అగ్ని మహా పురాణము

Table of Contents

186 - అథ దశమీవ్రతాని.

అగ్ని రువాచః-

అగ్ని పలికెను: ధర్మకామాదిప్రద మగు దశమీవ్రతమును చెప్పెదను. దశమినాడు ఒక్కపూట మాత్రమే భోజనము చేసి సమాప్తి యందు పది ధేనువులను దానము చేసి పది బంగారు నాణెములను దక్షిణ ఇచ్చువాడు బ్రాహ్మణాధిపతి యగును.

అగ్ని మహాపురాణమునందు దశమీవ్రతనిరూపణ మను నూట ఎనుబది యారవ అధ్యాయము సమాప్తము.