అగ్ని మహా పురాణము

Table of Contents

329 -  అథ ఛందః సారః

 ఆగ్ని రువాచః-

ఆగ్ని దేవుడు పలికెను. “ఛందస్” యను శబ్దము ఈ ప్రకరణములో అనువృత్తి చెందుచుండును. దైవి గాయత్రి ఏకాక్షరి, ఆసురిపంచదశాక్షరి, ప్రాజాపత్య అష్టాక్షరి, యాజుషి షడక్షరి, సామ్నీ గాయత్రి ద్వాదశాక్షరి, ఆర్చి ఆష్టాదశాక్షరి, సామ్ని గాయత్రిలో క్రమముగా రెండేసి ఆక్షరములు పెంచుచు ఆరుకోమ్లము లో వ్రాయవలెను. ఆర్చి గాయత్రిలో మూడేసి ప్రాజాపత్య గాయత్రిలో నాలుగేసి ఇతర గాయత్రులలో ఒక్కొక్కటి అక్షరము పెంచవలెను ఆసురి గాయత్రి యొక్క ఒక్కొక్క అక్షరము క్రమముగ, ఆరు కోష్ఠములలో తగ్గినచో వాటిని సామ్న్యా ది భేద సహితముగా ఉజ్జిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టప్, జగతీ ఛందస్సులుగా తెలుకొవపలెను. యాజుషి సామ్ని  ఆర్చి గాయత్రుల అక్షరములను వేరువేరు కూర్చుటచే బ్రాహ్మీ గాయత్రి, బ్రాహ్మి ఉషైక్ మొదలగునవి ఏర్పడును యాజుషికి ముందున్న మూడు గాయత్రుల అక్షరములను వేరువేరుగా ఆరుకోషములలో చేర్చుటచే ఎన్ని అక్షరములగునో యవి ఆర్పీ గాయత్రి ఆర్షి ఉషైక్ ఇత్యాది భేదములు ఏర్పడును. వీటిని ఆరువది నాలుకోష్ఠములలో వ్రాయవలెను.

ఆగ్ని మహాపురాణము ఛందస్సారమున మూడు వందల ఇరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.