అగ్ని మహా పురాణము

Table of Contents

333 - అథ అర్ధసమనిరూపణమ్

ఆగ్ని రువాచః

 ఆగ్ని దేవుడు పలికెను. ప్రథమ పాదమున స, స, స, స, రి, గులు రెండవ పాదము, భ, భ, భ, గు, గు, లు వుండి ఉత్తరార్ధము పూర్వార్ధమువలె నున్నచో యది ఉప చిత్రకము. ప్రథమ పాదమున భ, భ, భ, గు, గు, లు. ద్వితీయ పాదమున న, జ, జ, జ, లు వున్న ధృత మధ్య ప్రథమ పాదమునస, స, స, గు, ఆ ద్వితీయ పాదమున భ, భ, థ గులు వున్నచో వేగవతి, మొదటి పాదమున త, జ, ర, గులు, ద్వితీయ పాదమున య, స, జ, గు, గు, లు వున్నది భద్ర విరాట్ . ప్రథమ పాదమున స, జ, స, గు, లు ద్వితీయ పాదము, భ, ర, న, గు, గు, లు వున్న వి హేతుమతి. ప్రథమ పాదమున త, త, జ, గు, గు, లు. ద్వితీయ పాదమున జ, త, జ, గు, గు లు వున్నది ఆథ్యానికి. ఏత ద్విపరీతముగా నున్నది విపరీతాఖ్యానకి. . ప్రథమ పాదమున స, స, స, ల, గులు ద్వితీయమున న, భ, భ, రలు వున్నది హరిణప్లుక. ప్రథమ పాదమున న, న, ర, ల, గులు, గ్వితీయమున న, జ, జ, ర, లు వున్న ది ఆపర వస్త్రము. ప్రథమ పాదమున న, ర, య లు ద్వితీయము న, న, జ, ర, గు, లు వున్నది పుష్పితాగ్ర. ప్రథమ పాదమున ర, జ, ర, ఆలు ద్వితీయ పాద మున జ, ర, జ, ర, గులు వున్నది యమవతి. ప్రథమ తృతీయ చరణము లందు ఇరువది యెనిమిది లఘువులు ఒక గురువు ద్వితీయ చతుర్థ చరణము లందు ముప్పది లఘువులు ఒక గురువు వున్నది శిఖా. ఏత ద్వీపరీతముగ నున్నది ఖంజ. ఇపుడు సమ వృత్తము చెప్పబడుచున్నది.

ఆగ్ని మహా పురాణమువ ఛందస్సార మను మూడు వందల ముప్పది మూడవ అధ్యాయము.