అగ్ని మహా పురాణము

Table of Contents

359 - అథ కృత్సిద్ధరూపమ్ 

అగ్నిరువాచః

కుమారస్వామి చెప్పెను. కృత్ప్రత్యయములు భావకర్మ కర్త్రర్థము లందు మూడింటి యందును వచ్చును. అచ్ ల్యుట్, క్తిన్, భావమయ్, యచ్. అ, తవ్య, ఆదులు కృత్ప్రత్యయములు. అచ్ ప్రత్యయము చేర్చగా వినయః, ఉత్కరః, ప్రకరః, దేవః, భద్రః, శ్రీకరః మొదలగు రూపము సిద్ధించును. ల్యుట్ - శోభనమ్. క్తిన్ . వృద్ధి, స్తుతిః మతీ: - ఘయ్ - భావః, యుచ్ - కారణా భావనా మొదలగునవి. అ . చికిత్సా, తవ్య - కర్తవ్యమ్. ఉదాహరణము. అనీయ - కరణీయకమ్. యత్ - దేయం ధ్యేయమ్. ణ్యత్ . కార్యమ్, ఇవన్నియు కృత్య ప్రత్యయములు; క్తాదులు, క ర్థము నందు కొన్ని చోట్ల భావ కర్మార్థవం లందును చేర్చబడును. ఉదాహరణ- గ్రామః గతః, గ్రామం గతః త్వయా గురు ఆళ్లీష్ట మొదలగునవి. శతృ భవన్, కౌనచ్ - ఏధమాన, భవన్ స్త్రీ లింగములో భవ స్త్రీ అగును. అన్ని రాతువులకోశేషు స్వర్గ పాతాలాదివర్గాఃకంపెను నువుల్, తృచ్, ప్రత్యయములు వచ్చును, ఉదా: భావనః, థవితా మొదలగునవి క్విప్ - స్వయంభూః, ల్యుట్ కు భూతార్థ మున క్వసు, కొనచ్ ప్రత్యయములు చేర్చగ. బభూవివాన్, పేచిహన్ పేదాన, శ్రద్దదానక : ఇల్యాది రూపములగును, అణ్ చేర్చగా కుంభకార: మొదలగునవి సిద్ధించును. ఉనాదులు భూతార్థ ముందు కూడ వచ్చును. ఉదా:- కారః, పాయుః వాయుః ఇత్యాదులు ఛందందు ఇవి బహుళ ముగా వచ్చును.

అగ్ని మహాపురాణమున కృదంతనిరూపణమను మూడువందల యేబదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.