అగ్ని మహా పురాణము

Table of Contents

297 - ఆథ విషహృన్మంత్రౌషధమ్

అగ్ని రువాచః

అగ్ని దేవుడు పలికెను. “ఓం నమోభగవతే రుద్రాయ” మొదలు పరశుపాణయే" వరకును వున్న మూలోక్త మంత్రము “నమోభగవతే పక్షి రుద్రాయ” మొదలు "విషం ఠఠ వరకునువున్న మూలో మౌ మంత్రము చేతను సర్ప దష్టుని అభి మంత్రించినచో వాని విషము తొలగిపోవును. "ఓం నమోభగవతే రుద్ర" మొదలు "ద్రౌం హ్రీం – ఠః" వరకును వున్న మూలోక మంత్రమును జపించి మంత్ర సిద్ధిపొందిన వాడు నిత్యము సర్పములను బంధించగలడు. ఒక రెండు మూడు, నాలుగు టీజములుకలదియు కృష్ణ చక్రముచే ఆంగ పంచకముగల గోపీజనవల్లభాయ స్వాహాయను మంత్ర మును స్వూరసాధకము. 'ఓం నమోభగవతే రుద్రాయ" మొదలు "జాపయతి ఠఠ" వరకును వున్న మూలోక్త మంత్రమునకు పాతాళ క్షోభ మంత్రమని పేరు. ఈ మంత్రముతో అభిమంత్రించినచో విషము తొలగిపోవును. సర్పము కాటువేసినపుడు మండుచున్న కష్టముతో గాని, కోలుకున్న ళ్లతోకాని అగ్ని జ్వాలతోగాని కోక నదముతో గాని, కర చిన స్థానమున కాల్చినచో విషము ఉపశమించును. శిరీష వృక్ష బీజములు పుష్పములు, ఆర్క క్షీరము బీజము, కటుత్ర యము వీటిని త్రాగించినను పైన పూసినను కాటుక పెట్టినను విషము నశించును. కిష పుష్పర సముతో భావనచేసిన తెల్లని మరిచము పానవశ్య, ఆంజనాది రూపమున నిచ్చినచో విషమును నశింపచేయును. సందేహములేదు. కోశాతకీ వచా హింగు శిరీష, ఆర్కక్షీర - త్రికటు మోషాఁభస్సులను నశ్యాది రూపమున విచ్చినచో విషము నశించును. రామళ ఇక్ష్వాకు సర్వాంగ ముల చూర్ణము నశ్యముగా ఇచ్చినచో విషమును తొలగించును. ఇంద్రబల, అగ్నికము ద్రోణము తులచి కవిక సహ, వీటిర సములో త్రికటు చూర్ణము కలిపితిన్నచో విషము నశించును, కృష్ణపంచమినాడు తీసుకుని వచ్చిన శరీష పంచాంగము విషనాశకము 

అగ్ని మహాపురాణమున విషహృన్మంత్రౌషధమను రెండువందల తొంబదియేడవ అధ్యాయము సమాప్తము.