అగ్ని మహా పురాణము

Table of Contents

59 - అథాధివాసకథనమ్

హయగ్రీవుడు చెప్పెను : శ్రీహరి సాన్నిధ్యము సంపాదించుటకు ఆధివాసనమని పేరు. “నేను సర్వజ్ఞుడు, సర్వవ్యాపియు ఆయిన పురుషోత్తముడమ” అని భావన చేయుచు సాధకుడు ఓంకార వాచ్యుడగు పరమాత్మతో ఏకత్వంను చేయవలెను. పిమ్మట చైతన్యాభిమానియైన జీవుని వేరు చేసి, ఆత్మకును, ఆ జీవునకును ఏకత్వమును చేయవలెను. ఈ విధముగా చేసి, స్వాత్మరూపుడును, సర్మవ్యాపియు అగు పరమేశ్వరునితో దానిని కలిపి వేయవలెను. పిమ్మట ప్రాణ వాయువు ద్వారా (లం బీజరూపయగు) పృథివిని అగ్ని బీజ (రం) చింతనముచే ఆవిర్భవించిన అగ్నియందు కాల్చివేయ వలెను. అనగా పృథివి అగ్నిలో లీనమైనదని భావన చేయవలెను. పిమ్మట అగ్నిని వాయువునందు, వాయువును ఆకాశ మునందు లీనము చేయవలెను. అధిభూత - అధ్యాత్మ - అధిదైవ విభవములతో కూడిన సమస్త భూతములను తన్మా త్రలలో విలీనము చేసి, వీటినన్నింటిని క్రమముగ ఆకాశమునందు విలీనము చేయవలెను. ఆకాశ మన మనస్సునందు మనస్సును అహంకారమునందు, అహంకారమును మహత్తత్త్వమునందు, తహ తత్త్వమును అప్యాకృతప్రకృతియందును లీనము చేయవలెను.

ఆప్యాకృతమును (ప్రకృతిని లేదామాయను) జ్ఞాన స్వరూపుడగు పరమాత్మయందు విలీనము చేయవలెను. ఈ పరమాత్మమే వాసుదేవుడు. శబ్ద స్వరూపుడైన ఆవాసుదేవుడు నృష్టిచేయవలెనని సంకల్పించి, అవ్యాకృతమాయాశ్రయముచే స్పర్శమను పేరు గల సంకర్షణుని ఆవిర్భవింపచేసెను. సంకర్షణుడు మాయను ముఖముచేసి తేజోరూప ప్రద్యుమ్నుని సృజించెను. ప్రద్యుమ్నుడు రసరూపుడగు అనిరుద్దుని, అనిరుద్ధుడు గంధస్వరూపుడగు బ్రహ్మను సృజించెను. బ్రహ్మ మొట్టమొదట జలమును సృజించి, దానిలో పంచభూతములతో కూడిన బంగారు గ్రుడ్డును సృజించెను. ఆ అండమునందు జీవశక్తి సంచార మేర్పడెను. ఆత్మయందు లీనము చేయబడినట్లు మొదట చెప్పబడినది ఈ జీవశక్తి యే. జీవశక్తితో ప్రాణము నకు సంయోగ మేర్పడినప్పుడు ఆది ‘వృత్తి మతి' అని చెప్పబడును. వ్యాహృతిసమేతుడగు జీవుడు ప్రాణములలో నుండి ఆధ్యాత్మిక పురుషుడని చెప్పబడుచున్నాడు. వానినుండి ప్రాణయుక్తమగు బుద్ది పుట్టినది. దీనికి ఎనిమిది వృత్తులుండును. బుద్ది నుండి ఆహంకారము, అహంకారమునుండి మనస్సు జనించినది. మనస్సు నుండి శబ్ద - స్పర్శ - రూప - రస - గంధము లనెడు సంకల్పాదియు క్త ముంగు ఐదు విషయములు ఉత్పన్నమైనవి.

            వీటినుండి జ్ఞానశక్తి గల త్వక్ - శ్రోత్ర - ఘ్రాణ - నేత్ర - జిహ్వలను ఐదు ఇంద్రియములావిర్భవించినవి. వీటికి జ్ఞానేంద్రియములని పేరు. పాద - పాయు పాణి - వాక్ - ఉపస్థలు పంచకర్మేంద్రియములు. ఇప్పుడు పంచభూతముల పేర్లు వినుము, ఆకాశ వాయు తేజో - జల - పృథివులు పంచమహాభూతములు. అన్నింటికిని ఆధారమగు స్థూలశరీరము ఈ భూతముల నుండియే పుట్టుచున్నది. ఈత త్వములకు వాచకములగు ఉత్తమ బీజాక్షరములను న్యాసమునిమిత్తమై చెప్పు చున్నాను. ‘మం’ అను బీజము జీవస్వరూపము (జీవతత్త్వవాచకము) ఇది శరీరమంతయు వ్యాపించియున్నదని భావనచేసి దీనిని సకల దేహవ్యాపక న్యాసము చేయవలెను. ‘థం’ అనునది ప్రాణతత్త్వబీజము, ఇది జీవోపాధియందున్నది. అందుచే దీనిని దానియందే న్యాసము చేయవలెను. బుద్ధితత్త్వవాచకమగు 'బం' అను బీజమును, విద్వాంసుడు హృదయముపై ప్యాసము చేయవలెను. అహంకారరూపమగు 'సం' అను బీజమును కూడ హృదయమునందే వ్యాసము చేయవలెను. సంకల్ప కరణ భూతమనస్తత్వ రూపమగు ‘పం' అను బీజమును గూడ హృదయమునందే న్యాసము చేయవలెను.

శబ్దతన్మాత్ర తత్త్వవాచక మగు నకారమును (నం) శిరస్సు పైనను, స్పర్శరూప ధకారమును (ధం) ముఖ ప్రదేశమునందును, రూపతత్త్వవాచకమగు దకారమును (దం) నేత్రప్రాంతము నందును, రసతన్మాత్రబోధక. థకారమును (థం) వస్తే ప్రదేశ (మూత్రాశయ) మునందును, గంధతన్మాత్ర స్వరూపమగు తకారమును (తం), పిక్కలయందును, ఇకారమును (ఐం) శ్రోత్రములందును, ఢకారమును (ఢం) త్వక్కుపైనను, డకారమును డం) నేత్రములందును, ఈకారమును (ఠం) జిహ్వయందును. టకారమును (టం) నాసికయందును ఇకారమును (ఇం) వాగింద్రియమునందును, పాతత్త్వ రూప మగు రకారమును (రం) హస్తములందును. జకారమును (జం) పాదములందును, ఛకారమును (ఛం) పాయువునందును చకారము (చం) ఉపస్థయందును, పృథ్వీతత్వ రూపమగు జకారమును (జం) పాదములందును, మకారము (ఘం) వస్తి యందును, తేజస్తత్వరూపమగు (గం) ను హృదయమునందును, వాయుతత్వరూపమగు ఖకారమును (ఖం) నాసికయందును న్యాసము చేయవలెను. కకారము (కం) ఆకాశ తత్త్వరూపమైనది. విద్వాంసుడు దాని నెల్లప్పుడును శిరస్సుపై న్యాసము చేయవలెను.

హృదయ కమలమునందు సూర్యదేవతకు సంబంధించిన 'యం' బీజము న్యాసము చేసి, హృదయము నుండి బయ, ల్వెడలిన డెబ్బది రెండువేలనాడులలో షోడశకలాయుక్త సకార (సం) న్యాసము చేయవలెను. దాని మధ్యభాగమునందు బిందుస్వరూపపహ్ని మండలమును భావించవలేను. ఓ సురశ్రేష్ఠా! దానిపై ప్రణవసహితహకార (హం) న్యాసము చేయవలెను. “ఓం ఆం నమ! పర మేష్ట్యాత్మ నే”ఓం ఆం నమః పురుషాత్మనే, ఓం వారి నమో నిత్యాత్మనే, ఓం నాం నమో విశ్వాత్మనే ఓం వం నమః సర్వాత్మనే” అనునవి ఐదు శక్తులు. ప్రథమ శక్తిని స్నానమునందును. ఆసనకర్మయందు, ద్వితీయ. శక్తి ని, శయనమునందు తృతీయ శక్తి ని, యానకర్మయందు చతుర్థశక్తిని, ఆర్చనాకాలమునందు పంచమశక్తి ని వినియోగించ వలెను. ఈ ఐదును ఉపనిషత్తులు. వీటి మధ్యయందు. మంత్రమయు డగు శ్రీహరిని ధ్యానించి క్షకారము (క్షం)ను. న్యాసము చేయవలెను.

ఏ మూర్తి స్థాపింపబడుచున్నదో ఆ మూర్తి కి సంబంధించిన మూలమంత్రము న్యాసము చేయవలెను. “విష్ణు స్థాపన చేసినపుడు) “ఓం నమో భగవతీ వాసుదేవాయ” అనునది మూలముత్రము. ఈ మూలమంత్రముయొక్క ఒక్కొక్క అక్షరమును శిరస్సు, నాసిక, లలాటము, ముఖము, కంఠము, హృదయము, భుజములు, పిక్కలు, పాదములు. వీటియందు క్రమముగ న్యాసము చేయవలెను. పిమ్మట శిరస్సు పై కేశవుని, ముఖముపై నారాయణుని, కంఠముపై మాధవుని, భుజములపై గోవిందుని, హృదయము పై విష్ణువును, పృష్ఠ భాగమున మధుసూదనుని, జఠరమున వామనుని, కటిపై త్రివిక్రముని, పిక్కలపై శ్రీధరుని, దక్షిణభాగమున హృషీ కేశుని, చీలమండల పై పద్మ నాభుని, పాదముల పై దామోదరుని న్యాసము చేసి, పిమ్మట హృదయాదిషడంగన్యాసము చేయవలెను. సత్పురుషులలో శ్రేష్ఠుడ వై న బ్రహ్మ దేవా! ఇది ఆదిమూర్తి విషయమున చెప్పిన సాధారణన్యాసము.

లేదా ఏదేవత ప్రతిష్టింపబడుచున్నదో దాని మూలమంత్రముచేతనే మూర్తి సజీవకరణ ప్రక్రియ జరుపవలెను. ఆ మూర్తి యొక్క పేరులోని మొదటి అక్షరము గ్రహించి, దానికి పండ్రెండు స్వరములను చేర్చి అంగకల్పన చేయవలెను. దేవేశ్వరా! విగహముపై హృదయాద్యంగన్యాసము, ద్వాదశాక్షరమూలమంత్రన్యాసము, తత్త్వన్యాసము ఏ విధముగ చేయబడునో ఆ విధముగనే తన శరీరముమీద కూడ చేయవలెను. పిమ్మట చక్రాకార మగు పద్మమండలముపై మహావిష్ణు వును గంధాదులచే పూజించవలెను. వెనుకటి వలెనే మహావిష్ణు శరీరమును, వస్త్రాలంకాదులను, ఆసనమును ధ్యానించ వలేను. పై భాగమున పండ్రెండు ఆకుల సుదర్శన చక్రమును ధ్యానించవలేను. ఆ చక్రమునకు మూడు నాభులు, రెండు నేములు (చక్రాంతములు), పండ్రెండు స్వర ములు ఉండును. పిమ్మట విద్వాంసుడు పృష్ణదేశ మన ప్రకృత్యాదులను స్థాపింప వలేను. ఆకులు చివర పండ్రెండు గురు సూర్యులను పూజింపవలెను. పిమ్మట అచట పదునారు కళ లతో కూడిన చంద్రుని ధ్యానించవలెను. చక్రనాభియందు మూడు వస్త్రములను ధ్యానించవలెను. పిమ్మట శ్రేమడైన ఆచార్యుడు పద్మములోపల ద్వాదశదల పద్మమును ధ్యానించవలెను.

ఆ పద్మముపైన పురుషశక్తి ని ధ్యానించి, దానిని పూజించవలెను. పిమ్మట, దేశికుడు, ప్రతిమపై శ్రీహరి న్యాసము చేసి, ఆ శ్రీహరిని, ఇతర దేవతలను పూజింపవలెను. గంధపుష్పాద్యుపచారములు సమర్పించి ఆంగావరణ సహితముగా ఇష్ట దేవతను బాగుగా పూజింపవలెను. ద్వాదశాక్షర మంత్రములోని ఒక్కొక్క అక్షరమును బీజాక్షరముగ చేసి దానితో కేశ వాది భగవద్విగ్రహములను క్రమముగ పూజింపవలెను. పండ్రెండు ఆకులుగల మండలము మీద ఆ క్రమ ముగ లోక పాలాదులను పూజింపవలెను. పిమ్మట, ద్విజుడు, గంధపుష్పాద్యుపచారములతో పురుషసూక్తమును పఠించుచు పురుషప్రతిమలను, శ్రీ సూక్తము పఠించుచు పిండికలను పూజింపవలెను. పిమ్మట జననాదిక్రమమున వైష్ణవాగ్నిని ఆవిర్భ వింపచేయవలెను. విష్ణుదేవతకు సంబంధించిన మంత్రములతో అగ్నిలో హోమము చేసి, విద్వాంసుడు, శాంతిజలమును సిద్దము చేసి దానిని ప్రతిమ శిరస్సు పై చల్లి, అగ్ని ప్రణయనము చేయవలెను. 'అగ్నిం దూతం' ఇత్యాది మంత్రముతో దక్షిణ కుండము నందును, “అగ్ని మగ్నిమ్” ఇత్యాది మంత్రముతో పూర్వ కుండమునందును. 'ఆగ్ని మగ్నిం హనీమభిః' ఇత్యాది మంత్రముతో ఉత్తర కుండమునందును అగ్ని ప్రణయనము చేయవలెను. ఆగ్ని ప్రణయనసమయమునందు 'త్వమగ్నే ద్యుభిః” ఇత్యాది మంత్రము పఠింపవలెను.

ఒక్కొక కుండములో ఓం కారోచ్చారణ పూర్వకముగ ఒక వెయ్యి ఎనిమిది చొప్పున పలాశ సమిధలను యవలు మొదలగు వాటిని హోమము చేయవలెను. వ్యాహృతి మంత్రముతో మృతమిశ్రతిలలను, మూలమంత్రముతో ఘృతమును హోమము చేయవలెను. పిమ్మట మధురత్రయము (నెయ్యి, తేనె, పంచదార)తో శాంతిహోమము చేయవలెను. ద్వాద కాక్షర మంత్రముతో పాడనాభి - హృదయ - శిరస్సులను స్పృశింపవలెను. నెయ్యి, పెరుగు, పాలు హోమము చేసి శిరస్సు స్పృశింపవలెను. పిమ్మట శిరో-నాభి - పాదములు స్పృశించి గంగా - యమునా - గోదావరి - సరస్వతీ నదు లను ఆవాహనము చేయవలెను. విష్ణుగాయత్రితో అగ్నిని రగిల్చి, గాయత్రితో ఆ అగ్ని పై చరువును వండవలెను. గాయత్రీ మంత్రముతో మనం చేసి, బలు లిచ్చి, పిమ్మట బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. మాసాధిపతులైన ద్వాదశాది దిత్యుల తుష్టికే ఆచార్యునకు బంగారము, గోవు దక్షిణగా ఈయవలెను. దిక్పాలకులకు బలి ఇచ్చి. వేదపాఠ - గీత కీర్తనాదులతో రాత్రి జాగరణము చేయవలెను. ఈ విధముగ అధివాసనము పూర్తి చేసినవానికి అన్ని ఫలములును లభించును.

అగ్ని మహాపురాణమునందు అధివాసన మను ఏబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.