అగ్ని మహా పురాణము

Table of Contents

286 - అధ మృత్యుంజయ కల్పాః  

ధన్వ న్తరి రువాచః

ధన్వంతరి చెప్పెను. ఆయుర్దాయ ప్రదములు రోగ వినాశ కములగు మృత్యుంజయ కల్పములను చెప్పెదను. మధు, మృత, త్రిఫలా, అమృతములు మూడు వందల రోగములను తొలగించును. త్రివలను నాలుగు లేదా రెండు లేదా ఒక తులములు సేవించవలేను. ఒకమాసము, విల్వ లనగ్యము చేసికొన్న చో ఐదువందల సంవత్సరములు జీవిం చును. కవియగును. తిల, భల్లాతకములు రోగమును, అపమృత్యువును వశులను తొలగించును. వాకుచీపంచాంగ చూర్ణములను అడిరోదక ముతో ఆరుమాసములు సేవించినచో కుష్ఠము నశించును. నీలకురంట చూర్ణమును క్షీరముతోగాని. మధువుతోగాని సేవించిన మంచిది. ఖండ దుర్గ వణను పానము చేయువాడు, నూరు సంవత్సరములు జీవించును. మధు ఆజ్య శంథులను, ప్రతి దినము ప్రాతఃకాలము, ఒక పలము సేవించువాడు మృత్యువును జయించును. మాండకీ చూర్ణముతో క్షీరము సేవించువానికి వకులు, పలితము వుండదు. ఉచ్చటను, మధువుతో ఒక కర్తమా, తిని క్షీరపానము చేయువాడు, మృత్యువును జయించును, మధుమృతముతో గాని, క్షీరముతోగాని, నుర్గండిరసమును సేవించువాడు రోగ మును మృత్యువును జయించును. ఒక తులము పలాశ తైలమును మధువుతో ప్రతిదినము ఆరుమాసములు, , సేవించుచు, దుగ్గము త్రాగువాడు ఐదువందల సంవత్సరములు జీవించును. పాలతో కూడ జ్యోతిష్మతి పత్రరసమునుగాని త్రివలను గాని త్రాగువాడు వెయ్యి సంవత్సరములు జీవించును. మధువుతో ఘృతము, వాలుగు తులముల శతావరి చూర్ణము, సేవించు వాడు, సహస్ర వర్ష జీవియగును నిర్గుండిని, మధు మృతములతోగాని, పాలతో గాని సేవించిన రోగమృత్యువు లను నశింపచేయును. పంచాంగ నింబరసమును ఐదీర క్వాథముతో భావన చేసి భృంగరాజ రసముతో ఒక తులము సేవించినచో రోగములను జయించి అమర్త్యుడగును. రుదంతికా చూర్ణమును మృతమధువులతో గాని దుగ్గ ముతో గాని సేవించువాడు, మృత్యువును జయించును. హరీతకీ చూర్ణమును భృంగరాజరసముతో భావ నచేసి మృతమధువులతో సేవించినచో రోగముక్తుడై మూడువందల సంవత్సరములు జీవించును. వారాహికా భృంగ ర సలోహ చూర్ణ శతావరీ, ఆజ్యములను ఒక తులము సేవించినచో అయిదువందల సంవత్సరములు జీవించును. లోహ భస్మను శతావరిని భృంగరాజ రసముతో భావన చేసి మధుమృతములతో సేవించినవాడు మూడువందల సంవత్సరములు జీవించును. తామభస్మ, అమృతాత్రివృత్, గంధకములను సమముగ గ్రహించి కుమారికా రసముతో రెండుగురివిందెల గోలీలు తయారు చేసి ఘృతముతో సేవించుటచే ఐదువందల సంవత్సరములు జీవించును. ఆశ్వగంధ; త్రిఫలాశర్కర, తైల ఘృతములను సేవించువాడు నూరు వర్షములు జయించును.

అశోక వృక్షము బెరడు యొక్క చూర్ణమును మధు ఘృతములతో సేవించి దుగ్గ పానము చేయుటచే రోగములు నశించును. పునర్నవా చూర్ణమును మధు ఆజ్య క్షీరములతో సేవించిన పోడు రోగ విముక్తుడగును. మధు సహిత మగు తిల తైలమును నశ్యముగ తీసుకొన్న చో శత వర్ష జీవి యగును. కృష్ణ కేశములు కలవాడు యగును. ఆక్ష చూర్ణమున ఒక తులము మధ్వాజః క్షీర ములతో సేవించిన శరాయువగును, ఆభయా గుడములను మధురాది ఓషధులను ఘృతముతో తిని, పాలతో అన్నము భుజించు వాని కేశములు సర్వదా కృష్ణ వర్ణములై యుండును. ఆతడు రోగ రహితుడై అయిదు వందల సంవత్సరములు జీవించును. ఒక పలము కూష్మాండ చూర్ణమును మృత దుగ్గములతో ఒక మాసము సేవించుచు దుర్గాన్న భోజనము చేయువాడు రోగరహితుడై సహస్ర వర్ష జీవియగును కౌలుక చూర్ణమును భృంగాజ్యమును మడమృతము లతో సేవించిన వాడు నూరు సంవత్సరములు జీవించును. ఒక తులము కడుతుంటే తైలమును నశ్యముగా గ్రహించు వాడు రెండు వందల సంవత్సరములు జీవించుమ. త్రిఫలా పిప్పలి కుంతుల సేవనము మూడు వందల సంవత్సరము ఆయుర్దా యము నిచ్చును. వీటిని శతావరితో కలిపి సేవించినచో బలమును, సహస్రాయువును ఇచ్చును. చిత్ర శుంఠి విడంగముల సేవనము పూర్వోక్తి ఫలమును ఇచ్చును. త్రిఫలా, పిప్పల శుంఠులను లోహ భృంగరాజ, నింబ పంచక, ఖదిర నిర్గుండి, అంటకారి వాసక పునర్నవలతో గాని, వీటి రసముతో భావవ చేసి కాని, వటి లేదా చూర్ణము తయారు చేసి మృత మధుగుడ జలాదులతో సేవించినచో పూర్వోక్త ఫలము లభించును. "ఓం హ్రూంసః" అను మంత్రముచే అభి మంత్రిత మగు యోగ రాజము మృత్యు సంజీవని సమానమై రోగములను మృత్యువులను జయింప చేయును. ఈ కల్ప సాగరములను దేవతాసుర మునులు సేవించిరి. పాలకాప్యుడు అంగరాజునకు గజాయుర్వేదము బోధించెను.

ఆది మహాపురాణమున మృత్యుంజ కల్పమను రెండు వందల యెనుబది ఆరవ అధ్యాయము సమాప్తము.