అగ్ని మహా పురాణము

Table of Contents

142 - అథ మంత్రౌషధాదిః.

ఈశ్వర ఉవాచః-

పరమేశ్వరుడు పలికేను : ఇపుడు సంపూర్ణమనోరథముల నిచ్చు మంత్రచక్ర ఔషధములను గూర్చి చెప్పేదను. చౌర్యము చేసినట్లు సందేహము గల వ్యక్తిని గూర్చి ఏదైన ఒక వస్తువు పేరు చెప్పి, దానిలో ఉన్న అక్షరముల సంఖ్య రెట్టింపు చేసి ఒక చోట ఉంచు కొనవలెను. ఆ పేరులోని మాత్రల సంఖ్యను నాలుగుచే గుణించి ఆ గుణనఫలమును మరొక చోట ఉంచుకొనవలెను. మొదటి సంఖ్యతో రెండవ సంఖ్యను భాగించవలెను. శేషమున్నచో ఆ వ్యక్తి చోరుడని శేషము లేనిచో చోరుడు కాడనియు గ్రహించవలేను. ఇపుడు పుట్టబోయే శిశువును గూర్చి చెప్పెదను. ప్రశ్నలోని వర్ణములు విషమ సంఖ్యలో ఉన్న చో గర్భశిశువు పురుషుడు. ప్రశ్నించువాడు చెప్పిన వస్తువు పేరు స్త్రీలింగమైనచో, దాని అక్షరములు సమసంఖ్యలో నున్న యెడల పుట్టబోయే కాలునికి ఎడమ కన్ను గ్రుడ్డి దగును. ఏతద్విపరీత మైనచో దోషము లేదు. శ్రీ పురుషనామముల మాత్రలసంఖ్యను, అక్షరముల సంఖ్యను వేరు వేరుగా నాలుగుచే గుణించి వేరు వేరుగా ఉంచుకొనవలెను. మొదటిది మాత్రాపిండము, రెండవది వరపిండము, వర్ణపిండమును మూడు చే భాగించవలెను. శేషము సమ మైనచో కన్య ముతౌషధాదికమ్ విషమ మైనచో వుత్రుడు జన్మించును. శూన్యము శేషమైనచో భర్తకంటే ముందు భార్య చని పోవును. మాత్రాపిండమును మూ.కుచే భాగించగా శూన్యము శేషమైనచో శ్రీ కంటే ముందు పురుషుడు మరణించును. సమస్తభాగమునందు సూక్ష్మా క్షరములు గల ద్రవ్యముల ద్వారా ప్రశ్నను గ్రహించినచో అభిష్టసుజ్ఞానము కలుగును. శనిచక్రమును గూర్చి చెప్పెను. శనిదృష్టి యు లగ్నము సర్వధా త్యాజ్యము. ఏడవస్థానముపై శనిదృష్టి పూర్ణముగాను, చతుర్ధదశమ రాశుల పై సగము ప్రథమ-ద్వితీయ- అష్టమ ద్వాదశములందు పాదము ఉండును. శుభకర్మలందు వీటి నన్నింటిని విడువవలేను. ఏ దివ మునందు ఏ గ్రహము ఆధిపతియే ఆ దినమునందలి మొదటి జాము ఆ గ్రహమునకు సంబంధించును, మిగిలిన గ్రహములు ఆ దివసమునందలి అర్ధయామములకు అధిపతులు. శనిభాగ మైన సమయమున యుద్ధము చేయరాదు. ఇపుడు దినమున రాహుస్థితిని గూర్చి చెప్పెదను. రాహువు రవివారమునందు తూర్పునందును శనివారమునందు హాయవ్యమునందును, గురువారమున దక్షిణమునను, శుక్రవారమునందు ఆగ్నేయమునను, మంగళ వారమునందు కూడ ఆగ్నేయమునను, బుధ వారమున ఉత్తరమునందును ఉండును. ఫణిరాహువు ఈశాన్య ఆగ్నేయ- నైరృతి-వాయవ్యములందు ఒక్కొక్క జాము ఉండును. యుద్ధమునందు తన ఎదుట నున్న శత్రువును ఆవేష్టించి చంపివేయును. ఇపుడు తిథిరాహువును గూర్చి చేప్పెదను. రాహువు పూర్ణిమనాడు ఆగ్నేయమునందును, అమావాస్యనాడు పాయువ్యమునందును ఉండును. సుముఖ రాహుపు శత్రునాశకరుడు. శశ్చిమమునుండి తూర్పునకు మూడు నిలువు గీతలు గీసి ఈ మూలలేఖలను భేదించుచు దక్షిణము మండి ఉత్తరమునకు మూడు రేఖలు గీయవలెను. ఈ విధముగ ఒక్కొక్క దిశయందు మూడేసి రేఖ లగును. సూర్యుడు ఏ రాశిపై ఉండునో దానిని ఎదుట నున్న దిక్కున వ్రాసి క్రమముగా పండ్రెండు రాశులను ప్రదక్షిణక్రమమున ఆ రేఖాగ్ర ముల పై వ్రాయవలెను. పిదప 'క' నుంచి 'జ' వరకు అక్షరములను ఎదుట నున్న దిక్కునందు వ్రాయవలెను. “ర” నుకి ‘దివరకు అక్షరములు దక్షిణముగను, 'ధ'నుడి ‘మివరకు తూర్పునను. 'య'నుండి “హ'వరకు ఉత్తరమునందును వ్రాయవలెను. వీటికి రాహుగుణము అని పేరు. శుక్లపక్షమునందు వీటిని తృజి-చవలెను. తిథిరాహుసమ్ము ఖదృష్టి కూడ త్యజించవలేను. రాహుదృష్టి ఎదుట నున్నచో హాని కలుగును. అట్లు కానిచో విజయము కలుగును. ఇపుడు విష్టి రాహుపును గూర్చి చెప్పెదను. ఈశాన్యమునుండి కిణమునకు, దక్షిణమునుండి వాయువ్యమునకు. వాయువ్యమునుండి తూర్పునకును, అచటి నుండి నైరృతివరకును, ఆచటి నుండి ఉత్తరమునకు, అచటినుండి ఆగ్నేయమునకు, ఆచటినుండి పశ్చిమమువరకును, వశ్చి కుమునుండి ఈశాన్యమువరకును, ఎనిమిది రేఖలు గీయవలెను. ఈ రేఖపై విజ్జీ (భద్ర) తో కూడ మహాబలవంతు డగు రాహుపును గూర్చి విచారింతురు. కృష్ణ పక్షతృతీయాది తిథులలో విప్షరాహువు ఈశాన్యము సందును, సప్తమ్యాదుందు దక్షిణమునందును ఉండును. ఈ విధముగ కృష్ణ-శుక్ల పక్షములందు వాయువ్యమునం దున్న సంముఖరాహువు శత్రువినాశనమును చేయును. విష్టరాహుచక్రమున పూర్వాదిదిక్కులందు ఇంద్రాద్యష్ట దిక్పాలకులను, మహా భైరవాద్యష్టభైరవులనూ, బ్రహ్మణ్యాద్యష్టక క్తులను, సూర్యాద్యష్ట గ్రహములను స్థాపించవలెను. పూర్వాదిదిక్కులందు ఒక్కొక్కదానియందు బ్రహ్మణ్యాది, అష్టశక్తుల ఎనిమిది అష్టకములను గూడ స్థాపించవలెను. దక్షిణాదిదిక్కులందు వాత యోగినిని వ్రాయవలెను. రాహువు వాయువు వీచుచున్న వై పు పేరందరితో కలిసి ఉండి శత్రువినాశనము చేయును. ఇపుడు అవయవములను సుదృఢము చేయు ఉపాయమును చేప్పెడను. శరపుంఖిక ఆను ఓషధిని పుష్యనక్షత్రమునందు పెకలించి, చెప్పబోవు అపరాజితామంత్రము జపించి, కంఠమునందుగాని, భుజమునందు గాని ధరించినచో శత్రుబాణములకం లక్ష్యము కాకుండ రక్షించును. ‘అపరాజితా’ ‘పాఠా’ అను ఓషధులను కూడ ఈవిధముగనే ధరించినచో ఖడ్గ ప్రహారము మండి తప్పించుకొనవచ్చును. ' “ఓం నమో భగవతి.........రక్ష రక్ష”అను (మూలో క్షమైనది) ఆపరాజిలామంత్రము గ్రహ-జ్వర-భూతాది బాధలు తొలగించు కొనుటకు ఈ మంత్రమును ప్రయోగించవలెను.

అగ్ని మహాపురాణమునందు యద్దజయార్ణవమున మంత్రౌషధాదిక మన నూటనలుబది రెండవ అధ్యాయము సమాప్తము.