అగ్ని మహా పురాణము

Table of Contents

284 - అథమంత్ర రూపౌషధ కథనమ్

ధన్వన్తరి రువాచః

ధన్వంతరి పలికెను. ఓంకారాది మంత్రములు, ఆయురారోగ్య ప్రదములు, స్వర్గము ఇచ్సునవి కూడ, ఓం కారము ఆత్యుత్తమమైన మంత్రము, దానిని జపించిన వాడు, అమృత్యుడగును. గాయత్రి పరమ మంత్రము దానిని జపించినవాడు భుక్తి ముక్తులను పొందును. “ఓం నమోనారాయణాయ” అను మంత్రము సర్వార్థ సాధకము “ఓంనమోభగ వతే వాసుదేవాయ” యను మంత్రము సర్వ ఫలప్రదము. “ఓం హ్రూం నమోవిష్ణవే” యను మంత్రము పరమౌషధము దీనిచే దేవతలు అసురులును, లక్ష్మీవంతులై రోగముక్తులైరి. దీనివలన లోకోపకారము ధర్మము కలుగును. ఇది మహౌషధము “ధర్మః సద్ధర్మ కృద్దర్మీ” యను ధర్మసంబంధి నామములను జపించువాడు నిర్మలు డగును. శ్రీదః శ్రీశః, శ్రీనివాసః శ్రీధరః శ్రీనికేతసః, శ్రియః పతిః శ్రీపరమః" అను పదములను జపించువాడు ఐశ్వర్యమును పొందును. కామీకామ ప్రదః కామ కామపాల స్తథాహరిః; ఆనందోమాధవశ్చైవ" యను హరినామములు కామ ప్రదములు "రామః పరశురామశ్చ నృసింహో విష్ణురేవచ, త్రివిక్రమః" యను నామములు జయేచ్చక లవారు జపించ వలేను. విద్యాభ్యాసము చేయువారు నిత్యము పురుషోత్తమ నామము జపించవలెను. “దామోదరః" యను నామము బంధ హరము పుష్కరాక, యను నామము నేత్రరోగములను తొలగించును. "హృషీ కేశః యను నామము థయహరము. ఔషధకర్మ యందు అచ్యుతయను అమృత మంత్రమును జపించవలెను. "అపరాజితః" యను నామమును యుద్ధము నందును, జలము దాటునపుడు శ్రీనృసింహ నామమును స్మరించవలెను. పూర్వాదిదిక్కులందు క్షేమము కోరువాడు చక్రీ, గదీ, శార్జ్గీ, ఖడ్గీ, యను నామములు స్మరించవలెను, నారాయణ స్మరణము సదాచేయవలయును. నృసింహ స్మరణము సకల భీతినివారకము గరుడధ్వజస్మరణము విషహరము, వాసుదేవనామము సర్వదా జపించవలెను. ధాన్యా దులను ఇంటిలో వుంచునపుడును శయన సమయము నందును, అనంతాచ్యుత నామములు స్మరించవలెను. దుఃస్వప్న మున నారాయణుని, అగ్ని దాహాదులందు జలశాయిని స్మరించవలెను. విద్యార్థి హయగ్రీవుని పుత్రప్రాప్తి కాముడు జగ త్యూతిని శౌర్యకాముడు బలభద్రుని స్మరించవలెను. వీటిలో ఒక్కొక్క నామము యనేక ఫలముల నిచ్చును.

ఆగ్నిమహాపురాణమున మంత్ర రూపౌషధ కథనమను రెండువందల యెనుబది నాల్గవ అధ్యాయము సమాప్తము.