అగ్ని మహా పురాణము

Table of Contents

234 - అథ షాడ్గుణ్యమ్

పుష్కర ఉవాచః

పుష్కరుడు చెప్పెను : పరశురామా ! సామదానభేద దండోపాయములను గూర్చి వెనుక చెప్పబడినది. తన రాజ్యమునందు దండమును ఎట్లు ప్రయోగించవలేనో కూడ చెప్పబడినది. ఈ నాలుగు ఉపాయములను శత్రు దేశము వందేట్లు ఉపయోగించవలెనో చెప్పెదను. గుప్త ము, ప్రకాశము అని దండము రెండు విధములు. గ్రామమును మట్టిలో కలిపివేయుట, పంటకు నష్టము కలిగించుట, నిప్పు పెట్టుట - ఇవి ప్రకాశదండములు. విషము పెట్టుట, రహస్యముగా నిప్పుల అంటించుట, అనేక విధముల మనుష్యులచే చంపించుట, సత్పురుషులపై దోషారోపణము చేయుట నీరు దూషితము చేయుట - ఇవి గుప్త దండములు. భృగునందనా ! ఉపేక్షను గూర్చి వినుము – “యుద్దము చేయుటకు, నాకెవ్వరీతోను విరోధము లేదు. వ్యర్థముగా విరోధము అనర్గ మూ -ము. సంధి చేసికొన్నను ఇట్లే అగును. సామప్రయోగము చేసితిని గాని ప్రయోజనము కలుగలేదు దానముచే కేవలము ధనక్షయము కలుగును. భేదదండ ములచే గూడ ప్రయోజన మేమియు ఉండదు.” అని రోజుకు తోచినచో ఆ పేక్షను, ఆశ్రయించవలెను. “ఈతడు నాకు శత్రువైనను నాకేమియు నష్టము లేదు. ఇపుడు నేను కూడ ఆతనిని ఏమియు చేయజాలను." అనునమ్మిక కలిగినపుడు గూడ ఉపేక్షను అవలంబించవలెను. తన శత్రువును అనాదరము చేగనే తొలగించుకొనవలెను.

ఇపుడు మాయ అను ఉపాయము చెప్పెదను. అసత్యమైన ఉత్పాతములుచూపి శత్రువులలో భయాందోళనము కలిగించవలెమ. స్థూలమైన ఒక పక్షితోకకు చాల పొడవైన మండుచున్న ఉల్కను (కొరవి) కట్టి దానిని శత్రువుల గుడారము వైపుడువవలెను. దానిని చూచి శత్రువులు ఉల్కాపాతమను భ్రాంతిచెందునట్లు చేయవలెను. ఈ విధముగనే అనేక మైన ఉత్పాతములు చూపవలేను. అనేక విధములైన మాయలు చూపు మదాలను పుప్ వారిద్వారా శత్రువులలో ఉద్వేగము కలిగించవలెను. తపస్వుల చేతను, జ్యోతిష్కుల చేతను “నీకు ఆపద రానున్నదని చెప్పించవలెను. భూమిని జయించ దలచిన రాజు ఈ విధముగ ఆనేకోపాయములచే శత్రులమ భయభీతులను చేయవలెను. తనకు దేవతానుగ్రహ మున్నట్లును దేవతలు తనకు వరప్రదానము చేసినట్లును వారికి తెలియునట్లు చేయవలెను. యుద్దము ప్రారంభమైనచో తన సైనికులతో-- "వీరులారా! నిర్భయముగ పోరాడుడు, మన మిత్ర సేన వచ్చినది. శత్రువులు పారిపోవుచున్నారు" అని గర్జించి చెప్పుచు హర్షధ్వనులు చేయవలెను. "నా శత్రువు హతుడైనాడు" అని చెప్పవలెను. దేవతాదేశముచే వృద్ధిని పొందిన రాజు కవచాదులతో సన్నద్ధుడై యుద్ధ భూమిపై ప్రవేశించవలెను.

ఇపుడు ఇంద్రజాలమును గూర్చి చెప్పెదను. రాజు సమయానుసారముగ ఇంద్రజాలము ప్రదర్శించవలెను. తమ సాహాయ్యమునకై దేవతల చతురంగ సైన్యము వచ్చినట్లు శత్రువులకు చూపవలెను. శత్రుసేనపై రక్తవర్షము కురిపించి మాయచే, శత్రువుల భిన్న ములగు శిర స్సులు భవనము పైన కనబడునట్లు చేయవలెను.

ఇపుడు ఆరుగుణములను గూర్చి చెప్పెదను. సంధి - విగ్రహములు ప్రధానమైనవి. సంధి - విగ్రహ - యాన – ఆసన - ద్వైధీభావ - సుశ్రయములు ఆరు గుణములు. కొన్ని షరతులపై శత్రువుతో కలియుట 'సంధి'. యుద్దాదులచే వానికి నష్టము కలిగించుట ‘విగ్రహము’. శత్రువుపై దండెత్తి వెళ్ళుట 'యానము' విగ్రహము ప్రారంభించి తన దేశమునందే ఉండుట ‘ఆసనము'. సగము సేవతో యుద్ధమునకు వెళ్ళుట ద్వైధీభావము. ఉదాసీనుని గాని, మధ్యస్థునిగాని శరణుజొచ్చుట ‘సంశ్రయము’.

తన కంటే దుర్భలునితో కాక, తనతో సమానబలునితో, అధిక బలునితోను సంధి చేసి కొనవలెను. తాన బలవంతుడై శత్రువు దుర్బలుడై నపుడు అతనితో విగ్రహమే చేయవలెను. హీనావస్థలోనున్నను, తన పార్ష్ణి గ్రాహకుడు మంచివాడై చచో బలవంతుడగు రాజును ఆశ్రయించవలెను. యుద్ధమునకు వెళ్ళకపోయినయ శత్రుకార్యములను నశింపచేయ గల రాజు, పార్ష్ణిగ్రాహకుడు మంచివాడు కాకున్నను, విగ్రహము చూపి ఊరక కూర్చుండవలెను. లేదా పార్ష్ణిగ్రాహకుడు మంచివాడు కానప్పుడు ద్వైధీభావమును అవలంబించ వలెను. బలవంతుడగు రాజుచేతిలో పడిపోయెదమను భయమున్నపుడే సంశ్రయము అవలంబించవలెను. ఇది సామాది గుణము లన్నింటి కంటెను ఆధమమైనది. సంశ్రయమునకు తగిన పరిస్థితులలో ఉన్న రాజు యానమవలంబించినచో జనమును, ధనమును కూడ కోల్పోవును. ఎవరినై స ఆశ్రయించుటచే అధిక లాభము కలుగునను ఆశయున్నచో సంశ్రయమును అవలంబించవలెను. అన్ని విధముల శక్తి క్షీణించినపుడు మాత్రమే ఇతరులను శరణు వేడివలెను.

అగ్ని మహాపురాణమునందు షాడ్గుణ్యవర్ణనకను రెండువందల ముప్పదినాల్గవ అధ్యాయము సమాప్తము.