అగ్ని మహా పురాణము

Table of Contents

126 - అథ నక్షత్ర నిర్ణయః

ఈశ్వర ఉవాచః

పర మేశ్వరుడు పలికెను. ప్రాణుల శుభాశుభఫలజ్ఞానము కొరకు నాక్షత్రిక పిండమును గూర్చి చెప్పెదను. ఎవరి శుభాశుభఫలములను తెలిసికొనవలెనో ఆ మనుష్యుని బొమ్మ గీసి సూర్యు డున్న నక్షత్రము మొదలు మూడు నక్షత్ర మాలు వాని శిరస్సు పైనను, ఒకటి ముఖము పైనను, రెండు నేత్రములందును, నాలుగు చేతులు కాళ్ళమీదను, ఐదు హృదయము నందును, ఐదు మోకాళ్ళ మీదను వ్రాసి ఆయుర్వృద్ధివిచారము చేయవలెను. శిరస్సు పైనున్న నక్షత్రమున యుద్ధము చేసినచో రాజ్యము లభించును. ముఖమునందలి నక్షత్రమున సుఖము, నేత్రమునందలి నక్షత్రమున సుందర సౌభాగ్యము, హృదయ మునందలి నక్షత్రమున ద్రవ్యసంగ్రహము, హస్తమునందలి నక్షత్రమున చౌర్యము, పాదమునందలి నక్షత్రములందు మార్గమందే మృత్యువు. ఈ విధముగ ఫలితములు తెలియవలెను. ఎనిమిది కుంభములను పర్వాదిదిక్కులందు ఎనిమిదింటి యందును ఉంచవలేను. ఒక్కొక్క కుంభమునందు మూడేసి చొప్పున ఎనిమిది కుంభములందును ఇరువది నాలుగు వృక్షత్ర మల నుంచగా నక్షత్రములు మిగిలిపోవును. వీటికి ‘సూర్యకుంభములు’ అని పేరు. సూర్యకాంభము ఆశుభము. పూర్వాది దిక్కులం దున్న కుంభముల మీది నక్షత్రములు శుభములు. ఇపుడు యుద్ధమునందు జయపరాజయముల వివేకము నిచ్చు సర్పాకారరాహుచక్రముల గూర్చి చెప్పెదను. ముందుగా ఇరువది ఎనిమిది చుక్కలు పెట్టవలెను. వాటిని మూడు మూడుగా విభజించగా ఎనిమిది విభాగములు వచ్చును. వాటిపై ఇరువదినాలుగు నక్షత్రములు గుర్తించగా నాలుగు నక్షత్రములు మిగిలిపోవును. వాటి పై రేఖ గీయవలెను. సర్పాకారచక్రమేర్పడును. రాహు వున్న నక్షత్రమును పడగపై వ్రాయవలెను. ఆ నక్షత్రముతోడనే ప్రారంభించి క్రమముగా ఇరువదియేడు నక్షత్రములు వ్రాయవలెను. ముఖమునం దున్న ఏడు నక్షత్ర ములలో యుద్ధము చేసినచో యుద్ధమునందు మరణము కల్గును. స్కంధమునందలి ఏడు నక్షత్రములందు యుద్ధము చేసి నచో పరాజయము వచ్చును. పొట్టమీద నున్న ఏడు నక్షత్రములలో సమ్మానము. విజయములభించును. కటి యందలి నక్షత్రము లందు శత్రువుల హరణము జరుగును. పుచ్ఛము నందలి నక్షత్రములందు యుద్ధము చేయగా కీర్తి కలుగును. రాహుదృష్ట నక్షత్రమునందు మృత్యువు కలుగును. ఇపుడు సూర్యుడు మొధలు రాహువు వరమును గ్రహముల బలము వర్ణించెదను. రవివారమునందు మొదటిది మొదలు ఎనిమిదవ ఆర్ధప్రహరమలకు వరుసగ సూర్య-శుక్ర-బుధ-సోమ-శని-గురు-కుజ-రాహువులు ఆధిపతులు. శని సూర్య-రాహువులను యత్నపూర్వకముగ పృష్టగతు లగు వట్లు చేసికొని యుద్ధము చేయువాడు సైన్య సముదాయముపై విజయము సాధించును. ద్యూత-మార్గ-యుద్ధములందు జయము పొందును.

రోహిణి, ఉత్తరాత్రయము, మృగ శిర-స్థిర నక్షత్రములు. ఆశ్విని, రేవతి, స్వాతి, ధనిష్ఠ, శతభిష క్షి ప్రనక్షత్ర ములు. యాత్రార్థి ఈ నక్షత్రములందు యాత్ర చేయవలెను. అనూరాధ, హస్త, మూల, మృగశిర, పుష్య, పునర్వసునక్ష త్రములు అన్ని కార్యములకు మంచిది. జ్యేష్ఠ, చిత్త, విశాఖ, పూర్వాత్రయము, కృత్తిక, భరణి, మఖ, ఆర్ద్ర, ఆశ్లేష‘దారుణ’ నక్షత్రములు. స్థిర కార్యములు స్థిరనక్షత్రములందు చేయవలెను. డిప్రనక్షత్రములందు యాత్ర చేయవలెను. సౌభాగ్య కర్మలను మృదునక్షత్రములందును, ఉగ్రకార్యములను ఉగ్రనక్షత్రములందును చేయవలెను. దారుణ నక్షత్రములు భయంకర కార్యములకు ఉపయోగించును. కృత్తిక, భరణి, ఆశ్లేష, విశాఖ, మఘ, మూల, పూర్వాత్రయము ఆధోముఖ నక్ష త్రములు, వీటిలో అధోముఖ కర్మ చేయవలెను. కూపము, తటాకము, విద్యాకర్మ, చికిత్స, స్థాపనము, నౌకానిర్మాణము, కూపవిధానము, గొయ్యి తవ్వుట, మొదలగు పనులు ఈ అధోముఖనక్షత్రములందు చేయవలెను. రేవతి, అశ్విని, చిత్త, హస్త, స్వాతి, పునర్వసు, అనూరాధ, మృగశిర, జ్యేష్ఠ తిర్యజ్ము బవక్షత్రములు. వీటియందు రాజ్యాభి షేకము, గజాశ్వము లకు పట్టబంధనము, తోటవేయుట, గృహ-ప్రాసాదనిర్మాణము, ప్రాకారనిర్మాణము, క్షేత్రము, తోరణ-ధ్వజ-పతాకాదీ స్థాపనము చేయవలెను. రవివారమున ద్వాదశి, సోమవారమున ఏకాదశి, మంగళవారమున దశమి, బుధవారమున తృతీయ, గురువారమునందు షష్టి, శుక్రవారమునందు ద్వితీయ, శనివార మన సస్తమి దగ్గ యోగములు. ఇపుడు త్రిపుష్కరములు చేప్పెదను.

ద్వితీయ, ద్వాదశి, సప్తములు, రవి మంగళ శనివారములు ఇవి త్రిపుష్కరములు, విశాఖ-కృత్తికా-ఉత్తర ద్వయ-పునర్వసు-పూర్వభాద్రలు కూడ త్రిపుష్కరములు. అనగా పైన చెప్పిన వారములు, తిథులు, నక్షత్రములు కలిపినచో త్రిపుష్కరయోగము. ఈ యోగము నందు లాభము, హాని, విజయము, వృద్ధి, పుత్రజన్మ, వస్తునాళము-ఇవి త్రిగుణము లగును. అశ్విని, భరణి, ఆశ్లేష, పుష్యమి, స్వాతి, విశాఖ, శ్రవణము, పునర్వసు, దృఢవేత్రములు. ఇవి దిక్కులను చూడగలవు. వీటిలో పోయిన వస్తువు, యాత్రకు వెళ్ళిన మనుష్యుడు విశేషపుణ్యోదయముచేతనే తిరిగి వచ్చును. రెండు ఆషాఢలు, రేవతి, చిత్త, పునర్వసు ‘కేకర’ నక్షత్రములు. వీటిలో పోయిన వస్తువు ఆలస్యముగా దొరకును. కృత్తిక, మృగశిర, పూర్వాఫల్గుని, మఘ, మూం, జ్యేష్ట, అనూరాధ, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర చివీ టాక్షములు. వీటిలో పోయిన వస్తువు, యాత్రకై వెళ్ళిన వ్యక్తి కొలది ఆలస్యముగ తిరిగి వచ్చును. హస్త, ఉత్తరాభాద్ర, ఆర్ద్ర, పూర్వాషాఢ, ఆస్థానములు. వీటిలో పోయిన వస్తువు శీఘ్రముగ నే లభించును. యుద్ధ మేమియు చేయనవసర ముండదు. ఇపుడు నక్షత్రముల గండాంతమును చెప్పెదను. రేవతి చివరి నాలుగు దండములుగండములు, అశ్విని ప్రారంభము నందలి నాలుగు దండములు గండాంతర ములు. ఈ నక్షత్రముం  ఒక జాము సమయమును శుభకార్యములందు ప్రయత్న పూర్వకముగ త్యజించవలెను. అశ్లేష చివర మఘ ప్రారంభమున నాలుగేసి దండములు రెండవ గండాంతము. భైరవీ ! ఇపుడు తృతీయ గండాంతమును వినుము. జ్యేష్టా-మూలల మధ్య నున్న ఒక జాము చాల భయంకర మైనది. జీవించ నిచ్చ గలవాడు ఈ సమయమునందు ఏ శుభ కార్యము చేయరాదు. ఈ సమయమున శిశువు పుట్టినచో తలిదండ్రులు మరణింతురు.

అగ్ని మహాపురాణమునంచు నక్షత్రనిర్ణయ మను నూట ఇరువదియారవ అధ్యాయము సమాప్తము.