అగ్ని మహా పురాణము

Table of Contents

34 - అథ హోమాది విధిః

అగ్ని దేవుడు పలికేను : సాధకుడు ఈ “ఓం హ్రీం శ్రీం శ్రీధరాయ త్రైలోక్యమోహనాయ నమః” అను మంత్రము చదువుచు యాగమండపమును ప్రవేశింపపలేను. యజ్ఞశాలను అలంకరింపవలెను. (ఈ క్రింది శ్లోకమును చదువుచు భగవంతునకు నమస్కారము చేయవలెను). “వేద ములకును బ్రాహ్మణులకును హితమును చేయు, అవ్యయ స్వరూపుడగు శ్రీధరునకు నమస్కారము. ఋగ్యజుః సామాథర్వవేదములు విష్ణుస్వరూప మైనవి. శబ్దము లన్నియు విష్ణుస్వరూపమే. అట్టి, భగవంతు డైన విష్ణువునకు నమస్కారము” సాయంకాలము సర్వతోభద్రము మొదలగు మండలముల రచన చేసి పూజాద్యుపయుక్తము లగు ద్రవ్యములను సమకూర్చుకొనవలెను. కాళ్లు చేతులు కడుగుకొనవలెను. ఆ యా ద్రవ్యములను తగు స్థానములం దుంచి, చేతితో అర్ఘ్యము గ్రహించి, ఆ జలముతో తన శిరముపై ప్రోడించుకొన. వలెను. ద్వారాదిప్రదేశములందు నీళ్లు చల్లవలెను. ద్వారయాగ (ద్వారస్థదేవతాపూజాప్రారంభము చేయవలెను. మొదటగా తోరణాధిపతులను బాగుగా పూజింపవలెను. తూర్పు మొద లగు దిక్కులలో అశ్వత్థా-ఉదుమ్బర - వటప్లక్షవృస్త్రములను పూజింపవలెను. ఇవి కాక, తూర్పున ఋగ్వేదమును, ఇంద్రుని, శోభనుని, దక్షిణమున యజుర్వేదమును, యముని, సుభద్రుని, పశ్చిమమున సామవేదమును, వరుణుని, సుధన్వుని, ఉత్తరమున ఆథర్వవేదమును, సోముని, సుహోత్రుని పూజింపవలెను.

తోరణము (ద్వారము) లోపల పతాకలు కట్టి రెండేసి కలశములను స్థాపింపవలెను. కుముదము మొదలగు దిగ్గజములను పూజింపవలెను. ఒక్కొక్క గుమ్మమువద్దను ఇద్ద రిద్దరు ద్వారపాలకులను, వారి నామముత్రము చదువుచు పూజింపవలెను. తూర్పున పూర్ణ పుష్కరులు, దక్షిణమున అనందనందనులు, పశ్చిమమున వీర సేన. సుషేణులు, ఉత్తరమున సంభవ-ప్రభవులు అను ద్వారపాలులను పూజింపవలెను. ‘ఫట్’ అను అస్త్రమంత్రమును ఉచ్చరించుచు పుష్పములు చల్లి విఘ్నములను తొలగించిన పిదప మండలములోనికి ప్రవేశించవలెను. భూతశుద్ది, న్యాసము, ముద్రలు చేసి’ శిఖకు (‘వషట్’కు) చివర ‘ఫట్’ చేర్చి జపించుచు నాలుగు దిక్కులందును ఆవాలు చల్లవలేను. పిమ్మట వాసుదేవమంత్రముతో గోమూత్రమును, సంకర్షణమంత్రముతో గోమయమును, ప్రద్యుమ్న మంత్రముతో గోదుగ్గమును, అనిరుద్దమంత్రముతో పెరుగును, సొరాయణమంత్రముతో మృతమును గ్రహించి, వాటినన్నింటిని మృతపాత్రమునందు కలపవలెను. ఇతర వస్తువుల భాగములు నేతికంటే ఎక్కువ ఉండవలెను. వీటి నన్నింటిని కలుపగా పంచగవ్య మేర్పడును. పంచగవ్యమును ఒక పర్యాయము, రెండు పర్యాయములు, లేదా మూడు పర్యాయములు వేరు వేరుగ చేయవలెను. వీటిలో ఒకటి మండపప్రోక్షణమున కుపయోగింపవలెను. రెండవది తినుటకును, మూడవది స్నానమునందును ఉపయోగింపవలెను. పది కలశలను స్థాపించి వాటి పై ఇంద్రాదీలోకపాలులను పూజింపవలెను. పూజ చేసి వారికి శ్రీహరి ఆజ్ఞను వినిపింపవలేను. “ఓ లోకపాలులారా! శ్రీహరి ఆజ్ఞ ప్రకారము మీరు ఈ యజ్ఞమును రక్షించుటకై ఎల్లపుడును ఇచట నుండవలెను.”

యాగద్రవ్యాదులను సంరక్షించుకొని పైకీర ద్రవ్యములను (విఘ్ననివారణముకొరకై నాలుగు వైపులను చల్లు ఆవాలు మొదుగువాటికి విరము లనిపేరు) చల్లవలెను. అస్త్రమూలమంత్రమును (అస్త్రాయ ఫట్) ఏడు సార్లు జపించుచు ఈ విక్రమును చల్లవలెను. మరల అదే విధముగ అస్త్రమంత్రమును జపించుచు కుశ నిర్మితకూర్పమును తీసికొనవలెను. వాటిని ఊశానకోణమునం దుంచి వాటి పైన కలశమును వర్ధనిని ఉంచవలెను. కలశపై సాంగముగ శ్రీహరి పూజ చేసి, వర్ధనిలో అస్త్రపూజ చేయవలెను. ఆచ్ఛిన్నమగు వర్ధనీధార చే యాగమండపమును ప్రదక్షిణక్రమమున తడుపుచు కలశమును దానికి ఉపయుక్త మగు స్థానమున చేర్చి, ఆసనముపై ఉంచి, దాని పూజ చేయవలెను. కలశలో పంచరత్నము లుంచవలెను, దాని పై వస్త్రము చుట్టవలెను. దాని పై గంధాద్యుపచారములతో శ్రీహరిని పూజింపవలెను. వర్దినిలో కూడ బంగారు ముక్క ఉంచవలేను. దానిపై అస్త్రపూజ చేసి, దాని ఎడమ భాగమున, సమీపమునందే వాస్తు లక్ష్మీభూవినాయకులను పూజింపవలెను. సంక్రాంత్యాదికాలములందు ఈ విధముగనే శ్రీమహావిష్ణువు స్నానాభిషేకముల ఏర్పాటు చేయవలెను. మండపముయొక్క కోణములందును, దిక్కులందును ఎనిమిది కలశములను, మధ్యయందు ఒక కలశమును. మొత్తము భద్రములు లేని తొమ్మిది కలశములు-ఉంచి, వాటిలో పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, పంచగవ్యములు వేయవలేమ. పూర్వాదికలశములలో పైన చెప్పిన పస్తువులను, అగ్ని కోణాదులందలి కలశములలో ఆ ద్రవ్యములతో పాటు పంచామృతయుక్త జలమును చేయవలెను, పెరుగు, పాలు, తేనె, వేడినీళ్ళు - ఇవి పాద్యాంగములు.

కమలములు, శ్యామాకము, దూర్వాదలములు, విష్ణుక్రాన్తోషధి అను నాలుగు వస్తువులతో కూడిన జలము పాద్య మని చెప్పబడును. ఆర్ఘ్యమునకు కూడ ఎనిమిది అంగములు చెప్పబడినవి. ఆరముకొరకు యవలు, గంధము, ఫలములు, అక్షతలు, కుశలు, ఆవాలు, పుష్పములు, తిలలు సమకూర్చుకొనవలెను. జాతీలమగ-కంకోలములతో కూడిన జలమును ఆచమనీయముగా ఇవ్వవలెను. ఇష్టదేవతకు, మూలమంత్రము చదువుచు, పంచామృతస్నానము చేయించవలెను. మధ్య నున్న కలశమునుండి శుద్దోదకమును గ్రహించి దేవుని శిరము పై చల్లవలెను.కలశనుండి వచ్చు జలమును, కూర్చాగ్రమును స్పృశింపవలెను. పిమ్మట శుద్దోదకముతో పాడ్య-అర్ఘ్య-ఆచమనీయములు సమర్పింపవలెను. వస్త్రముచే దేవతామూర్తిని తుడిచి, వస్త్రధారణము చేయించి, సవస్త్రకముగ మండలముమీదికి దీసికొని వెళ్ళవలెను. అచట బాగుగా పూజ చేసి, ప్రాణాయామపూర్వకముగ కుండాదులలో హోమము చేయవలెను. (హవనవిధానము) రెండు చేతులు కడిగి, అగ్నికుండమునందు గాని, చేది పై గాని మూడు వూర్వాగ్ర రేఖలు గీయవలెను. వాటిని దక్షిణమునుండి ప్రారంభించి, ఉత్తరము వైపు గీయవలెను. మరల వాటిపై మూడు ఉత్తరాగ్ర రేఖలు గీయవలెను. (వీటిని కూడ కుడినుండి ప్రారంభించి ఎడమకు గీయవలెను).

పిమ్మట ఆర్ఘ్యజలముతో ఈ రేఖలను కడిగి యోని ముద్ర చూపవలెను. ఆగ్నిని ఆత్మరూపముగా భావించుచు యోనియుక్త మగు కుండమునందు స్థాపింపవలెను. పిమ్మట దర్బ-సృకో-స్రువాదులతో కూడ పాత్రాసాదనము చేయవలెను. బాహుప్రమాణము గల పరిధులు, ఇద్మ వశ్చనము, ప్రణీతాపాత్రము, ప్రోక్షణీత్రము, ఆట స్థాలి, ఆజ్యము, రెండు రెండు ప్రస్థముల బియ్యము; అధోముఖములుగా నున్న సకసువము. ప్రణీతయందును, ప్రోక్షణియందును పూర్వాగ్రముగ కుశ లుంచవలెను. ప్రణీతను నీటితో నింపి, భగవద్ధ్యానము చేసి, దానిని ఆగ్ని కి పశ్చిమమున, తన ఎదుట, సమకూర్చిన ద్రవ్యముల మధ్య ఉంచవలెను. ప్రేక్షణిని నీటితో నింపి పూజానంతరము కుడి వైపున ఉంచవలెను. చర వును అగ్నిపైఉంచి ఉడికించవలెను. అగ్నికి దక్షిణమున బ్రహ్మను స్థాపింపవలెను. అగ్ని కుండమునకు లేదా వేదికి, నాలుగు ప్రక్కల, పూర్వాది దిక్కులందు బరి స్సు పరిచి పరిధులను ఉంచవలేను. పిమ్మట గర్భాధానాది సంస్కారముల ద్వారా ఆగ్నికి వైష్ణవీకరణము చేయవలెను, గర్భాధానము, పుంసవనము, సీమంతోన్నయనము, జాతకర్మ, నామకరణము మొదలు సమావర్తనము వరకు నున్న సంస్కారములు చేసి ఒక్కొక్క కర్మకు ఎనిమిదేసి ఆహుతుల నివ్వవలెను. స్రువతో కూడిన సృక్కుతో పూర్ణాహుతి ఇవ్వనలెను.

కుండము మధ్య, ఋతుస్నాత యగు, లక్ష్మిని ధ్యానించి హోమము చేయవలెను. కుండములోపల నున్న లక్ష్మికి కుండలక్ష్మీ అని పేరు. త్రిగుణాత్మిక యగు ప్రకృతి ఈ లక్ష్మియే. ఈమెయే సకలభూజములకును, సకలమంత్రము లకును, విద్యలకును ఉత్పత్తిస్థానము, పరమాత్మ స్వరూపు. డగు అగ్ని దేవుడు మోక్షమునకు, కారణ మైనవాడు; ముక్తిదాత. కుండలక్ష్మి శిరస్సు తూర్పుదిక్కు వైవునను, భుజములు ఈశాన్య ఆగ్నేయదిక్కులవై పునను, కాళ్ళు వాయవ్యనై రృతిదిక్కులవై పునకును ఉండును. గుండమే ఉదరము. కుండమునందలి యోనిస్థానము యోని. మూడు మేఖలలు సత్వరజస్తమోగుణములు. ఈ విధముగ ధ్యానించి ముష్టిముద్రతో పదునైదు సమిధలను హోమము చేయవలెను. పిదప వాయవ్యదిక్కు నుండి ఆగ్నేయదిక్కు వరకును ‘ఆధారములు’ అనేడు రెండు ఆహుతుల నివ్వవలెను. ఇదే విధమున ఆగ్నేయముమండి ఈశాన్యము - వరకు ఆజ్యభాగములను ఆహుతులు చేయవలెను. ఆజ్యస్థాలినుండి ఉత్తర దక్షిణ మధ్యభాగములనుండి ఆజ్యము గ్రహించి ద్వాదశాంతముతో, అనగా మూలమును పన్నెండు పర్యాయములు జపించి, అగ్నియందు, ఆ దిక్కులందే హోమము చేసి, ఆచటనే త్యాగము చేయవలెను. పిమ్మట “భూః స్వాహా ఇత్యాదిక్రమమున వ్యాహృతిహోమము చేయవలెను. కమలమధ్యభాగమున సంస్కారసంపన్నుడగు. అగ్ని దేవుని ధ్యానింపవలెను. “ఈ ఏడు జహ్వలతో కోట్లకొలది సూర్యుల ప్రకాశముతో ప్రకాశించును. ఆతని ముఖము చంద్ర సదృశము. నేత్రములు సూర్యుని వలె దేదీప్యమానములుగ నున్నవి”. ఈ విధముగ ధ్యానించి అగ్ని దేవునకు నూటఎనిమిది ఆహుతులు సమర్పింపవలెను. లేదా మూలమూలమంత్రముచే, అందులో సగము సంఖ్యగల ఆహుతులను, మరి యెనిమిది ఆహుతులమ ఇవ్వవలెను. ఆంగములకు కూడ పదేసి ఆహుతులు ఇవ్వవలెను.

ఆగ్ని మహాపురాణమున అగ్ని కార్యకథన మను ముప్పదినాల్గవ అధ్యాయము సమాప్తము.