అగ్ని మహా పురాణము

Table of Contents

316 - అథ నాసామంత్రాః

అగ్ని రువాచః

ఆగ్ని దేవుడు పలికెను. ముందు "హుం" వుంచి పిదప ఖేచ, ఛె చేర్చి పిదప క్షః స్త్రీం హూంక్షే వ్రాసి, చివర ఫట్ చేర్చవలెను. ఇది విష సర్పాదులను తొలగించును. అన్ని కార్యములను సిద్ధింపచేయును. ఖేచ, ఛ, యను నది కాలదష్టునకు, జీవనము యిచ్చు పత్రము. ఓం, హూం, ఖేక్షః, ఈ మంత్రము విషమును శత్రువులను నశింప చేయుము. శ్త్రీం హుం ఫట్ ఈ మంత్రము ప్రయోగము పాపరోగాదులను తొలగించును. “ఛ" యను ప్రయోగము విఘ్నములను దుష్టులను శమింపచేయును. “హూం స్త్రీం ఓం" యను మంత్రము శ్రీ మొదలగు వారిని వశము చేయును ఫేస్త్రీం, ఖే, యననది వశమును విజయమును కలిగించును. “ఐం హ్రీం మొదలు హీం ఐంక్రాం యను కుజ్జికా విద్య సర్వార్థ సాధకము. ఇవుడు శివుడు స్కందునకు ఉపదేశించిన మంత్రములను వర్ణించెదను.

అగ్ని మహాపురాణమున నానామంత్ర నిరూపణమను మూడువందల పదునారవ అధ్యాయము సమాప్తము.