అగ్ని మహా పురాణము
313 - అథ నానామంత్రాః
ఆగ్ని రువాచః-
అగ్ని దేవుడు పలికెను. ఇపుడు వినాయకార్చనను చెప్పెదను. ముందు ఆధార శక్తి ని పూజించవలెను. ఆగ్నే యాది విదిక్కులందును పూర్వాది దిక్కులందును క్రమముగ ధర్మజ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్య, అధర్మ, అజ్ఞాన ఆవైరాగ్య, ఆ నైశ్వర్యములను పూజించి కందనాల పద్మ కర్ణికా కేసరసలను సత్త్వాది గుణత్రయమును పద్మాసనమును పూజచవలేను. పిదప తీవ్రా - జ్వాలినీ - నందా - సుయశా, - కామరూపిణీ - ఉగ్రా - తేజోవతీ సత్వా - విఘ్న నాశి నీయను తొమ్మిది శక్తులను పూజించవలెను . పిదప గణేశ మూర్తిని, మూర్తి లభించనిచో ధ్యానోక్త గణపతి మూర్తి ని పూజించి హృదయాద్యంగ పూజలు చేయవలెను. పూజా ప్రయోగ వాక్యములు ఈ విధముగా నుండును. గణం జయాయ హృదయాయ నమః ఏకదశ లోయ ఉత్కటాయ శిర సే స్వాహా అచల కర్ణినే శిఖాంయై వషట్ , గజ - వక్త్రాయ హుంకట్ కవచాయ హుం, మహోదరాయ దండ హస్తాయ, ఆసోయి నట్ ఈ ఐదు అంగములలో నాల్గింటిని నాలుగు దిక్కు లందును ఐడవ దానిని మధ్యభాగమునందును పూజించవలెను. పిదప గణంజయ, గణాధిప, గణనాయక, గణేశ్వర, వక్రతుండ, ఏక దంత, ఉత్కట, లంబోదర, గజవక్త వికటాననులను పద్మ దళముల పై పూజించవలెను. మధ్యభాగము హూం విఘ్న నాశనాయ నమః మహేంద్రాయ ధూమ్ర వర్ణాయనమః యని పలికి విఘ్న నాశన ధూమ్ర వర్ణులను పూజించ వలెను. బాహ్య ప్రదేశమున విఘ్నేశ్వరుని పూజించవలెను.
ఇపుడు త్రిపురభైరవ పూజల విధిని చెప్పెదను. ఎనమండుగురు భైరవులను పూజించవలెను. ఆసితాంగభైరవ రురు, చండ, క్రోధ, ఉన్మత్త, కపాలి భీషణ సంహార భైరవులు యని వారల పేర్లు. బ్రాహ్మి మొదలగు మాతృకలను కూడ పూజించవలేను. అకారాది హ్రస్వ స్వరముల బీజమును ఆదియందుంచి భైరవుని పూజ చేయవలెను. బ్రహ్మాది మాతృ కలను ఆకారాది దీర్చాక్షరములు ఆదియందుంచి పూజించవలెను. ఆగ్నేయాది దిక్కులందు వటుకులను పూజించవలెను. సమయ పుత్రవటుక , యోగినీ పుత్రక సిద్దపుతవటుక కుల పుత్ర వటుకులు వీరి పేర్లు. పిమ్మట హేతుక, త్రిపురాంత, ఆగ్ని వేతాల అగ్ని జిహ్వ, కరాల కాలలోచన ఏకపాద భీమాక్షులను ఎనమండుగురు క్షేత్రపాలకులను పూజించి, త్రిపురాదేవి యొక్క ప్రేత రూపపద్మాసవమును పూజించవలెను. ఐం, క్షైం, ప్రేత పద్మాసనా యనమః, ఓం, హైం, హీం. అసౌః త్రిపురాయై ప్రేతపద్మాసనస్థితాయై నమః యను మంత్రముతో త్రిపురాభై రవిని పూజించవలెను. త్రిపురాదేవి వామహ స్తము లందు ఆభయ పుస్తకములను, దక్షిణ హస్తములందు వర ముద్రాజపమాలి కలమ ధరించి యుండును. బాణసమూహముతో నిండిన అంబుల పొదిని ధనుస్సుమ ధరించి యుండును. మూల మంత్రమును హృదయాది వ్యాసము చేయవలయును. గో సమూహ మధ్య మున నిలిచి శ్మశానాది వస్త్రము పై చితిలోనే బొగ్గుతో ఆష్ట దళ కమల చక్రమును వ్రాయించవలెను. శత్రువు పేరును వ్రాసి మడత పెట్టి చితా భస్మముతో శత్రు మూర్తి నిర్మించి, ఆతడు దాని యందున్నట్లు భావన చేసి పైన చెప్పిన యంత్ర మను నల్లటి దారముతో చుట్టి ఆ మూ ర్తి పొట్టలో దూర్చవలెను. అపుడు ఆ వ్యక్తి నశించును.
“ఓం నమో భగవతి జ్వాలా మాలిని గృధ్ర గణ పరివృతే స్వాహా" యను మంత్రమును జపించుచు యుద్ధము నకు వెళ్ళు వాసి జయము కలుగును. ఓం, శ్రీం, హ్రీం, క్లీం, శ్రీయై నమః యను మంత్రముతో చతుర్దళ కమల పై ఉత్తర దీక్క్రమమున గృణినీ సూర్యా, ఆదిత్యా ప్రభావతీ యను నలుగురు శ్రీ దేవులను పూజించి ఈ శ్రీ మంత్రమును జపించుటచే శ్రీ లభించును. ఈ శ్రీ దేవులందరును సువర్ణ గిరి వలె సుందర కాంతి కలవారు. ఓం హ్రీం గౌర్యై నమః యను గౌరీ మంత్రముతో జప హోమ ధ్యాన పూజలు చేసిన దానికి సమస్తము లభించును. గౌరి దేవి శరీర కాంతి అరుణము, నాలుగు భుజములు వుండును. దక్షిణహస్తము నందు పాక , వర ముద్రలను, వామ హస్తము లందు అంకుశ ఆధయ హస్తములను ధరించి యుండును. శుద్ధ చిత్తముతో గౌరీదేవిని ప్రార్థించువానికి నూరు వర్షముల ఆయుర్దాయ ముండును. చోరాది భయ ముండడు. యుద్ధ రంగమున ఈ మంత్రముతో అభిమంత్రించిన ఉదకమును త్రాగినచో వాని పై ఆధిక కోపము కలవాడు కూడ ప్రసన్ను డగును. ఈ మంత్రము తో ఆంజనము తిలకము ధరించినచో వశీకరణము సిద్ధించును. జిహ్వపై దీనిని వ్రాసి నచో కవిత్వ శ క్తి లభించును. దీని జపముచే స్త్రీ పురుషులు వశ మగుదురు. సూక్ష్మ ప్రాణులు కూడ చూడబడును. స్పర్శ మాత్రముచే మనుష్యులు వశమగుదురు. మంత్రముతో తిలలు హోమము చేసినచో సర్వ మనోరథములు సిద్ధించును. ఈ మంత్రముతో ఐదు పర్యాయములు అభిమంత్రించి ఉన్న మును భుజించు వాని యొద్ద సర్వ ధనముండును. దీని ప్రారంభ మున లక్ష్మీ బీజమును (శ్రీం) వైష్ణవ బీజమును (క్లీం) చేర్చినచో ఆది ఆర్ధనారీశ్వర మంత్ర మగును. అనంగ రూపా మదనా, అనంగ మేఖలా యను శ క్తుల నామ మంత్రములను జపించుటచే లక్ష్మీ ప్రాప్తించును. కమల దళముల పై హ్రీం, స్వరములు, కాడి వ్యంజనములు వ్రాసి మధ్య అభీష్ట స్త్రీ నామధేయము వ్రాయవలయును. షట్కోణ చక్రము పై గాని కల శముపై గాని వ్రాయవచ్చును. పిమ్మట ఆ స్త్రీని ఉద్దేశించి జపము చేసినచో వశీకరణ మగును.
“ఓం, హ్రీం, చూం నిత్య క్లిన్నే మదప్రేవే ఓం ఓం'' యషనది ఆరు అంగముల మూల మంత్రము. ఎర్రటి త్రికోణ చక్రముపై అష్ట దళ కమలమును భావించి దానిపై ద్రావిన్యాదులను పూజించవలెను. పూర్వాది దిక్కు లందు, ద్రావిణి మొదలగు నలుగురు శక్తులను ఈశానాది కోణము లందు అపర మొదలగు నాలుగు శక్తులను భావన చేసి పూజించ వలెను. ద్రావిణీ, వామజ్యేష్టా ఆహ్లాదకారిణీ, ఆపరా. క్షోభిణీ, రౌద్రీ గుణ శక్తి యనువ. ఈ శక్తుల పేర్లు. దేవిని ఈ విధమగా ధ్యానము చేయవలెను. రక్త వర్ణ ములగు వస్త్రాలంకారాదులను ధరించి రెండు హస్తములలో పాశాంకుశములను రెండు హస్తములలో కపాల కల్ప వృక్షములను, రెండు హస్తములతో వీణను ధరించి యుండును. నిత్యాథయా, మంగళా, నవ వీరా, సుమంగళా, దర్భగా మనోన్మణీ ద్రాహయను ఎనమండుగురు దేవులను మారాది దిక్కుల కమల దళముల పై పూజించ వలేను. వీటి బాహ్య భాగమున ఐదు దళములపై ఓం హ్రీం ఆవంగాయ నమః, ఓం హ్రీం, స్మరాయ నమః ఓం హ్రీం మన్మథాయ నమః ఓం హ్రీం మారాయ నమః ఓం హీం కామాయ నమః యను ఐదుగురు కామ దేవులను పూజించవలెను. వారి హస్తములలో పాశ ఆంకుశ, ధనుస్సు బాణములవున్నట్లు ధ్యానించవలేను. వీటి బాహ్య భాగమున పది దళముల పై క్రమ. మంగ రతి విరతి, ప్రీతి విప్రీతి, మతి దుర్మతి, ధృతి విధృతి, తుష్టి వితుష్టి యను కామ వల్ల థంను పూజించవలెను. “ఓం, తం నిత్య క్లి న్నే ఓం ఓం" మొదలు ఓం థఎ నిత్యక్లిన్నే మదద్రవే స్వాహా వరకును. మూలో క్షమైనది నిత్యక్లిన్నా విద్యా. సింహాసనముపై ఆధార శ క్తిని పద్మమును పూజించి దాని దళములపై హృదయాద్యంగమును స్థాపించి పూజించి మధ్యకర్ణి క పై దేవిని పూజించవలెను. ఓం హ్రీం, గౌరి, రుద్రదై తే యోగేశ్వరి హూం ఫట్ సాహా. ఇది గౌరీ మంత్రము.
ఆగ్ని మహా పురాణమున నానామంత్ర నిరూపణ మను మూడు వందల పదమూడవ అధ్యాయము సమాప్తము.
