అగ్ని మహా పురాణము

Table of Contents

262 - అథాథర్వవిధానమ్

పుష్కర ఉవాచః

పుష్కరుడు పలికెను : పరశురామా! సామవిధానము చెప్పబడినది. ఇపుడు ఆధర్వవిధానమును చెప్పెదను. శాంతాతీయ గణమునుద్దేశించి హోమము చేసినచో మానవుడు శాంతిని పొందును. బహషజ్య గణమునుద్దేశించి హోమము చేసినవాడు సమ స్తరోగములను తొలగించుకొనును. ఆసప్తీయ గణమునుద్దేశించి ఆహుతులనిచ్చువాడు సకలపాపవిముక్తుడగును. అథయగణమునకు హోమము చేసిన వానికి ఎచటను భయముండదు. పరశురామా! అపరాజితగణమునకు హోమము చేసిన వానికి పరాజయముండదు. ఆయుష్యగణమునకు హోమమను చేసిన వానికి అపమృత్యు భయముండదు. స్వస్యయన గణమునకు హోమము చేసినవాడు అంతటను మంగళములు పొందును. శర్వవర్మగణమునకై హోమము చేయువాడు శ్రేయస్సు పొందును. వాస్తోష్పత్యగణమునకు హోమము చేయువాడు వాస్తుదోషములను తొలగించును. రౌద్రగణమునకు హోమము చేయుటచే సకలదోషములు. నశించును. క్రింద చెప్పబోవు పదునెనిమిది విధములగు కాంతులతో పదిగణములకు హోమము చేయవలెను. వైష్ణనీ, ఫోంది, బ్రాహ్మి, రౌద్రి, వాయవ్య, వారుణి, కౌబేరి, భార్గవి, ప్రాజాపత్య, త్వాష్ట్రి కౌమారి, ఆగ్నేయి, మారుద్గణి, గాంధర్వ నైఋతికి, ఆంగీరసి, యామ్య ఈ పదునెనిమిది కోరికలను తీర్చు పార్థివ శాంతులు.

“యస్త్వాం మృత్యుం” అను మంత్రమును జపించినచో మృత్యువు నశించును. సుపర్ణస్వా (4-63) ఆను మంత్రముచేహోమము చేసినవానికి సర్పదాధ వుండదు. “ఇంద్రేణదత్తా” (2-2-94) అను మంప్రము సమస్త కామసిద్ధికరము. “ఇండ్రేనాదత్తమ్” అను మంత్రము సమస్త బాధావినాశకరము. “ఇమాయాదేవి” (2-10-4) అను మంత్రము సర్వశాంతి కరము. “దేవామరుతః” అను మంత్రము సకలకామప్రదమ. “యమస్యలోకాత్” (19-56-1) అనుమంత్రము దుప్పప్పు నాశమున శ్రేష్టము. “ఇంద్రశ్చపంచవణిజః” అనమంత్రము వర్తకమరో లాభము కలిగించును. “కామోమేవాజి” అను మంత్రముతో హోమము చేసిన స్త్రీలకు సౌభాగ్య వృద్ధి కలుగుమ. “తుభ్యమేవ జవీమన్ (2-28-1) అను మంత్రమ వెయ్యిసార్లు ఇపించి దశాంశ హోమము చేసి పిదప “అగ్నేగోభిర్నః” అను మంత్రముతో హోమము చేసినచో మేధాశక్తి పెంపొందును. “ధ్రువంధ్రువేణ” (7-84-1) అను మంత్రముతో హోమము చేసినచో ఉత్తమస్థానము లభించును. “అలక్తజీవేతిననా” అను మంత్రము కృషిలో లాభము కలిగించును. “ఆహంతే భగ్న?” అను మంత్రము సౌభాగ్య వర్దకము. “యేమేమో!” అను మంత్రము బంధనము నుండి విముక్తి కలిగించును. “శపత్వహన్” అను మంత్రముతో జపహోమములు చేసినవాడు శత్రువులను నశింపచేయ కలుగును. “త్వముత్తమ” అను మంత్రము యశస్సును బుద్ధిని వృద్ధిపొందించును. “యదామృగాః” ఈ మంత్రము స్త్రీల సౌభాగ్యము పెంపొందించును. యేన చేహదిశం చైవ” అను మంత్రము గర్భము నిచ్చును. “ఆయంతే యోనిః” (3-20-1) అను మంత్రము పుత్రలాభకరము. “శివశ్శివాభిః” అను మంత్రము సౌభాగ్యవర్ధకము. “బృహస్పతిర్నఃపరిపాతు” (7-51-1) అనుమంత్రమును జపించుటచే మార్గమున క్షేమము కలుగును. “ముంచామిత్వా” అను మంత్రము అపమృత్యునివారక ము. ఆథర్వశీరమును పఠించువాడు సమ స్తపాప విముక్తుడగును. కొన్ని ప్రధాన మంత్రములచే సాధింపతగిన కర్మలను నీకుచేప్పితిని. పరశురామ! యజ్ఞోపయుక్తములగు వృక్షముల సమిధలు అన్నిటి కంటెను ముఖ్యమైన హవిస్సు, ఘృతము. ధాన్యము, తెల్లని ఆవాలు, అక్షింతలు, తిలక, దధి, దుగ్గవ, కుశలు తూరలు, బిల్వములు, ఈద్రవ్యములు కూడ శాంతిపుష్టి కరములు. తైలము, కజములు, రాజికలు, రక్తము, విషము, కంటక యుక్తసమిధలు వీటిని అభిచార ప్రయోగము నందు ఉపయోగించవలెను. మంత్రముల ఋషి, దేవతా, ఛందో, వినియోగ ములు తెలిసినవాడే ఆయామంత్రములతో ఆయాకర్మలను చేయవలెను.

అగ్ని మహాపురాణమున అథర్వవిధానమను రెండువందల అరువదిరెండవ అధ్యాయము సమాప్తము.