అగ్ని మహా పురాణము
74 - శివ పూజావిధిః.
మహేశ్వరుడు చెప్పెను : స్కందా! ఇపుడు శివపూజవిధానమును చెప్పుచున్నాను. ఆచమనము చేసి ప్రణవ జపము చేయుచు సూర్యునకు అర్ఘ్య మీయవలెను. పిమ్మట పూజామండపద్వారమును 'ఫట్' అను మంత్ర ముచ్చరించుచు ఉదకముతో తడిపి, ప్రారంభము 'హాం' బీజముతో నంది మొద లగు ద్వారపాలకులను పూజింపవలెను. ద్వారము పై ఉదుంబరవృక్షము స్థాపించి, లేదా భావన చేసి, దాని పై భాగము పై గణపతి-సరస్వతీ–లక్ష్మీదేవులను పూజించవలెను. దక్షిణభాగమున నందిని, గంగను, వామభాగమున మహాకాలుని, యమునను పూజింపవలెను. పిమ్మట దివ్యదృష్టి ప్రసరింప చేసి దివ్యవిఘ్న ములను తొలగించుకొనవలెను. వాటిని ఉద్దేశించి పుష్పములు విసరి, “ఆకాశ చారివిమ్నము లన్నియు తొ:గిపోయినవి.” అని భావన చేయవలెను. కుడి మణవతో మూడు పర్యాయములు భూమిపై కొట్టి, ఇట్లు చేయుటచే భూతలముపై నున్న సర్వవిఘ్నములు తొలగి నట్లు భావన చేయవలెను. పిమ్మట యజ్ఞమండపముయుక్క కడప దాటవలెను. ఎడమ కొమ్మ పట్టుకొని లోపల ప్రవేశించి, ఉదుంబరవృక్షమున అస్త్రన్యాసము చేసి, మండపమధ్యమున పీఠాధార భూమిపై “ఓం హాం వాస్వధిపతయే బ్రహ్మణే నమః” అను మంత్రముతో వాస్తుదేవతాపూజ చేయవలెను.
నిరీక్షణాశ స్త్రములచే శుద్ధము చేయబడిన గడ్డుకములను చేతిలో గ్రహించి, భావన ద్వారా శివాజ్ఞ గైకొని, సాధకుడు మౌనముగా గంగాది నదీతటమునకు వెళ్లి, అచట తన శరీరమును పవిత్రము చేసికొని గాయత్రి మంత్రజపము చేయుచు వస్త్రముతో వడగట్టిన జలముతో జలాశయమునందు ఆ గడ్డుకములను నింపవలెను. లేదా హృదయబీజమును (నమః) ఉచ్చరించుచు నింపవలెను. పూజకై కావలసిన గంధ - అక్షత - పుష్పాది సకలద్రవ్యములను దగ్గర ఉంచుకొని, భూతశుద్ధి మొదలగు కర్మలు చేయవలెను. ఉత్తరాభిముఖుడై , ఆరాధ్యదేవతకు కుడి ప్రక్క శరీరాంగముల పై మాతృకాన్యాసము చేసి, సంహారముద్రతో ఆర్ఘ్యముకొరకై ఉదకము గ్రహించి మంత్రోచ్చారణపూర్వకముగ శిర స్సుకు తగల్చి, దానిని దేవతకు సమర్పించుక కై దగ్గర ఉంచుకొనవలెను. పిమ్మట భోగ్యము లగు కర్మల భోగమునకై కూర్మముద్రను ప్రదర్శించి ద్వాదశ దల హృదయకమలమున తన ఆత్మను ధ్యానించవలెను.
పిమ్మట శరీరమునందు రంధ్రమును (శూన్యమును) భావించి, క్రమముగ పంచభూతశోధనము చేయవలెను. ముందుగ పాదము అంగుష్ఠములను పైనుండియు, లోపలినుండియు ఛిద్రమ యముగ భావన చేయవలెను. పిదప కుండలినీ శక్తిని మూలాధారమునుండి లేపి, హృదయకమలముతో చేర్చి, “హృదయరంధ్రమునం దున్న, అగ్నితుల్య తేజశాలి యగు “హూం' బీజమునందు కుండలినీశ క్తి విరాజిల్లుచున్నది అని భావనచేయవలెను. కుంభక ప్రాణాయామము చేసి, రేచకము చేసిన పిమ్మట, “హుం ఫట్' అని ఉచ్చరించుచ్ముక్రమముగ ఉత్తరోత్తర చక్రిములను భేదనము చేయుచు, కుండలిని హృదయ-కంఠంతాలు-భ్రూమధ్య - బ్రహ్మరంధ్రములకు చేర్చి ఆచట స్థాపించవలెను. ఈ గ్రంథులను భేదించి, కుండలినితో, హృదయ కమలమునుండి బ్రహ్మరంధ్రమునుండి వచ్చిన 'హూం' బీజరూపజీవుని ఆచటనే బ్రహ్మరంధ్రమునందు లేదా సహస్రారము నందు స్థాపించవలేను. హృదయమునం దున్న ‘హూం' బీజముతో సంపుటీకరించిన జీవునిలో, పూరక ప్రాణాయామము ద్వారా చైతన్యము జాగృతము చేయబడును. శిఖకు పైన ‘హూం' న్యాసము చేసి శుద్ధబిందురూప జీవుని భావించవలెను. పిమ్మట కుంభకముచేసి ఏకమాత్ర చైతన్యరూపుడగు జీవుని శివునితో కలిపివేయవలెను.
ఈ విధముగ శివునిలో లీను డైన సాధకుడు సబిజరేచక ప్రాణాయామముతో శరీర మునందలి భూతముల శోధనము చేయవలెను. శరీరమునందు పాదములనుండి బిందువువరకును ఉన్న అన్ని తత్వమును విలోమక్రమమున చింతనచేయ వలెను. బింరురూపజీవుని బింద్వంతమునందు లీనము చేసి పృథ్వీవాయువులను ఒకదానిని మరొకదానిలో లీనము చేయవలెను. అగ్ని - జలములను కూడ ఒక దానిలో ఒకటి విలీనము చేయవలెను. ఈ విధముగ పరస్పర విరోధముగల రెండు భూతములను ఒక దానిలో ఒకటి లీనము చేయవలెను. ఆకాశ మునకు దేనితోడను విరోధము లేదు. ఈ భూతశుద్ధికి సంబంధించిన విశేష వివ రణము వినుము. భూమండల స్వరూపము చతుష్కోణాకారము. దాని రంగు సువర్ణము వలె పచ్చగా ఉండును. ఆది కఠిన ముగ నుండుటయే గాక వజచిహ్నముతోను, 'హాం' అను తన బీజముతోను కూడుకొని యున్నది. దీనిలో ‘నివృత్తి’ అను కళ ఉన్నది. (శరీరమున పాదములు మొదలు మోకాళ్ల వరకును భూమండల మున్నది). ఈ విధము. పాదములు మొదలు శిరస్సువరకు శరీరమునందు పంచమహాభూతముల భావన చేయవలెను. ఈ విధముగ పంచగుణయుక్తము లగు వాయు-భూ మండలముల చింతన చేయవలెను.
జలస్వరూపము అర్ధచంద్రాకారము. అది ద్రవస్వరూపము. చంద్రమండలమము. దానివర్ణము ఉజ్జ్వలము. అది రెండు కమలములచే చిప్నా తము. 'హీం' బీజముతో కూడినది. “ప్రతిష్టా” అను కల గలది. వామదేవ-తత్పురుషమంత్రము లతో సంయుక్త మగు జలతత్త్వము నాలుగు గుణములతో కూడినది. దానిని ఈ విధముగ మోకాళ్లు మొదలు పాదాల వరకు) చింతనము చేయుచు వహ్ని స్వరూపమునందు లీనము చేసి శోధన చేయవలెను. అగ్ని మండలము త్రికోణాకారము, రంగు ఎరుపు. అది నాభినుండి హృదయమువరకును ఉండును). ఆది స్వస్తిక చిహ్న యుక్తము. దానియందు “హూం' బీజము అంకిత మై యుండును. అది విద్యాకలాస్వరూప మైనది. దాని మంత్రము ఆ ఘోరమంత్రము. ఇది మూడు గుణములతో కూడిన జలభూతము. ఈ విధముగ భావించి అగ్నితత్వమును శోధించవలెను. వాయుమండలము షట్కోణాకారము (హృద యము మొదలు కనుబొమ్మలవరకును ఉండునది). అది ఆరు బిందువులచే చిహ్నితమైనది. రంగు నలుపు. 'హైం' బిజము తోడను, సద్యోజాతమంత్రముతోడను యుక్త వై యున్న ఆది శాంతిక లాస్వరూప మైనది. దానిలో రెండు గుణము లున్నవి, ఆది పృథ్వీభూతము. ఈ విధముగ భావన చేసి వాయుతత్త్వమును శోధింపవలెను.
ఆకాశము వ్యోమాకారము! నాదబిందుమయము, గోలాకారము, బిందుశ క్తి విభూషితము, శుద్ధ స్ఫటిక నిర్మలము. (శరీరమున భ్రూమధ్యము మొదలు బ్రహ్మరంధ్రము వరకు ఆకాశ స్థానము). అది “హం ఫట్” అను బీజముతో కూడినది. శాంత్యతీతకలామయము. ఒక్క గుణము కలది. పరమవిశుద్దము. ఈ విధముగ చింతనము చేసి ఆకాశతత్త్వమును శోధన చేయవలెను. పిమ్మట అమృతవర్షిమూలమంత్రముచే సర్వమును పరిపుష్టము చేయవలెను. పిమ్మట ఆధారశ క్తిని, కూర్మమును అనంతుని పూజించవలెను. పిమ్మట పీఠముయొక్క ఆగ్నేయ పాదము (కోడు) నందు ధర్మమును, నైరృతి పాదమున జ్ఞానమును, వాయవ్యమున వైరాగ్యమును, ఈశాన్యపాదమున ఐశ్వర్యమును పూజించవలెను. పిమ్మట పీఠమునకు పూర్వాది దిశలందు క్రమముగ ఆధర్మ-ఆజ్ఞాన-అవే రాగ్య.అనైశ్వర్యములను పూజించవలెను. పీఠమధ్యభాగమున కమఃమును పూజించ వలెను. ఈ విధముగ మనస్సులోనే పీఠము పై నున్న కమలాసనమును ధ్యానించి దాని పై సచ్చిదానందఘను డగు శివుని ఆవాహనము చేయవలెను. ఆ శివ మూర్తియందు శివస్వరూపాత్మను చూచి, ఆసనమును, పాదుకాద్వయమును, తొమ్మిది పీఠ శక్తులను ధ్యానించవలేను. శక్తిమంత్రము చివర “నౌషట్” చేర్చి, దానిని ఉచ్చరించుచు పైన చెప్పిన ఆత్మమూర్తిని దివ్యా మృతములో ముంచి, సకలీక రణము చేయవలెను. హృదయము మొదలు హస్తముల వరకును ఉన్న ఆవయవములందును, కని షిక మొదలు వేళ్లయందును హృదయమంత్ర (నమః) న్యాసమునకు సకలీక రణ మని పేరు.
‘హుంఫట్’ అను మంత్రముచే ప్రాకారమును భావన చేసి, ఆత్మరక్ష ఏర్పరచుకొనవలెను. దీని బైట, వెలుపల, క్రింద, మీద, భావన ద్వారా శక్తిజాలమును విస్తరింపచేయవలెను. పిమ్మట మహాముద్రాప్రదర్శనము చేసి, పూరక ప్రాణా యామముతో హృదయకమలమునందున్న శివుని ధ్యానించి, ఆనందామృతమయ మకరందముతో (నిండిన) భావమయపుష్పము లతో శివునకు పాదములనుండి శిరస్సు వరకును అంగపూజ చేయవలెను. శివమంత్రము లతో నాభికుండమునం దున్న శివ స్వరూపాన్ని ని తృప్తుని చేయవలెను. ఆ శివానలమే లలాటమున బిందురూపములో నున్నది; దాని విగ్రహము మంగలమయము (అని) భావన చేయవలెను. స్వర్ణపాత్రము గాని, రజతపాత్రము గాని, తామ్రపాతము గాని ఆర్ఘ్యము నిమిత్తమై గ్రహించి దానిని అస్త్రవీజము (భట్) ఉచ్చరించుచు కడగవలెను. బిందు రూపశివునినుండి అమృతము ఆవిర్భవించుచున్నట్లు భావన చేసి హృదయమంత్రము (నమః) ఉచ్చరించుచు, దానితో కలిసిన జలాక్షలాదులతో ఆ పాత్రను నింపవలెను. దానికి షడంగ హజ చేసి, దేవతామూలమంత్రముచే అభిమంత్రించవలెను. అస్త్రమంత్రము (ఫట్)చే దాని రక్ష చేసి, కవచబీజ (హుమ్)ముచే దానిని కప్పవలెను. ఈ విధముగ ఆష్టాంగార్ఘ్యము ఏర్పరచి, ధేనుముద్రచే దానికి అమృతీకరణము చేసి, ఆ జలమును అన్ని వైపులను చల్లవలెను. తన శిరస్సు పై కూడ చల్లుకొనవలెను. పూజాసామగ్రిమీద కూడ అస్త్రబీజము నుచ్చరించుచు చల్లవలెను. హృదయబీజముతో అభిమంత్రించి, “హుమ్' బీజముచే (లేదాసుత్స్యముద్రచే) దానిని ఆచ్ఛాందిచవలెను.
అమృత (ధేను) ముద్ర ప్రదర్శించి, తన ఆసనముపై పుష్ప ముంచి, లలాటముపై తిలకము ధరించి, మూల మంత్రముతో దేవతకు పుష్పము అర్పించవలెను. సాధకుడు.స్నాన దేవతాపూజా-హోమభోజన-యజ్ఞానుష్టాన యోగ సాధన_ఆవశ్యక జపసమయములందు, స్థిర బుద్ధి యై మౌనముగా ఉండవలెను, నాదపర్యంతము ప్రణవోచ్చారణము చేయుచు మంత్రశోధనము చేయవలెను. ఉత్తమసంస్కారముక్తుడై దేవపూజా ప్రారంభము చేయవలెను. మూలగాయత్రిచేత గాని, రుద్ర గాయత్రిచేత గాని ఆర్ఘ్యపూజనము చేసి ఆ సామాన్యార్ఘ్యమును దేవతకు సమర్పింపవలెను. బ్రహ్మపంచకము (పంచగవ్య ములు, కుశోదక ముతో చేసిన బ్రహ్మ కూర్చము) సిద్దము చేసికొని, శివలింగమునుండి పుష్పనిర్మాల్యమును తీసివేసి, ఈశాన్యము నందు “చండాయ నమః” అని చెప్పుచు చండునకు సమర్పించవలెను. బ్రహ్మపంచకముతో పిండికా శివలింగములకు స్నానము చేయించి, 'ఫట్' అని ఉచ్చరించుచు, మరల ఉదకముతో స్నానము చేయించవలెను. “నమో నమః” అని ఉచ్చ రించుచు అర్ఘ్యపాత్రగతజలముతో ఆ శివలింగమునకు అభిషేకము చేయవలెను. ఇది లింగశోధన విధానము.
ఆత్మ-ద్రవ్య-మంత్రలింగ శుద్దులు చేసిన పిమ్మట సకల దేవతలను పూజించవలెను. వాయువ్యమునందు, “ఓం హాం గణతపయే నమః” అని ఉచ్చరించుచు గణపతిని పూజించవలెను. ఈశాన్యమునందు “ఓం హాం గురుభ్యో నమః” ఆని చెప్పుచు గురు-పరమగురు.పరాత్పరగురు - పర మేష్టి గురువులను గురుపరంపరను పూజించవలేను. కూర్మరూప ముగు - శిలపై ఉన్న అంకుర తుల్య నుగు ఆధారశక్తిని పూజించి, బ్రహ్మ శిలపై కూర్చున్న శివుని ఆసన మైన ఆనంతదేవుని “ఓంశ్రీమదగ్ని మహాపురాణము హాం అనన్తాయ నమః” అను మంత్రముతో పూజింపవలెను. శివుని సింహాసనముగా నున్న మంచమునకు నాలుగు కోళ్ళు ఉండును. వాటి ఆకారము సింహాకారమున విచిత్రముగా నుండును. ఈ సింహములు మండలాకారమున నిలచి ఎదుట నున్న దాని పృష్టభాగమును చూచు చుండును. ఇవి సత్య- త్రేతా ద్వాపర కలియుగములకు ప్రతీకములు. పిమ్మట శివుని ఆసనపాదుకలను పూజించవలెను. పిమ్మట ఆగ్నేయాది విదిశ లలో నున్న ధర్మ-జ్ఞాన-వైరాగ్య ఐశ్వర్యములను పూజింప వలేను. వీటి రంగులు వరుసగ కర్పూర_కుంకుమ-సువర్ల-కజ్జలము (కాటుక)లతో సమానముగ నుండును. వీటి నాలుగు కాళ్ళకును పూజ చేసి ఆసనముపై నున్న ఆష్టదలక మలము నందలి క్రింది దళములను, పై దళములను మొత్తము కమలమును పూజించి, “ఓం హాం కర్షకాయై నమః” అను మంత్రముతో కర్ణికామధ్య భాగమును పూజించవలెను. ఆ కమలము యొక్క ఎనిమిది పూర్వాది దళములందును, మధ్యభాగమునందును తొమ్మండుగురు శక్తులను పూజించవలెను. ఆ శక్తులు హస్తము లలో చామరములు ధరించి యుందురు. వరద-అభయముద్రలు కూడ ఉండును. వామా.జ్యేష్ణా. రౌద్రీ.కాలీ కలవికారిణీ బలవికారిణీ-బలప్రమథనీ సర్వభూతనమనీ_మనోన్మనీ ఆను ఎనమండుగురు శక్తులను అష్టదలగుల పైనను, మనోన్మని యను శ క్తిని కమల కేసరములందును “హాం వామాయై నమః” ఇత్యాది మంత్రము లుచ్చరించుచు పూజించవలెను. పిమ్మట పృథివ్యాద్యష్టమూర్తులను, విశుద్ధవిద్యాదేహమును భావించుచు పూజ చేయవలెను. శుద్దవిద్యను, తత్త్వవ్యాపక ఆసనమును పూజించవలెను. ఆ సింహాసనముపై కర్పూరము వలే తెల్లగా ఉన్న వాడును, సర్వవ్యాపియు, ఐదు ముఖములు గలవాడును అగు మహాదేవుని ప్రతిష్ట చేయవలెను. ఆయనకు పది భుజము లుండును. శిరస్సున ఆర్ధచంద్రు డుండును. కుడి చేతులలో శక్తి -ఋష్టి-శూల-ఖట్వాంగ-వరదముద్ర లుండును. ఎడమ చేతులలో డమరు-బీజపూర-సర్ప-ఆక్షసూత్ర-నీలక మలము లను ధరించి యుండును.
ఆసనముపై ఆసీనుడై యున్న శివుని దివ్యమూర్తి ముప్పది రెండు లక్షణములతో ప్రకాశించుచున్నదని చింతనము చేయుచు, శివస్మరణము చేయుచు, “ఓం హం హం హాం శివమూర్తయే నమః” అను మంత్ర ముచ్చరించుచు నమస్కా రము చేయవలెను, బ్రహ్మాది కారణ త్యాగ పూర్వకముగ మంత్రమును శివుని యందు ప్రతిష్టితము చేయవలెను. లలాట మధ్య భాగమున చంద్రుడు వలె ప్రకాశించుచున్న బిందు రూప పరమ శివుడు హృదయాదు లగు ఆరు అంగములతో సంయు. కు డె పుష్పాంజలిలోనికి దిగి వచ్చి నట్లు భావన చేసి ఆయనను పూజింపనున్న మూర్తియందు స్థాపించవలెను. పిమ్మట ఆవాహనీముద్రతో “ఓం హాం హౌం శివాయ నమః” అను మంత్ర ముచ్చరించుచు, మూర్తి పై శివుని ఆవాహనము చేయ వలెను. స్థాపనీముద్రచే స్థాపనము చేసి, సంనీధాపనీముద్రతో సన్నిహితుని చేసి, సంనిరోధనీముద్రతో ఆ మూర్తి పై కదల కుండు నట్లు చేయవలెను. పిమ్మట “నిష్ఠరాయై కాలకల్యాయై ఫట్” ఆను మంత్రము ఉచ్చరించుచు ఖడ్గముద్రతో భయ మును చూపుచు విఘ్నములను పారద్రోలవలేను. పిమ్మట లింగముద్రను చూపి నమస్కారము చేయవలెను. . 'నమః' అని అవగుంఠనము చేయవలెను, ఇష్టదేవతను తన వైపునకు అభిముఖముగ నున్నట్లు చేయుటయే ఆవాహనము. దేవతను అర్చా విగ్రహముపై కూర్చుండ బెట్టుట స్థాపనము, 'ప్రభూ! నేను నీవాడను” ఆని పలుకుచు భగవంతునితో అతి సన్నిహిత సంబంధము నేర్పరచుకొనుటయే సంవిధాపనము”. శివపూజకు సంబంధిచిన కర్మకాండ అంతయు పూర్తి అగువరకు భగ వత్సంనిధాన ముండునట్లు చేయుట “నిరోధము” భక్తులు కాని వారికి శివతత్వము తెలియకుండు సట్లు చేయుట ఆవగుంఠ నము. పిమ్మట సకలీకరణము చేసి 'హృదయాయ నమః' ఇత్యాదిముత్రములతో హృదయాచ్యంగములకు అంగులతో ఏకత్వ మును స్థాపించుటయే ‘అమృతీకరణము” చైతన్య శక్తి శంకరుని హృదయము, ఎనిమిది విధములైన ఐశ్వర్యము శిరస్సు, వశిత్వము శిఖ, అభేద్యమగు తేజస్సు కవచము, దుస్సహమైన ప్రతాపమే సమస్త విఘ్నములను నివారించు అస్త్రము హృదయముతో ప్రారంభించి “నమః, స్వధా, స్వాహా, వౌషట్ అనునవి ఉచ్చరించుచు పాద్యాదులను నివేదించవలెను. ఆరాధ్యదేవత యొక్క చరణారవిందముల పై పాద్యమును, ముఖారవిందమున ఆచమనమును, అర్ఘ్య - దూర్వా - పుష్ప- అక్షతాదులను శిరస్సునను ఉంచవలెను. ఈ విధముగ పది సంస్కారములచే పరమేశ్వరుని సంస్కారము చేసి, గంధ పుష్పాది పంచోపచారములతో యథా విధిగ పూజింపవలెను. మొదట దేవతా విగ్రహమునకు ఉదకముచే అభిషేకము చేసి, రాజికాలవణాదులతో ఉద్వర్తన మార్జనములు చేయవలెను. పిమ్మట ఆర్ఘ్య జలబిందువులు, పుష్పములు మొదలగు వాటితో అభిషేకము చేసి ఘటములో నున్న ఉదకముతో మెల్ల మెల్లగ స్నానము చేయించవలెను.
పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార వీటిని వరుసగ ఈశానతత్పురుష-ఆ ఘోర-వామదేవ-సద్యోజాత మంత్రములతో అభిమంత్రించి, వాటితో మాటిమాటికి స్నానము చేయించవలేమ. వాటిని కలిపి పంచామృతము చేసి, దానితో భగవంతునకు స్నానము చేయించవలెను. దీనివలన భోగ మోక్షములు, లభించును. పైన చెప్పిన క్షీరము మొదలైనవాటిలో జలధూపములు కలిపి, మూలమంత్రముతో శివునకు అభిషేకము చేయవలెను. పిదప యవపిష్టముతో జిడ్డుపోవు నట్లు చేసి.
భోగేచ్ఛ గల సాధకుడు పై శ్లోకము పఠించుచు, మూలమంత్ర ముచ్చరించుచు కుడి చేతిలో అర్ఘ్యాదకము గ్రహించి, దానిని భగవంతుని వర ముద్రతో కూడిన హస్త ములో విడువవలెను. మరల ఈ విధముగ ప్రార్థించవలెను. “మహాదేవా! కల్యాణ స్వరూపుడవగు నీ పాదములను శరణు జొచ్చినాను. నేను చేసిన శుభాశుభ కర్మల నన్నింటిని తొల గింపుము “హూం క్షః శివుడే దాత. శివుడే భోక్త శివుడే ఈ సకల ప్రపంచము, సర్వత్ర శివునకు జయమగు గాక. శివుడే నేను ఈ రెండు శ్లోకములు చదువుచు చేసిన జపమును శివునకు సమర్పింపవలెను. పిమ్మట పూర్వము చేసిన శివ మంత్రజపములో దశాంశము మరల జపించవలెను. (హోమపూర్తి కి ఇది అవసరము) మరల ఆర్ఘ్య మిచ్చి. భగవంతుని స్తుతించవలెను. పిమ్మట అష్టమూర్తి యగు శిపునకు ప్రదక్షిణము చేసి సాష్టాంగ ప్రణామము చేయవలెను. నమస్కరించి శివద్యానము చేసి, చేతమునందు గాని, అగ్న్యాదులందు గాని శివుని ఉద్దేశించి హోమ-పూజాదులు చేయవలెను.
అగ్ని మహాపురాణమునందు శివపూజావిధి వర్ణన మను డెబ్బది నాల్గవ అధ్యాయము సమాప్తము.
