అగ్ని మహా పురాణము
220 - అథ రాజ్ఞః సహాయసమ్పత్తిః
పుష్కర ఉవాచః
పుష్కరుడు పలికెను : ఆభిషేకానంతరము ఉత్తముడగు రాజు మంత్రి సమేతుడై శత్రువులను జయించవలెను. సత్కులప్రసూతుడు, నీతిశాస్త్రజ్ఞుడు ఆగు బ్రాహ్మణుని గాని క్షత్రియునిగాని సేనాపతిగా నియమించవలెను. ద్వారపాలకులు గూడ నీతిజ్ఞులై యుండవలెను. దూత కూడ మృదుభాషి యై, అత్యంత బలసామర్థ్యవంతుడై ఉండవలెను. శ్రీ గాని, పురుషుడు గాని రాంబూలధారి కావచ్చును. కాని ఆ వ్యక్తి రాజభక్తి కలిగి, క్లేశ సహిష్ణవే, స్వామి ప్రీతి పాత్రము కావలెను. సంధి - విగ్రహ - యాన – ఆసన -ద్వైధీభావ సమాశ్రయములను ఆరు గుణములను సమయానుసారముగా ప్రయోగింప గలుగు వానిని సాంధీ విగ్రహకునిగా నియమింపవలెను. రాజరక్షకుడు సర్వదా ఖడ్గముబూని యుండవలెను. సారథి సేనాది వియకమగు మంచి జ్ఞానము కలవాడై ఉండవలెను. పాకశాలాధ్యక్షుడు రాజహీరాభిలాషియై, చతురుడై సర్వదా పాకశాలలోనే ఉండవలెను. రాజసభాసదస్యులు ధర్మవేత్తలై యుండవలెను. వ్రాయసగాండ్రు వివిధ లిపివేత్తలే రాజ హితై మలై ఉండవలెను. ద్వారపాలకులు రాజహితచింతకులై, రాజు ఎప్పుడు తమను పికచునో తెలిసినవారై ఉండవలెను. ధనాధ్యక్షుడు రత్నపరీక్షా నిపుణుడై , ధనమును వృద్ధి చేయుట యంతాసక్తి కలవాడై ఉండవలెను. రాజవైద్యుడు ఆయుర్వేద నిపుణుడై యుండవలెను. గజాధ్యక్షుడు గజవిద్య యందు ప్రవీణుడై ఉండవలెను. ఏనుగులపై ఎక్కు మావటిడు పరిశ్రమచే ఆలసట చెందనివాడు కావలెను. అక్వాధ్యక్షుడు అశ్వవిద్యావిశారదుడై ఉండవలెను. దుర్గాధ్యక్షుడు రాజహితైషియై బుద్ధిమంతుడై ఉండవలెను. శిల్పులు వాస్తు విద్యావిశారదులై ఉండవలెను. యంత్రముల ద్వారా ఆయుధములు ప్రయోగించుట, హస్తముచే శస్త్రములను విడచుట, శస్త్రములను ప్రయోగింపకుండుట. విడచిన శస్త్రములను నివారించుట మొదలగు యుద్ధ రీతులందు ప్రవీణుడు, రాజుహితమును కోరువాడు ఆగు వానిని శస్త్రాచార్యపదమునందు నియమించవలెను. వృద్దుని అంతఃపురాధ్యక్షుని చేయవలెను. ఆంతఃపురమునందలి అన్ని కార్యములను నిర్వహించుటకు ఏబది సంవత్సరముల స్త్రీలను, డెబ్బది సంవత్సరముల పురుషులను నియమించవచ్చును. సర్వదా జాగరూకులైన వారినే ఆయుధాగారమున నియమింపవలెను. భృత్యులకు వారి వారి కార్యములను బట్టి జీవిక ఏర్పరుపవలెను. ఉత్తమ - మధ్యమ - ఆధమ కార్యానుసారముగా అట్టివారినే ఆయా కార్యములందు నియోగించ వలెను. విజయాభిలాషియగు రాజు స్వహితైషులగు వారినే సహాయకులుగా నియమించవలెను. ధర్మ కార్యములందు ధర్మాత్ములను, యుద్దమునందు శూరులను, ధర్జనమునందు ఆర్థ కుశలులను నియమించవలెను. శుద్ధమగు ప్రవర్తన, ఆలోచన కలవారినే ఆయా కార్యములందు నియోగించవలెను.
స్త్రీల సంరక్షణ విషయమున నపుంసకులను నియమించవలెను. క్రూర కార్యములందు తీక్ష్ణ స్వభావులగు వారిని నియోగించవలెను. ధర్మార్థ కామములను హరించుయందు ఏ పురుషుడు సమర్థుడుగ కనబడునో ఆతనిని నియమించ వలేను. నీచకార్యములందు అట్టివానినే నియోగించవలెను. పురుషులను అనేక విధముల పరీక్షించిన పిదపనే వారిని తగు కార్యములందు నియోగించవలెను. మంత్రితో ఆలోచనలు చేయుచుండవలెను. కొందరికి వృత్తికల్పించి ఏనుగులున్న అడవులలో వారికి నివాస మేర్పరచి వారి విషయము తెలుసుకొనుచుండు కే ఉత్సాహవంతు లగు అధ్యక్షులను నియమించవలెను. ఎవరికి ఏ కార్యమునంచు నే పుణ్య మండ నో వారిని ఆ కార్యమునందు నియమించవలేను. తండ్రి తాతల నుండి తరతరాలుగా వచ్చుచున్న భృత్యులను అన్ని కార్యముందనుని యోగించ వచ్చును. వారందరును సమానులే గాన వారిలో ఎవరినికూడ ఇతరులపై అధికారిగ నియమించగూడదు. ఇతర రాజుల నుండి తనను ఆశ్రయించుటకై వచ్చినవారికి, వారు దుష్టలైనను, ముచివారై నను ప్రయత్నపూర్వకముగ ఆశ్రయమీయవలెను. వారు దుష్టులని తెలిసినచో వారిని విశ్వసించగూడదు. వారి జీవితా వృత్తిని తన ఆధీనమునందుంచు కొనవలెను. ఇతర దేశ ములనుండి వచ్చిన వారిని గూఢచారులద్వారా బాగుగా పరీక్షించి తగు విధమున సత్కరించవలెను. శత్రు - అగ్ని - విష - సర్ప - ఖడ్గములు ఒక ప్రక్క దుష్టులగు థృత్యులు మరొక ప్రక్క. వీరిలో దుష్టభృత్యులు అధిక థయంకరులు. రాజు గూఢచారులనే నేత్రములుగ ఉపయోగించవలేను. అందుచే అన్ని విషయములు తెలుసుకొనుటకై గూఢచారులను సమ కూర్చుకొనవలెను. జనులచే గుర్తింప శక్యముకానివారిని శాంత - కోమలస్వభావము కలవారిని, గూఢచారులనుగా నియమించవలెను. వారు ఒకరికొకరు కూడ తెలియనివారుగా ఉండవలెను. వారిలో కొందరు వర్తకులుగాను, కొందరు మంత్రతంత్రవేత్తలుగాను, కొందరు జ్యోతిష్కులుగాను, కొందరు వైద్యులుగాను, కొందరు సంన్యాసులుగాను, కొందరు బలాబల ఏరక ర్తలుగాను సంచరించుచుండవలెను. రాజు ఒక్క గూఢచారి చెప్పిన ఆ నమ్మకూడదు. చాలమంది ఒకే విధముగ చెప్పినయెడలనే నమ్మ వలెను భృత్యులలో ఎవనికి తవపై అనురాగ మ్నుదో ఎవనికి లేదో, ఎవనిలో ఏసద్గుణ ములున్నవి, ఏదుర్గుణము లున్నవి, శుభచింతకుడెవడు అకథచింతనుడెవడు. అను విషయములను తెలిసికొనవలెను. ప్రజల అనురాగమును పెంచు కార్యములను మాత్రమే చేయవలెను. వారికి వై ముఖ్యమ కలుగు పని చేయకూడదు. ప్రజానురాగమును పెంచు లక్ష్మీగల రాజే నిజమైన రాజు, ఆందరిని రంజింపచేయుట చేతనే అతడు ’రాజు’ అని చెప్పబడుచున్నాడు.
అగ్ని మహాపురాణమునందు రాజసహాయసంపత్తివర్ణనమను రెండువందలఇరువదవ అధ్యాయము సమాప్తము.
