్మలకాంతియే వాటి స్వరూపమునకు లక్షణము, ముఖభాగమునందు - నేత్రోన్మీలనము ఆవశ్యకము. అందు నిమిత్తమే ఈ చిహ్మము నిర్మింపబడుచన్నది.

లక్షణోద్ధార రేఖను మృత్యుంజయమత్రమతో, మృతమధువులతో పూజించి, శిల్పిదోషపరిహారార్థమై మృత్తికాది స్నానము చేయించి, లింగమును పూజించవలెను. పిదప దానమానాదులతో శిల్పిని నంతోషబెట్టి గురువునకు గోవు నీయ వలేను. సౌభాగ్యవతు లగు స్త్రీలు ధూపదీపాదులతో లింగమునకు విశేష పూజలు చేసి మంగళ గీతములను గానము చేయవలెను. సవ్యాపవ్య భావముతో కుశముతో గాని, సూత్రముతో గాని స్పర్శపూర్వకముగ గోరోచనము సమర్పించవలెను. పిదప యజమానుడు బెల్లము, ఉప్పు, ధాన్యాకము (కొత్తుమ్మరి) మొదలగునవి ఇచ్చి ఆ శిలను పంపివేయవలెను. పిమ్మట గురువు మూర్తిరక్షకు లగు బ్రాహ్మణులతో కలిసి, “నమః” లేదా ప్రణవమంత్రములో మట్టి, గోమయము, గోమూత్రము, ఈస్మము-వీటితో వేరు వేరుగా స్నానము చేయించవలెను. ఒక్కొక్క దానితో స్నానము చేయించిన పిదప మధ్యయందు. జలముతో స్నానము చేయించవలెను. పిదప పంచగవ్యవులు, పంచామృతము, రూక్షత్వమును తొలగించు కషాయ ద్రవ్యములు, స్విషధి మిశ్ర జలము, శ్వేత పుష్పములు, ఫలములు, సువర్ణము, రత్నములు, శృంగము, యవలు కలిపిన జలము, సహస్రధార, దివ్యౌషధిముక్త జలము, తీర్థ జలము, గంగాజలము, చందనమిశ్ర జలము, క్షీర సాగరాదీజలము, కలశజలము, శివకీ లశ జలము వీటిచే స్నానము చేయించ వలెను. రూక్ష్మత్వమును తొలగించు విలేపనము ఉత్తమ గండము చందనము మొదలగువాటితో పూజ చేసిన పిమ్మట బ్రహ్మమంత్రముతో పుష్పములను, కవచమంత్ర ముతో-రక్త వస్త్రమును సమర్పించవలెను. అనేక విధములగు హారతి ఇచ్చి, రష. తిలక పూర్వకముగ గీతవాద్యాదు తోను వివిధ ద్రవ్యములతోను, జయజయ ధ్వనులతోను, స్తుత్యాదులతోను, పరమేశ్వరుని సంతుష్టుని  చేసి, పుష్పమంత్ర ములతో పూజ చేయవలెను. హృదయమంత్రముతో ఆచమనము చేసి, “ఓ ప్రభూ! లెమ్ము” అని ఇష్టదేవతతో చెప్ప వలెను. పిదప ఇష్టదేవతను బ్రహ్మరథముపై కూర్చుండ బెట్టి నాలుగు దిక్కులందును త్రిప్పి వివిధద్రవ్యము నిను వేద జల్లుచు, పశ్చిమద్వారమునకు తీసికొనిపోయి అచట దేవతను శయ్యపై కూర్చుండ బెట్టవలెను, ఆసనము ఆద్యంతముల యందు శక్తి భావన చేయుచు ఆశుభాసనముపై కూర్చుండ బెట్టవలెను.

పశ్చిమాభిముఖ మైన ప్రాసాదమునందు పశ్చిమము వైపున పిండిక స్థాపించి, దానిపై బ్రహ్మ శిల ఉంచవలెన. శివకోణము నందు నూరు అస్త్రమంత్రముతో అభిమంత్రించిన నిద్రకలశమును, శివాసనమును కల్పించి, హృదయమంత్రముతో ఆర్ఘ్యమిచ్చి, దేవతను లేవదీసి, శిరోమంత్రముతో, లింగమయా సనముపై, తూర్పువైపు శిరస్సు ఉండునట్లు, ఉంచవలెను. పిదప చందనధూపాదులు సమర్పించి దేవుని పూజించి కవచమంత్రముతో వస్త్రము సమర్పించి, గృహోపకరణ వలను దు లర్పించి, శ క్త్యనుసారము నమస్కారపూర్వకముగ నైవేద్యము : నివేదించవలెను. అభ్యంగము కొరకై, మృత - మధు యుక్తమగు పాత్రను, దేవతాపాన సమీపమున ఉంచవలెను. ఆచార్యుడు, శక్తి మొదలు భూమి వరకునునున్న ముప్పదియారు తత్వములను, తదధిపతి సహితముగ స్థాపించి, వాటిని, పుష్పమాలలతో మూడు భాగములుగ విభజించ వలెను. ఇది మాయమొదలు శ క్తిపర్యంతమైన భాగ ముల; మొదటిది చతుష్కోణము;- రెండవది అష్టకోణము; మూడవది వర్తులాకారము. సృష్టి క్రమానుసారము ఈ భాగములకు బ్రహ్మ విష్ణుశివులు, ఆధిపతులు, పిదప పూర్వాది క్రమమున మూర్తు లను, మూర్తీ శ్వరులను న్యాసము చేయవలెను. పృథివి, అగ్ని; యజమానుడు, సూర్యుడు, జలము, వాయువు చంద్రుడు, ఆకాశము ఈ ఎనిమిది మూర్తిరూపములు. వీరి న్యాసము, చేసిన పిమ్మట ఆధిపతుల న్యాసము చేయవలెను. శర్వ - ఉగ్ర - రుద్ర- భవ - ఈశ్వర – మహాదేవ- భీముని ఆధిపతులు. లం, రం, శం, ఖం, చం, పం, సం, హం, అనువ. వీరి మంత్రము. త్రిమాత్రిక ప్రణవపంలు గాని, హృదయమత్రము గాని, మూల మంత్రములు గానీ వీరి పూజ కి వినియోగింపబడును లేదా పుచకుందాత్మక యానమునంద పృథ్వీజు తేజో వాయు- ఆకాశము అనైతు పంచమూర్తుల న్యాపము చేయవలెను. పిదప, మంత్రజ్ఞుడు, బ్రహ్మ - శేషుడు, రుద్రుడు ఈశుడు, సదాశివుడు అనువారిని సృష్టి క్రమమున న్యాసము చేయవలెను, యజమానుడు మముకు వైనచో, వంచమూర్తులకు బదులు నివృత్త్యాది పంచకళలను, ఆజాతుడు మొదలగు తదధిపతులను న్యాసము చేయవలెను. లేదా సర్వత్ర వ్యాప్త రూపమగు కారణాత్మక త్రితత్త్వన్యాసము చేయవలెను.

శుద్దాధియందు విద్యేశ్వరులను ఆశుద్ధాధ్వయందు లోకనాయకులను మూర్తి పతులనుగా చూడవలేను. భోగి (సర్పము) కూడ మంత్రేశ్వరుడు. క్రమముగ ముప్పదియైదు, ఎనిమిది, ఐదు, త్రిమూర్తి రూపములును చెప్పబడినవి. ఇవే వీటి తత్త్వములు, ఏతత్తత్వాధిపతుల మంత్రములు దిగ్దర్శనము మాత్రము చేయబడుచున్నది. “ఓం హం శక్తి తత్త్వాయ నమః” ఇత్యాదికము “ఓం హం శక్తి తత్త్వాధిపాయ నమః” ఇత్యాదికము “ఓం హాం జ్మెమూర్తయే నమః “ఓం హం ఇమూర్వ ధిపతయే బ్రహ్మణే నమః ఆత్యాదికము “ఓం హం శివతత్త్వాయ నమః” “ఓం హం శివతత్త్వాధి పతయే రుద్రాయనమః” ఇల్యాదికము నాభిమూలము నుండి ఉచ్చరింపబడుచు మంటావాదము వలె నలువైపుల వ్యాపించు చున్నదియు, బ్రహ్మాది కారణత్యాగ పూర్వకముగ ద్వాదశ స్థానమును పొందిన మనస్సు కంటే ఆభిన్న మును అగు మంత్రమును, నిష్కళుడును, ముప్పదియారు కళలతో కూడినవాడును, సహస్రకిరణములతో ప్రకాశించుచున్నవాడును సర్వశక్తి మయుడును, పొంగుడును అగు వ్యాపక శివుని ధ్యానించుచు, ఆ దేవుని ద్వాదశాంతమునుండి తీసికొని వచ్చి శివ లింగముపై స్థాపింపవలెను. శివలింగముపై చేయు ఉపన్యాసము సకలపురుషార్ధ సాధనముగ నుండవలెను. పిండితాది వ్యాసవిధానము చెప్పబడుచున్నది. పిండికకు స్నానము చేయించి, చందనాదులు పూసి, సుందరవస్త్రములు కప్పి, దాని భగస్వరూపమగు ఛిద్రమునందు పంచరత్నాదులు వేసి, లింగమునకు ఉత్తరమున ఉంచవలెను. లింగమునందు వలె దాని యందు కూడ వ్యాసము చేసి యథావిధిగ పూజించవలెను. స్నానాది హజాకార్యములు పూర్తి చేసి లింగ మూలభాగమున శివుని న్యాసము చేయవలెను. పిదప శక్యంత వృషభమునకు కూడ స్నానాది సంస్కారములు చేసి స్థాపన చేయవలెను. పిదప మొదట ప్రణవమును, తరువాత హ్రాం హ్రూం హీం లలో ఒక బీజాక్షరమును- ఉచ్చరించుచు క్రియాశక్తి సహిత మగు, ఆధారరూపిళిల (పిండిక)ను పూజించవలెను. భస్మ - కుశ - తిలలతో మూడు ప్రాకారములు నిర్మించి రక్షణారమై బైట ఆయుధములతో కూడిన లోకపాలులను నిలిపి, పూజించవలెను.

“ఓం హ్రీం క్రియాశ క్తయే నమః ఓం హ్రీం మహాగౌరి. రుద్రదయితే స్వాహా అనునవి పూజా మంత్రములు; “ఓం హ్రీం ఆధార శక్తయే నమః ఓం ప్రవృషభాయ నమః అను మంత్రములతో పిండికను పూజించవలెను. ధారీకా దీప్తా - అత్యుగ్రా - జ్యోగ్ని - “లోత్కటా - ధాత్రీ - విధాత్రీంను పిడి పై న్యాసము చేయవలెను. - లేదా వామా - జ్యేష్ణా - క్రియా - జ్ఞావా - వేధా అను ఐదుగురు నాయికలను న్యాసము చేయవలెను. లేదా క్రియా - జ్ఞానా - ఇచ్ఛా అను ముగ్గురినే న్యాసము చేయవలెను. వెనుకటి వలెనే - శాంతి మూర్తులలో తమీ - మోహా - షుధా నిద్రా - మృత్యు మాయా - జరా - భయలను న్యాసము చేయవలెను. . లేదా తమా, మోహా - ఘోరా - రతి - అవ జ్వరా అను ఐదు గుర న్యాసము చేయవలెను, లేదా క్రియా - జ్ఞానా - ఇచ్చా అను ముగ్గురు అధినాయికలను తీవ్రమూర్తి గల ఆత్మాది తత్త్వము తియముపై న్యాసము చేయవలెను. . పిడికా - బహ్మ శిలాదులపై, వెనుకటివలెనే గౌర్యాదిమతములతో సకల కార్యములు యథావిధిగా చేయవలెను. ఈ విధముగ న్యాసకర్మ చేసి, కుండము దగ్గరకు వెళ్ళి దాని లోపల మహే శ్వరుని మేఖలయందు చతుర్భుజుని, నాభియందు కియా శక్తి ని న్యాసము చేయవలెను. కలశ - వేదీ - అగ్ని- శివుల తో నాడీ సంధాన కర్మ చేయవలెను. తామరతూడులోని దారము వలె ఆతిసూక్ష్మమైన శక్తి ఊర్ధ్వగతమను వాయువు సహాయముతో పైకి ఎగిరి, శూన్యమార్గమునుండి శివునిలో ప్రవేశించును ఆ ఊర్ధ్వగతశ క్తి అచటి నుండి బయలుదేరి వచ్చి శూన్యమార్గమునుండి తనలో ప్రవేశించుచున్నదని భావన చేయవలెను. ఈ విధముగనే మూర్తి పాలుల సంధానము కూడ చేయ వలెను.

కుండమునందు ఆధారశక్తి ని పూజించి, తర్పణము చేసిన పిదప క్రమముగా, తత్త్వ - తత్వేశ్వర - మూర్తి మూర్తి శ్వరులను మృతాదులతో పూజించి, తర్పణము చేయవలెను. పిదప వారిపై సంహితామంత్రములతో నూరు గాని మ్యోగాని, ఐదు వందలు గాని హోమములు చేసి, పూర్ణాహుతి ఇవ్వవలెను. ఈ విధముగ తత్త్వతత్వేశ్వరులకును, మూర్తి మూర్తీశ్వరులకును, ఒండొరుల సాంనిధ్యమున తర్పణములు చేసిన పిమ్మట మూర్తిపాలకులు గూడ వారికే హోమములు చేయవలెను. పిదప ద్రవ్యకాలానుసారము వేదములనుతోను, ఆంగముతోను తర్పణము చేసి, శాంతికలశ జలముతో ప్రోక్షించిన కుశమూలముతో లింగమూలభాగమును స్పృశించి, ఎన్ని హోమములో అంత జపము చేసి, హృదయ మంత్రముచే సంనిధాపనమును కవచమంత్రముచే ఆచ్ఛాదనమును చేయవలెను. ఈ విధముగ సంధనము చేసి లింగోర్ధ్వ భాగమున బ్రహ్మను మూలభాగమున విష్ణువును పూజించి, శుద్ధి నిమిత్తమై వెనుకటి అన్ని కార్యములు పూర్తి  చేసి, హోమ సంఖ్యానుసారము జపాదులు చేయవలెను. కుశ మధ్యభాగముచే లింగమధ్యభాగమును, కుశాగ్రభాగముచేలింగాగ్ర భాగమును స్పృశించవలెను. ఏ మంత్రముచే ఏ విధముగ సంధానము చేయవలెనో. చెప్పబడుచున్నది. “ఓం హాం హం ఓం ఓం ఏం ఓం ధూం ధూం జాహ్యమూర్తయే నమః, ఓం హాం వాం ఆం ఓం ఆం షాం ఓం భూం భూం వారి వహ్ని మూర్తయే నమః, యజమావాది మూర్యభి. సంధానము కూడ ఇట్లే చేయవలెను. పంచమూర్త్యాత్మక శివునిసంధాన కర్మ కూడ హృదయాది మంత్రములతో ఈ విధముగనే చేయవలెను. త్రితత్త్వాత్మక స్వరూపమునందు సంధానకర్మ మూల మంత్రముతో గాని, స్వస్వబీజమంత్రములతో గాని చేయవలెనని గ్రహించ వలెను. శిలా పిండికా-వృషభములకు కూడ సంధానము ఈ విధముగనే చేయవలెను. ఒక్కక్క భాగము శుద్ధి కొరకై, దాని మంత్రములతో శతాది హోమము చేయవలెను. న్యూనతాదిదోష పరిహారార్థమై శివమంత్రముతో నూట ఎనిమిది హోషములు చేసి, చేసిన కర్మను గూర్చి శివునకి చెవిలో చెప్పవలెను.

“ప్రభూ! నేనీ కార్యమును నీ శ క్తిచేతనే చేయగలిగితిని. భగవంతుడగు రుద్రునకు నమస్కారము. రుద్రదేవా! నీకు నమస్కారము, కర్మ విధి పూర్ణమైనను కాక పోయినను, నీవు నీ శక్తి చేతనే దీనిని పూర్ణము చేసి గ్రహించుము.” “ఓం శాంకరి ఫూరయ స్వాహా” ఆని చెప్పి పిండిక పై న్యాసము చేయవలెను. పిదప జ్ఞాని యగు పురుషుడు లింగమున క్రియాశ క్తిని, పీఠ విగ్రహమునందు, బ్రహ్మశిల పైన ఆధారరూపిణి యగు శ క్తిని న్యాసము చేయవలెను. ఏడు రాత్రులు ఐదు, రాత్రులు లేదా ఒక రాత్రి దానిని నిరోధించి వెంటనే అధివాసనము చేయవలెను. ఆధివాసనము లేకుండగ చేసిన యాగము ఫలదాయకము కాదు గాన ఆధివాసనము తప్పక చేయవలెను. అధివాసనకాలమున ప్రతిదినమునను, దేవతలకు వారి వారి మత్రములతో వందేసి హోమములు చేసి, శివకలశాది పూజ చేసి, దిక్కులందు బలి సమర్పించవలెను. గుర్వాదు లతో రాత్రి నీయమపూర్వకముగ నివసించుట” ఆధివాసము; ఆధి పూర్వక వన్ ధాతువునకు భావార్థమున మజ్లో ప్రత్యయము చేర్చుటచే అధివాస శబ్దము నిష్పన్నమైనది.

అగ్నిమహాపురాణమునందు ప్రతిష్ఠాంతర్గతాధివాసవిధి యగును తొంబది యారవసర్గః సమాప్తము.