అగ్ని మహా పురాణము

Table of Contents

271 - అథ వేదశాఖాది కీర్తనమ్

పుష్కర ఉవాచః

పుష్కరుడు పలికెను. సర్వాను గ్రాహకములగు వేదమంత్రములు నాల్గు పురుషార్థములను ఇచ్చును. ఋక్, యజుః, సామ, ఆథర్వములని వేదములు నాలుగు. వీటి మంత్రముల సంఖ్య ఒక లక్ష. ఋగ్వేదమునకు, సాంఖ్యానము ఆశ్వలాయనమని, రెండు శాఖలు. వీటిలో ఒకవెయ్యి ఋగ్వేద బ్రాహ్మణములలో రెండు వేల మంత్రములున్నవి. కృష్ణ ద్వైపాయనాదులు ఋగ్వేదమున ప్రమాణముగా అంగీకరించిరి. యజుర్వేదమున పందొమ్మిది వందల తొంబది తొమ్మిది మంత్రములున్నవి. బ్రాహ్మణములందు వెయ్యి మంత్రములు వున్నవి. శాఖలు ఎనుబది ఆరు, కాండ్వి, మాధ్యందినీ, కఠి, మైత్రాయణి, తైత్తరీయ, వైశంపాయనిక . మొదలగు శాఖలు, యజుర్వేదము నందువున్నవి. సామవేదమున కౌధుమ శాఖ, అథర్వణాయణిశాఖ - అను రెండుశాఖలున్నవి. దీనిలో వేదము ఆర వ్యాకము, ఉక్తకము, ఊహము, అనునాలుగు గానములున్నవి. సామవేదమంలో తొమ్మిది వేల నాలుగు వందల ఇరువదిఐదు మంత్రములు వున్నవి. ఇవి బ్రహ్మ కు సంబంధించినవి. ఇంతవరకు సామవేదమానము చెప్పబడినది.

సుమంతువు - జాజలి - శ్లోకాయణీ - శౌనకుడు పిప్పలాదుడు ముంజ కేశుడు, మొదలగు వారు ఆథర్వవేదము రాఖా ప్రవర్తకులగు ఋషులు. దీనిలో పదహారువేల మంత్రములు నూరు ఉపనిషత్తులు వున్నవి. శ్రీ మహావిష్ణువు వ్యాస రూపమున అవతరించి వేదశాఖా విభాగమును చేసెను. వేద శాఖా భేదాదులు ఇతిహాసములు పురాణములు, ఇవన్నియు విష్ణు స్వరూపములు, లోమహర్షనుడను నూతుడు వ్యాసుని నుండి పురాణాదులు గ్రహించి, ప్రచారము చేసెను. ఆతనికి సుమతిఅగ్ని వర్చసుడు, మిత్రము శింశపాయనుడు, కృతవ్రతుడు, సావర్ణి - అను ఆరుగురు శిష్యులుండిరి. శింశపాయనాదులు పురాణ సంహితను రచించిరి. శ్రీ మహావిష్ణువే బ్రహ్మాది అష్టాదశ పురాణముల రూపమునను అష్టాదశ విద్యారూపమునను, వున్నాడు. సప్రపంచ, నిమ్రపంచ, మూర్తి మూర్త, స్వరూపధారియగు శ్రీమహావిష్ణువు అగ్నిపురాణరూపమున నున్నాడు. అతనిని తెలుసుకొని పూజించి స్తుతించినచో భుక్తిముక్తులు లభించును. విజయశీలుడగు విష్ణువు ప్రభావసంపన్నుడు. అగ్ని సూర్యాదిరూపముననున్న వాడు. ఆ విష్ణువే ఆగ్ని రూపమున దేవతాదుల ముఖముగ నున్నాడు. ఆతడే పరమగతి. వేద పురాణములందు యజ్ఞమూర్తిగ వర్ణింపబడుచున్నాడు. ఈ అగ్ని పురాణము విష్ణువు యొక్క మహత్త రరూపము. ఈ అగ్ని మహాపురాణము నకు కర్తయు శ్రోతయు కూడ జనార్దనుడే అందుచే ఈ అగ్ని మహావురాణము సర్వవేదమయము. సర్వ విద్యామయము సర్వజ్ఞానమయము, పుణ్యము శ్రేష్ఠము. చదువు వారికిని వినువారికిని సర్వాత్ముడగు శ్రీహరియే స్వరూపము ఈ పురాణము విద్యార్థులకు విద్యను ధనార్డులకు ఐశ్వర్యమును, రాజ్యార్థులకు రాజ్యమును, ధర్మకాములకు ధర్మమును, స్వర్గ కాములకు స్వర్గమును, పుత్రకాములకు పుత్రులను, గడాదికములకు గోవులను గ్రామములకు గ్రామములను ఇచ్చును. కామార్థులకు సర్వసౌభాగ్యములను, గుణ కీర్తులను ఇచ్చును. జయరాములకు జయమును, సర్వకాములకు సర్వముతు ముక్తి కోరువారికి ముక్తిని ఇచ్చును. పాపములు చేసిన వారికి పాపములు తొలగించును.

అగ్ని మహాపురాణమున వేదశాఖా కీర్తనమను రెండువందల డెబ్బది ఒకటవ అధ్యాయము సమాప్తము.