అగ్ని మహా పురాణము

Table of Contents

158 - అథ స్రావాద్యాశౌచమ్

పుష్కర ఉవాచః-

పుష్కరుడు చెప్పెను : మన్వాదిఋషులు చెప్పిన విధముగ గర్భస్రావాశౌచమును గూర్చి చెప్పెదను నాల్గవ మాసమువరకును జరిగిన గర్భస్రావమునందును, పంచమషష్టమాసములందు జరిగిన గర్భపాతమునందును మాసము లెన్నియో అన్ని రాత్రులు స్త్రీకి ఆశాచము. లేదా మూడు రోజులు మాత్రమే ఆశాచము. ఏడవ మాసమునుండి దశరాత్రా శాచము. క్షత్రియునకు నాలుగు రాత్రులు, వైశ్యునకు ఐదు రాత్రులు, శూద్రునకు ఎనిమిది దినములు ఆశాచము. ఏడు మాసములకంటే అధిక మైనచో అందరికిని పదునొకండు దినములు అశుద్ది. ఈ ఆశౌచము స్త్రీలకు మాత్రమే. తండ్రికి స్నానమాత్రముచేతనే రుద్ది. సపిండులకు ఆరుమాసములవరకును ఆశౌచము లేదు. సప్తమష్టమమాసములందు మూడుశ్రీమదగ్ని మహాపురాణము రాత్రులు ఆశౌచము. దంతజననములోపల మృత్యు వైనచో సపిండులకు సద్యఃశౌచము. చూడాకరణము లోపల ఒక రాత్రి, ఉపనయనము లోపల రాత్రిత్రయము. ఆది దాటిన దళరాత్రము. దంతములు రాకుండ మృతు డైనచో తలిదండ్రు లకు మూడురాత్రులు; చూడాకరణమునకు పూర్వము మృత్యువు కలిగినను మూడు రాత్రులే. మూడు సంవత్సరముల లోపు బ్రాహ్మణబాలుడు మృతు డైనచో సపింకులకు ఒక రాత్రి ఆశాచము. క్షత్రియ బాలకుడు మరణించినచో సపిండులకు రెండు రోజులు వైద్యులకు మూడు రోజులు, శూద్రులకు ఐదు రోజులు ఆశౌచము. బ్రాహ్మణులకు మూడు రోజుల ఆశాచము చెప్పినచోట శూద్రులకు పదకొండు రోజులు, క్షత్రియులకు ఆరు రోజులు, వైశ్యులకు తొమ్మిది రోజులు ఆశౌచ ముండును. రెండు సంవత్సరముల బాలునకు అగ్ని సంస్కారము లేదు. వానిని భూమిలో పాతి పెట్టవలెను. అతనికి ఉదక క్రియ కూడ ఉండదు. లేదా నామకరణము చేసినవాడు జాతదంతు డైనచో ఆగ్ని సంస్కార ఉదక దానములు చేయవలెను. ఉపనయ నానంతరము మరణించినచో పది రోజుల ఆశాచము. అగ్నిహోత్రముచేయుచు వేదాధ్యయనము చేయు బ్రాహ్మణునకు ఒక్క దినము నందే శుద్ధి, అతనికంటే హీనునకు మూడు దినములు, హీనతరునకు ఐదు రాత్రుల ఆశౌచానంతరము శద్ధు డగును. పేరుకు బ్రాహ్మణుడనబడువాడు పది రోజులకును శుద్దుడగును.

సద్గుణవంతుడైన బ్రాహ్మణుడు ఏడు దినములలోనే శుద్దుడగును; గుణవంతుడైన క్షత్రియుడు తొమ్మిది దినములలోను, వైశ్యుడు పది దినములలోను, శూద్రుడు ఇరువది దినములలోను శుద్ధు డగును. సాధారణు డగు బ్రాహ్మణుడు పది దినములలోను, క్షత్రియుడు పండ్రెండు దినములలోను, వైశ్యుడు పదునైదు దినములలోను, శూద్రుడు మాసమునకును శుద్దు డగును గుణాధిక్య మున్నచో పది రోజుల ఆచము మూడు రోజులును, మూడు రోజుల ఆశౌచము ఒక్క రోజు, ఒక రోజు ఆశాచము తాత్కాలికముగాను తొలగిపోవును. ఈ విధముగనే ఆంతటను ఊహించవలెను. దాసులు, శిష్యులు, భృత్యులు మొదలగువారు తమ స్వామి లేదా గురువుతో కలిసి నివసించునపుడు ఆ స్వామి లేదా గురువు మరణించినచో వారందరికి కుటుంబములోని వారితో సమముగా ఆశౌచ ముండును. అగ్ని హోత్రము చేసికొనని వానికి సపిండమృత్యువు జరిగిన వెంటనే ఆశౌచము తగులును. ఆగ్ని హోత్రానుష్టానము చేయువానికి మాత్రము మృతునకు దాహ సంస్కారము జరిగిన తరువాతనే ఆచము ప్రాప్తించును. అన్ని వర్ణముల వారికి మూడవ వంతు ఆశాచసమయము గడచిన పిమ్మట శారీరకస్పరాధికార ముండును. ఈ నియమమును బట్టి బ్రాహ్మణాదులు వరుసగ మూడు, నాలుగు, ఐదు, పది రోజులస్రావాద్యాశాచమ్ తరువాత స్పర్శార్లు లగుదురు. బ్రాహ్మణాదులు ఆస్థిసంచయము వరసగ నాలుగు, ఐదు, ఏడు, తొమ్మిది_ఈ దినములందు చేయవలెను. వివాహము కాని కన్య మరణించి నపుడు బాంధవులకు, ఒక రోజు, వివాహిత యైనచో మూడు రోజులు ఆశౌచము. వివాహిత యైన పుత్రిక గాని, సోదరి గాని మరణించినచో రెండు దినముల ఒక రాత్రి ఆశౌచము. అవివాహితలకు తండ్రిగోత్రమే గోత్రము. వివాహితలకు భర్తృగోత్రము. వివాహ మైన పుత్రికి జలదానము చేయవలసిన విధి భర్తకు తండ్రికి గూడ ఉండును. పది దినముల పిమ్మట చూడాకరణమునకు ముందు కన్య మరణించినచో మాలా పితరులకు మూడు దినముల ఆశౌచము. ఇతర బంధువులకు తాత్కాలికాశౌచము, చూడాకరణానంతరము వివాహాత్పూర్వము ఐంధువులకు ఒక రోజు ఆశౌచము. వాగ్దానానంతరము వివాహాత్పూర్వ మైనచో మూడు రోజుల ఆశౌచము పిదప ఆ కస్య భ్రాతృపుత్రులకు రెండు రోజుల ఒక రాత్రి ఆశాచము, అన్యసపిండులకు మాత్రము తాత్కాలిక శుద్ది. సజాతీయులతో జన్మ-మరణములందు, కలిసి యున్నచో బ్రాహ్మణునకు పది రోజులలో శుద్ధి, క్షత్రియ-వైశ్య-శూద్రులతో కలసి యున్న చో వరుసగ ఆరు, మూడు, ఒక రోజులలో శుద్ధి.

ఈ ఆశోచనీయ సము లన్నియు సపిండులకు మాత్రమే. ఔరసులు కాని పుత్రులు మొదలగు వారి విషయమున చేప్పెడను. క్షేత్రజుడు. దత్తుడు మొదలగు పుత్రులును, తనను విడచి మరొకనితో సంబంధము పెట్టుకొనిన శ్రీ గాని, తన భార్యగా అయిన పరపురుషుని శ్రీ గాని మరణించినపుడు ఆశౌచము మూడు రాత్రులు మాత్రమే ఉండును. స్వధర్మమును త్యజించి తన జన్మ ను వ్యర్థము చేసికొన్న వాడును, వర్ణసంకరజాతుడును, పరివ్రాజకుడు, అశాస్త్రీయ విధానముచే విషాదుల ద్వారా ఆత్వహత్య చేసికొన్న వారును, వీరికి జలాంజలి ఇవ్వవలసిన పనిలేదు. వారికి ఉదక క్రియానివృత్తి అయిపోయినది. ఒక తల్లికి ఇద్దరు తండ్రుల ద్వారా పుట్టినవారి వలన బంధులకు జాతాశౌచము ఒక రోజు, మృతాశౌచము రెండు రోజులు. ఇంతవరకును సపిండుల ఆశౌచము చెప్పబడినది. ఇపుడు సమానోదకుల ఆశాచము చెప్పబడుచున్నది. బాలుడు దంతోత్పత్తికి పూర్వమే మరణించినను, దేశాంతరమునం దున్న సపిండుడు మరణించినను, ఆసపిండుని మృత్యువునందును, సచేలస్నానముచే శుద్ధి. జన్మమృత్యువులందు సపితులకు పు దిన ములలో శుద్ధి. ఒక కులమునకు చెందిన అసపిండులకు మూడు రాత్రులతో శుద్ది. సమానగోత్రుంకు స్నానమాత్రముననే శుద్ది ఏడవ తరమునందు సపిండత్వము తొలగును. పదునాల్గవ తరమునందు సమానోదక సంబంధము గూడ తొలగిపోవును. కొందరి మతము ప్రకారము జన్మనామములస్మృతి లేనపుడు సమానోదక సంబంధము తొలగిపోవును. అటు పిమ్మట సగోత్రత్వము మాత్రము మిగులును. పది రోజులు ముగియక ముందే విదేశములో నున్న బంధువు మరణ వార్త విన్న వాడు మిగిలిన రోజులు మాత్రము ఆశౌచము పట్టవలెను. దళాహము దాటిన తరువాత తెలిసినచో మూడు రోజులు పట్టవలెను. సంవత్సరము దాటిన తరువాత తెలిసినచో జలస్పర్మ మాత్రముచే శుద్ధి. మేనమామ, శిష్యుడు ఋత్విక్కు, బంధువులు మరణించి నపుడు ఒక పగలు, ఒక రాత్రి, ఒక పగలు ఆశాచ ముండును. మిత్రుడు, జామాత, దౌహిత్రుడు, మేనల్లుడు, బావమరిది కుమారులు, మరణించినపుడు స్నానమాత్రముచే శుద్ధి. మాతామహి, ఆచార్యుడు, మాతామహుడు మరణించినపుడు మూడు దినములు ఆశౌచము. దుర్భిక్షము, రాష్ట్రాపద్రవము మొదలగు ఆపదలందు సన్యకాలశుద్ధి చెప్పబడినది. యజ్ఞముచేయుచున్న వాడు, వ్రతపరాయణుడు, బ్రహ్మ చారి, దాత, బ్రహ్మ వేత్త - వీరికి తత్కాలమందే శుద్ది, దానము, యజ్ఞము, దేశోపద్రవము, వివాహము యుద్ధము - వీటియందు సద్యఃశుద్ధి చెప్పబడినది. మహామా మొదలైన ఉపద్రవముంచే మరణించిన వారి విషయమునందు గూడ సద్యఃకాలాశౌచము. రాజును, గోవును, బ్రాహ్మణుని చంపిన వారును ఆశాస్త్రీయము ఆత్మహత్య చేసుకొన్న వారును మరణించినపుడు తత్కాల శుద్ధి చేప్పబడినది.

ఆసాధ్యములగు వ్యాధులతో బాధపడువాడును, స్యాధ్యాయాసమర్థుడును, అగ్నియందుగాని, జలమును గాని ప్రవేశించి మరణించుట ప్రాయశ్చిత్తము. ఆవమానము, క్రోధము, స్నేహము, పరాభవము, భయము- వీటివలన ఉరి పోసికొనిగాని, మరొక విధముగా గాని ఆత్మహత్య చేసికొన్న పురుషుడై నను, స్త్రీ యైనను, లక్షసంవత్సరములు ఆకాచియైన నరకము నందు నివసించును. శాచాశాచాదిజ్ఞానము కూడ లేని ఆతి వృద్ధుడు మరణించినచో ఆశౌచము మూడు రాత్రులే. రెండవ రోజున ఆస్థిసంచయనము, మూడవరోజున జలదానము, నాల్గవ రోజున శ్రాద్దము చేయవలెను. పిడుగు పడి చనిపోయినవారి ఆశాచము సపిండులకు మూడు దినములు. పాషండులను ఆశ్రయించి, పతిఘాతిని డైన శ్రీ మరణించి నపుడు ఆశౌచము ఉండదు. ఆమెకు జలాంజలి కూడ ఇవ్వరాదు. పితృమాత్రాదుల మరణవార్త ఒక సంవత్సరము తరువాత అందినను సచేలస్నానము చేసి, ఉపవసించి, విధిపూర్వకముగ ప్రేతకార్యములు చేయవలెను. అసపిండుని శవము మోసినవాడు సచేలస్నానము చేసి, ఆగ్ని ని స్పృశించి, నెయ్యి తిన్నచో శుద్దు డగును. అతడు ఆ కుటుంబమువారి అన్నము తిన్న చో ఆతనికి పది రోజుల తరువాతనే శద్ధి. ఆ యింటివారి అన్నము తినక, ఆ ఇంటిలో నివాసము చేయక ఉన్న చో ఒక్కరోజునకే శుద్ధి. అనాధ బ్రాహ్మణశవమును మోసిన బ్రాహ్మణులకు అడుగడుగున యజ్ఞఫలము కలుగును. స్నానమాత్రముచేతనే శుద్ధి. శూద్రశవము అనుసరించి వెళ్లిన బ్రాహ్మణునకు మూడురోజులకు శుద్ధి యగును. మరణించిన వాని బంధువులతో కలసి విలాపాదులు చేసిన బ్రాహ్మణుడు ఒక పగలు, ఒక రాత్రి, దాన శ్రాద్ధాదులను పరిత్యజించవలెను. తన యింటిలో శూద్రస్త్రీ ప్రసవించినను, శూద్రుడు మరణించినను మూడు రోజులలో ఇంటిలోని భాండాదును పార వేయ వలెను. భూమిని అలకవలెను. ఆపుడు శుద్ధి యగును. సజాతీయు లుండగా బ్రాహ్మణశ వమును శూద్రులచే మోయించరాదు. శవమునకు స్నానము చేయించి, నూతనవస్త్రమును కప్పి, పూవులతో పూజించి శ్మశానమునకు తీసికొని వెళ్ల వలేను. నగ్న దేహమునే డహించవలెను. దేహభాగమును కొంచెముకూడ మిగల్చగూడదు.

ఆ సమయమున సగోత్రుడు శవమును ఎత్తి చితిపై ఉంచ వలెను. ఆగ్న్యాధానము చేసి శవానిని యథావిధిగా మూడు అగ్నులతో దహనము చేయవలెను. అగ్న్యాధానము లేక ఉపనయన సంస్కారయుక్తు డైన వానికి ఒక (ఆహవనీయ) అగ్ని తోను సాధారణులను లౌకికాగ్ని తోను దహనము చేయవలెను. “ఆస్మాత్...లోకాయస్వాహా” అను మంత్రము పఠించుచు పుత్రుడు తండ్రి శవము ముఖమున అగ్ని ఉంచవలెను. పిదప ప్రేత యొక్క నామగోత్రము నుచ్చ రించుచు బంధువులు ఒక్కొక్క జలప్రదానము చేయవలెను. మాతామహాచార్యాదులు మరణించినపుడు గూడ ఈ విధముగనేశ్రీమదగ్ని మహాపురాణము ఇలాంజ నిదానము చేయవలెను. మిత్రులకు, వివాహితులగు పుత్రోసోదర్యాదులకును, మేనల్లునకును, ఋత్విక్కులకును, మామగారికిని గూడ ఈ విధముగా జలము నిచ్చుట ఇష్టముపై ఆధారపడి యుండును. పుత్రుడు తండ్రికి పది రోజులపాటు “అప నః శుచత్ అఘమ్” ఇత్యాదిమంత్రము పఠించచు, జలాంజలి ఇవ్వవలెను. బ్రాహ్మణునకు పది, క్షత్రియునకు పదునొకండు, వైశ్యునకు పదునైదు, శూద్రునకు ముప్పది పిండములు ఇవ్వవలెను. పుత్రుడైనను, పుత్రిక యైనను, మరెవ్వ రైనను పుత్రుడు వలెనే మృతునకు పిండప్రదానము చేయవలెను. దహన సంస్కారము చేసి ఇంటికి తిరిగి వచ్చి, మనస్సు అదుపులో ఉంచుకొని, ద్వారము వద్ద నిలచి, రెండు వేపాకులు నమలి, ఆచమనము చేసి, ఆగ్నిని, జలమును, గోమయమును, పచ్చని ఆవాలను సృశించవలెను. పిదప ముందుగా జాతీమీద పాద ముంచి మెల్లగా ఇంటిలో ప్రవేశించ వలెను. ఆ నాటినుండి బంధువులు ఉప్పు, మాంసము తినగూడదు. అందరును భూమిపై శయనించవలేను. స్నానము చేసి మూల్యమిచ్చి కొన్న అన్నము తినవలెను. మొదట దాహసంస్కారము చేసినవాడు పది దినములవరకును కర్మ చేయ వలెను. అధికారము గలవారు లేని పక్షమున బ్రహ్మచారియే పిండదానము, జలాంజలిదానము చేయవలెను. సపిండులకు ఈ విధముగ మరణాశౌచము వచ్చినట్లే జాతాశౌచము కూడ వచ్చును. మరణాశౌచము. సపిండులందరికిని వచ్చును. జాతాశౌచముచే కలుగు అస్పృశ్యత్యము విశేషముగా తలిదండ్రులకు మాత్రమే వచ్చును. వారిలో కూడ తల్లికే విశేషముగ ఆశాచ ముండును. తండ్రి స్నానము చేయుటచే స్పర్శయోగ్యు డగును, పుత్రజన్మదివసమున తప్పక శ్రాద్ధము చేయవలెను. ఆ దినము శ్రాద్ధదానములు, గో-సువర్ణ-వస్త్రాదిదానములు చేయుట మంచిది.

మరణాశౌచము మరణాశౌచముతోను, సూతకాశౌచము సూతకముతోను తొలగును. మొదటి ఆశౌచముతో రెండవ ఆశాచమునకు శుద్ధి యగును. జన్మా శౌచమునందు మరణాశాచ మైనను, మరణాశౌచమున జన్మా శాచ మైనను మరణాశౌచ ములో జన్మా శౌచము నివర్తించి నట్లు గ్రహించి శుద్ధి చేసికొనవలెను. జన్మా శౌచముతో మరణశాచము తొలగదు. రెండు సమాన మైన ఆశాచములే అయినపుడు మొదటిదానితో రెండవదానిని సమాప్తము చేసికొనవలెను. ఇది ధర్మరాజు చెప్పిన తర్మము. ఒక మరణాశౌచము లోపల రెండవ మరణాశౌచము వచ్చినపుడు రెండవది మొదటి దానితో అంతమగును. గురు వైన శౌచముతో లఘు వైన ఆశౌచము బాధిత మగును గాని, లఘ్వాశాచముచే గుర్వాశాచము బాధితము కాదు. మృతకాశాచము లేదా సూతకాశాచము చివరి రాత్రి మధ్య రెండవ ఆశాచము వచ్చినచో మిగిలిన భాగముతోనే రెండవది పూర్తిగా నివృత్త మైపోనువుగాన సపిండు లందరికిని శుద్ధి యగును. రాత్రి చివరి భాగమున రెండవ ఆశౌచము వచ్చినచో మిగిలిన భాగముతోనే రెండవది పూర్తిగా నివృత్త మైపోవును గాన సపిండు లందరికిని శుద్ధి యగును. రాత్రి చివరి భాగ మన రెండవ ఆశాచము వచ్చినచో మరి రెండు రోజుల తరువాత ఆశాచమ నివర్తించుమ. చివరి రాత్రి గడచిపోయి చివరి ఎనమున ప్రాతఃకాలము మరి యొక్క ఆశాచము వచ్చినచో మరి మూడు రోజుల తరువాత సపిండులకు శుద్ధి యగును. రెండు విధములైన ఆశాచములందును ఆ కుటుంబమువారి అన్నము తినగూడదు. ఆశాచమున దానాద్యధికారము కూడ ఉండదు. ఆశాచసమయమున ఇతరుల ఇంట భోజనము చేసినచో ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. తెలియక భోజనము చేసినచో పాపము రాదు. తెలిసి తిన్న వానికి ఒక దినము ఆచము ప్రాప్తించును.

అగ్ని మహాపురాణమునందు స్రావాద్యాశౌచ మమ నూటయేబది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.