అగ్ని మహా పురాణము

Table of Contents

255 - పునర్వ్యవహారే దివ్యప్రమాణం

అగ్ని రువాచః

అగ్ని దేవుడు చెప్పెను : తపస్వులు, కులీనులు, దానశీలులు, సత్యవాదులు, కోమలహృద యులు, ధర్మాత్ముల పుత్రయుక్తులు, ధనవంతులు, పంచయజ్ఞములు చేయువారు, ఆయిన ఐదుగురు గాని, ముగ్గురుగాని సాములుండవలెను. వారు జాతివర్ణానుసారముగ ఉండవలెను. లేదా ఆందరికిని అందరును ఉండవచ్చును. స్త్రీలు, బాలకులు, వృద్ధులు, జూదరులు, మత్తులో ఉన్న వారు, ఉన్మత్తులు, పాలకులు, నటులు, పాషండులు, వంచకులు, వికలమైన ఇంద్రియములు కలవారు, పతితులు, ఆప్తులు, అర్థ సంబంధముక లవారు, సహాయకులు, శత్రువులు, చోరులు, సాహసవంతులు, దోమలుగా పరిగణింప బడినవారు, బంధ్వాది పరిత్యక్తులు సాక్షులుగా ఉండుటకు అర్హులుకారు. వాటి ప్రతివాదులు ఇరువురును అంగీకరించినచో ధర్మవేత్తయగు ఒక్కవ్య క్రియే సాక్షిగా ఉండవచ్చును. స్త్రీని బలాత్కరించుట, దొంగతనము చేయుట, ఎవరైన నిందించుట కఠిన దండవము వేయు, మొదలగు దుస్సాహసకార్యములందు అందరిని సాక్షులుగా గ్రహింపవచ్చును.

సాక్ష్యము చెప్పని వానిచే రాజు నలుబది ఆటవరోజున పదవవంతు అధికముగా కలిపి ఋణమును ధనికునకు ఇప్పించవలెను. తెలిసి కూడ సాక్ష్యము చెప్పని నరాధమునకు అసత్యముగా సాక్ష్యము చెప్పిన వానికి వచ్చు పాపము వచ్చును. ఆతనిని కూడ సాక్షిని శిక్షించునట్లు శిక్షించవలెను. "పాపములు చేసిన వారికిని, మహాపాతకములు చేసిన వారికిని. గృహదాహము చేసిన వారికిని, స్త్రీబాలఘాతుకులకును ఏలోకములు వచ్చునో కూటసాక్ష్యము చెప్పినవానికి కూడ ఆలోకములే ప్రాప్తించును. నీవు ఆసత్యముగా సాక్ష్యముచెప్పి ఎవరిని పరాభవింపచూచుచున్నావో వానికి నీవు నూరు జన్మములలో చేసిన పుణ్యములన్నియు చేరిపోవును" అని వారి ప్రతివాదుల సమీపమునందున్న సాక్షులకు చెప్పవలెను. చాలమందితో అభిప్రాయభేదము వచ్చినప్పుడు గుణవంతుల సాక్ష్యమును అంగీకరించ వలెను. గుణవంతుల మధ్యభేదమువచ్చి తపుడు ఆధిక గుణవంతుల సాక్ష్యమును గ్రహించవలేను. సాక్షులు ఎవనిమాటను సమర్థింతురో ఆతనికి జయము కలుగును. వ్యతిరేకముగా ఇచ్చినచో ఆతడు పరాజయము పొందును.

మొదట కొందరు సాక్షులు సాక్ష్యము చెప్పినను తరువాత ఆధిక గుణవంతులు కొందరు గాని రెట్టింపు సంఖ్య కల వారుగాని మరొక విధముగా సాక్ష్యము చెప్పినచో పూర్వము సాక్ష్యము చెప్పినవారు కూటసాక్షు గుదురు. కూటసాకులను ఒక్కొక్కరిని వివాదాస్పదమైన ధనముకంటే రెట్టింపు ధనము దండించవలెను. కూటసాక్షి రాహ్మణుడై నచో ఆతనిని దేశ మునుండి వెడలగొట్టవలెను. ఇతరులు చెప్పిన సాక్ష్యమును కప్పిపుచ్చిన వానినుండి ఎనిమిది రెట్ల ధసమును దండముగా గ్రహించవలెను. బ్రాహ్మణుడైనచో దేశమునుండి బహిష్కరించవలెను. వర్ణ ముల వారికివధ ప్రాప్తిచు సందర్భమునందు సాక్షి అసత్యముకూడ చెప్పవచ్చును. ధనికుడును, అధమర్ణుడును (ఋణమును తీసుకున్నవాడు) పరస్పరాంగీకార పూర్వకముగా ఋణము తీసికొనిన ధనమును గూర్చి సాకులతో పతము పై వ్రాయించుకొనవలెను. ఆ పత్రముపై సంవత్సరము, మాసము, పక్షము, దినము, పేరు, జాతి, వారిగోత్రము, వారిమిత్రులు బంధువులు, తండ్రులు, మొదలగువారి పేర్లు కూడ వ్రాయవలెను. వ్రాయుట పూర్తియగు పిమ్మట ఋణగ్రహీత అముకుని (ఫలానావారి) పుత్రుడనైన నాకు ఈ పత్రముపై వ్రాసినది ఆంగీ కార్యమే. అని చేవ్రాలు చేయవలయును. సాక్షులందరును ఆముకుడ నైన నేను దీనికి సాక్షిని, యని తమతమ తండ్రుల పేరు కూడ నిర్దేశించుచు హస్తాక్షరములు ఉంచ వలెను ఆధమర్థుడు లిపిజ్ఞానములేని వాడైనచో అతడు అందరి సాక్షుల యెదుట తనమతమును వ్రాయించవలెను. సాక్షి అందరి సాక్షుల యెదుట ఆముకుడి కుమారుడనైన నేను ఇరువురును కోరగా వ్రాయుచున్నాను. అని ప్రారంభించి లేఖకార్థమును వ్రాయవలెను. స్వహస్తలిఖితమైన లేఖ్యమ సాక్షులు లేక పోయినను ప్రమాణమే. కాని బలాత్కారముచేత గాని, మోసము చేతగాని, వ్రాయించబడినది ప్రమాణము కాదు. లేఖ్యపూర్వకమైన ఋణమును మూడు తరములవరకును చెల్లించవలసియుండును. తాకట్టు పెట్టిన వస్తువును దాని పై తీసుకోనిన ఋణము తీర్చనంత వరకు ధనికుడు అనుభవించవచ్చును. లేఖ్యము వ్రాసిన వాడు దేశాంతర మునందున్నను లేఖ్యము నష్టమైనను తుడిచివేయబడినను, హరింపబడినను భిన్నమైనను ఛిన్నమైనను దగ్గ మైనను మరొక లేఖ్యమును వ్రాయించవలెను. లేఖ్యము సందిగ్ధముగా నున్న పుడు మరల మరొక లేఖ్యము వ్రాయవలెను. లేఖ్యమునకు శుద్ధి, యుక్తిప్రాప్తిచేతను (ఆదేశ కాలములలో ఆతనివద్ద ఇంతధనము ఉండుటకు అవకాశమున్నది అని యుక్తి చేతను) క్రియ (సాకులహస్తాక్షరములు) చేతను చిహ్నముల చేతను (ప్రత్యేకముగా ఉపయోగించిన గుర్తులు) ధనిక ఋణశ్రీమదగ్ని మహాపురాణము గ్రహీతల సంబంధము చేతను వారిధనప్రాప్తి సంభావ్యమే అను ఆగమము చేతను, నిర్ణయింపబడును. ఋణములోని కొంత ధనము చెల్లించినపుడెల్ల ధనికుడు అలేఖ్యము వెనుక వైపున చెల్లించిన ధనమును వ్రాసి హస్తాక్షరములు వుంచవలెను. ఋణము పూర్తిగ చెల్లించివేసినపుడు అలేఖ్యమును చింపివై చి చెల్లించినట్లుగా ధనికుడి నుండి పత్రమును పొందవలెను. సాక్షులున్నపుడు తీసుకున్న ఋణమును వారి యెదుటనే చెల్లించవలెను.

ధర్మశాస్త్రములలో సందిగ్ధమైన విషయమును నిర్ణయించుటకై తుల, ఆగ్ని, జలము, విషము, కోశము అను ఐదు దివ్య ప్రమాణములు చెప్పబడినవి. ఆభియోగము చాల తీవ్రమైనపుడున్న ఆభియోక వ్యవహారము చివరనున్నపుడును వీటిని ప్రయోగించవలెను. వాది ప్రతివాదులు అంగీకరించి ఈ దివ్యప్రమాణ ప్రయోగమునకు సిద్దముకావలెను. లేదా ఇతరములగు శారీరక ఆర్థిక దండములకు సిద్ధము కావలెను. రాజద్రోహము, మహాపాతకము, మొదలగు విషయములందు సందేహము కలిగినపుడు శీర్షక స్థితి (వివాదము చరమావస్థ రాకున్నను ఈ దివ్యమును స్వీకరించవచ్చును. వెయ్యి పణములకు తక్కువైన ఆభియోగమునందు తులా-విష దివ్యములను ప్రయోగించకూడదు. కాని రాజద్రోహ మహా పాతకమునందు వీటిని గ్రహించవచ్చును. అభియోగ ము వేయిపణములకొరకు అయినచో తుల మొదలగు మూడు ప్రమాణములను ప్రయోగించవచ్చును. అంతకు తక్కువే నన కోశమును ప్రయోగించ వచ్చును. శపథము చేసినవాడు శుద్ధుడుయని (నిర్దోషి) నిర్ణయమైనచో రెండవవానిచే అతనికి యేబది పణములు ఇప్పించవలెను. దోషియైనచో దండించవలెను. పరీక్షింపదగిన వానిచే మొదటిరోజున ఉపవాసము చేయించి మరునాడు సూర్యోదయ సమయమున వస్త్ర సహితముగా స్నానము చేయించి రాజబ్రాహ్మణ సముఖమన దివ్య ప్రమాణము చేయించవలెను. శ్రీ, బాలకులు, వృద్ధులు, అంధులు, కుంటివారు, బ్రాహ్మణులు, రోగములతో బాధపడుతున్నవారు ఇట్టి అపరాధులచే తులా దివ్యప్రమాణము మాత్రమే చేయించ వలేవు. ద్రనకు అగ్ని కాని, ముకాని, విషయముయొక్క ఏడుయవలుకొని దివ్యప్రమాణములుగా విధింపబడినవి. తూచుటయందు నేర్చుకలవారు ఆభియుక్తుని (దోషి) తులలో (కాంటాలో) ఒకవైపునవుంచి మరొక వైపున ప్రతిమానము (సమమైన మరొక పదార్థమును) వుంచి ఒక రేఖ గీసి క్రిందికి దింపవలెను. ఆతడు ఈ క్రింది వాక్యమును చదువుచు తులను ఆభిమంత్రించవలెను. "సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, రూమి, జలము, హృదయము, యముడు, పగలు, రాత్రి, రెండు సంధ్యలు, ధర్మదేవత, వీరందరును మానవుని వృత్తము తెలుసుకొనగలరు. ఓతులా! నీవు పునర్వ్యవహారే దివ్య ప్రమాణమ్ సత్యమునకు స్థానముగా పూర్వము దేవతలచే నిర్మింపబడితివి. ఓకల్యాణీ! సత్యమునే చెప్పుము. నన్ను సంకయము నుండి విడిపించుము. ఓతల్లీ! నేను పాపము చేసియున్నచో నన్ను కిందికి దింపుము. శుద్ధుడనైనచో నన్ను పైకి లేపుము.

అభియుక్తునిచే చేతులలో ధాన్యమును నలిపిచి చేతులకు రంగుపూసి అతని చేతులలో ఏడు అశ్వత్థ పత్రములను దారముతో కట్టవలెను. అతనిచే “ఓఅగ్ని దేవా! నీవే సర్వభూతములలోపల సాక్షి వై సంచరించుచున్నావు. నీవు నా పుణ్యపాపములనుగూర్చి సత్యముగా చెప్పుము." అని చెప్పించి గోళాకారములోనున్న యేబది ప ముల లోహపిండమును ఎఱగా కాల్చి ఆతని చేతులలో వుంచవలేను. ఆతడు దానిని గ్రహించి మెల్లగా ఏడు మండలములు నడువవలెను. మండలము అనగా పదహారు అంగుళముల దూరము. అక్కడ అగ్నిని విడిచిపెట్టి మరల చేతులతో ధాన్యమును నలిపి చేతులు కాలకుండ వున్నచో అతడు శుద్దుడు.. ఆ అయఃపిండము మధ్యలో పడిపోయినను ఏదైన సందేహము కలిగినను మరల ఆతడు ఆ పిండమును తీసుకొనివెళ్లవలేను. “ఓ వరుణదేవా! నీవు పవిత్రులలో పవిత్రుడవు. ఓ పావనా! శోధింపద గిన నన్ను శోధించుము. ఆభిశస్తుడనైన నన్ను సత్యముచే రక్షింపుము" యని జలమును అభిమంత్రించి బొడ్డు లోతు నీటిలో నిలబడివున్న పురుషుని కాళ్లు పట్టుకొని అభియుక్తుడు జలములో ప్రవేశించవలయును. అదే సమయమున ఒకడు బాణము విడువగా వేగవంతుడు మరొకడు ఆ బాణమును తిరిగి తీసుకొనివచ్చునంతవరకు అతడు (ఆభియుక్తుడు) నీటిలో మునిగియున్నచో శద్ధుడగును (నిర్దోషి). "ఓ విషమా! నీవు బ్రహ్మ పుత్రుడవు సత్యధర్మమునందు నిలచియున్నావు నన్ను ఈ ఆభిశాపము (దోషారోపణము) నుండి రక్షించుము. సత్యముచే నీవు నాకు అమృతము అగుము" అని పలికి అభియుక్తుడు హిమాలయ పర్వతమునందు పుట్టిన శార్జ విషమును భక్షించవలయును. అతడు విష వేగము ఏమియులేక దానిని జీర్ణించుకొన్నచో ఆతడు శుద్దుడు యని నిర్ణయింపవలయును. న్యాయాధికారి ఉగ్రదేవతలను పూజించి వారి అభి షేకోదకమును తీసుకొనివచ్చి అభియుక్తునకు ఆ విషయమును చెప్పి వారిచే చారడేసి చొప్పున మూడు మారులు త్రాగించవలయును పదునాలుగు దినములలోపుగా అతనికి రాజువలనకాని దైవమువలకాని ఘోరమైన వ్యసనము కలుగకొన్నచో ఆతడు నిస్సందేహముగా శుద్దుడు. అధిక మూల్యములగు వస్తువుల విషయమున అభియోగమునందు స్వల్పసంశయము కలిగినపుడు సత్యము వాహనములు శస్త్రములు గోవులు బీజములు సువర్ణము దేవతలు గురుచరణములు ఇష్టాపర్తములు మొదలగు పుణ్య కార్యములు వీటిపై శపథము చేయించవలయును.

అగ్ని మహాపురాణమునందు వ్యవహారకాండమున దివ్యములు అను రెండువందల యేబది ఐదవ అధ్యాయము సమాప్తము.