అగ్ని మహా పురాణము

Table of Contents

73 - అథ సూర్యపూజావిధిః.

పరమేశ్వరుడు పలికెను. స్కందా! ఇపుడు అంగన్యాస కరన్యాసములతో సూర్య పూజావిధానమును చెప్పెదను. తేజోమయసూర్యుడను నేనే” అని భావన చేసి అర్ఘ్యపూజనము చేయవలెను. ఎఱ్ఱటి చందనము కలిపిన జలమును లలాట సమీపమునకు తీసికొని వెళ్ళి దానితో అర్ఘ్యపాత్రమును నింపవలెను. దానిని గంధాదులతో పూజించి సూర్యాంగములచే రజావగుంఠనము చేయవలెను. పిమ్మట జలముతో పూజాసామగ్రిని ప్రోక్షించి, పూర్వాభిముఖుడై సూర్యుని పూజ చేయ వలెను. “ఓం ఆం హృదయాయ నమః” ఇత్యాది విధమున స్వరబీజము మొదట చేర్చి శిరస్సు మొద లగు అన్ని అవయవముల న్యాసము చేయవలెను. పూజాగృహద్వారమునందు కుడి వైపున దండిని, ఎడమ వైపున పింగళుని పూజింపవలెను. “గం గణపతయే నమః” అను మంత్రముతో ఈశాన్యమున గణేశుని పూజింపవలెను. ఆగ్నేయమున గురుపూజ చేయవలెను. పీఠమధ్యమునందు కమాలాకారాసనము భావన చేసి పూజించవలెను. పీఠముయొక్క ఆగ్నేయాది కోణములలో క్రమముగ విమల-సార - ఆరాధ్య - పరమసుఖములను, మధ్యభాగమున ప్రభూతాసనమును పూజింపవలేను. విమలాదుల నాల్గింటి రంగులు వరుసగ శ్వేత.రక్త-పీత.నీలములు ఉండును. వాటి ఆకారము సింహముతో సమానముగ నుండును. వీటి నన్నింటిని పూజించవలెను. పీఠముపై నున్న కమలములోపల “రాం దీప్తాయై నమః” అను మంత్రముచే దీప్తాశ క్తిని, “రీం సూష్మాయై నమః” అను మంత్రముతో స్మూశక్తిని, “రూం జయాయై నమః” అను మంత్రముచే జయాశ క్తిని, “రేం భద్రాయై నమః” అను మంత్రముచే భద్రాశ క్తిని, “రైం విభూతయే నమః” అను మంత్రముచే విభూతి శక్తిని, “రోం విమలాయై నమః” అను మంత్రముచే విమలాశ క్తిని, “రౌం అమోఘాయై నమః” అను మంత్రముచే అమోఘా శక్తిని, “రం విద్యుతాయై నమః” అను మంత్రముచే విద్యుతాశ క్తిని పూర్వాది దిక్కులు ఎనిమిదింటి యందును పూజించి, “రః సర్వతోముఖ్యై నమః” అను మంత్రముచే మధ్యభాగమునందు, తొమ్మిదవ పీఠశ క్తి యైన సర్వతోముఖిని పూజించ వలెను. పిమ్మట “ఓం బ్రహ్మ విష్ణుశివాత్మకాయ సౌరాయ- యోగ పీఠాత్మనే నమః” అను మంత్రముచే సూర్యదేవుని పీఠమును పూజించవలెను. పిమ్మట “డోలాయ నమః” అను షడక్షర మంత్రమునకు ప్రారంభమున “ఓం హం ఖం” అను అక్షరములు చేర్చి తొమ్మిది అక్షరములు గల “ఓం హం  ఖథోలాయ నమః” అను మంత్రము ద్వారా సూర్య విగ్రహావాహనము చేసి సూర్యుని పూజ చేయవలెను. దోసిటిలో నున్న ఉదక మును లలాటసమీపమునకు తీసికొని వెళ్ళి రక్త వర్ణుడై న సూర్యుని ధ్యానించి, ఆ సూర్యుడు తన ఎదుట నున్నట్లు భావన చేయవలెను. పిదప “హ్రాం హ్రీం సః సూర్యాయ నమః” అని పలుకుచు సూర్యునకు అర్ఘ్య మీయవలెను. . పిదప బింబముద్ర చూపుచు ఆవాహనాద్యుపచారములు సమర్పింప వలెను. పిదప సూర్యునీ ప్రీతి కొరకై గంధాదికి ము సమర్పింపవలెను. ఆగ్నేయమునందు “ఓం ఆం హృదయాయ నమః” అను మంత్రముచే హృదయమును, నైరృతిదిక్కునందు “ఓం భూః ఆర్కాయ శిర సే స్వాహా” అను మంత్రముచే శిరస్సును, వాయవ్యమున “ఓం భువః సురేశాయ శిఖాయై వషట్” అను మంత్రముచే శిఖను, ఈశాగ్యమునందు “ఓం స్వః కవచాయ హుం” అను మంత్రముచే కవచమును, ఇష్టదేవతకును ఉపాసకుసకును మధ్య “ఓం హాం నేత్రత్రయాయ వౌషట్” అను మంత్రముచే నేత్రమును, దేవతకు పశ్చిమభాగమునందు “వః అస్త్రాయ ఫట్” అను మంత్రముచే అస్త్రమును పూజింపవలెను. పిన్ముట పూర్వాదిదిశలందు ముద్రలను ప్రదర్శింపవలెను.

హృదయ-శిరః-శిఖా-కవచములకు పూర్వాచి దిక్కులందు ధేనుముద్రను ప్రదర్శించవలేను. నేత్రములకు గోశృంగముద్ర చూపవలేను. అస్త్రమునకు త్రాసలీముద్ర చూపవలెను. పిమ్మట గ్రహములకు నమస్కారము, పూజ చేయ వలెను. “ఓం సోం సోమాయ నమః” అను మంత్రముతో తూర్పునందు చంద్రుని, “ఓం బు బుధాయ నమః” అను ముత్రముతో దక్షిణమున బుధుని, “ఓం బృం బృహస్పతయే నమః” అను మంత్రముతో పశ్చిమమున బృహస్పతిని, “ఓం భం భార్గవాయ నమః” అను మంత్రముతో శుక్రుని పూజింపవలెను. ఈ విధముగ పూర్వాదిదిః లందు చంద్రాదిగ్రహములను పూజించి ఆగ్నేయాది విదిక్కులందు మిగిలిన గ్రహములను పూజింపవలెను. ఎట్లనగా “భౌం భౌమాయ నమః” అను మంత్రముతో ఆగ్నేయమున కుజుని, “ఓం శం శనైశ్చరాయ నమః” అను మంత్రముతో నైరృతి దిక్కునందు శనైశ్చరుని, “ఓం రాం రాహవే నమః” అను మంత్రముతో వాయువ్యమునందు రాహువును, “ఓం కేం కేతవే నమః” అను మంత్రముతో ఈశాన్యమునందు కేతువును గంధాద్యుపచారములతో పూజింపవలేను. అఖోర్కీ (సూర్యభగవానుని) తో పాటు ఈ అన్ని గ్రహములపూజ కూడ చేయవలెను. మూలమంత్రము జపించి, అర్ఘ్యపాత్రమునందు జలము గ్రహించి సూర్యునకు సమర్పించి, పిదప స్తుతించవలెను. ఈ విధముగ స్తుతి చేసిన పిదప ఆభిముఖముగ నిలబడి సూర్యునకు నమస్కరించి ఇట్లు ప్రార్థించ వలెను. “ప్రభో! నా అపరాధములను లోపములను క్షమింపుము”. పిమ్మట “అస్త్రాయ ఫట్” అను మంత్రముతో అణుసంహార సమాహరణము చేసి, “శివసూర్య” అని పలుకుచు సంహారిణీముద్ర ద్వారా సూర్యుని ఉపసంహృత మగు తేజస్సును తన హృదయకమలములో నుంచి సూర్యనిర్మాల్యమును ఆతని పారదు డైన చండునకు సమర్పింపవలెను. ఈ విధముగ జగదీశ్వరు డగు సూర్యుని పూజ చేసి, ధ్యానహోమములు చేయుటచే సాధకుని మనోరథము లన్నియు సిద్ధించును.

అగ్ని మహాపురాణమునందు సూర్యపూజావిధివర్జన మను డెబ్బదిమూడవ అధ్యాయము సమాప్తము.