అగ్ని మహా పురాణము

Table of Contents

202 - అథ పుష్పాధ్యాయ కథనమ్.

అగ్ని రువాచః-

అగ్ని దేవుడు పలికెను : శ్రీమహావిష్ణువు పుష్ప-గంధ-ధూప-దీప-నైవేద్యముల సమర్పణచే ప్రసన్ను డగును. శ్రీ మహావిష్ణువునకు సమర్పింప యోగ్యములు, ఆయోగ్యములు అయిన పుష్పములను గూర్చి చెప్పెదను. మాలతీ పుష్పము పూజకు అత్యుత్తమము. తమాలపుష్పము భోగమోక్షప్రదము. మల్లికాపుష్పము సమ స్తపాపనాశకము. యూథిక విష్ణులోకమునిచ్చును. అతిముక్తకలో ధ్రపుష్పములు విష్ణులోక ప్రాప్తి హేతువులు. కరవీరపుష్పములతో పూజించువాడు విష్ణులోకమును చేరును. జపాపుష్పములు పుణ్యప్రదములు. పావ స్త్రీ - కుబ్జక - తగరపుష్పమాలు విష్ణులోకము నిచ్చును. కర్ణికారపుష్పపూజ చేయువాడు వైకుంఠము చేరును. కురంటపుష్పపూజ పాపవినాశ కము. కమల - కుంద - కేతకీ పుష్పములు పరమగతినిచ్చును. బాణపుష్ప - కృష్ణతులసీ పత్రములతో పూజచేయువాడు - విష్ణులోకమును పొందును. ఆశోక - తిలక - ఆటరూషపుష్పములచే పూజించువాడు మోక్షాధికారి యగును. బిల్వ - శమీపత్రములచే పరమగతి సులభము. తమాలదలములతోను, భృంగరాజముతోను పూజచేయువాడు విష్ణులోక నివాసి యగును. కృష్ణతులసీ - శుక్ల తులసి - కల్హార - ఉత్పల - పద్మ - కోకనదపుష్పములు  పుణ్యప్రదములు. నూరుక మలముల మాల సమర్పించినచో శ్రీమహావిష్ణువు ప్రసన్ను డగును. నీప-అర్జున - కదంబ - కింశుక - ఆగ స్త్య - గోకర్ణ - నాగకర్ణ - సంధ్యాపుష్పి బిల్వాతక - రంజనీ - కేతకీ - కూష్మాండ - గ్రామకర్కటి - కుశ - కా - ద్యూత - విభీతక - మరువ కాదిపత్రములతోను, ఇతరమైన సుగంధిపత్రములతోను పూజ చేసినచో శ్రీమహావిష్ణువు ప్రసన్ను డగును. వీటితో పూజించిన వాడు పాపవిముక్తుడై భుక్తిముక్తులను పొందును. లక్షస్వర్ణములకంటె గూడ కోట్ల రెట్లు పుష్పములు ఉత్తములు. తన ఉద్యానవనమునుండియు, ఇతరుల ఉద్యానములనుండియు తెచ్చిన పుష్పములకంటె వన్యపుష్పములకు మూడు రెట్లు ఫల మధిక మని చెప్పబడినది.

రాలిన పూవులతోను, అధిక మైన అవయవములు గలవాటితోను, నలిగిపోయినవాడొతోను శ్రీమహావిష్ణువును పూజించరాదు. కాంచనార ఉన్మత్త - గిరికర్ణికా - కుటజ - కార్మిలి - శిరీషపుష్పములతో విష్ణువును పూజించరాదు. వీటితో శ్రీమహావిష్ణువును పూజించువాడు నరకము చెందును. సుగంధము గల రక్త కమలముతోను, నీలకమలములతోను శ్రీమహావిష్ణువును పూజించవలెను. ఆర్కే - మందార - ధుస్తూరకుసుమముతో శివుని పూజించవలెను. కాని కుటజ - కర్కటి - కేతకీపుష్పములతో శివుని పూజింపగూడదు. కూష్మాండ - నింబపుష్పములును, గధహీనము లగు ఇతర పుష్పములును పైశాచము అని చెప్పబడుచున్నవి. అహింస, ఇంద్రియజయము, ఓర్పు, జ్ఞానము, దయ, స్వాధ్యాయము మొదలగు ఎనిమిది భావపుష్పములచే దేవతలను పూజించు మానవుడు భుక్తిముక్తి . పొతుం డగును. వీటిలో అహింస మొదటి పుష్పము. ఇంద్రియ నిగ్రహము రెండవది. సకలప్రాణుల పై దయ మూడవ పుష్పము. ఓర్పు నాల్గవడగు శ్రేష్టపుష్పము. ఈ విధముగ శమ - తపోధ్యానములు పంచమ - షష్ఠ - సప్త మ పుష్పములు. సత్యము ఎనిమిదవ పుష్పము. వీటితో పూజించినచో భగవంతుడు ప్రసన్ను డగును; సంతసించును. నరశ్రేష్ఠా! ఇతర పుష్పములు పూజకు బాహ్యోపకరణములు మాత్రమే. శ్రీమహావిష్ణువు భక్తిదయాసమన్వితము లగు భావపుష్పములతో పూజించినచో సంతుష్టు డగును. జలము దారుణ పుష్పము. మృత-దుగ్గ-దధులు సౌమ్యపుష్పములు. అన్నాదులు ప్రాజాపత్య పుష్పములు, ధూపదీపములు అగ్నేయపుష్పములు. వలపుష్పాదులు వానస్పత్యపుష్పములు. శ్రద్ధాదిభావములు వైష్ణవకుసుమములు. ఈ అష్ట విధకుసుమములు సర్వకామప్రదములు. ఆసనము (యోగ పీఠము) పంచాంగన్యాసము, అష్ట పుష్పము . ఇవి విష్ణురూపములు. ఈ అష్ట పుష్పములచే పూజితుడై శ్రీమహావిష్ణువు ప్రసన్ను డగును. ఇవి కాక వాసుదేవాది నామములతో శ్రీమహష్ణువును, ఈశానాదినామ వుష్పములతో శివుని పూజించవలెను.

ఆగ్ని మహాపురాణము నందు పుష్పాధ్యాయ మను రెండువందలరెండవ అధ్యాయము సనూప్తము.