అగ్ని మహా పురాణము

Table of Contents

181 - అథ షష్ఠీవ్రతాని

అగ్ని రువాచః-

 అగ్నిదేవుడు చెప్పెను: ఇపుడు షష్టి వ్రతములను గూర్చి చెప్పెదను. కార్తికకృష్ణషష్టియందు ఫలములు భుజించి కార్తికేయునకు అర్ఘ్యదానము చేయవలెను. దీని వలన మనుష్యుడు భుక్తిముక్తులను పొందును. దీనికి స్కంధషష్టి వ్రత మని పేరు. భాద్రపదకృష్ణషష్టియందు అక్షయషష్టి వ్రతము చేయవలెను. ఇది మార్గశీర్షమునందు గూడ చేయవలెను. ఈ అక్షయషష్టీదివసమున ఏ ఒక సంవత్సరమునందై నను ఉపవాస ముండువాడు భుక్తిముక్తు లను పొందును.

అగ్ని మహాపురాణమునందు నూటఎనుబదియొకటవ అధ్యాయము సమాప్తము.