అగ్ని మహా పురాణము

Table of Contents

173 - అథ పునః ప్రాయశ్చిత్తాని

 ఆగ్ని రువాచః-

పాపములను నశింపచేయు ప్రాయశ్చిత్తమును బ్రహ్మ చెప్పిన విధముగ చేప్పేదను. ప్రాణములను తీయు పని ‘హననము’. రాగ మువలన గాని, ద్వేషము వలన గాని, ప్రమాదము వలన గాని, ఒక బ్రాహ్మణుని, తానే గాని, పర ప్రేరణచే గాని చంపినవాడు బ్రహ్మఘాతకుడు. ఒకే కార్యమును చేయుటకై ఉద్యుక్తులై దాలమంది శస్త్రములు ధరించి వచ్చి నపుడు వారిలో ఒక్కడే బ్రాహ్మణుని చంపినను, వారందరు బ్రహ్మహత్య చేసినట్లే. తిట్టబడి గాని, ఈనాపహా రాదులచే పీడింపబడి గాని ఒక బ్రాహ్మణుడు ఎవని మూలముగా తన ప్రాణములు కోల్పోవునో అతడు బ్రహ్మహత్య చేసిన వాడు. ఔషధాద్యుపకారము చేసినపుడు మరణించినను బ్రహ్మహత్యాదోషము లేదు. పుత్రుని, శిష్యుని,, భార్యనుశ్రీమదగ్ని మహాపురాణము శాసించు నపుడు వారు మృతు లై నను పాపము లేదు. దేశమును, కాలమును, వయస్సును, శక్తిని, పాపమును బాగుగా పరీక్షించి, మరొక విమోచనోపాయము లేనపుడు ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. బ్రహ్మహత్య చేసినవాడు మరొక బ్రాహ్మణుని కాపాడుటకు గాని తన ప్రాణములు విడచినచో లేదా ఆగ్నిలో దుమికినచో ఆతని బ్రహ్మహత్యాపాపము తొలగును. శిరస్సుకపాలమును గుర్తుగా ధరించి, తాను చేసిన పాపము చెప్పుచు, భిక్షాన్నము మితముగా తినుచు పండ్రెండు సంవత్స రములు గడపినచో శుద్ధిపొందును పరిశుద్ధ మైన నడవడిక కలవాడై ప్రవర్తించు వాడు బ్రహ్మహత్య దోషమునుండి ఆరు సంవత్సరములలో విముక్తుడగును. కావలె నని ఈ పాపము చేసినవారు కష్టములేకుండ చేసినవారికి చెప్పిన ప్రాయశ్చిత్తము నకు రెట్టింపు ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. బ్రహ్మహత్య చేయుటకై ఉద్యమించినవానికి మూడు సంవత్సరములు ప్రాయశ్చిత్తము. బ్రహ్మహత్య చేసిన క్షత్రియునకు రెట్టింపు ప్రాయశ్చిత్తము, వైశ్యునకు రెండు రెట్లు, శూద్రునకు మూడు రెట్లు, ఇతర పాపముల విషయమున బ్రాహ్మణునకు పూర్తి ప్రాయశ్చిత్తము, క్షత్రియునకు మూడు పాదములు, వైశ్యునకు శ్రీ - వృద్ద - బాల రోగులకు ఒక పాదము ప్రాయశ్చిత్తము. క్షత్రియవధ చేసినవారికి బ్రహ్మహత్యా ప్రాయశ్చిత్తములో నాల్గవ వంతు ప్రాయశ్చిత్తము; వైశ్యహత్మయందు ఎనిమిదవ వంతు; సదాచారవంతుడగు శూద్రుని హత్యయందు పదహారవ వంతు.

దుష్టురాలు కాని శ్రీని చంపినవాడు శూద్రహత్యకు చెప్పిన ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. గోవును చంపినవాడు మాసము పాటు పంచగవ్యములు భక్షించుచు నియతు డై, గోష్ఠమునందు శయనించుచు, గోవులను అనుసరించుచు, గోవును దానము చేయుటచే శుద్ధుడగును. లేదా కృచ్ఛమును, అతికృచ్ఛమును చేయవలెను. క్షత్రియాదులందు పాదము చొప్పున ప్రాయశ్చిత్తము తగ్గును. చాల ముసలిది,, చాల దుర్బలముగానున్నది, చాల బాల్యావస్థలో నున్నటి యగు గోవును చంపిన ద్విజుడు పైన చెప్పిన వ్రతమును సగము చేయవలెను. యథాశ క్తిగా బ్రాహ్మణులకు భోజనము పెట్టి బంగారము, తిలలు మొదలగునవి ఇవ్వవలెను. గుద్దుచేత గాని, చెంపదెబ్బచేత గాని, కీలముచేత గాని గోవును హింసించివను; చేపలు మొదలగు నవి విరుగగొట్టి నపుడును, కట్టి మొదలగు వాటితో కొట్టినను దానిని గోవధగా చెప్పవలెను. లొంగ దీసికొను నపుడును, లొంగ దీయించేటప్పుడును బండ మొదలైనవాటికి కట్టి నపుడును, స్తంభము, గొలుసు, త్రాడు మొదలైన వాటిచే చనిపోయినను ఒక పాదము తక్కువ చేయవలెను. కజ్ఞచే కొట్టగా చనిపోయినచో సాంతపనము, మట్టి బెడ్డతో కొట్టినపుడు చనిపోయినచో ప్రాజాపత్యమును, జాయితో కొట్టగా చనిపోయిన చో తప్తక ఎచ్చమును, శస్త్రముచే మరణించగాఅతికృచ్ఛమును ఆచరించవలెను. పిల్లిని, ఉడుమును, ముంగిసను, కప్పను, కుక్కను, పక్షిని చంపినవాడు మూడు దినములు క్షీరము మాత్రమే లా, కృచ్ఛమును, చాంద్రాయణమును చేయవలెను. ఈ వధ రహస్యముగా చేసినచో వ్రతము కూడ రహస్యముగా చేయవలెను. ప్రకాశముగా చేసినపుడు ప్రకాశముగా చేయవలెను. సర్వపాపములను తొలగించుకొసుటకు నూరు ప్రాణాయామములు చేయవ రెను. పానకము, ద్రాక్షామధువు, ఖర్జూర జన్యము, తాళవృక్ష భవము ఇక్షురసభవము. మాధ్వీకము, టంక మాధ్వీకము, మైరేయము, నారి కేలవృక్షమలము, ఇవన్నియు మద్యములే (మాదక ములే) యైనను మద్యములు కావు. పిష్టముతో తయారు చేసినదే నిజమైన సుర. మూడు వర్ణముల వారికిని నిషిద్ధములు మద్యములను త్రాగినవాడు బాగా మరుగుచున్న నీళ్లు త్రాగి శుద్దుడగును. లేదా ఒక సంవత్సరము ధాన్యకణములను మాత్రమే తినవలెను. లేదా ఒక పర్యాయము మాత్రమే రాత్రి యందు తెలకపిండి తినుచు సంవత్సరముగడపవలెను. సురాపానదోషనివృత్తికొరకు జటాధారియై, సురాపానము చేసిన గుర్తు ధరించి కంబళ ధారియై ఉండవలెను.

మలమూత్రములను, సుర తగిలిన ఆహారమును తెలియక భుజించిన మూడు వర్ణములవారును పునఃసంస్కారార్డులు మద్యభాండములో నున్న నీళ్ళు త్రాగినవాడు ఏడు రోజులు వ్రతము చేయవలెను. చాండాలోదకము త్రాగినవాడు ఆరు దినములు వ్రత మాచరించవలెను. చాండాలుల కూపభాండములయందు నీరు త్రాగినవాడు సాంత్వనము చేయవలెను. అంత్యజాతీయుల జలము త్రాగిన ద్విజుడు త్రిరాత్రో పవాసము చేసి పంచగవ్య వ్రాశనము చేయవలెను. మత్స్యములు, కంటకములు, శంబూకము (నత్త గుల్ల శంఖములు, ముత్యపు చిప్పలు, కపర్దములు, చిన్న వాడును, నవోదకము త్రాగినవాడును పంచగవ్యముచే శుద్దుడగును. శవకూపో వకము త్రాగినవాడు మూడబాత్రులలో శుద్దుడగును. చాండా లాన్నము తిన్న వాడు చాంద్రాయణవ్రతము చేయవలెను. ఆపత్కాలమునందు . శూద్ర గృహమున భుజించినవాడు మనస్తాపముచే శుద్ధు డగును. శూద్రుల పాత్రతో భుజించిన విప్రుడు ఉపవాసముండి పంచగవ్ భక్షణ చేయుట చే శుద్దుడగును. కందుపక్వమును (దుంగలములో వేయించిన పదార్థము) తైల పర్వమును స్నేహ పదార్థము, పెరుగుతో కలసినసర్దువు గుడక్షీరరసాదికము కూడ శూద్రుని నుండి గ్రహించినను అనింద్యములు. స్నానము చేయకుండ భుజించినవాడు ఉపవాసము చేసి దినాంతమునందు జపము చేయుటచే శుద్దు డగును. మూత్రవిసర్జన చేసి అశుచిగా వున్నపుడు భుజించిననాడు మూడు రాత్రుల ఉపవాసము చే శుద్దుడగును. కేశ కీటాదులతో కూడినదానిని, కావలె నని పాదముతో స్పృశించిన దానిని కాకులు తిన్న దానిని, కుక్క ముట్టినదానిని, గవాదులు వాసనచూచినదానిని తిన్న వాడు మూడు దినములు ఉపవాసము చేయవలెను. రేతస్సును, మలమూత్రములను భక్షించిన వాడు ప్రాజాపత్యము నాచరింపవలెను.

నవక్రాద్ధమునందు భోజనము చేసిన వాడు చాంద్రాయణమును, మాసికమునందు పరాక ప్రాయశ్చిత్తము, పక్షత్రయ శ్రాద్దమునందు అతికృతమును, షణ్మాసమునందు కృచమును, ఆబ్దికమునందు పాదకృచ్చమును, మరల ఆబ్దికముందు ఏకాహము వెనుకటిరోజున వార్షిక శ్రాద్ధము మరునాడు మరల ఆబ్దికము నందు ఏకాహము చేయవలెను. నిషిద్ధవస్తువులను భక్షించినచో ఉపవాసముండుట ప్రాయశ్చిత్తము. భూతృణమును, లశునమును తిన్న వాడు శిశుకకృచ్చము చేయవలెను. అభోజ్యుల అన్నము తిన్నను, శ్రీశూద్రోచ్ఛిష్టమును తిన్నను, అభక్ష్యమాంసమును తిన్నను ఏడు దినములు పాలు త్రాగ వలేను. మధుమాంసములను, శావాశౌచాన్నమును తిన్న బ్రహ్మ చారియు, యతియు వ్రతస్థుడును ప్రాజాపత్య - కృచ్ఛములు చేయవలెను. అన్యాయముచే పరధనాప హరణము స్తేయము.స్వర్ణ సేయము చేసినవాడు రాజుచే ముసలముతో కొట్టిచంపబడినచో శుద్దు డగును. స్వర్ణ స్తేయము చేసినవాడును, సురాపానము చేసినవాడును, బ్రహ్మహత్య చేసినవాడును, గురుతల్పగుడును క్రిందపండుకొనుచు, జటాధారియై ఆకులు, దుంపలు, ఫలములు మాత్రము ఒక పూట మాత్రమే తినుచు ఉన్న చో పండ్రెండు సంవత్సరములలో శుద్ధుడగును (కృచ్ఛ్రము)స్తేయము చేసిన వాడును సురాపానము చేసినవాడునుఒక సంవత్సరము సురాపానము చేయవలెను. మణులు, ముత్యములు, పొగడములు, రాగి, వెండి, ఇనుము, కంచు, రాళ్ళు అపహరించినవాడు పండ్రెండు దినములు కణములు మాత్రమే భుజించవలెను. మనుషులను స్త్రీలను పొలమును, గృహమును, వాపీకూపతనాగములను హరించినవాడు చాంద్రాయణము చేయవలెను. భక్ష్యములను, భోజ్యములను, వాహనములను శయ్యను ఆసనమును, పుష్పమూలఫలములను అపహరించినచో పంచగవ్యముచే శుద్ధి యగును.

తృణ - కాష్ట - ద్రుమములను, కుషాన్నమును, బెల్లమును, వస్త్ర-చర్మ -మాంసములను అపహరించినవాడు మూడు దినములు ఉపవాసము చేయవలెను. తండ్రి భార్య, సోదరి, ఆచార్యపుత్రి, గురుభార్య, స్వసుత వీరితో సంగము చేసినవాడు గురుతల్పగుడు. ఈ పాపము చేసినవాడు చేసిన పాపమును చెప్పుచు, కాలుచున్న ఇనుప పెనము పై ప్రజ్వలించు చున్న ఇనుప స్త్రీమూర్తి ని కౌగలించుకొని మరణించినచో శుద్ధి పొందును. లేదా గురుతల్పగుడు మూడు చాంద్రాయణములను చేయవలెను. పతిత స్త్రీలు కూడ ఇట్లే చేయవలెను. పర భార్యాగాము లైన పురుషుల కేది ప్రాయశ్చిత్తమో స్త్రీలకు గూడ అదే ప్రాయశ్చిత్తము. బాలికలు, చాండాలస్త్రీలు, కుమార్తెలు, సపిండుల కుమార్తెలు భార్యలు, వీరి సంగము చేసినవారికి మరణమే ప్రాయశ్చిత్తము. ఒక రాత్రి శూద్రస్త్రీ సంగము చేసిన ద్విజుడు భిక్షాన్నము తినుచు, నిత్యము జపము చేసినచో మూడు మాసములలో ఆ దోషమును పోగొట్టుకొనును. తండ్రి సోదరుని భార్య, సోదరుని భార్య, చాండాలస్త్రీ పుక్కపీశ్రీ, కోడలు సోదరి, సఖురాలు, తలిదండ్రుల సోదరి, తన దగ్గర దక్షణ నిమిత్తమై ఉంచిన స్త్రీ, శరణుజొచ్చిన శ్రీ, మేనమామ కూతురు, సోదరి, సగోత్ర యైన శ్రీ, అన్యుని కోరుచున్న స్త్రీ, శిష్యభార్య, గురు భార్య వీరితో సంగము చేసినవాడు చాంద్రాయణము చేయవలెను.

అగ్ని మహాపురాణమునందు ప్రాయశ్చిత్తనిరూపణ మను నూట డెబ్బది మూడవ అధ్యాయము సమాప్తము.