అగ్ని మహా పురాణము

Table of Contents

7 - అథ అరణ్యకాణ్డ వర్ణనమ్.

రాముడు వసిష్టుని, తల్లులను నమస్కరించి వారిని తిరిగి పంపి వేసి చిత్రకూటమునుండి బయలుదేరి దండకారణ్యము వైపు వెళ్ళుచు మార్గ మధ్యమును, అత్రిమహామునిని, అతని భార్య యైన అనసూయను, శర భంగుని, సుతీష్ణుని, అగస్త్యభ్రాతను, అగస్త్యుని చూచి నమస్కరించేను అగస్త్యుని, అనుగ్రహము వలన ధనస్సును, ఖడ్గమును పొంది, దండకారణ్యము చేరెను.

జనస్థానమునందు గోదావరీతీరమున, పంచవటితో నివసించెను. భయంకరురా లైన కూర్పణఖ వారిని భక్షించుటకై అచటికి వచ్చెను. మంచి రూపము గల రాముని చూచి ఆమె కామమోహితురాలై ఇట్లు పలికెను.

శూర్పణఖ ఇట్లు పలికెను. “నీవు ఎవరవు? ఎక్కడనుండి వచ్చినావు ? నేను కోరుచున్నాను. నాకు భర్త వగుము. ఈ ఇద్దరినీ భక్షించెదను. ఇట్లు పలికి ఆమె సీతాలక్ష్మణులను భక్షించుటకు ఉద్యమించెను. అపుడు రాముడు ఆజ్ఞాపింపగా లక్ష్మణుడు. ఆమె ముక్కు చెవులు కోసివేసెను.

రక్తము స్రవించుచుండగా ఆమె వెళ్ళి సోదరుడైన ఖరునితో ఇట్లనెను. ఖరుడా ముక్కులేని నేను మరణించేదను. కాని రాముని భార్య సీత, సోదరుడు, లక్ష్మణుడు ఉన్నారు. నీవు, వారి గోరువెచ్చని రక్తమును త్రాగించినచో జీవించెదను.

అట్లే చేసెదను అని పలికి ఖరుడు: పదునాలుగు వేలమంది రాక్షసులను, దూషణ త్రిశిరస్కులను తనతో తీసుకొని రామునితో యుద్ధము చేయుటకు వెళ్ళాను. రాముడు కూడ యుద్దమునందు బాణములచే రాక్షసులను కొట్టి. ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు అను నాలుగు అంగములు గల సైన్యమును, త్రిరనని, భయంకరుడైన అరుని, యుద్ధము చేయుచున్న దూషణుని యమలోకమునకు వం పెను.

శూర్పణఖ లంకకు వెళ్ళి రావణుని ఎదట నేల పై, బడి, క్రుద్ధురాలై రావణునితో ఇట్లు పలికెను. “నీవు రాజువు కావు. రక్షకుడవు కావు. అందులను చంపిన రాముని భార్య యైన సీతను హరించి భార్యను చేసికొనుము. రామలక్ష్మణుల రక్తము త్రాగిన యడలనే జీవించెదను. ఆట్లు కానిచో జీవింపను

ఆ మాటలు విని రావణుడు “అటులనే చేసెదను” అని పలికి మారీచునితో ఇట్లు పలికెను. బంగారు చిత్రవర్ణ మైన మృగ రూపము ధరించి, రామలక్ష్మణులను దూరముగా తీసికొను బోవువాడవై సీత ఎదుటకు వెళ్ళుము. నే నామెను హరించెదను. ఇట్లు చేయ కున్న చో నీకు మరణమే.

మారీచుడు రావణునితో ఇట్లు పలికెను. (అనుకొనెను). ధనుర్ధారియైన రాముడు సాక్షాత్తు మృత్యుదేవతయే. రావణుని చేతిలో నై నను మరణింపవలసినదే; . రాముని చేతిలో నే నను మరణించవలసినదే. మరణము తప్పనప్పుడు రాముని చేతిలో మరణము మంచిది. రావణుని చేతిలో కాదు. ఈ విధముగ తలచి, మృగరూపము ధరించి మాటిమాటికిని సీత ఎదుట సంచరించెను.

సీతచే ప్రేరితుడై న రాముడు (కొంత దూరము దానిని వెంబడించి) బాణము చేత దానిని చంపెను. మరణిం చుచు ఆ మృగము హా సీతా హా లక్ష్మణా అని అరచెను.

పిమ్మట సీత ప్రేరేపింపగా లక్ష్మణుడు, తన కిష్టము లేకున్నను రాముని వద్దకు వెళ్లెను. రావణుడు జటా యువును చంపి సీతను హరించేను.

జటాయువుచే చీల్చబడిన శరీరము గల ఆతడు జానకిని అంకము పై కూర్చుండ బెట్టుకొని తీసికొని పోయి లంక చేరి, ఆమెను ఆశోకమను వనమున బందీగా ఉంచి ఇట్లు పలికెను.

రావణ ఉవాచః -

రావణుడు పలికెను. “నీవు నాకు ప్రముఖురాలై న భార్యవగుము”, “ఓ రాక్షసస్త్రీలలారా! ఈమెను రక్షింపుడు.” రాముడు మారీచుని చంపి, లక్ష్మణుని చూచి ఇట్లు పలికెను.

శ్రీ రాముడు పలికెను. “లక్ష్మణా! ఆ మాయామృగము. నీవు కూడ వచ్చివేసినావు. అందుచే సీతను తప్పక అపహరించి యుందురు.” పిమ్మట ఆతనికి సీత ఆశ్రమమున కనబడలేదు.

రాముడు దుఃఖించుచు “నన్ను విడచి ఎక్కడికి పోతివి” అని పలుకుచు దుఃఖార్హుడై విలపించెను. లక్ష్మణునిచే ఊరడింపబడి జానకిని అన్వేషించెను.

జటాయువు రాముని చూచి “సీతను రావణుడు అపహరించేను “అని చెప్పి ప్రాణములు వీడచెను. రాముడు ఆతనికి అంత్య సంస్కారములు చేసెను. పిమ్మట కబంధుని సంహరించెను. ఆతడు శాపవిముక్తుడై “సుగ్రీవుని వద్దకు వెళ్లము” అని రామునితో పలికెను.

అగ్ని మహాపురాణములోని రామాయణ కథలో ఆరణ్యకొండవర్ణన మనెడు సప్త మాధ్యాయము సమాప్తము.