అగ్ని మహా పురాణము
258 - అథ వాక్పారుష్యాదిప్రకరణమ్
అగ్ని రువాచః
ఆగ్ని దేవుడు పలికెను : అవయవలోపము ఇంద్రియలోపము కలవారిని రోగ పీడితులను, సత్యవచనములచేతగాని, అసత్యవచనముల చేతగాని. విపరీత స్తోత్రములచేగాని ఆక్షేపించువారిని పదమూడున్నర పణములచే దండించవలెను. నీ సోదరిని, తల్లిని చేరిచేదను యని తిట్టువానికి ఇరువదియైదు పణముల దండము విధించవలెను. తిట్టబడినవాడు ఆధముడు అయినచో సగము దండము, పర స్త్రీగాని, ఉత్త ములుగాని ఆయినచో రెట్టింపు దండము విధించవలెను. వర్ణజాతుల ఉత్తమత్వ అధమత్వములను పరిశీలించి, దండమును నిర్ణయించవలెను. నిమ్న వర్ణమువాడు ఉచ్చవర్ణము వానిని తిట్టినపుడు రెండు రెట్లు మూడు రెట్లు దండములను, ఉత్త మవర్ణమువాడు విమ్నవర్ణము వానిని తిట్టినపుడు సగము తగ్గించియు దండము విధించవలెను. మాటలతో "నీచేతులను, మెడను, నేత్రములను, తొడలను విడగగొట్టెదను” యని తిట్టినచో నూరు. పణముల దండము విధించవలెను. పొగములు, ముక్కు, చెవులు, చేతులు, విరచెదను. " ఆని తిట్టిన వానికి దానిలో సగము దండము విధించవలెను. ఇట్లు తిట్టిన వాడు అసమర్థుడైనచో పది పణములు దండించవలెను. సమర్థుడైన పాడు దండము చెల్లించి తిట్ట బడినవాని క్షేమము కోరకే (ప్రతిభూ) జామీను ఇవ్వవలెను. "నీవు పతితుడవు" యని తిట్టిన వానికి మధ్యమ సాహస దండము. ఉపపాతకములు చేసినాపు యని తిట్టిన వానికి ప్రథమ సాహసండము. వేదవేత్తలను రాజును దేవతలను తిట్టిన వానికి ఉత్తమ సాహస దండము. జ్ఞాతులను సంఘమును తిట్టినవానికి మధ్య మదండము. గ్రామమును - దేశమును తిట్టినవానికి ప్రథమ సాహసదండము.
ఎవరినైన కొట్టినపుడు సాక్షులులేనిచో ఆయభియోగమును రాజు చిహ్నము యుక్తి, శాస్త్రము, వీటిని బట్టి పరి శీలించవలెను దెబ్బతగిలినట్లు : అసత్యమగు చిహ్నములు చేసికొనెవా! అని పరిశీలించవలెను. ఇతరుని పై భస్మము పంకము పరాగము చల్లిన వానికి పది పణముల దండము. ఆమేధ్యమున ఉమ్మి తగల్చిన వానికిని మనపతో తన్నిన వానికిని రెట్టింపు దండము. ఇది సమని విషయమనను చెప్పబడినది. పర స్త్రీల విషయమునను ఉత్తమ విషయమునన ఈ అపరాదము చేసినచో రెట్టింపుదండము. తనకంటే హీనుల విషయమున చేసినచో సగము దండము. మోహముచేత గాని మదాదుల చేతగాని చేసినచో దండమలేదు. ఒక విప్రువకు ఏ అంగముచే అబ్రాహ్మణుడు పీడ కల్గించునో ఆ ఆంగమును ఛేదించ వలెను. బ్రాహ్మణుని చంపుటకు ఆయుధ మెత్తినచో ప్రథమ సాహస దండము. ఆయుధమును స్పృశించినచో సగము దండము. కొట్టుటకు హస్తముగానీ పాదముగాని ఎత్తిన వానికి వరుసగా పది ఇరువది పణమాల దండవు. ఒకరినొకరు కొట్టు కొనుటకై ప్రయత్నించినపుడు అందరికిని మధ్యమ సాహనదండము. పాదము, కేశములు, వస్త్రము, హస్తములు, పట్టిలాగినచో. పదిపణము:దండము. పీడించినను లాగినను బట్టతో చుట్టబెట్టినన తన్ని నను నూరు పణము దండము. కాషాదులచే కొట్టినపుడు రక్త మురాకున్నచో ముప్పది రెండు పణముల దండము రక్తము కనబడినచో రెట్టింపు దండము హస్తములను కొని పాదము లను కాని, దంతములను దాని విరుగ గొట్టిన వానికి కర్ణములను నాసికను ఛేదించిన వానికిని గాయము కలుగునట్లు కొట్టిన వానికిన్ని చచ్చెనా యన్నట్లు కొట్టినవానికి మధ్యమదండము. ఇతరుల చేష్టను, భోజనమును, వాక్కును అడ్డుగొనినప్పుడున్ను నేత్రాదులను, పీడించినపుడున్న కంకము బాహువులు తొడలు వి.చినపుడున్ను మధ్యమ సాహస దండము. చాలమంది కలసి ఒక నిని కొట్టినచో వారికి వెనుక చెప్పిన దండమును రెట్టింపు దండము ప్రత్యేకముగా విధించవలెను. కలహములో అపహ రింపబడిన వస్తువును, దాని స్వామికి ఇప్పించి దాని మూల్యమునకు రెట్టింపు దండము విధించవలెను. అన్యునకు దుఃఖము కల్గించు వానిచే చికిత్సాదులకు యెంత వ్యయమగునో ఆంతధనము ఇప్పించవలేను. ఏకలహమునకు ఏదండము విధింప బడినదో ఆదండమును కూడ విధించవలేను నావచే దాటించు వాడు స్థల శుల్కమును తీసుకున్నచో పది పణముల గండము. దేవకార్యాదులు వచ్చినపుడు సమర్థుడై యుండి కూడ చుట్టుప్రక్కలవున్న బ్రాహ్మణులను నియంత్రణము చేయనివానికి పది పణముల దండము. ఇతరుల గోడను కొట్టి నను భేదించినను రంధ్రము చేసినను దానిని పడగొట్టినను వరసగ ఐదు, పది, ఇరువది ముప్పది ఐదు పణము - ఇప్పించవలెను. ఇతరుల గృహమునందు దుఃఖోత్పాదక ములగు వస్తువులను ప్రాణహర ములగు వస్తువులను పడవేయువారికి పదహారు పణము దండము మధ్యమ సాహస దండము విధించవలెను. క్షుద్ర పశువు లకు పీడ కల్గించినను వాటి శరీరమునుండి రక్తము స్రవించినట్లు చేసినను, కొమ్ములు ఛేది చిను, వరసగ రెండు నాలుగు ఎనిమిది పణముల దండము. వాటి లింగమును ఛేదించగ అవి మరణించిన చో మధ్యమ సాహస దండము విధించి వాటి మూల్య మును ఇప్పించవలెను. మహా పశువుల విషయమున ఈ అపరాధము చేసినపుడు రెట్టింపు దండము. ప్రరోహి (కొమ్మ తీసి పాతగ మొలచునది) వృక్షముల శాఖను మానును మొత్తము వృక్షమును చీల్చివేసినపుడు ఇరువది పణముల దండముఉప జీవ వృక్షమును (ఫ, వృక్షములు) ఇట్లు చేసినచో రెట్టింపు చండము. సాహసమును చేయించినవానికి చేసిన కౌనికంటే రెట్టింపు చండము. నేను నీకు ధనము నిచ్చెదను సాహసమును చేయు ము యని చెప్పి చేయించినవానికి నాలుగు రెట్లు దండము.
పూజ్యులను తిట్టికవానికి వారి ఆజ్ఞ అతిక్రమించిన వానికి సోదరుని భార్యను కొట్టినవానికి, ఇచ్చేదనని చెప్పి ఇవ్వనివానికి, భూగృహమును భేదించినవానికి, ఇరుగుపొరుగువారికిని కులీనులకు ఆపకారము చేయువానికిని ఏబది పణముల దండము. స్వేచ్ఛాపూర్వ! ముగ విధవాసంముచేసి దానికి, కష్టములోనున్న వారు ఆరచినపుడు, పరుగెత్తని హనికి అకారణముగా తిట్టు నానికి, ఉత్తములను స్పృశించు చండాలునడు, దేవ పితృ కార్యములందు సన్యాసులకు భోజనము పెట్టు శూద్రునకు, అనుచితముగా ఒట్లు పెట్టు వానికి, తనకు చేయు అధికారములేని పనులు చేయువానికిని వృషభములు ముద్ర పశువుల పుం స్వమును చెడగొట్టినవానికిని, సాధారణ విషయములందు మోసముచేయువానికని, దాసీ గర్భమును నశింప చేసినవానికిని, నూరుపణముల దండము విధించవలెను. తండ్రి, కుమారుడు, సోదరి, సోదరుడు, దంపతులు, ఆచార్యుడు, శిష్యడు, వీరిలో పతితుడుకాని వారినికూడ పరిత్యజించువారికి నూరుపణముల దండము. ఇతరుల వస్త్రములను ధరించిన చాకలివానికి మూడుపణముల దండము. ఆమ్మి వేసినను అద్దెకిచ్చినను కుదువ పెట్టినను పదిపణముల దండము. తుని (తక్కెడ) శాసవములు, కొలతలు, వీటిలో కపటము చేయువానికిని, నాణెములలో మోసముచేయువానికిని, వీటితో వ్యవహ రించువానికీని ఉత్తమ సాహస దండము విధించవలెను. మంచిదానిని చెడ్డదనియు, చెడ్డదానిని మంచిదనియు చెప్పు నాశిక పరీక్షకులకు ప్రథమ సాహస దండము. జంతువుల విషయమున తప్పుడు వైద్యము చేయు వైద్యునకు ప్రథమ సాహస దండము. మనుష్యులకు చేసినచో మధ్యమ దండము. రాజ పురుషులకు చేసినచో ఉత్తమ దండము. బంధించకూడని వానిని బంధించినను, బంధింప తగిన వానిని విడిచి పెట్టినను అట్టి అధికారికి ఉత్తమ దండము. కొలతలో గాని, తూక ములోగాని ఎనిమిదవ వంతుహరించిన వానిచే ఇరువది రెండు పణములు ఇప్పించవలెను ఆన్షమాంశము కన్న అధికము అయినను తక్కువై నను దండమును కూడ మార్చవలెను. మందులు, తైలములు, లవణము, గంధము, ధాన్యము, గడము మొద లైన పణ్య వస్తువులలో తక్కువరకము వస్తువు కల్పిన వానికి పదహారు పణముదండము. కొందరు శిల్పులు కలిసి పని చేయుచు మూల్యములో ప్రసము గాని వృద్దిగాని కల్పించినచో వారికి వేయి పణముల దండమును విధించ వలెను. వ్యాపారులు రోజుచే ప్రతిదినము నిర్ణయింపబడిన మూల్యమునకే క్రయ విక్రయములు చేయవలెను. దానిలో వచ్చు లాభము వర్తకులకు చెందును. వర్తకులు స్వదేశ మునందు లభించు పణ్యముపై (అమ్మే వస్తువు) సూటికి ఐదువంతులు విదేశీయ వస్తువుల పై, నూటికి పది వంతులు లాభము తీసుకొనవచ్చును. ఇది వెంటనే అమ్ముడుబోవు వస్తువులకు వర్తించును, నర్త కము చేయుటలో కలుగు వ్యయమును పణ్యము పై వేసి ఆమ్మువారికి కొను వారికిని కూడ లాభము కలుగునట్లు మూల్యము విర్ణయించవలెను.
పణ్యము మూల్యము, తీసుకొని పణ్యమును గ్రాహకునకు ఇవ్వని వానిచే వృద్ధి సహితముగ ఇప్పించవలెను. గ్రాహకుడు విదేశము నుండి వచ్చినచో అతనికి ఆ దేశ మునందు ఎంత లాభము వచ్చునో అంతధనముతో ఇప్పించ వలెను. గ్రాహకుడు కొన్న వస్తువును ఏకారణము చేతనై నా, తీసుకొనకున్న చో దానిని మరియొక నికి అమ్మ వచ్చును. కాని దాని పై నష్టము వచ్చినచో అది మొదటి గ్రాహకుని నుండి తీసుకొనవలెను. రాజోపఘాతము చేతగాని, దైవోపఘాతము చేతగాని, పణ్యము పాడై పోయినచో ఆనష్టమును గ్రాహకుడు అడిగినను ఇవ్వని విక్రేతయే భరించవలెను, ఒకరికి ఆమ్మిన దానిని మరియొకనికి అమ్మినను, చెడ్డదానిని మంచిదని చెప్పి అమ్మి నను దాని మూల్యమునకు రెట్టింపు దండము విధించవలెను. పణ్యముల లాభనష్టములు తెలియని వర్తకుడు ఏదైనా వస్తువునుకొన్నపుడు వెనుకాడ కూడదు. ఆట్లు చేసి నచో ఆరవవంతు దండము విధించవలెను. లాభము కోరి కొందరు వర్తకులు కలిసి వ్యాపారము చేయునపుడు వారు లాభా లాభములను, ద్రవ్యమును బట్టి గాని మొదట అనుకొనిన మాటను బట్టిగాని చేసుకొనవలెను. వారిలో ఒకరు మిగిలిన వారి అనుమతి లేకుండగను, వారు నిషేధించినను లేదా తన ప్రమాదమువలనన వస్తువును పాడు చేసినచో అనష్టమును ఆతడే భరించవలేను. వారిలో ఒకడు ఒక వస్తువును ప్రమాదము నుండి రక్షించినచో దానిలో పదవవంతు అతనికి చెందును. వస్తు వుల నిర్ణీత మూల్య ములో ఇరువదవ భాగమును రాజు శుల్కముగా గ్రహించవలేను. రాజ నిషిద్ధమైన వస్తువుగాని, రాజ యోగ్యమైన వస్తువును గాని ఎవరైనా విక్రయించుచున్న చో, దానిని రాజు స్వాధీనము చేసుకొని వచ్చును. ఆసత్య పరిమాణ మును చూపి కాని, పన్ను తీసుకొను స్థానమునుండి తొలగిపోయిగాని, మోసముతో గాని క్రయ విక్రయములు చేయు వానికి ఆ వస్తు మూల్యమనకు ఎనిమిది రెట్లు దండము విధించవలెను. కలిసి వ్యాపారము చేయువారిలో ఒకడు దేశాంత రము వెళ్లి నను మరణించినను ఆకని ద్రవ్యమును ఆతని దాయాదులు బంధులు జ్ఞాతులు గ్రహించవలెను. వారెవ్వరులేనిచో రాజు గ్రహించవలెను. సంఘములోని ఒకడు వక్రముగ ప్రవర్తించినచో ఆతనికి లాభము పంచకుండగ పంపివేయవలెను. స్వయముగ వ్యాపారము చేయలేనివాడు ఇతరులచే చేయించవలెను. ఋత్విక్కులు, కర్షకులు, కర్మచారులు, వారి విష యములో కూడ ఇదే విధానము.
చోరుని అపహరించబడి ధనమును బట్టి గాని, ఆతని పద చిహ్నము ను బట్టీగాని, రాజభటుని పట్టుకొని వలెను. పూర్వము ఆపరాధముచేసినవానిని ఆశుద్దమైన నివాసము కలవానిని, తమజాతి నామము, మొదలగువాటిని కప్పి పచ్చువారిని శంకచే బందీలుగా పట్టుకొనవచ్చును. ద్యూతము, స్త్రీ, పానము ఈ వ్యసనములు కలవారును ప్రశ్నించగ ఎండిపోయిన ముఖముగలవారును, కంఠస్వరము మారిపోయిన వారును, ఇతరుల ద్రవ్య గృహాదులనుగూర్చి ప్రశ్నించు వారును, రహస్యముగ సంచరించు వారును, ఆదాయము లేకున్నను వ్యయము చేయు వారును, వష్టమైన ద్రవ్యములను అమ్ము వారును చోరులుగా బంధింపబడవలెను. చౌర్యశంకచే పట్టుకొనబడినవాడు తాను నిరపరాధియని నిరూపించుకౌనజాలనిచో వానిచే అపహృత ద్రవ్యమును ఇప్పించి వానిని చోరచండముచే శిక్షించవలెను. అపహృగ ధనమును ఇప్పించి అనేక విధములు వానిని కొట్టించవలెను. చౌర్యము చేసినవాడు బ్రాహ్మణుడై నచో వానినుదుట గుర్తు వేసి రాజ్యమునుండి బహిష్క రించవలెను. గ్రామములో ఎవరినై న కొట్టినన, ధనము అపహరింపబడినను, ఆపరాధి జాడలు తెలియనపుడు ఆ గ్రామాధి పతి దోషము. ఆతడే చోరునిపట్టి రాజుకు అప్పచెప్పవలేను. చోరుడు ఏ గ్రామ మునకు పారిపోయెనో ఆచ్చట వాని గుర్తు తెలిసి ఆతడు చౌర్యము చేసిన గ్రామము యొక్క అధిపతి ఒప్పచెప్పవలెను. కోకడు దూర మును బయ వున్న పుద గ్రామాధికారిగాని, దశ గ్రామాధికారిగాని, ఆశ్వగజాద్యపహారులకును ఇతరులను చంపినవాని పట్టి కూ ము పై గుచ్చి చంప వలేను. ఏదైన వస్తువును ఎత్తుకొని పోయినవానికిని పెట్టే బద్దలుకొట్టిన వానికిని వరుసగ బొటనవ్రేమ, తర్జని, ఖండించ వలేను. ఆ అపరాధము రెండవసారి చేసి చో ఒక హస్తము, ఒక పానము ఖండించవలేను. చోరునికిగాని, మాతను,నను. గాని తెలిసికూడ భోజనము, అగ్ని, జలము, ఇతర ఉపకరణము 2 ఆలోచన, మార్గవ్యయము ఇచ్చినదానికి ఉత్తమ సాహస దండన విధించవలెను. ఇతరుల శరీరముపై ఆయుధమ ప్రయోగించినను, గర్భపాతనము చేయించినను ఉత్తమ దండము ఎవరినైన పురుషునిగాని, స్త్రీనిగాని చంపినపుడు వానికి ఉత్తమ సాహస దండముగాని, ఆధమ సాహసదండముగాని వాని శీలాచారములనుబట్టి ఇవ్వవలెను. పురుషుని చంపి స్త్రీని, విషమును ఇచ్చిన స్త్రీని మెడలకు రాయికట్టి నీళ్లలో పడవేయవలెను.
విషము పెట్టిన దానికిని, దహనము చేసిన స్త్రీ కిని తనకు పూజ్యుడైనవారిని, సంతానమును చంపి స్త్రీ కనీ, హస్తములు ముక్కు చెవులు ఖండించి ఎద్దులచే చంపించవలెను. పొలములను, గృహములను, వనములను, గ్రామములను వినీత ములను, కళ్లములను కాల్చిన వారిని, రాజు భార్య సంగ ముచేసినవారిని ఊక నిప్పతో కాల్చిచంపవలేను. కేశ గ్రహణపూర్వకముగ పర స్త్రీని సంగ్రహించిన వాడు స్వజాతియైనచో ఉత్తమ దండము, అనులోమ్యము అయినచో మధ్యమదండము పొందఅర్హుడు. ప్రాతిలో మ్యము అయినచో పురుషుని చంపవలెను. స్త్రీకి చెవులు కోయవలెను. పర స్త్రీ యొక్క వస్త్రముకట్టుముడి స్తనములు, కంచుకం, నాభికేశములను స్పృశించిన వానిని అనుచిత దేశ కాలములందు సంభాషణము చేయువానిని, ఒకే ఆసనముపై కూర్చున్న వానిని వ్యభిచార దోషమునకై దండించవలెను. వలదన్నను సంభాషణాదులుచేసిన స్త్రీకి నూరు పణములు, అట్టి పురుషునకు రెండువందల పణములు దండమ. నిషేధించినను వారిరువురును సంభాషణాదులు చేసినచో వ్యభిచాగముచేసినచో ఎట్టి దండమో అట్టి దండను. పశుసంగమము చేసినవానికి నూరుపణముల దండము. నీచస్త్రీ సంగమము, గో సంగమము చేసినవానికి మధ్యమ సాహసడండము. కొనబడినస్త్రీలు, దాసీత్రీలు, ఉంచుకొన్న స్త్రీలు, గమ్యంగుస్త్రీలు, వీరితో సంగమము చేసిన పురుషునక ఏబది పణముల దండము. బలాత్కరించి దాసీ సంగమము చేసినవానికి పది పణ వంటి దండము. అంత్యజాతి స్త్రీతోడను, సన్యాసితోడను సంగమముచేసిన వాని లలాటమున భగ చిహ్నమంచి దేశమునుండి పారద్రోలవలెను. రాజ శాసనమును న్యూనముగాగాని, అధికముగా గానీ వ్రాయువానికిని వ్యభిచారిని, చోరుని విడిచి పెట్టిన వానికిని ఉత్తమ సాహసదండము. బ్రాహ్మణునిచే ఆభక్షములు తినుపించు వానికి ఉత్తమ సాహసదండము. కల్తీ బంగారము అమ్మవానికిని చెడ్డ మాంసము అమ్మవానికిని ఆంగములు ఖండించి ఉత్తమ సాహసదఁడము విధించవలెను. సామర్థ్యమున్న ను కోరలు, కొమ్ములు గల తన పశువులచే పీడింపబడుచున్న వానిని విడిపింపని పశుస్వామికి ప్రథమ సాహసడండము. ఆక్రమించిన వాడు ఏడ్చుచున్నను విడిపించనిచో రెట్టింపు దండము. చోరుడుకానివానిని చోరుడని చెప్పినవానికి ఐదువందల పణముల దండము. రాజునకు ఆప్రియముపలుహనికిని రాజనించకులకును మరణించినవాని శరీరమునందలి వస్త్రాదులను అమ్ము వానికిని గురువును కొట్టిన వానికని రాజమంత్రమును ప్రకటించిన వానికిని నాలుక కోసి దేశమునుండి బహిష్క రించవలెను. రాజు యొక్క వాహనమును ఆసనమును కూర్చున్న దానికి మధ్యమ సాహసదండము. రెండు నేత్రములను పీకి వేసిన వానికిని, రాజ శత్రువుల ఆజ్ఞను నిర్వహించు వానికిని బ్రాహ్మణ వేషముతో జీవించు శూద్రునకు ఎనిమిది వందలపణముల దండ ము. న్యాయానుసారము పరాజితుడై నను, పరాజి కుడను కాను అని చెప్పుచు, వచ్చి చో వానిని మరల జయించి రెట్టింపు ధనము దండము విధించవలెను రాజు ఆన్యాయముగ దండము విధించి, ధనము తీసుకొన్నచో దానిని వరుణునకు నివేదించి దానిని ముప్పది రెట్లు చేసి బ్రాహ్మణు నికు ఇవ్వవలెను. ధర్మపూర్వకముగ, లోక వ్యవహార ములు చూచు రాజునకు ధర్మము, ఆర్థ ము, కీర్తి లోక పంక్తి ఆర్థసంగ్రహము ప్రజాగౌరవము శాశ్వత స్వర్గ నివాసము అను ఏడు గుణములు లభించును.
అగ్ని మహాపురాణమునందు “వాక్పారుష్యాది” ప్రకరణమను రెండువందల యేబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
