అగ్ని మహా పురాణము
212 - ఆథ కామ్య - మేరుదానవర్ణనమ్
అగ్ని రువాచః -
వసిష్టా! ఇపుడు సమస్తమనోరథములన తీర్చు కామ్యదానములను గూర్చి చెప్పెదను. ప్రతిమాసమునందును పూజ చేయుచు ఒక దినమున విశేషపూజ చేయుదురు. దీనికి ‘కామ్యపూజనము. అని పేరు. సంవత్సరము పూర్తి యైన పిమ్మట గురుపూజనము, మహాపూజనము చేసి ప్రతసమాప్తి చేయవలెను. మార్గశిరమాసమునందు శివపూజ చేసి పిష్ట నిర్మిత మగు ఆశ్వమును కమలమును దానము చేయువాడు చిరకాలము సూర్యలోకములో నివసించును. పౌషమాసము పిష్టగజదానము చేసినవాడు ఇరువదియొక్క తరములవారిని ఉద్దరించును. మామమున పిష్టమయరథాశ్వదానము చేసినవాడు నరకము చూడడు. ఫాల్గునమున పిష్టమయవృషభ దానము చేసినవాడు స్వర్గము చేరి రెండవ జన్మమున రాజ్యము పొందును. చైత్రమాసమునందు, చాసీదాసయుక్తము, గుడముతో నిండినది యగు గృహము దానము చేసినవాడు చిరకాలము స్వర్గమున నివసించి పిదప రాజగును. వైశాఖమున సప్తధాన్యదానము చేసినవాడు శివసాయుజ్యము పొందును. జ్యేష్ఠాషాఢముందు అన్న బలి ఇచ్చువాడు శివస్వరూపు డగును. శ్రావణము నందు పుష్పరథదానము చేసినవాడు స్వర్గమునందు సుఖము లనుథ వించి, రెండవ జన్మమున రాజ్యమును పొందును. రెండు వందల ఫలములు దానము చేయువాడు సంపూర్ణకులమును ఉద్దరించి రాజ్యపదమును పొందును. భాద్రపదమున ధూపదానము చేయువాడు స్వర్గము చేరి రెండవ జన్మమున రాజ్యము పొందును. ఆశ్వయుజమాసమున దుగ్ధ - ఘృతపూర్ణపాత్ర దానము చేసిన వాడు స్వర్గమును పొందును. కార్తికమున గుడము, పంచదార, ఘృతము దాము చేసి వాడు స్వర్గమున నివసించి జన్మాంతరము నందు రాజగును.
ఇపుడు భుక్తిముక్తిప్రదము లగు పండ్రెండు విధము లైన మేరుదానములను గూర్చి చెప్పెదను. కార్తీక పూర్ణిమ నాడు మేరువ్రతము చేసి బ్రాహ్మణునకు ‘రత్న మేరువు’ దానము చేయవలెను. ఇపుడు అన్ని మేరువుల ప్రమాణము వినుము. వజ్రములు, మాణిక్యములు, నీలమణులు, వైడూర్యములు. స్ఫటికి ములు, పుష్పరాగముసు, మరకతములు, ముత్యములు వీటిని ఒక్కొక్కప్రస్థము చొప్పున ఇచ్చినచో ఉత్తమము, ఇందులో సగ మైనచో మధ్యమము, మధ్యమములో సగము అధమము. రత్న మేరుదానము చేయువాడు పిసినారితనము వీడవలెను. ద్వాదశదల కమలము నిర్మించి దాని కర్ణిక పై మేరువును స్థాపించవలెను. దీనికి దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మేరువునకు తూర్పున మూడు దళము లుండును. వాటి పై వరుసగ మాల్యవల్ - భద్రాశ్వ - ఋష, పర్వతములను పూజించవలెను. మేరువుకు దక్షిణమునందున్న దళములపై నిషధ హేమకూట - హిమవత్పర్వతములను పూజించవలెను. మేరువునకు ఉత్తరమునం దున్న దలముల పై వరుసగ నీల - శ్వేత - శృంగులను పూజించవలెను. పశ్చిమగలములపై గంధమాదన - వైకంక - కేతుమాలములను పూజించవలెను. ఈ విధముగ పండెండు పర్వతములతో గూడిన మేరుపర్వతమును పూజించవలెను. ఉపవాస ముండి స్నానము చేసి, విష్ణువును, శివుని పూజించవలెను. భగవంతుని ఎదుట మేరువును పూజించి మంత్రోచ్చారణపూర్వకముగ ఆ బ్రాహ్మణునకు దానము చేయవలెను. దానసంకల్పము చేయునపుడు దేశ కాలమును ఉచ్చరించి “ఈ ద్రవ్యముతో నిర్మించినదియు శ్రీమహావిష్ణువు దేవతగా కలదియు అగు ఈ మేరువును ఈగోత్రము గల బ్రాహ్మణునకు దానము చేయుచున్నాను. ఈ దానముచే నా ఆంతఃకరణము శుద్దమగు గాక. నాకు ఉత్త మము లగు భోగములును, మోక్షము సంప్రాప్తించు గాక” అని చెప్పవలెను. ఈ విధముగ దానము చేసినవాడు తన సమస్తకులమును ఉద్ధరించి, దేవతలచే సంమానితుడై . విమానము పై కూర్చుండి ఇంద్రలోక - బ్రహ్మలోక - శివలోక శ్రీవై కుంఠములందు విహరించును. సంక్రాంత్యాది పుణ్యకాలములందు మేరుదానము చేయవలెను; చేయించవలెను.
ఒక వెయ్యి పలముల బంగారముతో మహామేరువును నిర్మించవలెను. దానికి మూడు శిఖర ములుండును. వాటిపై బ్రహ్మ విష్ణు మహేశ్వరులను స్థాపించవలెను. మేరు పర్వతము ప్రక్కల నుండు పర్వతములు నూరేసి పలముల సువర్ణముతో నిర్మించవలెను. మేరుపర్వతముతో పదమూడు పర్వతము లుండును. ఉత్తరాయణ సంక్రాంతినాడు గాని, సూర్యచంద్రగ్రహణములందు గాని మేరువును విష్ణుప్రతిమకు ఎదురుగా స్థాపించ వలెను. శ్రీ మహావిష్ణువును. ఆ మేరు వును పూజించి బ్రాహ్మణునకు దానము చేయవలెను. ఇట్లు చేసిన వాడు చిర కాలము విష్ణులోకములో నుండును. పండ్రెండ పర్వతములతో కూడిన రజత మేరువును సంకల్పపూర్వకముగ దానము చేయువాడు. భూమిమీద ఎన్ని పరమాణువులున్నవో అన్ని సంవత్సరములు రాజ్యము ననుభవించును. పైన చెప్పిన ఫలమును కూడ అనుభవించును. శ్రీమహావిష్ణువును, బ్రాహ్మణుని పూజించి భూమి మేరువును దానము చేయవలెను. ఒక నగరమునందలి లేదా జనపదమునందలి లేదా గ్రామము నందలి ఎనిమిదవ అంశముచే భూమిమేరు వును కల్పించి మిగిలిన అంశముచే పండ్రెండు అంశములను కల్పించవలెను, భూమిమేరు దానమువలన గూడ పూర్వోక్తఫలము లభించును. ఏనుగులతో పండ్రెండు పర్వతములతో గూడిన మేరువును నిర్మించి ముగ్గురు పురుషులతో కూడ ఆ హస్తిమేరువును దానము చేయవలెను. అట్లు చేసిన వానికి అక్షయఫలము లభించును. పదునైదు అశ్వములతో ఆశ్వమేరువు ఏర్పడును. పండ్రెండు పర్వతముల స్థానములందు పండ్రెండు అశ్వము లుంచవలెను. శ్రీ మహావిష్ణ్వాది దేవతల పూజ చేసినపిమ్మట ఈ ఆశ్వమేరుదానము చేసినవాడు ఈ జన్మమున వివిధభోగములను అనుభవించి మరుజన్మమున రాజగును. అశ్వమేరువు విషయమున చెప్పిన విధముననే గోమేరు దానము కూడ చేయవలెను. ఒక పుట్టి బరువు గల పట్టువస్త్రములతో ‘వస్త్రమేరువు’ ఆగును. దానిని మధ్యయం దుంచి పండ్రెండు వస్త్రములను ఉంచవలేను. దీనిని దానము చేసినవావికి అక్షయఫలము లభించును. ఐదువేల పలముల మృ తముతో ఘృతపర్వత మగును. దీని ప్రక్క నున్న పర్వతములు ఒక్కొక్కటి ఐదు వందల పలము ఘృతముతో నిర్మింపబడును. ఈ ఘృతపర్వతముపై శ్రీ మహా విష్ణువును పూనించి తత్సంముఖమున బ్రాహ్మణునకు దానము చేసినవాడు ఈ లోకమునందు సుఖము పొంది విష్ణులోకము చేరును. ఇట్లే ఖండ (పటిక బెల్లము) మేరువు నిర్మించి దానము చేసినవానికి పూర్వోక్తఫలము లభించును.
ఐదు పుట్ల ధాన్యముతో ధాన్యమేరువును, ఒక్కొక్క పుట్టెడు ధాన్యముతో మిగిలిన పండ్రెండు పర్వతములను నిర్మించి, వాటి అన్నింటి పైన మూడేసి స్వర్ణమయ శిఖరములు ఏర్పరచి, అన్నింటి పైనను బ్రహ్మ విష్ణుమహేశ్వరులను పూజించవలెను. శ్రీ మహావిష్ణువునకు విశేషపూజ చేయవలెను. దీనివలన అక్షయఫలము లభించును. ఈ ప్రమాణము చేతనే తెలమేరువును, దశాంశ ప్రమాణము చేతనే అన్యపర్వతములను నిర్మించి, వాటికి వెనుక చెప్పిన విధముగ శిఖరములు నిర్మించి, దానము చేసినవాడు బంధుసహితుడై విష్ణులోకమునకు వెళ్లును - “విష్ణుస్వరూపమగు తిలమేరువుకు నమస్కారము. బ్రహ్మ విష్ణుమహేశ్వరులు దేని శిఖరములో, ఏది పృథ్వీనాభియం దున్నదో, ఏది ప్రక్క నున్న పండ్రెండు పర్వతములకు ప్రభువో అట్టి సమ స్తపాపహరము, శాంతిమయము, విష్ణుభక్తి యుక్తము ఆగు తిలమేరువునకు నమస్కారము. అదే నన్ను రక్షించుగాక. నేను పాపరహితుడ నే పితరులతో గూడ శ్రీ మహావిష్ణుసన్నిధి చేరగలను. “ఓం నమః”. నీవు విష్ణుస్వరూప మైనదానవు. విష్ణుసంముఖమునందు, విష్ణుస్వరూపు డగు బ్రాహ్మణునకు, భక్తిపూర్వకముగ, భోగ మోక్ష ప్రాప్తికై నిన్ను దానము చేయుచున్నాను” అని చెప్పుచు ఆ తిలమేరువును దానము చేయవలెను.
ఆగ్ని మహాపురాణమునందు మేరుదానవర్ణన మను రెండువందలపండ్రెండవ ఆధ్యాయము సమాప్తము.
