అగ్ని మహా పురాణము

Table of Contents

323 - అథ షడంగాన్య ఘోరాస్త్రాణి

ఈశ్వర ఉవాచః-

            పరమేశ్వరుడు చెప్పేను. “ఓం హ్రూం హంసః” ఆనుమంత్ర మంత్రముచే మృత్యురోగాదులు శమించును. ఈ మంత్రముతో ఒకలక్షదూర్వా హోమములు చేసి శాంతి పుష్టి లభించును. లేదా కేవల ప్రణవమునుగాని, మాయ బీజమును (హ్రీం) గాని జపించుట చే దివ్యాంతరిక్షభౌమ ఉత్పాతములు శమించును. ఉత్పాత వృక్షము కూడ శమించును. “ఓం నమోభగవతి” మొదలు సాహో వరకును వున్న మూలోక్త మంత్రమును లక్ష జపము చేసి దశాంశ హోమములు చేసిన వాడు సర్వకర్మలను సాధించును. ఇంద్రాదులను కూడ వశము చేసుకొనును. మనమ్యుల విషయము చెప్పవలెనా. ఈ విద్య అంతర్ధానకారిణీ మోహినీజృంభణి, శత్రుబుద్ధిని మోహింపచేయునది. ఈ కామధేను విద్య ఏడు విధములు శత్రుచోరాదులను మోహింపచేయునది. ఈశ్వర పూజితము సర్వ మహాభయముల యందు స్మరింపతగునది యగ మంత్రరాజమును చెప్పెదను. లక్ష జపించి తిల హోమము చేసినచో మంత్రము సిద్ధించును. దీని ఉద్దారములు  వినుము. “ఓం హలే” మొదలు “సాహా” వరకును వున్న మూలో క్షమైనది మంత్రము. దుర్గ దుర్గమునుండి తరింప చేయునుగాన ఆమెకా పేరువచ్చినది. ఈమె మంగళ ప్రదురాలు. “ఓం, హ్రీం చండకపాలిని” మొదలు ఫట్ హీం వత కును వున్న మూలోక మంత్రమును జపించి బియ్యము కడిగి వాటిని ఈ మంత్రముతో ముప్పది పర్యాయములు అభి మంత్రించి వాటిని దొంగలకు పంచి పెట్టినచో ఆ బియ్యమునమలగనే వారి తెల్లటి దంతము పడిపోవును. వారు చౌర్య పాప విముక్తులగుదురు. “ఓం జ్వలల్లోచన మొదలు తేస్వాహా” అను మూలోక మంత్రముతో క్షేత్రపాలునకు బలియిచ్చి న్యాసము చేసినచో గ్రహము వశమగును. శత్రువులు నశింతురు రణ భూమియందు శత్రువులు హతులగుదురు. విష బీజ న్యాసముచే మూడు విధము:గు విషమును లేదా విఘ్న ములను హరించవచ్చును. ఆగురు చందన, కుష్ఠ, కుంకుమ, నాగ, కేసర, నఖ దేవదారువులను సమ ప్రమాణమున గ్రహించి నూరి ధూపము వేయవలెను. దీనిలో తేనె కలిపి దాని సుగంధముతో శరీర మును వస్త్రాదులను ధూపితము చేసినచో వివాదము శ్రీ మోహవము శృంగారము కలహము మొదలగు సమయములందు శుభఫలము లభించును. కన్యావరణ, భాగ్యోదయ సంబంధి కార్యము లందు కూడ సాఫల్యము లభించును. మాయా మంత్రము (హ్రీం)చే ఆభి మంత్రించిన రోచన నాగ కేసర కుంకుమ మనక్మిలలతో తిలకము ధరించి ఎవనిని చూచిన వాడు వశమగును. శతావరి చూర్ణమును పాలతో కలిపి తాగినచో పుత్రులు ఉత్పాదింప కలుగును. నాగ కేసర చూర్ణమును నేతిలో కలిపి తిన్నను పలాశ బీజములను నూరి త్రాగినను పుత్రోత్పాదకుడగును.

“ఓం ఉత్తిష్ఠ” మొదలు “స్వాహా” వరకును వున్న మూలో క్తమగు నది ఇరువది ఆరు అక్షరముల సిద్ధ విద్య. నదీ తీరమునందలి మట్టితో లక్ష్మీమూర్తి చేసి తత్తువులర సముతో మందార పత్రముపై ఇష్ట స్త్రీ నామమును వ్రాయవలెను. పిమ్మట మూత్రోత్సర్గము చేసి ఈ మంత్రమును జపించినచో ఆభిష్ట వశమగుమ. ఓం జూం (“క్షుం సః వషట్”) ఇది మహామృత్యుం జయ మంత్రము. దీని జప హోమములు పుష్టి కార్యములు “ఓం హం సః హ్రూం హూం స హ్రః స్కైః” యీ ఆష్ట వర్ణ మృత సంజీవని విద్య రణమునందు జయము నిచ్చును. ఈశానాదే మంత్రములు కూడ ధర్మకామాది దాయకములు “ఈశానః మొదలు భవోద్భ వాయనమః” యను వరకును మూలో క్షములు ఐదు ఈశానాది మంత్రములు. ఇపుడు భుక్తి ముక్తి ప్రదములగు పంచ బ్రహ్మ యొక్క ఆరు అంగములను చేప్పెదను. “ఓం నమః” పరమాత్మనే మొదలు “తేస్వాహా” వరకును వున్న డెబ్బది ఏడు అక్షరముల హృదయ మంత్రము మనోరథమును ఇచ్చును. ఓం శివ శివాయనమః” ఇది శిరో మంత్రము. ఓం శివ హృదయే జ్వాలినీ స్వాహా శిఖాయై వషట్ ఇది శిథా మం! తము ఓంశివాత్మక మొదలు  “స్తంభయ హూం” వరకును వున్నవి ఒక నూరు ఐదు అక్షరముల కవచ మంత్రము ఓం ఓజసే యనునది నేత మంత్రము. ఓం “ప్రస్ఫుర” మొదలు “హుం ఫట్” వరకును వున్నది  అఘోరాస్త్ర మంత్రము.

అగ్ని మహాపురాణమున షడంగా ఘోరాస్త్ర వర్ణనమను మూడువందల ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.