అగ్ని మహా పురాణము

Table of Contents

50 - అథదేవీప్రతిమా లక్షణమ్

హయగ్రీవుడు చెప్పెను : చండీదేవికి ఇరువది భుజములుండును. కుడి చేతులలో శూల-ఖడ్గ-శక్తి-చక్రపాశఖేట-ఆయుధ, అభయ-డమరు శక్తులను, ఎడమచేతులలో నాగపాశ-ఖేటక-కుఠార -అంకుశ పాశ .ఘంటా ఆయుధ-గదాదర్పణ-ముద్ధరములను ధరించియుండును. చండీదేవిప్రతిమకు వదిభుజములుకూడ ఉండవచ్చును. ఆమె పాదములక్రింద తలఖండించిన మహిషముండును. ఆ తలతెగి వేరుగా ఉండవలేమ. దాని కంఠమునుండి శూలము. హస్తమునందుగల పురుషుడు శస్త్రమునుఎత్తి మిక్కిలికోపముతో ముఖమునుండి రక్తము కక్కుచుండును. వాని కంఠమునందు మాల, వెండ్రుకలు, ఎఱ్ఱగానుండును. దేవీవాహనమైన సింహము దాని రక్తమునాస్వాదించుచుండును. ఆ మహిషాసురుని , కంఠమున పాశ మొకటి గట్టిగా బిగించియుండును. దేవి కుడికాలు సింహము పైనను, ఎడమకాలు. క్రిందనున్న మహిషాసురుని పైనను ఉండును.

ఈ చండీదేవికి మూడు నేత్రములుండును. ఈమె ఆనేక శస్త్రములను ధరించి శత్రువులను మర్ధించునది. తొమ్మిది పద్మముల రూపమున నున్న పీఠముపై దుర్గాప్రతిమపై ఈమెను పూజింపవలెను. మొదటి కమలము తొమ్మిది దళములందును, మధ్యతనున్న కర్ణికయందును ఇంద్రాది దిక్పాలులను, నవతత్త్వాత్మికలగు శక్తులతో దుర్గాదేవిని పూజింప వలెను. దుర్గాదేవి ప్రతిమకు పదునెనిమిది భుజములుండును. కుడివైపున నున్న హస్తములలో ముండ-ఖేటక-దర్పణతర్జనీ-ధనుష్-ధ్వజడమరు, చర్మపాశములను, వామభాగమున నున్న హస్తమంలో శక్తి-ముద్దరశూల-వజ్ర ఖడ్గకంకుశ బాణ-చక్ర శలాకలను ధరించి యుండును. పదునారు భుజముల దుర్గాప్రతిమకు కూడ డమరువు, తర్జని తప్ప ఈ ఆయుధములే ఉండును. రుద్రచండ, ప్రచండ, చండోగ్ర, చండనాయిక, చండ, చండవతి, చండరూప, ఆతిచండిక అనువారు ఎనమండుగురు దుర్గలు. ఈ దుర్గలను తూర్పు మొదలు ఎనిమిది దిక్కులందును స్థాపించి పూజింపవలేను. ఉగ్రచండ యను తొమ్మిదవ దుర్గను మధ్య భాగమున స్థాపించి పూజింపవలెను. రుద్రచండ మొదలగు ఎనమండుగురు దుర్గల దేహకాంతి వరుసగ గోరోచనాసదృశముగను, - ఆరుణముగను, నల్లగను, నీలముగను, తెల్లగను, ధూమముగను, పచ్చగను, తెల్లగను ఉండును. వీరందరును సింహవాహనులై మహిషాసురుని కంక,ము నుండి ఆవిర్భవించిన పురుషుడు శస్త్ర ధారియై యుండును. ఈ దుర్గాదేవులు వాని జుట్టు, తమ చేతులతో పట్టుకొని యుందురు.

ఈ నవదుర్గలుమ ఆలీడపున (కుడికాలు వెనుకకు తన్ని పెట్టి ఎడమకాలు ముందుకు వంచి నిలబడుటకు ఆలీడమని పేరు). ఈ డకలను స్థాపించి పూజించినచో పుత్రపౌత్రాభివృద్ధి కలుగును. చండికాది రూపములో పూజింపబడునది గౌరియే. హతుడికి కండి, అక్షమాల, గద, అగ్ని ధరించినచో ఆమెకే “రంభ” అని పేరు వనము నందు ఆమెకే “సిద్ద” యని పేరు. సిద్ధావస్థలో ఆమె వద్ద అగ్ని ఉండదు. లలిత కూడ గౌరియే. ఆమె స్వరూపమిట్లుండును. ఒక ఎడమచేతిలో కంఠసహితమైన ముండము (భిన్న శిరస్సు), రేండవచేతిలో దర్పణము, క్రింది కుడి చేతిలో ఇలాంజలి, పైచేతిలో సౌభాగ్యముద్ర ఉండును. లక్ష్మి కుడిచేతిలో కమలన. ఎడమచేతిలో మారేడు పండు ఉండును. సరస్వతి రెండు చేతులలో పుస్తకము, అక్షమాల ఉండును. మిగిలిన రెండు చేతులలో వీణ ఉండును. గంగాదేవి తెల్లని దేహచ్చాయతో మకరారూఢయై. ఒక హస్తమాన కలశమును, మరియొక హస్తమున కమలమును ధరించి యుండును. యమునాదేవి శ్యామవర్ణ. రెండు హస్తములందును కలశములు ధరించి తాబేలుపై నిలచి యుండును. తుంబురుని ప్రతిమ వీణా సహితముగ నుండవలెను. ఆతని శరీరకాంతి తెల్లగా నుండును. శంకరుడు శూలపాణి, వృషభము నెక్కి మాతృకలముందు వెళ్ళుచుండును. బ్రహ్మపత్నియైన సావిత్రి గౌరవర్ణమంగలది. నాలుగు ముఖములుండును. కుడి చేతులలో అక్షమాల, సుక్కు ఉండును. ఎడమ చేతులలో కుండము, ఆక్షపాత్ర ఉండును. వాహనం హంస శంకరుని పత్నియగు పార్వతి వృషభారూఢయై కుడిచేతులలో ధనుర్బాణములను, ఎడమ చేతులలో చక్రధనస్సులను ధరించి యుండును. ఎఱ్ఱని కాంతి గల కౌమారీ శ క్తి నెమలిపే ఎక్కి, రెండు చేతులందును శ క్త్యా యుధములమ ధరించి యుండును. లక్ష్మి (వైష్ణవీ శక్తి) కుడిచేతులలో చక్ర-శంఖమాలను, ఎడమ చేతులలో గదా కమలములను ధరించును. వారాహీ శ క్తి మహిషముపై ఎక్కి దండ - శంఖచక్రగదలను ధరించును. ఐంద్రీశ క్తి సహస్ర నేత్రములు గలది. ఐరావతమపై ఎక్కి వజ్రము ధరించి యుండును. ఐంద్రీదేవి పూజ వలన కార్యసిద్ధి లభించును. చాముండ కండ్లు చెట్టు తోఱలవలె లోతుగా ఉండును, శరీరము మాంసరహితమై అస్థి పంజర మువలె నుండును. నేత్రములు మూడు, మాంసహీనమగు శరీరమునందు అస్థులు మాత్రమే సారముగ మిగిలియుండును. జుట్టు పైకి లేచి ఉండును. అణగి ఉండదు. ఏనుగు. చర్మమును ధరించును. ఎడమ చేతులలో కపాలము, పట్టికము, కుడి చేతులలో శూలము, ఖడ్గము ఉండును. శవముపై ఎక్కి ఎముక ఆ ఆభరణములు ధరించును.

వినాయకుని ఆకారము “మనుష్యా కారసదృశముగా నుండును. పొట్ట చాల పెద్దది. ముఖము ఏనుగల ముఖము; తొండము చాల పొడవుగా నుండును. యజ్ఞోపవీతము - ధరించి యుండును. ముఖము వెడల్పు ఏడుకళలు. తొండము పొడవు ముప్పదియారు అంగుళములు, నాడి (కంఠముపై నున్న ఎముక) విస్తారము పండ్రెండు కళలు, మెడ ఒకటిన్నర . కళల ఎత్తు ఉండును. . కంఠప్రదేశము విస్తారము ముప్పదియారు అంగుళములు. గుహ్య ప్రదేశము - ఒకటిన్నర అంగుళములు.. నాభిఊరువుల విస్తారము పండ్రెండు అంగుళములు, కాళ్లు, పాదాల ప్రమాణము కూడ ఇంతయే. కుడి చేతులలో తన. దంతమును, పరశువును, ఎడమచేతులలో లడ్డు, నల్లకలువ ధరించి యుండును.

మయూరారూఢుడై ఉన్న కుమారస్వామికి ఇరువైపుల సుముఖీ, బిడాలాక్షి అనుమాతృకలును, శాఖ విశాఖులను అనుజులును నిలచి యుందురు. రెండు హస్తములు, జలరూపము, కుడి చేతిలో శక్తి, ఎడమ చేతిలో కోడి ఉండును. ముఖములు ఒకటి కాని, ఆరు కాని నిర్మింపవచ్చును. గ్రామములోని విగ్రహమునకు ఆరు లేదా పండ్రెండు హస్తములుండవలెను. వనము నందు స్థాపించు విగ్రహమున మాత్రము రెండు - భుజములే ఉండవలెను. ఆరు కుడి భుజములలో శక్తి బాణ-పాశ -బద్ధ-గదా తర్జనీ ముద్రలును, ఎడమ చేతులలో నెమలి పింఛము, ధనస్సు, ఖేటము, - పతాక, అభయముద్ర, కుక్కుటము ఉండవలెను. రుద్రచర్చిక గజచర్మధరించి ఎడమ చేతిలో కపాలము, కర్తరి ధరించి, కుడి చేతిలో శూల - పాశములను ధరించి, ముఖమును, ఒక పాదమును ఎత్తి ఉండును. ఈ దేవి ఆష్ట భుజారూపమున గూడ పూజింపబడును.

ముండమాలను డమరువును ధరించినపుడు ఆమెయే ‘రుద్రదాముండ” ఆని చెప్పబడును. ఈమె నాట్యము చేయును. అందుచే ‘నాట్యేశ్వరి’ అని కూడ ఈమెకు పేరు, ఈమె నాలుగు ముఖములతో ఆసనముపై కూర్చున్నప్పుడు “చతుర్ముఖీ మహాలక్ష్మీ” (మహాలక్ష్మి యొక్క తామస మూర్తి) అని చెప్పబడును. ఈమె తన చేతులలో నున్న నరులను గుజములను, దున్న లను, ఏనుగులను తినుచుండును. సిద్ద చాముండకు పది భుజములు, మూడు నేత్రములు ఉండును. కుడి చేతుల లో శస్త్రమును, ఖడ్గమును, మూడు డమరువులను ధరించును, ఎడమ చేతులలో ఘంట, ఖేటకము, మంచపు కోడు, త్రిశూలము, (డాలు) ధరించి యుండును, సిద్ద యోగీశ్వరీ దేవి సంపూర్ణ సిద్దినిచ్చును, ఈ దేవికి స్వరూపమైన మరి యొక శక్తి యున్నది. ఈమె శరీరకాంతి ఎఱ్ఱగా నుండును. పాశాంకుశములను ధరించిన ఈమెకు 'భైరవి'' అని పేరు. రూప విద్యాదేవికి పండ్రెండు భుజములుండును. ఈ దేవులందరును శ్మశానములో ఆవిర్భవింతురు. భయంకర ముగ నుందురు, ఈ ఎనమండుగురు దేవులకును (రుద్ర, చండ, ఆష్టభుజ లేదా రుద్ర చాముండ, సిద్దయోగీశ్వరి భైరవి, రూపవిద్య) అంబాష్టకము అని పేరు. క్షమాదేవి చుట్టు ఆడ నక్కలుండును. వృద్ద శ్రీరూపములో నున్న ఆమెకు రెండు హస్తములుండును. నోరు తెరచి ఉండును, పండ్లు ఎత్తుగా ఉండును, మోకాళ్ళు చేయి ఆనుకొని భూమి పై కూర్చుండును. ఈమె ఉపాసకులకు కల్యాణ ప్రదాయిని, యక్షిణిలు కండ్లు తెరచికొని (మూయకుండ చూచుచు) ఉందురు. అప్సరసలు సర్వదా సౌందర్యవతులు, వీళ్ళ కండ్లు పచ్చగా ఉండును.

నందీశ్వరునకు ఒక చేతిలో అక్షమాల, రెండవ చేతిలో త్రిశూలము ఉండును. మహాకాలుని చేతిలో కత్తి, రెండవ చేతిలో ఖండితమైన సిరస్సు, మూడవ చేతిలో శూలము, నాల్గవ చేతిలో ఖేడము ఉండవలెను. కృశమైన శరీరము గల భృంగి నృత్యముద్రలో నుండును. ఈతని శిరస్సు కూష్మాండమువలె స్థూలమై బట్టతలయై ఉండును. వీరభద్రుడు మొదలగు గణములకు ఏనుగులు, గోవుల వంటి చెవులు ముఖములు ఉండును. ఘంటాకర్ణునకు పదునెనిమిది భుజము లుండును. ఆతడు పాపములను, రోగములను నశింపచేయును. ఎడమ ప్రక్కన నున్న ఎనిమిది చేతులలో వజ్రం ఖడ్గ - దండ - చక్ర - బాణ - ముసల - అంకుశ - ముద్గరములను, కుడి ప్రక్కనున్న ఎనిమిది చేతులలో తర్జనీ - ఖేట - శక్తి - ముండ - పాశ - ధనుస్ - మంటా - కుఠారములను ధరించును. మిగిలిన రెండు చేతులతో త్రిశూలమును పట్టుకోని యుండును. ఘంటామాలచే అలంకృతుడగు మంటా కర్ణుడు విస్పోటకమును నివారించును.

ఆగ్నేయ మహాపురాణమునందు దేవి ప్రతీమాలక్షణమను ఏబదియవ అధ్యాయము సమాప్తము.