అగ్ని మహా పురాణము
299 - అథ బాలగ్రహహరణాల తంత్రమ్
అగ్ని రువాచః
అగ్ని దేవుడు చెప్పెను. బాలాది గ్రహములను తొలగించు బాల తంత్రమును చెప్పెదను. పుట్టిన దినమున శిశువును పాపినియను గ్రహి ఆవేశించుమ. దానిచే శిశువు శిరమున ఉద్వేగము కలుగును. పాలు త్రాగక మెడ ఇటు అటు త్రిప్పుచుండును. ఇది పాపినీ గ్రహచేష్ట. దీనిని నివారించుటకు పాపిని గ్రహికిని మాతృకలకుమ మత్స్య మాుస సుర, భక్ష్య గంధమాలా, ధూపదీ:మంతో జలి ఇవ్వవలెను. ఆ శిశువు శరీరమున, ధాతకీలోధ్ర, మంజిష్ఠా తాల చందనముల లేపనముచేసి గుగ్గులు ధూపము వేయవలయును. రెండవ రోజున భీషణియను గ్రహి ఆవేశించును. కాసనిశ్వాసములు మాటి మాటికి గాత్ర సంకోచము ఇవిదానివలన కలుగు చేష్టలు. ఆట్టి శిశువుకు అజామూత్రముపోసి కృష్ణ, అపామార్గ చందనములతో ఆరగ దీసిన పిప్పలి లేపము చేయవలయును. గోశృంగ, దంత, కేశములతో ధూపము వేసి వెనుకటివలెనే బలియివ్వవలయును. మూడవ రోజు ఆక్రమించు గ్రహిపేరు “ఘంటాలి” మాటిమాటికి యెక్చుట ఆవులింత అరచుట భయము గాత్రోచ్వేగము అరుచి ఇవి దానివలన కలుగు చేష్టలు. ఆట్టి శిశువునకు కేసరము రంజ నము గోదంతము హస్తి దంతము వీటిని మేక పాలలో నూ శరీరమునకు పూయవలయును. వఖ రాజీ బిల్వ పత్రములలో ధూపమువేసి వెనుకటివలెనే బలి యివ్వవలయును. నాల్గవ దినమున గ్రహికాకోలి. ఇది ఆవహించిన శిశువు గోత్రోద్వేగ ముతో ఎక్కువగా ఏడ్చును. నురుగుకక్కును. దిక్కులవై పు చూచును. దీనిశాంతికౌరకై కుల్మాష మద్యములలో బలియిచ్చి గజదంత సర్వత్వక్ ఆశ్వమూత్రములను శరీరముకు పూసి రాజీనింబ పత్రములతో గొల్ల వెంట్రుకలతో ధూపము వేయవలయును. - ఐదవ గ్రహియగు హంసాదిక ఆవులింతలను ఎగుడు శ్వాసలను, ముష్టి బంధనమును కలిగించును. వెనుకటి వలెనే బలి యివ్వవలయును. శిశు శరీరమునకు శేషశృంగ బలాలోధ్ర శిలా తాలములు పూయవలయును. ఆరవ గ్రహిపట్కారి. భయమును మోహమును అధిక రోదనమును కల్గించును. శిశువు ఆహారము తినక అవయవములను ఎక్కువగా కదల్చును. వెనుకటి వలె బలియివ్వవలయును. రాజీ, గగ్గులు, కుష్ఠ గజచంతాదులతో ధూపన లేప దులు చేయవలయును. యేడవరోజున గ్రహిముక్తకేశి. దానిచే ఆక్రమించబ3న శిశువు దుఃఖాతురుడగను. శరీవము నుండి దుర్వాసనవచ్చును. ఆవులింత, అధికమగును. రోదనము కాసము కలుగును. వానికి వ్యాఘ్రనఖముల తో ధూపము వేసి శరీరమునకు గోమయ గోమాత్రములు లేపనము చేయవలయును. ఎనిమిదవ డివమున గ్రహి శ్రీచండి. ఈ గ్రహి ఆవేశించిన శిశువు దిక్కులు చూచును. నాలుక కదల్చును. దగ్గును. రోదనము చేయును. పూక్వోక్తమరు బలిని ఇవ్వ వలయును. హింగులావడా, సిద్ధారలగునము? తో ధూప అను లేపములు చేయవలయును. తొమ్మిదవది ఊర్ధ్వగ్రహి యను మహాగ్రహి. యిది ఆవేశించిన శిశువు ఉద్వేగముతో ఊర్ధ్వనిశ్వాసములతో తన రెండు పిడికిళ్ళను సమలును. వానికి రక్తచందన కుషాదులతో ధూపలేపనములు చేయవలయును. కపిరోమ నఖములతో ధూపము వేయవలయును. పదవ దివసమున రోదని అను గ్రహి ఆవేశించును. అపుకు శిశువు ఎక్కువ రోదనము చేయును. శరీరము నీలవర్ణమై సుగంధ
యుక్తమగును. అట్టి శిశువునకు వేపాకుతో ధూపము, ఉగ్రరాజి సర్జరముణ లేపము చేయవలయును. లాజకుల్మాష, ఓదనములతో దానికి బలియివ్వవలెను. ఈ విధముగ పదమూడు రోజుల వరకు ధూపాదిక క్రియ జరుపవలయను.
ఒక మాసము వయస్సు గల శిశువును పూతన యనుగ్రహి ఆవహించును. ఇది ఆవహించిన శిశువు కాకి వలె అరచుచు, ఏడ్చును. పొడవుగా శ్వాస పీల్చుచు మాటి మాటికి కండ్లు మూయును. వాసనమూత్ర గంధము వలె నుండును. అట్టి శిశువునకు గోమూత్రముచే స్నానము చేయించి, గోదంతము ధూపము వేయవలయును. ఆ పూతన కొరకై గ్రామము నకు దక్షిణమున కరంజ వృక్షము క్రింద ఒక సప్తాహము వరకు పీత వస్త్ర రక్త మాల్య మద్య తిల చతుర్విధమాంస గంధ దీప త్రివిధ పాయసములతో బలి యివ్వవలెను. రెండు మాసముల శిశువును ముకట యనుగ్రహి ఆవహించును. ఆ శిశువు శరీరము పచ్చబడిపోయి చల్ల బడును, జలుబు చేసి ముక్కు నుండి నీరు వచ్చును. ముఖము ఎండి పోవును. ఈ గ్రహి కొరకై పుష్ప గంధ, వస్త్ర ఆపూప, ఓదన, దీపము లతో బలి యివ్వవలెను. కృష్ణాగరు మొదలగు వాటితో ధూపము వేయవలయును. మూడవ మాసమున గోముఖ ఆవహించును. ఆ శిశువు ఎక్కువ నిద్ర పోవును. మాటి మాటికి మల మూత్రములు విడుచుచు గట్టిగా ఏడ్చును. ఆ గ్రహి కొరకు ముందుగా తూర్పున యవ, ప్రియంగు, కుల్మాష, శాక, అన్న దగ్ధముతో బలి యిచ్చి పినప శిశువుకు మధ్యాహ్నమున పంచ భంగముతో స్నానము చేయించి నేతితో ధూపము వేయ వలయును. నాల్గవ మాసమున పింగళ యను గ్రహి ఆవహించును. అపుడు ఆ శిశువు శరీము తెల్ల నై దుర్గంధ యుక్తమై ఎండి పోవ ప్రారంభించును. అట్టి శిశువు తప్పక మరణించును. ఐవవ మాసమున లలన అనుగ్రహిచే ఆవహింపబడిన శిశువు శరీరము శిథిలమై పోవును. ముఖము ఎండి పోవను. దేహము పాలిపోయి ఆపాన వాయు వెడలు చుండును. లలనా శాంతికి దక్షిణ దిక్కు నందు వెనుక చెప్పిన విధముగ బలి యివ్వవలెను. అకవ. మాసమున పంకజ అనుగ్రహి ఆవహించును. దీని చే రోదనము వికృత స్వరము మొదలగ నవి కలుగును. ఈ గ్రహి కొరకు వెనుక చెప్పిన పదార్థములు అన్న పుష్ప గంధాదులు జలి యివ్వవలయును, ఏడవ మాసమున నిరాహార యను గ్రహి ఆవహించగా, దుర్గంధ దంత రోగాదులు కలు గును. నిరాహార కొరకై విష్టాన్నము వెనుక చెప్పిన పదార్దములు. బలి యివ్వ వలయును. ఎనిమిదవ మాసమున యమున యను గ్రహి ఆవహించగా శిశువు శరీరము పై దద్దురులు బయలుదేరి, శరీరము ఎండి పోవును. దీని కొరకై చికిత్స చేయ కూడదు. తొమ్మిదవ మాసమున కుంభకర్ణి యను గ్రహి ఆవహించిన శిశువు జ్వరము, జలుబులతో బాధపడును ఎక్కువగా ఏడ్చును. ఆ గ్రహి కొరకై పూర్వము చెప్పిన పదార్దములు కుల్మాషములు మొదలగునవి ఈశాన్యమున బలి యివ్వ వలయును. దశమ మాసమున తాపసి గ్రహి ఆవహించిన శిశువు ఆహారము త్యజించి కండ్లు మూసుకొని యుండును. ఈ గహి కొరకై ఘంటా. పతాకా, పిష్ఠాన్నములు మొదలగునవి బలిగా యివ్వవలెను. పదకొండవ మాసమున రాక్షసి యనుగ్రహి ఆవహించగ శిశువు నేత్ర రోగి ముచే పీడితుడగును. దానికి చికిత్స చేయుట వ్యర్థము. పండ్రెండవ మాసమున చంచం యను గ్రహి ఆవహించగా శిశువునకు దీర్ఘ నిశ్వాసము భయాదికము కలుగును. శాంతి కొరకై మధ్యాహ్న సమయమున తూర్పు నందు కుల్మాష తిలాదులతో బలి యివ్వవలయును.
రెండవ సంవత్సరమున యాతన ఆవహించగా శిశుపునకు యాతన కలుగును. రోదనాదికము ఉండును. శాంతి కొరకై వెనుకటి వలే స్నానాదికము చేయించి తిల మాంస, మద్యములు బలిగా యివ్వవలెను. మూడవ సంవత్సరమున రోదని గ్రహి ఆక్రమించగా కంపము రోదనము, రక్త మూత్రము కలుగును. ఇందు సిమిత్తమై గుడోచన, తిలాపూపములు తిలపిష్టముతో చేసిన ప్రతిమ దానము చేయవలయును. . శిశువునకు తిలమిశ్ర జలముతో స్నానము చేయించి పంచ పత్రముల తోను రాజ ఫలత్వక్క తోను ధూపము వేయవలయును. నాల్గవ వర్షమున గ్రహి చిటక, బాలునకు జ్వరము, వాపు అన్ని అవయవములందు నొప్పి కల్గును. ఛటక నిమిత్తమై వెనుక చెప్పిన పదార్థములను తిలలను బలి యిచ్చి బాలకునకు స్నాపము చేయించి ధూపము వేయవలయును. ఐవవ వర్షమున గ్రహి చంచల. బాలునకు జ్వరము, భయము, ఆంగ శై థిల్యము కలు గును. చంచల కొరకై అన్నము మొదలగునవి బలి యిచ్చి బాలునకు మేష శృంగ ముతో ధూపము వేయవలయును. పళ ఉదుంబర అశ్వత్థ వట, బిల్వ, దళములు కలిసిన జలముతో వానికి స్నానము చేయించ వలయును. ఆరవ సంవత్సరమున ధావని యను గ్రహిచే ఆక్రమింపబడిన బాలుని శరీరము నీరసమై ఎండిపోవును. ప్రతి అవయవము నందను పీడ కలుగును. ఏడు దినముల వరకు వెనుక చెప్పిన పదార్థములను బలిగా యిచ్చి బాలకునకు భృంగ రాజముతో స్నా సముచేయించి ధూపము వేయవలయును.
ఏడవ సంవత్సరమున యమునా గ్రహి ఆవహించిన పిల్ల వానికి వాంతులు మాటలేక పోవుట ఎక్కువ నవ్వుట, ఏడ్చుట కలుగును. మాంస పాయస, మద్యాదులు బలి యిచ్చి స్నానము చేయించి ధూపము వేయవలయును. ఎనిమినప సంవత్సరమున జాత వేద ఆవహించగా, బాలుడు నిరాహాముడై ఏడ్చును. కృపర ఆపూప దధ్యాదులు బలిగా ఇచ్చి స్నానము చేయించి ధూపము వేయవలయును. తొమ్మిదవ వర్షమున - కాల ఆవహించగా భుజములు , కొట్టుకొనుట, గర్జనము భయము కలుగును. కృసర ఆపూప సక్తు కుల్మాష పాయసములు బలిగా ఇవ్వవలెను. పదవ సంవత్సరమున కలహంసి ఆవహిం చగా దాహము కృశత్వము. జ్వరము కలుగును. ఐదు దినములు పౌలిక, దధి, అన్నములు బలిగా ఇవ్వవలెను. వేపాకుల ధూపము కుష్ట లేపనము చేయవలయును. పదకొండవ సంవత్సరమున దేవదూతి ఆవహించగా బాలుడు నిష్ఠురముగా పలుకును. వెనుకటి వలెనే బలి యిచ్చి లేపాదికము చేయవలయును. పుడ్రెండవ సంవత్సరమున బలిక ఆవహించిన బాలుడు శ్వాస రోగముతో బాధపడును. వెనుకటివలెనే బలిలే పాదికము చేయవలయును. పదమూడవ సంవత్సరమున వాయవి ఆవ హించిన బాలునకు ముఖ రోగ ఆంగ శైథిల్యములు కలుగును. రక్తాన్న గంధ మాల్యాదులు బలి యిచ్చి బాలునకు పంచ దళములతో స్నానము చేయించవలెను. రాజి, నింబదళములు ధూపము వేయవలెను. పమనాల్గవ సంవత్సరమున యక్షిణి ఆవహించగ శూల జ్వర దాహామలు కలగును. మాంస భక్ష్యాదులతో బలి యివ్వవలయును. శాంతి కొరకై స్నానావికము కూడ వెనుకటి వలెనే చేయవలెను. పదునై దవ సంవత్సరమున ముండికా గ్రహి ఆవహించిన బాణనకు సర్వదా రక్తస్రావము కల్గుచుండును. దీనికి చికిత్స చేయించకూడదు. పదునారవ సంవత్సరము వానరి ఆవహించిన బాలుడు నేలపై పడిపోవును. నిద్రా జ్వరాదులతో బాధపడును. మూడు దినములు పాయసాదులు బలిగా యిచ్చి స్నానా వేకము వెనుకటి వలెనే చేయించవలెను. పద నేడవ సంవత్సరమున గంధవతి ఆవహించగా బాలకుని శరీరమున ఉద్వేగము కలుగును. ఆతడు ఎక్కువగా ఏడ్చును. కుల్మా షాడికము బలిగా ఇచ్చి వెనుకటివలెనే స్నాన ధూప లేపనాదులు చేయవలెను. దిన దేవత హతవ వర్ష దేవత సుకుమారిక. “ఓం నమః సర్వ మాతృభ్యం” మొదలు “రుద్రోథాపయతి” వరకు వున్న మూలో మౌ మంత్రము సర్వ కామ ప్రదము. దీనిని బాల గ్రహ శాంతికై ఉపయోగించవలెను. “ఓం నమో భగవతి” మొదలు “వస వస” వరకు వున్న మూలోక్త మంత్రమును రక్షారమై బలి దాన సమయమున పఠించవలెను. బ్రహ్మ, విష్ణువు, శివుడు, స్కందుడు గౌరి, గణాదులు రక్షింతురు గాక ! జ్వర దాహముతో బాధపడుచున్న పిల్లవానిని విడచెదరు గాక ! ఈ మంత్రము కూడ బాలగ్రహ నివారకము.
అగ్ని మహా పురాణమున బాలగ్రహహర బాల తంత్ర నిరూపణ మను రెండు వందల తొంబ్బది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
