అగ్ని మహా పురాణము

Table of Contents

354 - అథ కారకమ్

స్కంద ఉవాచః

స్కందుడు చెప్పెను. విభ క్త్యర్థ సమన్వితమగు కారకమును చెప్పెదను. గ్రామోఽస్తి, హే మహార్క, ఇవి ప్రథమ సంబోధనము నకు ఉదాహరణములు. “నౌమి విష్ణుం శ్రియాసహ” ఇచట విష్ణుం ఆనునది కర్మ కావున ద్వితీయలో వున్నది. క్రియా యనువది తృతీయా , సహ యోగముచే వచ్చినది. క్రియ చేయుటలో స్వతంత్రుడు కర్త, వానిని ప్రేరేపించువాడు హేతు కర్త్ర, కర్మనే కర్తగా చెప్పినచో కర్మకర్త. దీనికి “స్వయ భిద్యేత్ ప్రాకృతధీః” “స్వయంభిద్య తేతరుః” ఇత్యాదుల ఉదాహరణములు. అభిహితము, అనభిహితము అని కర్త రెండు విధములు. మొదటిది ఉత్తమము, రెండవది అధమము. “ధర్మ! వ్యాఖ్యాయతే” ఇత్యాదులో కర్త ఆనభిహితము. ఈ విధముగా కర్త ఐదు విధములుగా చెప్పబడినది. కర్మ ఏడు విధములు. “యతిః హరిం శ్రద్దదాతి” ఇచట ఈప్సిత కర్మ, అహిం లంఘయతే; ఇది అనీప్సిత కర్మ, “దుగ్ధంసంభశయప్ రజరయతి” ఇడి ఈప్సితా విప్సిత కర్మకు ఉదాహరణమ. “గోపాలకి గాం పయోదోగ్ధి” ఇది ఆకథిత కర్మ; “గురుం శిష్యం, గ్రామంగమ యతి ఇచట కర్తకర్మ; హరే పూజా క్రియతే”. ఇచట అభిహిత కర్మ. హరేః స్తోత్రం కుర్యాతో ఇచట అనభిహితకర్మ; బాహ్యము అభ్యంతరము అని కరణము రెండువిధములు; “చముషా రూపం గృహ్ణాతి” ఇచట బాహ్యకరణము. “ధాత్రేణలునాతి” ఇచట ఆంతర కర్మము; సంప్రదానము మూడు విధములు;  “బ్రాహ్మణాయ గాం దదాతి” ఇచట ప్రేరక సంప్రదానము. “నరః నృపతయే దాసందదాతి” ఇచట అనుమంత్రక సంప్రదానము. భర్త్రే పుష్పాణిదదాతి. ఇచట ఆనిరాకర్తృక సంప్రదానము; ఆపాదానము రెండు విధములు; ధావతః ఆశ్వాత్ పతితః ఇచట చలాపాదానము . సః వైష్ణవః గ్రామాదాగచ్చతి. ఇచట ఆచలాపాదానము, 

అధికరణము నాలుగు విధములు “దధ్నిఘృతమ్” తిలేషతై లమ్ ఇత్యాదులందు వ్యాపకాధికరణము. కపిః గృహే తిష్ఠతి” ఇచట ఔపశ్లేషిక అధికరణము. జలేమత్స్యః ఇత్యాదులందు వైషయికాధికరణను. గంగయాం . మోష వసతి, ఇత్యాదులందు సామీప్యకాధిక రణము. దీనికే ఔపచారిక పాక్యమని పేరు. కర్త అనభిహితమైనపుడు తృతీయ కాని షష్టి కాని వచ్చును. ఉదా:- లోకైః విష్ణుః సంపూజ్యతే, “తేన లేదా తస్యగంతవ్యమ్." కర్తృ కర్మలు అభిహితమైనచో ప్రథమా విభక్తి వచ్చును. భక్తః హరిం ప్రణవేత్. ఉదా: హేతర్థమున తృతీయా విభక్తి వచ్చును. ఉదా. అన్నే న వసేత్. తాదర్థ్యమున చతుర్థి వచ్చును. ఉదాహరణమ వృక్షాయ జలమ్. వరి, అప, తీజ్ మొదలగు వాటితో సంబంధ మున్నపుడు పంచమి వచ్చును. ఉదా. దేవః పరిగ్రామాత్ వృష్టః; పూర్వః గ్రామాత్, ఋతేః విష్ణోః నముక్తి మరొక ఉదాహరణము. ఇతరః హరేః, పృథక్ వినా మొదలగు వాటితో సంబంధమున్నపుడు పంచమి కాని తృతీయ కాని వచ్చును. ఉదాహరణములు. పృథక్ గ్రామాల్ “విహారేణ వినా”, కర్మ ప్రవచనీయలతో సంబంధమున్నపుడు ద్వితీయ వచ్చును. ఉదాహరణములు, అన్వర్జునం యోద్ధారః; అభితః గ్రామమ్. నమః, స్వాహా, స్వధా స్వస్తి, వషట్, మొదలగునవి ప్రయోగించినపుడు చతుర్థి వచ్చును. ఉదాహరణములు. నమః దేవాయ, తేస్వస్తి, భావవాచకము కందే తుమర్థమున చతుర్థి వచ్చును. ఉదాహరణము - పాకాయయాతి మొదలగునవి; సహార్థక శబ్దములతో సంబంధము న్నపుడును త్వర్థమునందును రుత్సి లాంగ వాచకమునకును తృతీయ వచ్చును. ఉదాహరణములు; పిఠాపుతేణ సహ అగార్ అజ్ఞాకాణః, థృత్యః ఆర్థన నివ సేత్ ఇత్యాదులు కాలమునందును భావార్థమునందును సప్తమి వచ్చును. ఉదాహ రణములు. “జ్ఞానతే ముక్తి ర్భవేత్” “వసంతే సహహరింగతః” ఇత్యాదులు నృణాంసామి వృషస్వామి, నృణాం ఈశః, సతాంపతిః, నృణాం సాక్షి, నృమసాక్షి, గోమనాథః, గవాం పతిః, గోష సూతికి, గవాంపూత, రాజ్ఞాం దాయకః. ఇత్యాద్యుదాహరణములలో షష్టి సప్తమీ విభక్తులు వచ్చినవి. స్మృత్యర్థ కర్మకు షష్టి వచ్చును. మాతుః స్మరతి, కర్తృ కర్మలకు నిత్యముగ షష్టి వచ్చును. అపాఁఖేల్తా, తవకృతికి, ఇత్యాదులు ఉదాహరణములు. నిజ్ఞాది, యోగ మునందు షష్టిరాదు. 

అగ్ని మహా పురాణము కారక నిరూపణ మను మూడు వందల యేబది నాలుగవ అధ్యాయము సమాప్తము.