అగ్ని మహా పురాణము

Table of Contents

248 - అథ పుష్పాది పూజాఫలమ్

అగ్నిరువాచః

అగ్ని దేవుడు పలికెను : వసిష్ఠా! పుష్పములతో పూజించినచో శ్రీ మహావిష్ణువు అన్ని కార్యములను సిద్దింప చేయును. మాలతి, మల్లిక, గిలిమల్లిక, గులాబి, కనేగము, పొవంతి, అతిముక్తకము, కర్ణికారము, కురంటకము, తగరము, నీచము, దాణము, యూథిక, ఆశోకము, తిలకము, కుందము, తమాలము - ఈ పూవులతో పూజ శ్రేష్ఠము. బిల్వపత్రము, శమీపత్రము. భృంగరాజ పత్రము, తులసి, కృష్ణతులసి, వాసక పత్రము - ఇవి కూడ పూజకు తగినవి. కేతకీపత్ర-పుష్పములు, పద్మములు, రక్తకమలములుకూడ పూజలో గ్రాహ్యములు. జిల్లేడు, ధత్తూరము, గులివెంత, పర్వత మల్లిక, కుటజము, శాల్మలి, కటోరపుష్పము - ఇవి పూజానర్హములు. ప్రస్థము (నాలుగుసేర్లు) నెయ్యితో శ్రీమహావిష్ణువునకు ఆభిషేకము చేసినచో కోటి గోవుల దానము చేసిన ఫలము లభించును. ఒక ఆడకము ఘృతముతో అభిషేకము చేసినవాడు రాజ్యమును పొందును. ఘృతమిశ్రదుగ్ధముతో అభిషేకము చేసినవాడు స్వర్గమును పొందును.

అగ్నిమహాపురాణమునందు పుష్పాదిపూజాఫల కథనమను రెండువందల నలుబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.