అగ్ని మహా పురాణము

Table of Contents

89 - ఏకత త్త్వ దీక్షావి      ధిః.

పరమేశ్వరుడు చెప్పెను. ఇపుడు చిన్న దగుటచే ఏకతాత్త్విక దీక్షను గూర్చి చెప్పుచున్నాను. సమయామగుణ మగా, యథోచితడితిని స్వీయమంత్ర సూత్రంధరాదికన చేయవలెను, ఫివుట బము అగ్ని మొదలు శివపర్యంతమైన సమస్తతత్త్వముల చింతనము చేయవలెను. సూత్రములో మణులు గ్రుచ్చబడి యున్నట్లు అన్ని తత్వములును శివ తత్త్వములో గ్రుచ్చబడి యున్నవి. శివతత్త్వాద్యావాహనము చేసి, వెనుకటివలే గర్భాధానాది సంస్కారములు చేయవలెను. కాని సర్వశుల్క సమర్పణమును మాత్రము మూలమంత్రముతో చేయవలెను. పిమ్మట తత్త్వసమూహగర్భిత మైన పూర్ణా హుతి ఈయవలెను, ఆ ఒక్క ఆహుతి చేతనే శిష్యుడు నిర్వాణము పొందగలుగును. శివునియందు నియోజనము, స్థిరత్వా పాదనము చేయుటకును రెండవ పూర్ణాహుతి కూడ చేయవలెను. పిమ్మట శివకలశజలముతో శిష్యునకు స్నానము చేయించ వలెను.

అగ్ని మహాపురాణమునందు ఏకతత్వదీక్షావిధివర్ణన మను ఎనుబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.