అగ్ని మహా పురాణము

Table of Contents

127 - అథ నానాబలాని.

ఈశ్వర ఉవాచః

పరమేశ్వరుడు చెప్పెను : విష్కంభయోగమున మూడు ఘడియలు శీలయోగమున ఐదు ఘడియలు గండ-అతిగండ యోగముల ఆరు ఘడియలు, వ్యాఘాత-వజ్రముల తొమ్మిది మడియలు అన్ని కార్యములందును త్యాజ్యములు. పరిమవ్యతీపాత-వైధృత యోగములందు దిన మంతయు త్యాజ్యమే. ఈ యోగ ములందు యాత్రాయుద్ధాదికము చేయరాదు. దేవీ! నే నిపుడు మేషాదీరాశుల ఫలములను, గ్రహముల ద్వారా కలుగు ఫలములను చేప్పెదను. జన్మరాశియందు చంద్రశుక్రులు వర్ణితులే యైనను శుభప్రదులు. జన్మరాశినుండియు, లగ్నమునండియు రెండవ స్థానమున సూర్యుడు గాని, శని గానీ, రాహువు గాని కుజుడు గాని ఉన్నచో ప్రాప్తద్రవ్యము నశించును. ఆప్రాప్తము లభించదు; యుద్ధమున పరాజయము కలుగును. చంద్ర-బుధ గురు శుక్రులు ద్వితీయమందున్న చో శుభప్రదులు. మూడవ ఇంటిలో నున్న రవి.శని-కుజశుక్రబుధ-చంద్ర-రాహువులు శుభ ప్రదులు. నాల్గవ ఇంటిలో బుధ శుక్రులున్నచో శుభులు. ఇతరులు భయప్రదులు. పంచ మమునం దున్న గురు-శుక్ర-బుధ-చంద్రులు ఆభిష్టలాభదాయకులు. దేవీ! తన రాశినుండి ఆరవ భావమున రవి చంద్ర శని కుజు-బుధు లున్న చో శుభవలము నిత్తురు. కాని శుక్రగురులు శుభ ప్రదులు. కారు సప్తమభావమునందు రవి-శుక్ర-శని-కుజ రాహువు లున్న చో హాని కలుగును. బుధ-గురు-శుక్రులున్న చో సుఖము కలుగును; అష్టమమునందలి బుధ-శుక్రులు శుభులు. ఇతరులు హానికరులు. నవమభావమునం దున్న బుధ శుక్రులు శుభులు, ఇతరులు అశుభులు దశమభావము వందలి శుక్ర.సూర్యులు లాభకరులు. శని-కుజ-రాహు-చండ్ర-బుధులు శుభకారకులు. పదకొండవ భావమునం దున్న ఏ గ్రహమైనను శుభము నిచ్చును. దశమ స్థానమునందు బుధ శుక్రులు శుభులు. ఇతర గ్రహములు ఆశుభులు. ఒక దివసమునందు పండ్రెండు రాసులును తిరిగివచ్చును. ఇపుడు వాటి ఫలమును చెప్పెదను

మీన-మేష-మిథునములకు ఒక్కొక్కదానికి భోగ కాలము నాలుగు దండములు. వృషభ-కర్కట-సింహ-కన్యలకు ఆరేసి దండములు, తులావృశ్చికధనుర్మకరకుంభములకు ఐదేసి దండముల కాలము. సూర్యు డున్న రాశీ ఉదయ రాశి, ఆ రాశినుండి ఇతర రాశుల భోగ కాలము ప్రారంభ మగును. మేషాది రాశులకు క్రమముగ చర-స్థిర-ద్విస్వభావము అని పేరు. మేష-కర్కట-తులా-మకరములు చరరాశులు. వీటియందు ఆస్థిరము లైన శుభాశుభకార్యములు చేయవలెను. వృషభ-సింహ-వృశ్చిక-కుంభములు స్థిరరాశులు. వీటిలో స్థిర కార్యములు చేయవ రెను. ఈ లగ్నములలో బైటకు వెళ్ళిన వ్యక్తి తో శీఘ్రసమాగము జరుగదు. రోగి శీఘ్రముగ రోగ విముక్తుడు కాడు. మిథున-కన్యా-ధనుః-మీనము ద్విస్వభావ రాశులు. ఈ రాశులు అన్ని కార్యములందును శుభప్రదములు. వీటియందు యాత్ర, వ్యాపారము, సంగ్రామము, వివాహము, రాజదర్శనము, వృద్ధిక రము, జయలాభకరములు; యుద్ధమునందు విజయప్రదములు, ఆశ్వినీనక్షత్రమునందు ఇరువది తారలు ఉండును. దాని ఆకారము గుర్రము వలె నుండును. ఈ నక్షత్రమునందు వరము ప్రారంభించినచో ఒక రాత్రి వరకు గొప్ప వర్షము కలుగును. భరణీయందు వర్షము ప్రారంభించినచో పదునై దు దినములవరకును ఆవిచ్చిన్నముగా నుండును.

అగ్ని మహాపురాణమునందు నానాబలవర్ణన మను నూట ఇరువదియేడవ అధ్యాయము సమాప్తము.