అగ్ని మహా పురాణము

Table of Contents

105 - అథ నగరాధివాస్తునిరూపణమ్.

ఈశ్వర ఉవాచః-

పరమేశ్వరుడు పలికెను. నగర గ్రామ దుర్గాదులలో గృహప్రాసాదవృద్ధికై ఎనుబదియొక్క పదముల వాస్తు మండలము నిర్మించి, దానిపై తప్పక వాస్తుదేవతాపూజ చేయవలెను. పూర్వాభిముఖము. లగు పది రేఖలు పది నాడులకు ప్రతీకములు. యవతి, కాంతా, విశాలా ప్రాణవాహినీ, సతీ, వసుమతీ, నందా, సుభద్రా, మనోరమా అనునవి: ఆ నాడుల పేర్లు, ఉత్తరాభిముఖముగ ప్రవహించు ఇంకను పది నాడులు కూడ ఉన్నవి. వాటిచే తొమ్మిది పదములు ఎనుబదియొక - పదములుగ విఠణింపబడును. హరిణీ, సుప్రభా, లక్ష్మీ, విభూతి, విమలా, ప్రియా, ఇయా, జ్వాలా, విశోకా అని వాటి పేర్లు. సత్ర పాతము చేయగా రేఖామయములగు నాడులు అభివ్య క్తములై చింతనబిషయములగును. ఈvది దేవతలు ఎనమండుగురు చొప్పున అష్టకము లగును , ఆ అష్టకమును నాలుగు దిక్కులందును పూజించవలెను.ఈ. మున-జయశక్ర-ఆర్క-సత్య-భృశ-వ్యోమదేవతలను. (అష్టకమును) వాస్తుమండలము మీద పూర్వదిక్కున పూజించవలెను. అగ్ని-పూషన్-వితథ-సోమ-కృతాంత-గంధర్వ-భృంగ -మృగులను దేవలాష్టకమును దక్షిణమున నున్న పదములందు పూజించవలెను. పితృ, ద్వారపాల, సుగ్రీవ, పుష్పదంత, వరుణ, దైత్య, శోష,యక్ష్మ లను ఆష్టకమును పశ్చిమపదము లందు పూజించవలెను. రోగ, అప్పా, ముఖ్య, భల్లాట, సోమ, శైల, ఆదితి, దితు లను దేవతాష్టకమును ఉత్తరమున నున్న పదములపై పూజించవలెను. వాస్తుమండలము మధ్య నున్న తొమ్మిది పదములపై బ్రహ్మయు, ఇరువదినాలుగు పదముల పై, ఆరేసి పదములపై అధికారము గల దేవతలను పూజించవలెను. బ్రహ్మకును, ఈశనకును మధ్య నున్న కోష్టకములం దున్న పదములపై ఆపదేవతను క్రింది రెండు పదములపై ఆపవత్సుని పూజించవలెను. దాని తరువాత నున్న ఆరు పదములపై మరీచిని పూజించవలెను. మరీచికిని, అగ్ని కిని మధ్యనున్న రెండు పదములపై సవిత ఉండును. వాటి క్రింద నున్న రెండు పదములపై సావిత్రుడు ఉండును. దాని క్రింద ఆరు పదములపై వివస్వంతు డుండును. పితృ దేవతలకును బ్రహ్మ! కును మధ్య నున్న రెండు పదములపై విష్ణువు, ఇంద్రుడును ఉందురు. క్రింది రెండు పదముందు ఇంద్రుడును, జము డుమ ఉందురు. వారిని పూజించవలెను. వరుణనకును, బ్రహ్మకును మధ్యనున్న ఆరు పదముల పై మిత్రదేవతను పూజించ వలెను.  రోగమునకును, బ్రహ్మ కును శుధ్యనున్న రెండు పదముల పై రుద్ర-రుద్రదాసులను, క్రింది రెండు పదములందు యక్ష్మను పూజించవలెను. మండలము బైటి ఈశావాది కోణముందు క్రమముగా చరకీ-స్కంద-విదారీ-వికట-పూతనా జంత-పాపా-పిలిపిచ్చ లను బాలగ్రహములను పూజించవలెను.

ఎనుబది ఒక్క పదములు గల వాస్తుచక్రము చెప్పబడినది. శతపదమండలము గూడ ఉండును. దానిమీద, కూడ వెనుక టివలెనే దేవతాపూజ చెప్పబడినది. శతపదచక్రమునందు మధ్య నున్న పదునారు పదములపై బ్రహ్మను పూజించవలెను. బ్రహకు పూర్వాదిదిశలం దున్న మరీచి వివస్వత్-మిత్రపృథ్వీధరులును పదేసి పదములపై పూజించపలెను. ఈశాన్యాదిదిక్కులం దున్న దితి. ఈ అగ్ని-పూషన్-పితృపాపయత్మ రోగ దేవతలు ఒకటిన్నర పదముల పై నందురు. స్కందా! ఇపుడు యజ్ఞాదులకై కావలసిన ముడపములను, క్రమముగా, సంక్షేపముగా వర్ణించేదను ముప్పది హస్తముల పొడవు, ఇరువది ఎనిమిది హస్తముల వెడల్పు ఉన్న మండపము శివునకు ఆశ్రయము. పొడవువెడల్పులలో పదకొండు చొప్పున తగ్గించగా, పందొమ్మి 3 హస్తముల పొడవు, పదునేడు హస్తముల వెడల్పు ఉన్న మండపము శివసంజ్ఞకము. ఇరువది రెండు హస్తముల పొడవు, వమనే దు హస్తముల వెడల్పు ఉన్న , మండపమునకు సావిత్రమని పేరు. ఇతర గృహముల విస్తారము ఆంశికముగ నుండును. గోడ ఎత్తు దాని లావైన ఉపజంఘ ఎత్తునకు మూడు రెట్లు ఉండవలెను. గోడకొరకై ఎంత సూత్రమానము నిశ్చితమైనదో అంతయే దాని ఎదుట నుండు భూమి ఉండవలెను. అది వీథభేదముచే అనేక విధములనుండును. భద్రనామక ప్రాసాదమునందు ద్వారవీథి వీథులతో సమానముగనే ఉండవలెను. శ్రీజయ మను ప్రాసాదమునందు ఉండు ద్వారవీథిలో దానియందు వీథిపృష్టభాగ ముండదు. ద్వారవీథిలో వీథిపార్శ్వథాగమును తగ్గించినచో అట్టి ద్వారవీథి కల ప్రాసాదమునకు 'భద్ర'మని పేరు. వీథి విస్తారము గూడ గర్బవిస్తారము వలె నుండవలెను. కొన్ని చోట్ల దాని సగముతోను, లేదా నాల్గవవంతుతో సమానముగా ఉండును. ఉపవీథులను వీథిలో సగము ప్రమాణ ముండు నట్లు నిర్మించవలేను. దానికి ఒకటి లేదా రెండు, లేదా మూడు పురము లుండవలెను. ఇపుడు ఇతర మైన సాధారణగృహ ములను గూర్చి చెప్పుచున్నాను. ఆ గృహమును ఆ ఆకారముతో నిర్మించినచో అది సమస్త మైన కోరికలను సఫలమ చేయును. దానిలో వరుసగా ఒకటి, రెండు, మూడు, నాలుగు, లేదా ఎనిమిది శాలలు ఉండవలెను. ఏక కాలగృహము యొక్క శాల దక్షిణభాగమున నిర్మింపబడును. దాని ద్వారము ఉత్తరము వైపున ఉండును. రెండులను నిర్మించు పక్షమున వాటిని పశ్చిమమునందును, తూర్పునందును నిర్మింపవలెను. వాటి ద్వారములు, ఎదురెదురుగా ఉండవలెను, నాలుగు శాలల గృహమునకు. నాలుగు ద్వారములు, నాలుగు అడుగులు ఉండును గాన అవి సర్వతోముఖముగ నుండును. ఆది గృహ స్వామికి కల్యాణకరము. పశ్చిమము వైపు రెండు శాలండు ద్విశాలాగృహమునకు 'యమసూర్యకము' అని పేరు. తూర్పు, ఉత్తరముల వైపు ళాల లున్నచో ఆ గృహమునకు ‘దండ' మని పేరు. పూర్వదక్షిణముల వైపు రెండు శాల లున్నచో దానికి 'పాతము' అని పేరు. త్రిశాలాగృహమునందు తూర్పువైపు శాల లేనిచో దానికి సు శేషత్రము అని పేరు: 'అది బుద్ధిదా యక ము. దక్షిణమున తప్ప ఇతర దిశలుదు శాల లున్న చో దానికి 'విశాలము' అని పేరు. ఆది కులక్షయకరము. చాల భయదాయకము. పశ్చిమమున శాల లేని విశాలగృహమునకు ‘పక్షమ్నము’ అని పేరు. అది పుత్రహానికరము. అనేక శత్రుకార కము.

ఇపుడు పూర్వాదిదిక్రమమున ధ్వజాదిగృహముల నెనిమిదింటిని గూర్చి చెప్పెదను స్నానగృహ-అనుగ్రహ గృహములను తూర్పునను, వంటయిల్లును ఆగ్నేయమునను, శయ్యా-రసక్రియల గృహమును దక్షిణమునందును, శస్త్ర గృహమును నైరృతియందును, ధనరత్నాదుల కోశాగారమును పశ్చిమమునందును, అన్నగృహము వాయవ్యమునందును, ధనపశ్వాదులను ఉత్తర మునందును, దీక్షాగృహమును ఈశాన్యమునందును నిర్మింపవలెను. గృహస్వామి హస్తముచే కొలవ బడిన గృహపిండము పొడవు వెడల్పుల హస్తమానమును మూడుచే గుణించి ఎనిమిదిచే భాగించవలెను. అట్లు భాగించగా వచ్చిన శేషమును బట్టి ఈ ధ్వజాద్యాయములు ఏర్పడును. దానిని పట్టియే ధ్వజము మొదలు కాకము వరకును ఉన్న ఆయములు తెలియును. రెండు, మూడు, నాలుగు, ఆరు, ఏడు, ఎనిమిది శేషించినచో దానిని బట్టి శుభాశుభఫలము లేర్పడును. గృహాయము మధ్యమము (ఐదవది) కాని, (చివరిది) కాకము గాని అయినచో అట్టి గృహము సర్వనాశకర మగును. అందుచే ఎనిమిది భాగ ములను విడచి, తొమ్మిదవ-భాగమునండు నిర్మించిన గృహము శుభకరము. ఆ నవమభాగమునందే మండపము ఉత్తమముగా భావింపబడుచున్నది. దాని పొడవు వెడల్పులు సమముగా నుండవలెను లేదా వెడల్పుకంటె. పొడవు రెట్టింపు ఉండవలెను. తూర్పునుండి పశ్చిమము వైపునకును, ఉత్తర మునుండి దక్షిణమునకును, బజారునందే గృహపంక్తి కాన వచ్చును. ఒక్కొక్క ఇంటికి, ప్రతిదిక్కునకును ఎనిమిదేసి ద్వారము లుండవచ్చును. ఈ ఎనిమిది.. ద్వారములకును వేరు వేరు -ఫలము లున్నవి. పూర్వదిక్కునం.దున్న ఎనిమిదిద్వారములకును - భయము, స్త్రీ, చాపల్యము, జయము, వృద్ధి, ప్రలో పము, ధర్మము, కలహము, నిర్ధనత ఆనునవి తప్పక జరుగు ఫలములు. దక్షిణదిక్కునం -దున్న ఎనిమిది ద్వారములతో దాహ-దుఃఖ-సుహృన్నాక ధననాళ్ల-మృత్యు-ధనశిల్పజ్ఞాన పుత్రప్రాప్తులు, ఫలము- ఆయుస్సంన్యాస-సస్య-ధన శాంతి-ఆర్థనాళ-శోషణ-భోగ-సంతానప్రాప్తులు పశ్చిమద్వారఫలములు. రోగ...మద-ఆర్తి-ముఖ్య లా అర్థ-ఆయుః-కృశతా- మావములు ఉత్తర ద్వారఫలములు.

అగ్ని మహాపురాణమునందు గృహాది వాస్తు వను నూట ఐదవ అధ్యాయము సమాప్తము.