అగ్ని మహా పురాణము
92 - అథ వాస్తు ప్రతిష్ఠావిధిః
పరమేశ్వరుడు చెప్పెను. స్కందా! నేనిపుడు. సంక్షేపముగ క్రమమున ప్రతిష్టను గూర్చి చెప్పెదను పీఠము శక్తి లింగము శివుడు, ఈ రెండింటి యోగము వలన శివసంబంధి మంత్రములచే ప్రతిష్ఠ చేయబడును, ప్రతిష్టలో ‘ప్రతిష్ట’ మొడలగు ఐదు భేదము లున్నది. వాటిని గూర్చి చెప్పెదను. బ్రహ్మ శిలా యోగమున్నప్పుడు విశేషరూపమున చేసిన స్థాపవము ‘ప్రతిష్ఠ’. పీఠముపైననే వీలును బట్టి ఆర్చా విగ్రహమును స్థాపించినచో ఆది స్థాపనము. ప్రతిష్టాలిన్నమగు స్థాపనమునకు స్థిరస్థాపన మని పేరు. ఆధార పూర్వకముగ చేయు లింగ స్థాపనము ఉతాపనము లింగమును స్థాపించి విద్వాంసులు దానికి సంస్కారము చేసినచో అది ఆస్థాపవము. ఇవి శివ ప్రతిష్ఠకు సంబంధించిన ఐదు భేదములు విష్ణ్వాది ప్రతిష్ఠ “ఆస్థానము” ‘ఉత్థానము’ అని రెండు విధములు. ఈ అన్ని ప్రతిష్టలందును. చైతన్య రూపుడగు పరమశివుని నియోజనము చేయవలెను. పదాధ్వాది భేదములచే ప్రాసాదములలో కూడ ఐదు విధములగు ప్రతిష్ట చెప్పబడినది. ప్రాసాదము కొరకై భూపరీక్ష చేయవలెను. మట్టి రంగు తెల్లగా ఉండి మృతసుగంధము గల భూమి బ్రాహ్మణులకు శ్రేష్టము. ఇట్లే వరసగ క్షత్రియులకు ఎఱ్రగా, రక్త గంధము కల మట్టి, వైశ్యులకు పచ్చని, సుగంధము గల మట్టి, శూద్రులకు నల్లని సురాగంధము గల మట్టి గల భూములు శ్రేష్టమైనవి. తూర్పునందును, ఈశాన్యమునందును, లేదా అన్ని దిక్కు లందును పల్లముగా నుండి, మధ్య ఎత్తుగానున్న భూమి ప్రశస్తమైనది. ఒక చేతిలోతు త్రవ్వి తీసిన మట్టిలో ఆగోతిని పూడ్చివేయగా మట్టి మిగిలి పోయినచో ఆ భూమి ఉత్తమమైనది. లేదా జలాదులతో దానిని పరీక్షించవలెను. ఎముకలు బొగ్గులు మొదలగు వాటిచే దూషితమగు భూమిని త్రవ్వుట, ఆవులు మొదలగు వాటిని అచట కట్టుట, చాలసార్లు దున్నుట మొదలగు వాటిచే బాగుగా శోధనము చేయవలెను. నగర - గ్రామ - దుర్గ – గృహ- ప్రాసాదాదుం నిర్మాణము కొరకు భూమిని పై విధముగ శోధన చేయవలెను. ద్వారపూజ మొదలు మంత్రతర్పణ పర్యంతమగు సంపూర్ణ కర్మను మండపమునందు చేసి, విధి పూర్వకముగ ఘోరాస్త్రసహస్రయాగము చేయవలెను. సమముచేసి, అలికిన నేలపై దిక్సాధనము చేయవలెను. సువర్ణ - అక్షత - దధులతో ప్రదక్షిణక్రమమున రేఖలు గీయవలెను. మధ్య భాగమునుండి ఈశానకోక్షమునందున్న, జల పూర్ణకలశమునందు శివుని పూజించవలెను. పిదప వాస్తుపూజ చేసి ఆ కలశలోని జలముతో గునపము మొదలగు వాటిని తడపవలేను. మండపము వెలుపల విధి పూర్వకముగ రాక్షసగ్రహాది పూజచేసి దిక్కులందు బిలు లివ్వవలెను.
కలశపై పూజచేసి లగ్నము వచ్చిన పిమ్మట అగ్నికోణమునండలి కోష్ఠమునందు మొదట తడిపిన మధులిప్తమగు గునపముతో భూమి త్రవ్వి మట్టి నైరృతి దిక్కునందు వేయవలెను. తవ్విన గోతిలో కలశములోని ఉదకము పోయవలెను పిదప భూమితడిపి గునపము మొదలైన వాటిని తడిపి, వాటి హజ చేయవలెను. పిదప ఈ మరొక కలశమును. రెండు వస్త్రములతో ఆచ్చాదించి బ్రాహ్మణుని కంఠముపై నుంచి, వాద్య - వేద ఘోషలతో నగరము తూర్పు సరిహద్దువరకు ఎంత వరకు ఇష్టమో అంతదూరము వెళ్ళి, అచట క్షణకాలము పాటు ఆగి, అచటినుండి నగరము నాల్గు దిక్కులందును ప్రదక్షిణ క్రమమున తిరుగుచు ఈశాన్యము వరకును ఆ కలశమును త్రిప్పవలెను. ఆ పనితో పాటు సీమాంత చిహ్నములను తడుపు చుండవలెను. ఈ విధముగ రుద్రకలశమును నగరము నాల్గువైపుల త్రిప్పి భూపరిగ్రహము చేయవలెను. దీనికి అర్ఘ్య దాన క్రియయని పేరు, పిదప శల్యదోషనివారణార్థమై రాళ్ళు లేదా నీరు వచ్చే వరకును భూమి త్రవ్వవలెను. ఎముకలు మొదలై నవి కనబడినచో వాటిని త్రవ్వించి తొలగించవలెను. లగ్న సమయమున ఎవ్వడై న ప్రశ్న వేయగా ఆతని ముఖము నుండి అ క చ ట త ప స హ అను వర్గములకు చెందిన అక్షరములు బయల్వెడలినచో, ఆ దిక్కులందు శల్యము లుండు నని సూచింపబడుచున్నది. పక్షులు మొదలగునవి వాలినచో అచట శల్యములున్నవని సూచింపబడుచున్నది. కర్త కు ఏ అంగమునందు వికారముండునో తత్సదృశ మగు శల్యమున్నదని నిశ్చయించవలేను, పశ్యాదిప్రవేశము వాటి ఆరపు, పక్షిరవము మొదలగు వాటిచే శల్యములున్న దిక్కు సూచింపబడును. ఒక పట్టిక పై గాని, భూమి మీద గాని అకారాద్యష్ట వర్గయుక్తమగు మాతృకావర్ణములను వ్రాయవలెను. వర్గాను సారము క్రమముగ తూర్పునుండి ఈశాన్యము వరకు నున్న దిక్కులందు శల్యమున్నట్లు తెలియవలెను. అవర్గమైనచో తూర్పున ఇనుము ఉండును. కవర్గమైనచో ఆగ్నేయమున బొగ్గు ఉండును. చవర్గమైనచో దక్షిణమునందు భస్మము ట వర్గమైనచో నైరృతియందు ఎముకలును ఉండును. తవర్గ మైనచో పశ్చిమమున ఇటుకలు, పవర్గమైనచో వాయవ్యమున పెంకులు, యవర్గమైనచో ఉత్తరమున శవములు కీటకము మొదలగునవి సవర్గమైనచో ఈశాన్యమునందు ఇనుము ఉండును. హవర్గమైనచో వెండి, క్షవర్గయుక్త దిగ్భాగమున ఆ దిక్కునందే అనర్థకరము లగు వస్తువు లుండును.
ఒక్కొక్క హస్తము పొడవు గల తొమ్మిది శిలాఖండములను ప్రోక్షించి, వాటిని ఎనిమిదేసి అంగుళము లోపల మట్టి లోపల పాతవలెను. పైన నారుపోసి ముద్గరముతో కొట్టవలెను. ఆ రాళ్ళుమూడు వంతుల పొడవు నేలలో దిగిన పిమ్మట, గొయ్యి పూడ్చి, అలికి, అచటి భూమిని చదును చేయవలెను. గురువు సొమాన్యార్ఘ్యమును చేత ధరించి, చెప్పబోవు మండపము వైపు వెళ్ళవలెను. మండపద్వారమున ద్వారపాలకపూజ చేసి పశ్చిమద్వారమునుండి లోనికి ప్రవేశించవలెను. అచట ఆత్మశుద్ది కుండమండపాది సంస్కారము చేయవలెను. కలశ వర్గన్యాదిస్థాపన చేసి లోకపాలులను, శివుని పూజించవలెను. అగ్ని ననపూజనాదు లన్నియు వెనుకటి వలెనే చేయవలెను. పిమ్మట గురువు యజమానునితో కలిసి శిలల స్నాన మండపమునకు వెళ్ళవలెను. ధర్మాదిసంజ్ఞితము లగు నాలుగు ప్రాసాదలింగ శిల లున్నవి. వాటి ఎత్తు ఎనిమిది అంగుళము లున్నచో మంచిది. చతురస్రములుగను ఒక హస్తము పొడ వుండు నట్లును ప్రస్తరశిలలు నిర్మించవలెను. ఇటుకల ప్రమాణము శిలాప్రమాణములో సగ ముండవలెను. ప్రాసాదమునందు శిలలను, ఇటుకలతో కట్టు ఆలయములలో ఇటుకలు ఉపయోగించవలెను. వాటి తొమ్మిది శిలలను లేదా ఇటుక లను వజ్రాదిచిహ్నములతో చిహ్నితములు చేయవలెను. లేదా ఐదు శిలలను కమలచిహ్నముతో చిహ్నితము చేయవలెను. ఆలయ నిర్మాణము ఈ అంకిత, శిలతోడనే ప్రారంభించవలెను. నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అనునవి ఐదు శిలల పేర్లు. పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, సముద్రము అనునవి ఐదు నిధి కుంభములు. నంద, భద్ర, జయ, పూర్ణ, అజిత, అపరాజిత, విజయ, మంగళ, ధరణీ అనునవి తొమ్మిది శిలల పేర్లు. సుశద్ర, విభద్ర, సునంద, పుష్పదంత, జయ, విజయ, కుంభ, పూర్వ, ఉత్తరములు ఈ తొమ్మిదింటి నిదికలశములు.
ప్రణవమయాసనము నిచ్చి ఆశ్రమంత్రముచే తాడనోల్లేఖనాదులు చేసిన పిదప ఈ శిలల నన్నింటిని సామాన్య రూపమున కవచమంత్రముచే ఆచ్చాదించవలెను. అస్త్రమంత్రము చివర “హుం ఫట్' చేర్చి దానిని ఉచ్చరించుచు మట్టి గోమయము, గోమూత్రము, కషాయములు, గంధయుక్త జలము-వీటితో మలస్నానము చేయించవలెను. పిమ్మట పంచగవ్య పంచామృతములతో యథావిధిగ స్నానము చేయించవలెను. గంధోదకముతో స్నానము చేయించిన పిదప స్వీయనామాంకిత మంత్రముతో శిలను ఫలరత్న -సువర్ణ-గోశృంగ-చందనములతో పూసి, వస్త్రముతో ఆచ్ఛాదించవలెను. స్వర్ణోత మగు ఆసన మిచ్చి, యాగమండప పరిక్రమణము చేసి ఆ శిలను తీసికొని పోయి హృదయ మంత్రముతో శయ్య పై గాని, కుకాస్త రణముపై గాని పరుండబెట్టవలేను. అచట పూజించి, బుద్ధినుండి పృథివివ రకును ఉన్న తత్వముల న్యాసము చేసి త్రిఖండ వ్యావక తత్త్వత్రయమును ఆ శిలలపై క్రమమున న్యాసము చేయవలెను. బుద్ధినుండి చిత్తమువరకు, చిత్తములోపల మాతృ కల వరకు, తన్మాత్రలు మొదలు పృథివి వరకును శివతత్త్వ-విద్యాత త్వ.ఆత్మతత్త్వము లున్నవి. పుష్పమాలాది చిహ్నత స్థానములపై క్రమముగా మూడు తత్వములను, తదీయమంత్రములతోను తత్వేతలను హృదయమంత్రముతోను పూజించే వలెను. ఓం హూం శివతత్త్వాయ నమః, ఓం హం శివతత్త్వాధిపాయ రుద్రాయ నమః, ఓం విద్యాతత్త్వాయ నమః, ఓం హాం విద్యాతత్త్వాధిపాయ విష్ణవే నమః, ఓం హాం ఆత్మతత్త్వాయ నమః, ఓం హాం ఆత్మతత్త్వాధిపతయే బ్రహ్మణే నమః అనునవి పూజోపయుక్తమంత్రములు. ప్రతితత్త్వమునందును, ప్రతిశిల యందును భూ-అగ్ని-యజమాన-సూర్య.జల.వాయు. చంద్ర-ఆకాశము లను ఎనిమిది మూర్తుల న్యాసము చేయవలెను. పిదప క్రమముగ శర్వ - పశుపతి - ఉగ్ర - రుద్ర : భవ - ఈశాన. మహాదేవభీమమూర్తుల వ్యాసము చేయవలెను. “ఓం ధరామూర్తయే నమః, ఓం ధరాధిపతయే శర్వాయ నమః ఇత్యాదులు మూర్తి - మూ ర్తీశ్వర మంత్రములు. పిదప అనంతాది లోకపాలులను వారి వారి మంత్రముతో వ్యాసము చేయవలెను. లూం, రూం, యూం, బ్రోం, త్రూం, ఝం, ఝూం, హ్రూం, త్రం అనునవి ఇంద్రాదిలోక పాలబీజములు. ఇది నవశిలాపక్షమున చెప్పబడినది. పంపశిలపక్షమున ప్రత్యేక తత్త్వమయ శిలను స్పృశించి వాటిపై క్రమముగా పృథివ్యాదిమూర్తి న్యాసము చేయవలెను. బ్రహ్మ-విష్ణు-రుద్ర - ఈశ్వర - సదాశివులు ఐదుగురు మూ ర్తీకులు. ఈ ఐదింటిని పైన చెప్పిన ఐదు మూర్తులందును వెనుకటి వలె పూజించవలెను. “ఓం పృథివీమూర్తయే నమః, ఓం పృథివీ మూర్త్యధిపతయే నమః” ఇత్యాదులు పూజోపయుక్తమంత్రములు.
ఐదు కలశ లను వాటి నామమంత్రములతో పూజించి స్థాపించవలెను. మధ్య శిలాక్రమమున యథావిధిగా న్యాసము చేసి, విభూతి - కుశ - తిలలతో అస్త్రమంత్రవతో ప్రాకారము ఏర్పరుపవలెను. కుండములందు ఆధారశక్తి స్యాస పూజన ములు చేసి, తత్త్వ - తత్త్వాధిప - మూర్తి - మూర్తీ శ్వరులకు మృతాదులతో తర్పణము చేయవలెను. పిదప బ్రహ్మాత్మ శద్ధి కొరకై - మూలాంగము లైన బ్రహ్మమంత్రముతో క్రమముగ నూరు. నూరు హోమములు చేసి, పూర్ణాహుతి వరకును హోమము చేసిన పిదప శాంతి జలముతో శిలలను ప్రోక్షించి పూజించవలెను కుశలతో స్పృశించి ప్రత్యేక తత్త్వమునందు సాంనిధ్య సంధానములు చేసి పిదప శుద్ధవ్యాసము చేయవలెను. ఈ విధముగ క్రమముగా మూడు భాగములందు కర్మల చేయవలెను, “ఓం ఆం ఈం ఆత్మతత్త్వ విద్యాతత్త్వాభ్యాం నమః” అనునది మంత్రము. కుశ మూలాదులతో క్రమముగ ముగ్గురు తత్వేశాదులను స్పృశించి హ్రస్వదీర్ఘ ప్రయోగ పూర్వకముగ తత్త్వానుసంధానము చేయవలెను. అందును మంత్రము - ఓం హం ఉం విద్యాతత్వ శివతత్త్వాభ్యాం నమః పిదప మృతమధు పూర్ణములును, అగ్రమున పంచగవ్యాభిషిక్త ములును ‘పంచ లోకపాలకులు దేవతలుగా కలదియు అగు పంచకలశ లను, వాటి మంత్రమునిచే పూజించి వాటి సమీపమున హోమము చేయవలెను. పిదప సకల శిలాధి దేవతల ధ్యానము చేయవలెను. “ఆ శిలాధిదేవతలు విద్యా స్వరూపులు స్నానము పూర్తి చేసికొనినారు. వాటి శరీర కాంతి బంగారము వలె దేదీప్యమానముగ నున్నది. ఉజ్జ్వలములగు వస్త్రములు ధరించి ఆలంకృతులై యున్నారు న్యూనతాదిదోష పరిహారార్థమును వాస్తు భూమిశుద్ధి కొరకును ఆశ్రమంత్రముతో పూర్ణాహుతివరకును నూరు నూరు హోమములు చేయవలెను.
శ్రీ అగ్నిమహాపురాణమునందు ప్రతిష్టాంగభూతశిలాన్యాసవిధి వర్ణనమను తొంబది రెండవ అధ్యాయము సమాప్తము.
