అగ్ని మహా పురాణము
120 - అథ భువనకోశవర్ణనమ్.
అగ్ని రువాచః-
అగ్ని దేవుడు చెప్పెను :వసిష్ఠా! భూమివిస్తారము డెబ్బది వేలయోజనము లని చెప్పబడినది, రవి ఎత్తు పదివేల యోజనములు. భూమి క్రింద ఏడు పాతాలము లున్నవి. ఒక్కొక్క పాలాలము పదేసి వేల విస్తారము గలది. ఆతలము, వితలము, నితలము, ప్రకాశమానమగు మహాతలము, సుతలము. తలాతలము, రసాతలము అని వాటి పేర్లు. ఈ పొలాలముల భూములు క్రమముగా నలుపు, పసుపు, ఎరుపు, తెలుపు, శర్కరామయము, శిలామయము, సువర్ణమయము అయి ఉండును. ఈ పాతాళము లన్నియు చాల సుందరము లైనవి. వాటిలో దైత్యదాన వాదులు సుఖముగా నివసించుచుందురు. ఈ పాతాళముల క్రింద శ్రీమహావిష్ణువుయొక్క తమోగుణప్రధానవిగ్రహ మైన ఆడిశేషుడు ఉండును. ఇతనికి అనంతగుణము లుండుటచే అనంతుడని పేరు. ఇతడు తన శిరముపై భూమిని ధరించుచుండును. భూమి క్రింద అనేక నరకము. అన్నవి. కాని విష్ణుభక్తులు నరకములకు వెళ్ళరు. సూర్యునిచే ప్రకాశింపచేయబడు చున్న వృథ్వి ఎంత విస్తృతమైనదో, నథోలోకము గ్రూడ అంత విస్తృత మైనది. వసిష్ఠా! సూర్యుడు పృథీవికి ఒక లక్ష యో నమాల దూరపనం డంలో సూర్యునకు లక్ష యోజనముల దూరమున చంద్రుడు ఉండును. చంద్రకు లవయోజ శముల దూరమున నృత్రిమండలిమున్నది. నక్షత్రమండలమునకు రెండులక్షల యోజనముల దూరమన-బుధుడు మహాద్వీపాది వర్ణనమ్ అచటికి రెండులక్షల యోజనముల దూరమున శుకుడు, అచటికి రెండులక్షల యోజనముల దూరమున కుజుడు, అచటికి రెండు లక్షల యోజనముల దూరమున గురుడు, ఆచటకు రెండు లక్షల యోజనముల దూరమునశనియు ఉన్నారు. అక్కడికి లక్ష యోజనముల దూరమున సప్తర్షిమండల మున్నది. సప్త రిమండలమునకు లక్ష యోజనముల దూరమున ధ్రువుడు ఉన్నాడు. త్రిలోకముల ఎత్తు ఇదియే. ధ్రువునకు కోటి యోజనముల దూరమున మహర్లోక మున్నది. కల్పాంతజీవు లగు భృగ్వాదులు ఆ లోకమునం దుందురు. మహర్లోకమునుండి రెండు కోట్ల జనముల దూరమున జనలోక మున్నది. సనక సనందనాది సిద్దపురుషులు అచట నివసింతురు. జనలోకము నుండి ఎనిమిది కోట్ల యోజనముల దూరమున తపోలోక మున్నది. అచట వే రోజు లను దేవతలు నివసించుచుందురు. తపోలోకమునుండి తొంబదియారు కోట్ల యోజనముల దూరమున సత్యలోక మున్నది. మృత్యురహితులగు పుణ్యాత్ములు, దేవతలు, ఋషులు ఆసత్యలోకమునందు నివసింతురు. దానికే బ్రహ్మలోక మని పేరు.
పాదములతో నడచి వెళ్లునంతవరకు ఉన్నది భూలోకము భూలోకము - సూర్యమండలములమధ్య నున్న లోకము భువర్లోకము. సూర్యలోకమునుండి ధ్రువలోకమువరకును ఉన్నది స్వర్గలోకము. దాని విస్తారము: పదునాలుగు లక్షల యోజనములు. ఇదే త్రైలోక్యము అండకటాహముచే చుట్టబడి యున్న విస్తృత బ్రహ్మాండ - మిదియే; ఈ బ్రహ్మాండమును క్రమముగజల - అగ్ని - వాము - ఆకాశ రూపము లగ ఆవరణములు. బైట. ఆవరించి యున్నవి. వీటి అన్నింటి పైన అహంకారావరణ మున్నది. ఈ జలాధ్యావరణములు ఉత్తరోత్తరము పది రెట్లు చొప్పున ఉండును అహంకార రూపావరణమును మహత్త త్వరూపావరణము చుట్టియున్నది. మహామునీ! ఈ ఆవరణము లన్నియు ఒక దాని కంటె ఒకటి క్రమముగ పది రెట్లు పెద్దవి. ప్రధానము మహత్తత్వమును కూడ ఆవరించి యున్నది. దాని కెన్నడును అంతము లేదు గాన అనంతము. అందుచేతనే దానికి సంఖ్యగాని, ప్రమాణము గాని లేదు. మునీ! ఆది - సకల జగత్కారణము దానికే అపరా ప్రకృతి యని పేరు. దానినుండి. అసంఖ్యాకములగు బ్రహ్మాండములు పుట్టినవి. కామ్లమునందు అగ్ని, తిలమునందు తైలము ఉన్నట్లు ప్రధానమునందు స్వయంప్రకాశ చేతనాత్మకు డగు వ్యాపకు డైన పురుషు డున్నాడు. ఓ మహాప్రాజ్ఞా! పరస్పర సంయుక్తు లైన ప్రకృతిపురుషులు సకలభూతముల ఆత్మ యగు విష్ణుశ క్తిచే ఆవరింపబడియున్నారు. మహామునీ! శ్రీ మహావిష్ణుస్వరూప మగు ఆ శక్తి యే ప్రకృతి పురుషుల సంయోగ ఆ మశపురాణము వియోగములకు హేతువు. సృష్టిసమయమున వాటియందు క్షోభ కలుగుటకు హేతువు ఆదియే. జలసంపర్కముచే ఎట్లు వాయువు ఆలకణములం దున్న శీతలత్వమును ధరించునో అట్లే మహావిష్ణుక క్తి ప్రకృతిపరుషమయజగత్తును ధరించుచున్నది. విష్ణు శక్తి ఆశ్రయమువలననే దేవతాదులు ప్రకట మగుచున్నారు. ఆ విష్ణువే బ్రహ్మ - సకలజగత్కారణము.
మునిశ్రేష్ఠా! సూర్యుని రథము విస్తారము తొమ్మిది వేల యోజనములు. దాని ఈషాదండము దీనికి రెట్టింపు. పద్దెనిమిదివేలయోజనముల పొడ వైనది. దాని ఇరుసు ఒకటిన్నర కోట్ల ఏడులక్షల పొడవు గలది. దానిపై చక్రము తగల్చి యున్నది. దానికి పూర్వాష్టమధ్యాహ్న -ఆషరాహ్న ము లను మూడు వాడు లున్నవి. సంవత్సర-పరివత్సర-ఇవత్సర అనువత్సర-వత్సరములు ఐదు ఆకులు ఆడ ఋతువులు ఆరు నోములు, రెండు ఆయనములు దాని శరీరము. ఈ సంవత్సరమయరథచక్రమున కాలచక్ర మంతయు ప్రతిషత్త మైనది. మహామతీ! సూర్యరథము దుర నలుబదియై దు వేల పొడి వై నది. దాని యుగము (ఆడి) లో సగము భాగము రెండు ధురల పరిమాణముతో తుల్యము. ఆ రథము నందలి చిన్న దురయు, దాని యగార్ధము ధ్రువాధారముపై ఉన్నవి. ఉత్తమవ్రతపాలక్కా గాయత్ర్యాది ఛందఃస ప్తకము సూర్యుని ఏడు గుణములు. సూర్యుడు కనబడుట ఉదయము కనపడకుండుట ఆస్తమయమ, వసిష్ఠా! పృథివి మొదలు ధ్రువుని వరకును ఉన్న ప్రదేశము ప్రలయకాలమునందు నశిఇచిపోవును. సప్తర్షుల పైన ఉత్తరముగ ధ్రువు డున్న ప్రదేశము. విరాడ్రూపు తగు శ్రీమహావిష్ణువు మూడవ పధము. పుణ్యపాపములు తొణింపగా దోషరూపముక విముక్తు లగు సంయతచిత్తు లైన్యమహా త్ములతో ఆడి నివాసస్థానము. ఈ విష్ణుపదమునుండియే గంగ ఆవిర్భవించినది. గంగ సంస్మరణమాత్రముచేతనే సకల పాపములను నశింపచేయును. ఆకాశమునందు శింశుమారాకృతితో నున్న నక్షత్రసముదాయము విష్ణుస్వరూప మైనది,
దాని పుచ్చభాగము ధ్రువుని స్థానము. ధ్రువుడు తాను తిరుగుచు, చంద్రసూర్యాదులను తిప్పుచున్నాడు. సూర్యుని రథమును ప్రతిమాసమునందును, వేరు వేరు దేవతలు, శేషు లైన జమలు, గంధర్వులు, అప్సరసలు, యతులు, సర్పములు, రాక్షసులు ఆధిష్టించి యుందురు. సూర్యుడే చలి, వేడి, వర్షము మొదలగు వాటికి కారణము. ఋగ్యజుకి సామవేదాత్మకు డగు శ్రీమహావిష్ణువు ఈ సూర్యుడే. ఇతడే శుభాశుభముల నిచ్చువాడు. మూడు చక్రములు గల చంద్రుని రథమునకు కుడి ఎడమ వైపుల కుందకుసుమము వలె తెల్లగా నుండు పది గుజములు కట్టబడి యుండును. ఆ రథముపై చంద్రుడు సంచరించును. ముప్పదిమూడు వేల ముప్పదిమూడు వందల ముప్పది ముగ్గురు (36,333) దేవతలు చంద్రునీ అమృతమయ కళలను పానము చేయుచుందురు. అమావాస్యయందు, పితృదేవతలు, 'అమా' అను కళనాశ్రయించి, చంద్రుని మిగిలిన రెండు కళలలో ఒక అమృతకళను త్రాగుదురు. చంద్రుని కుమారు డైన బుధుని రథము వాయ్వగ్ని మయ పదార్థ నిర్మితము. ఎనిమిది గుఱ్ఱము లుండును. ఆ రథముపై బుధుడు సంచరించుచుండును. శుక్ర-కుజగురు-శని-రాహు కేతువుల రథము :కు గూడ ఎనిమిదేసి గుఱ్ఱము లుండును. విప్రవరా! శ్రీ మహావిష్ణుస్వరూప మగు జలమునుండి పర్వతసముద్రాదిసహితము, కమలసదృశము అగు పృథివి ఉత్పన్న మైనది. గ్రహ-నక్షత్ర-త్రిలోకవదీపర్వత-సముద్ర-వనాదు లన్నియు విష్ణుస్వరూపములే. విజ్ఞాన విస్తారము కూడ విష్ణుస్వరూపమే. విజ్ఞానము కంటె అతిరిక్త మగు వస్తు వేదియును లేదు. శ్రీ మహావిష్ణువు జ్ఞానస్వరూపుడు. ఆతడే పరమపదము. చిత్తశుద్ధి ద్వారా విశుద్ధ జ్ఞానమును పొంది విష్ణుస్వరూపు డగుట్టకు తగు ఉపాయములను మానవుడు అవలంబించవలెను. సత్యము, అనంత జ్ఞానస్వరూపము ఆగు బ్రహ్మ మే విష్ణువు. ఈ భువనకోశమును పఠించువాడు పరమాత్మ పదమును పొందును. ఇపుడు నేమ జ్యోతిశ్శాస్త్రాది విద్యలను గూర్చి చెప్పెదను. వాటిలో చెప్పిన శుభాశుభఫలములకు అధిపతి శ్రీమహావిష్ణువే.
అగ్ని మహాపురాణమునందు భువవకోశవర్ణనమను నూటఇరువదవ అధ్యాయము సమాప్తము.
