అగ్ని మహా పురాణము

Table of Contents

113 - అధ నర్మదాదిమాహాత్మ్యమ్

ఆగ్ని రువాచః-

అగ్ని దేవుడు పలికేను : ఇపుడు నర్మదాదిమాహార్మ్యమును చేప్పెదను. నర్మద శ్రేష్ట మైన తీర్థము. గంగా జలము స్పర్శచే వెంటనే పవిత్రింపచేయును. కాని నర్మద డర్శనమాత్రము చేతనే పవిత్రింపచేయును. నర్మదాతీర్థము నూరు యోజనముల పొడవు, రెండు యోజనముల వెడల్పు ఉన్నది. అమరకంటతక పర్వతము నలువైపుల నర్మదానదికి సంబంధించిన ఆరువదికోట్ల అరువదివేల తీర్థములున్నవి. కావేరీసంగమతీర్థము చాల పవిత్ర మైనది. ఇపుడు శ్రీపర్వత మాహాత్మ్యమును చెప్పెదను. ఒకమారు గౌరి శ్రీదేవిరూపమ ధరించి గొప్పతపస్సు చేసెను. దానిచే ప్రసన్ను డైన శ్రీహరి ఆమెకు వరము లిచ్చుచు ఇట్లుచేప్పెను. దేవీ! నీకు ఆధ్యాత్మజ్ఞానము లభించును. ఈ పర్వతము శ్రీపర్వతమను పేర విఖ్యాతి నొందును. దీని నలువైపుల నాలుగు వేల యోజనముల ప్రదేశము చాల పవిత్రమగును. ఇచట చేసిన దాన తపో-జవ-శ్రాద్దములు అక్షయఫలము లగును. ఈ ఉత్తమతీర్థము అన్ని యు ఇచ్చును. ఇచట మరణించువారికి శివలోక ప్రాప్తి కలుగును. ఈ పర్వతముపై శివుడు సర్వదా పార్వతితో క్రీడించుచుండును, హిరణ్యకశిపుడు ఇచటనే తపస్సు చేసి చాల బలవంతుడయ్యెను. మునులు గూడ ఇచట తపస్సు చేసి సిద్ధి పొందిరి.

అగ్ని మహాపురాణమునందు నర్మదాదిమాహాత్మ్యవర్ణన మన నూటపదమూడవ అధ్యాయము సమాప్తము.