అగ్ని మహా పురాణము
64 - అథ కూపాది ప్రతిషా కథనమ్
హయగ్రీవుడు చెప్పెను:- బ్రహ్మదేవా! ఇపుడు కూపములు, దిగుడుబావులు, చెరువులు ప్రతిష్ఠ చేయు విధిని చేప్పెదను; శ్రీహరియే జలరూపముచే దేవశ్రేష్ట జైన సోము గాను, వరుణుడు గాను ఆయెను. ప్రపంచ మంతయు ఆర్నీ షోమమయము. జలరూపు డైన నారాయణుడు దానికి కారణము. బంగారముతో, లేదా వెండితో, లేదా రత్నములతో వరుణుని ప్రతిమ చేయిలి చవలెను. వరుణదేవునకు రెండు భుజములతో, హంసారూఢుడై , నదులతోడను, కాలువలతోడను కూడియుండును. ఆతని కుడి చేతిలో ఆభయముద్రయు, ఎడమచేతిలో నాగపాశము ప్రకాశించుచుండును. యజ్ఞమండప మధ్య భాగమున కుండముతో ప్రకాశించు వేదిక నిర్మించి దాని తోరణమున పూర్వద్వారమున కమండలసహితముగా వరుణకలశము స్థాపింపవలెను, భద్రక మున (దక్షిణద్వారమున)ను, అర్ధచంద్రమునను (ప్రశ్చిమద్వారముదను) స్వస్తిక మునను (ఉత్తర ద్వార మున) వరుణకలశ ములు స్థాపించవలెను. కుండమునందు అగ్న్యాధానము చేసి పూర్ణాహుతి ఇవ్వవలెను.
“యే తే శతం వరుణ” ఇత్యాదిమంత్రముతో స్నానపీఠముపై వరుణుని స్థాపింపవలేను మూలమంత్రము.ముచ్చ రించుచు, ఆచార్యుడు, వరుణదేవతా ప్రతిమకు ఘృతము పూయవలెను. “శం నో దేవీ” ఇత్యాదిమంత్రముతో ప్రక్షాళనముచేసి, “శుద్దవాలకి,” “సర్వశుద్ధవాలు” ఇత్యాదిమంత్రములతో, పవిత్ర జలముచే స్నానము చేయించవలెను. పిన్ముట స్నానపీఠము నకు పూర్వాది దిక్కులందు కలశములను స్థాపించవలెను. తూర్పుననున్న కలశమున సముద్రజలము, ఆగ్నేయమున నున్న కలశ మున గంగాజలము, దక్షిణ కలశమున వరాజలము, నైరృతికలశమున సెలయేరు నీరు, పశ్చిమకలశమున నదీజలము వాయవ్య కలశమున కొండకాలువ నీరు, ఉత్తరకలశమున కాలువల నీరు, ఈశాన్యకలశమున తీర్థ జలములను ఉంచవలెను. ఈ వివిధజలములు లభించనిచో నదీజలమే ఉంచవలెను. ఈ అన్ని కలశములను, యాసాం రాజా ఇత్యాది మంత్రముచే అభిమంత్రించవలెను. విద్వాంసు డైన పురోహితుడు “సుమిత్రియా” ఇత్యాది మంత్రముతో మార్జననిర్మంథనములు చేయ వలెను. “చిత్ర దేవానామ్” ఈతచ్చక్షుర్దేవహితమ్ అను మంత్రములతో తేనె, నెయ్యి, పంచదార ఆను మధురత్రయముచే నేత్రములను తెరవవలెను ఆ సువర్ణమయ వరుణ ప్రతిమపై జ్యోతిస్సును పూజించి ఆచార్యునకు గోదాన మీయవలెను.
“సముద్రజ్యేష్టా” ఇత్యాదిమంత్రముతో పూర్వకలశ జలము చేతను, “సముద్రం గచ్ఛ” ఇత్యాదిమంత్రముతో ఆగ్నేయకలశ స్థిత గంగాజలముచేతను, “సోమో ధేనుమ్” ఇత్యాదిమంత్రముతో దక్షిణకలశస్థితివర్షాజలముచేతను, “దేవీరాప” ఇత్యాదిమంత్రముతో నైరృతికలశస్థిత నిర్జర జలముచేతమ, “పఞ్చ నద్యః” ఇత్యాదిమంత్రముతో పశ్చిమకలశ స్థిత నదీజలము చేతను, “ఉద్భిద్యః” ఇత్యాదిమంత్రముతో ఉత్తరకలశ స్థితోద్భిజ్జ జలముచేతను, పావమానీ ఋక్కులతో ఈశాన్యకలశస్థిత తీర్థజలముచేతను వరుణునకు అభిషేకము చేయవలెను. పిమ్మట యజమానుడు ‘ఆపోహిష్ణా' మంత్రముతో పంచగవ్యముల చేతను, 'హిరణ్యవర్ణామ్' ఇత్యాదిమంత్రముతో స్వర్ణ జలముచేతను, “ఆపో అస్మాన్” అను మంత్రముచే వర్షాజలముచేతను, వ్యాహృతులతో కూపజలముచేతను, “ఆపో దేవీ” ఇత్యాదిమంత్రముతో తడాగజలముచేతను, తోరణమునం దున్న వరుణ కలశ జలముచేతను వరుణునికి స్నానము చేయించవలెను. కొండకాలవల జలము నింపిన ఎనుబది యొక్క కలశములలోని జలముచే “వరుణస్యోత్తమ్భనమసి” ఇత్యాది మంత్రము పఠించుచు స్నానము చేయించవలెను. “త్వం నో ఆగ్నే వరుణస్య” ఇత్యాదిమంత్రముతో అర్ఘ్యప్రదానము చేయవలెను. వ్యాహృతుల నుచ్చరించుచు మధుపర్కమును, “బృహస్పతే ఆతీయదర్యో” ఇత్యాది మంత్రముతో, వస్త్రములను, “ఇమం మే వరుణ” ఇత్యాది మంత్రముతో పవిత్రక మును, ప్రణవ ముచ్చరించుచు ఉత్తరీయమును సమర్పింపవలెను. వరుణసూక్తము పఠించుచు పుష్ప-చామర దర్పణ-ఛత్రపతాకలను సమర్పింపవలెను. మూలమంత్రము చదువుచు, 'ఉత్తిష' అని వనికి లేవదీసి, ఆ రాత్రికి ఆధివాసనము చేయించవలెను. “వరుణం వా” అను మంత్రముచే సంనిధీకరణము చేసి వరుణ సూక్తముచే పూజింపవలెను. మూలమంత్రముచే సజీవీక రణము చేసి చందనాదులతో పూజించవలెను. మండలమున వెనుక చెప్పిన విధమున అర్చన చేయవలెను. ఆగ్ని కుండమున సమిధలతో హోమము చేయ వలెను, వైదికమంత్రములతో గంగ మొద లగు నాలుగు గోవులను పిదుకవలెను. అన్ని దిక్కులందును యవలతో వండిన చరువు ఉంచి హోమము చేయవలెను. చరువును వ్యాహృతులచేతను, గాయత్రిచేతను లేదా మూలమంత్రముచేతను అభిమంత్రించి సూర్య-ప్రజాపతి.దివ్.అంతకనిగ్రహ-పృథ్వీ దేహధృతి-స్వధృతి - రతి.రమతీ ఉగ్ర_భీమ-రౌద్ర-విష్ణు-వరుణ-ధాతా.రాయ స్పోష-మహేంద్ర-అగ్ని-యమ-నిరృతి-వరుణ.వాయు కుబేర ఈశ.అనంత-బ్రహ్మ-వరుణ నామములను చతుర్థ్యంతములు చేసి పలుకుచు అంతమున “స్వాహా చేర్చి బలి ఇవ్వవలెను. “ఇదం విష్ణుః”, “తద్వి ప్రాసః” అను మంత్రములచే ఆహు తుల నీయవలెను. “సోమో ధేనువు” ఇత్యాది మంత్రములతో ఆరు ఆహుతులిచ్చి “ఇమం మే వరుణ” అను మంత్రముతో ఒక ఆహుతి ఇవ్వవలెను. ‘ఆపో హిష్ణా’ ఇత్యాది మంత్రత్రయమతోను, 'ఇమా రుద్రా' ఇత్యాదిమంత్రముతోను కూడ ఆహుతుల నీయవలెను.
పిమ్మట పది దిక్కులందును బలు లిచ్చి గంధపుష్పాలతో పూజింపవలెను. ప్రతిమను ఎత్తి మండపము మీద స్థాపించి గంధపుష్పాదుల చేతను, సువర్ణ పుష్పాదుల చేతన్ను పూజించవలెను. పిమ్మట శ్రేష్టుడైన ఆచార్యుడు ఎనిమిది దిక్కులందును రెండేసి జానల చెరువులను, ఇసుకతో ఎనిమిది వేదికలను నిర్మింపవలేను. “వరుణస్య” ఇత్యాది మంత్రము చదువుచు, మృతముతోను, యవలతో వండిన చరువుతోను వేరు వేరుగ నూటఎనిమిది హోమములు చేయవలెను. శాంతి జలము తీసికొని వచ్చి దానితో వరుణుని శిరస్సు పై అభిషేకము చేసి, సజీవీకరణము చేయవలెను. తన ధర్మపత్ని యగు గౌరితో కూడిన వరుణుడు నదీనదములతో పరివేష్టితుడై యున్నట్లు ధ్యానము చేయవలెను. ఓం వరుణాయ నమః అను మంత్రముతో పూజించి సాంనిధ్యకరణము చేయవలెను. పిమ్మట వరుణదేవుని లేవదీసి మంగళ ద్రవ్యములతో గజ పృష్టాదుల పై ఎక్కించి ఊరేగించవలెను. పిమ్మట ఆ వరుణమూర్తిని “ఆపో పా మ యో భువః” ఇత్యాది మంత్రము పఠించుచు మధురత్రయయుక్త మగు కలశములో ఉంచి కలశ సహితు డగు వరుని జలాశయ మధ్య భాగమునందు సురక్షిత రూపమున స్థాపింపవలెను.
పిమ్మట యజమానుడు స్నానము చేసి వరుని ధ్యానించవలెను. అనంతరము బ్రహ్మాండసంజ్ఞక మగు సృష్టిని ఆగ్ని బీజముచే (రం) దహించి, దాని భస్మరాశిని ఉదకముచే ముంచెత్తి నట్లు భావన చేయవలెను. జగ మంతయు జలమయ మైనది ఆని భావన చేసి ఆ జలమునందు జలేశ్వరు డైన వరుణుని ధ్యానించవలెను. ఈ విధమున జల మధ్య భాగమున వరుణదేవతా ధ్యానము చేసి అచట యూపమును స్థాపించవలెను.. యూపము చతుష్కోణముగ గాని, ఆష్ణకోణముగ గాని, గోలాకారముగ గాని ఉండుట మంచిది. పది హస్తముల పొడ వుండవలెను. దాని పై ఉపాస్యదేవతా చిహ్నము, లుండవలెను. దానిని యజ్ఞమున కుపయోగించు చెట్టు కత్తితో నిర్మింపవలెను. కూపమునకు అట్టి యూపమే ఉపయోగించును. దాని మూలభాగమున బంగారు ఫలక ముంచవలెను. దిగుడు బావిలో పదునైదు హస్తముల యూపమును, పుష్కరిణిలో ఇరువది హస్తముల యూపమును, తటాకమున ఇరువదియైదు హస్తముని రూపము స్థాపింపవలెను. యజ్ఞప్రాంగణమున “యూప బ్రహ్మ” ఇత్యాది మంత్రముతో యూపమును స్థాపించి, దానికి వస్త్రములు చుట్టబెట్టి, పై భాగమున పిలాక ఏర్పరుపవలెను. దానిని గంధాదులతో పూజించి, జగత్తుకొరకై శాంతికర్మ చేయవలెను. ఆచార్యునకు భూమి, గోవు, సువర్ణము, జలపాత్రము మొదలగునవి దక్షిణగ ఇవ్వవలెను. ఇతర బ్రాహ్మణులకు గూడ డక్షిణ లిచ్చి, వచ్చిన వారికి భోజనము పెట్టవలెను. బ్రహ్మ మొదలు తృణమువరకు, లేదా కీటకము వరకు దప్పికొన్న వారి కందరికిని ఈ తడాగములో నున్న జలముచే తృప్తి కలుగు గాక” అని పలుకుచు జలము విడిచి పెట్టి. జలాశయములో పంచగవ్యము లుంచవలెను. పిమ్మట “ఆపో హి షామ” ఇత్యాది ఋ క్రయము పఠించుచు, బ్రాహ్మణులు సమకూర్చిన శాంతి జలమును, పవిత్రతీర్థ జలమును ఉంచి, బ్రాహ్మణులకు గోవృషభాదిదానము చేయవలెను. ఎట్టి అడ్డులు చెప్పకుండగ అందరికిని అన్న దానము చేయు ఏర్పాట్లు చేయవలెను. ఒక్క జలాశయమును నిర్మించువాని పుణ్యము లక్ష ఆశ్వమేధయాగములు చేసిన వాని పుణ్యము కంటే వేయి రెట్లు అధికము. ఆతడు స్వర్గము చేరి విమానమునందు ఆనందించుచుండును. ఎన్నడును నరకమునకు వెళ్ళడు. జలాశయమునందు గోవులు మొదలగు పశువులు జలము త్రాగును గాన దానిని నిర్మించినవాడు పాప వినిర్ముక్తు డగును. జలదానము చేసిన మానవుడు సకల దానములను చేసిన ఫలముపొంది స్వర్గమునకు వెళ్ళును.
ఆగ్ని మహాపురాణము నందు కూపవాపీతటాకాది ప్రతిష్ఠా కథన మను అరువదినాల్గవ అధ్యాయము సమాప్తము.
