అగ్ని మహా పురాణము

Table of Contents

277 - అథ రాజవంశవర్ణనమ్

ఆగ్ని రువాచః

ఆగ్ని దేవుడు పలికెను. తుర్వసునికి వర్గుడు వానికి గోధానుడు వానికి శ్రీ9శాని, వానికి కరంధముడు, వానికి మరుత్తుడు, వానికి దుష్యంతుడు, దానికి వరూథుడు, పొనికి గాండీరుడు, వానికి గాంధారుడు పుట్టెను. గాంధారునకు ఐదుగురుపుత్రులు పుట్టిరి. వీరి నామధేయములననుసరించి గాంధార-కేరశ-చోశ-పాండ్య-కోల-దేశమాలు ఏర్పడినవి. వీరందరును మహాబలవంతులు. దృహ్యునికి బభ్రు సేతువు వానికి పురోవసువు, పానికి గాంధారుడు, వానికి ధర్ముడు, వానికి మృతుడు పొనికి విదుషుడు, వానికి ప్రచేతసుడు, పుట్టిరి. ప్రచేతసుని నూర్గురి కుమారులలో ఆనద్ర.సభానర-చాక్షుష-పర-మేశుపులు- ప్రధానులు సభానరునకు కానలుడు, వానికి సృంజయుడు, దానికి పురంజయుడు, వానికి జనమేజయుడు, వానికి మహాశాడు, పానికి మహామానసుడు, వానికి ఉశ్వరుడు, పుట్టెను. మహామానసుని భార్యయగు నృగకు నృగుడను కుమారుడు పుట్టెను. నృగువకు నరయను భార్యయందు వరుడుమ కృమియను భార్యయందు కృమియు, దశయను భార్యయందు సువ్రతును దృషద్వతియందు శిబి జనించేను. శిబికి పృథుదర్భుడు వీరకుడు-కై కేయుడు-భద్రకుడు ఆనునలుగురు పుత్రులు జనించిరి. వీరి పేర్లతో నాలుగుదేశమును ప్రసిద్ధములై సవి. ఉశీనరునికి తితిక్షువు వానికి రుషధ్రథుడు, వానికి పైలుడు, వానికి సుతకుడు, వానికి మహాయోగిన బలిజన్మించేను. బలికి, ఆంగ-వంగ-ముఖ్యక-పుండ్ర-కశింగులను పుత్రులు పుట్టిరి. వీరందరికిని బాలేయులని పేరు. యోగియైన బలి మహాబలవంతుడు. ఆంగునికి దధివాహనుడు వానికి దివిర థుడు వానికి డెర్మరథుడు, వానికి చిత్రరథుడు, వానికి సత్యరథుడు, వానికి లోమపాదుడు వానికి చతురఁగుడు వానికి పృథులాక్షుడు, వానికి చంపుడు, వానికి హర్యంగుడు, వానికి భద్రరథుడు, వానికి బృహత్కర్మ, వానికి బృహద్భానుడు, వానికి జయద్రథుడు, వానికి బృహద్రథుడు, వానికి విశ్వజిత్తు, వానికి కర్ణుడు, పానికి వృషసేనుడు పుట్టెను. అంగవంశమునందు పుట్టినరాజులను గూర్చిచెప్పితిని. ఇపుడు పురువంశవర్ణనము వినుము.

ఆగ్ని మహాపురాణమన రాజవంశవర్ణనమను రెండువందల డెబ్బది యేడవ అధ్యాయము సమాప్తము.