అగ్ని మహా పురాణము

Table of Contents

172 - అథ పునః స్తోత్రప్రాయశ్చిత్తాని.

పుష్కర ఉవాచః-

పుష్కరుడు చెప్పెను : మానవుల మనస్సు పరభార్యాపరధన జీవహింసాదులయందు ప్రవర్తించునపుడు విష్ణస్తుతియే ప్రాయశ్చిత్తము. సర్వదా విష్ణువునకు నమస్కారము. చిత్త మునం దున్నవాడును, అహంకారమునకు గతి యైన వాడును, హరియు, ఈశుడును, అవ్యకుడును, అపరాజితుడును అగు విష్ణువును నమస్కరించుచున్నాను. ఏ కారణమువలన విష్ణువు నా మనస్సులో నున్నాడో, నా బుద్ధిలో నున్నాడో, నా అహంకారములో నున్నాడో, నాలో ఉన్నాడో, స్థావరజంగమాత్మ ప్రపంచముయొక్క కర్మ ఆ కర్మగా నుండి చేయుచున్నాడో, ఆ కారణమువలన ఆ విష్ణువునే చింతించుటచే పాపము నశించుగాక  ఏ కారణమువలన ధ్యానము చేయగానే పాపమును హరించునో, భావనాబలమువలన స్వప్న మునందు కనబడునో అట్టి ఉపేంద్రుడును ప్రణతార్తి హరుడును అగు విష్ణువును నమస్కరించుచున్నపుడు హస్తావలంబనము నిచ్చు పరాత్పరుడైన విష్ణువును నమస్కరించుచున్నాను. ఓ సర్వేశ్వరేశ్వరా! విభూ పరమాత్మా! అధోక్షజా! నీకు నమస్కారము. నృసింహా! అనంతా! భూతభావనా! భూతేశా! హృషీ కేశా! నీకు నమస్కారము. నృసింహా! అనంతా! భూతభావనా! భూతేశా! కేశవా! నేను దుష్ట వాక్కు పలుకుటచేతను, చేడు కార్యములు చేయుట చేతను, చెడు ఆలోచనలు చేయుటచేతను కలిగిన పాపమును శాంతింప చేయుము. నీకు నమస్కార మగుగాక. కేశ వా! నా చిత్తమునకు లొంగిపోయిన నేను చేసిన దురాలోచనలను ఉగ్ర మైన దుష్కార్యమును, నశింపచేయుము. బ్రహ్మణ్య దేవా! గోవిందా! పరమార్థపరాయణా! జగన్నాధ జగత్పషకా! అచ్యుతా! వా పాపమును శాంతింపచేయుము. హృషీ కేశా! పుండరీకాక్షా! మాధవా! తెలిసికాని, తెలియక గాని నేను అపరాహమునందును, సాయాహ్నమునందును, మధ్యాహ్నమునందును రాత్రియందును మనోవాక్కాయములచే చేసిన పాపము నీ నామ మాత్రోచ్చారణముచే నా స్వప్నమునందే నశించిపోవుగాక. హృషీ కేశా! పుండరీకాక్షా! మాధవా! శరీరమునకు సంబంధించినది గాని, వాక్కు చేత చేసినది గాని అయిన నా పాపమును శమింపచేయుము. భుజించుచు గాని, నిద్రించుచు గాని, నిలచి గాని, మెలకువగా నుండి గాని, నే నీ రోజున మనోవాక్కాయములచే చేసిన పాపమును నశింపచేయుము. పాపజన్మలు నరకము ఇచ్చు స్వల్ప మైనను అధిక మైనను నా పాపము వాసుదేవనామకీర్తనమువలన శమించుగాక, పరబ్రహ్మ స్వరూపుడును పరమ స్థానమును, పరమపవిత్రుడును అగు విష్ణువు కీర్తింపబడగనే సమస్త పాపము నశించుగాక! గంధస్పర్శాదివర్జితమగు ఏ విష్ణు పదమును పొందిన పండితులు మరల వెనుకకు రారో అట్టి విష్ణుపదము సకలపాపములను నశింపచేయుగాక. ఈ పాప ప్రణాశనస్తోత్రమును చదివినవాడును, విన్న వాడను, మనోవాక్కాయజన్యము లగు పాపములనుండి విముక్తుడగును. సర్వపాప పునఃప్రాయశ్చిత్తాని గ్రహాలు నుండి గూళ్ల విముక్తు డై శ్రీ మహా విష్ణువు యొక్క ఉత్త మనమును చేరును. అందువలన పాపము చేసినపుడు స్వఘనాశకమగు ఈ స్తోత్రమును జపించవలెను. వ్రతము నిమిత్తమై కూడ ఇది శ్రేష్టము. పాపము ప్రాయశ్చిత్త ములచేతను స్తోత్రజపము చేతను వ్రతము చేతను నశించును. అపి స్ము ఓ సిద్దినిమిత్తమై చేసిన కర్మలు భుక్తి ముక్తి ప్రదములగును.

అగ్ని మహాపురాణమునందు సర్వపాపప్రాయశ్చిత్త ముర పాపశ స్తోత్ర మను నూటడెబ్బది రెండవ అధ్యాయము సమాప్తము.