అగ్ని మహా పురాణము

Table of Contents

160 - అథ వానప్రస్థధర్మ నిరూపణమ్.

పుష్కర ఉవాచః-

పుష్కరుడు చెప్పెను : ఇపుడు వానప్రస్థాశ్రమ ధర్మములు చెప్పేదను; వినుము. జటలు ధరించుట, అగ్ని హోత్రము చేయుట నేలపై పండుకొనుట మృగాజినమును ధరించుట, వనములో నివసించుచు, పాలు, దుంపలు, అడవిధాన్యము, ఫలములు ఆహారముగా గొనుట, ప్రతిగ్రహము నుండి విరమించుట త్రిష వణస్నానము, బ్రహ్మచర్యము దేవాతిథిపూజ ఇది వానప్రస్థుని ధర్మము. పౌత్రుడు జనించిన వెంటనే గృహస్థుడు అరణ్యమునకు పోవలెను. అచట ఒంటరిగా గాని, భార్యాసమేతుడుగా గాని, ఆయుర్దాయమునందలి మూడవ వంతు గడపవలేను. శరీర బలమున్నంతవరకును గ్రీష్మము నందు పంచాగ్ని మధ్య తపస్సు చేయవలెను. వర్షాకాలమునందు ఆరుబై టను, హేమంతమునందు తడిబట్టలు ధరించియు ఉగ్ర మైన తపస్సు చేయవలెను. వెనుకకు మరలక, అవక్రగతియై ముందుకే పోవలెను. అనగా మరల గృహస్థాశ్రమమునకు రాకుండ సన్యాసాశ్రమమునే గ్రహించుటకై ప్రయత్నించవలెను.

ఆగ్ని మహాపురాణమునందు వానప్రస్థధర్మవర్ణన మను నూట అరువదవ అధ్యాయము సమాప్తము.