అగ్ని మహా పురాణము

Table of Contents

311 - అథ త్వరితా మూలమంత్రాది

అగ్ని రువాచః

ఆగ్ని దేవుడు చెప్పెను. సింహాసనము నందున్న వజ్ర వ్యాప్తకమలము నందు మంత్రన్యాస పూర్వక దీక్షాది విధాన మును చెప్పెదను. “హే హే హుతి వజ్ర దంత పరుపురు, లు, లు, గర్ణ, గర్ణ, ఇహ సింహాస నాయ నమః.” ఇది సింహాసన పూజా మంత్రమా. నాలుగు నిలువు రేఖలు, నాలుగు ఆడ్డరేఖలు గీయగా తొమ్మిది కోష్ఠములు ఏర్పడును. నాగు దిక్కు లందును వున్న కోష్ఠ స్కలను వుంచి విదిక్కులందున్న కోష్ఠములను చెరిపి వేయవలెను. మిగిలిన కోక్షముల కోణముల వరకు వచ్చు రేఖల ఎనిమిది యుండును. బాహ్య కోష్ఠము యొక్క బాహ్య భాగమునకు సరిగా మధ్య యందు వజ్ర మధ్య శృంగ మగును. బాహ్య రేఖను రెండు భాగములు చేయగా యెంత రేఖార్ధ మగునో అంత శృంగము మాత్రమే వుండవలెను. బాహ్య రేఖ వక్రముగా నుండవలెను. దానిని రెండుగా విభజించవలెను. మధ్య కోష్టమును కమలాకారముగ మార్చి పీత వర్ణ మగు కర్ణిక ఏర్పరుప వలయును. నల్లటి చూర్ణముతో కులిశ చక్రమను ఏర్పరచి దానిపై శృంగము ఆకారము ఖడ్గాకార ములో వుండునట్లు చేయవలెను. చక్ర బాహ్య భాగమున చతురస్ర చక్రము వ్రాసి వజ్ర సంపుటముతో చిహ్ని తము చేయవలెను. భూపుర ద్వార మున నాల్గు వజ్ర సంపుటములు ఏర్పరుప వలయును. పవ్మవు వామ వీడియు సమముగా నుండవలయును. కమలము లోపలి భాగము కేసరములు ఎర్రగా నుండవలెను. మండలము నందు స్త్రీలకు దీక్ష ఇచ్చి మఠిత్ర జపానుష్ఠానము చేయించినచో రాజు శీఘ్రము గా ఇతర రాజ్యములను జయించును. తాను తన రాజ్యమును కోల్పోయినచో దానిని మరల పొందును. ఓంకారముచే సందీప్త మగు మూ ర్తిని హుంకారముతో నియు క్తము చేసి వాయ్వాకాశ బీజములతో స-పుటిత మగు మూల విద్యనుచ్చరించి ఆద్యంతము లందు కర్ణి క యందు పూజి-చవలెను. ప్రదక్షిణ క్రమమున ఒక్కొక్క అక్షర రూపమగు బీజములను ఉచ్చరించుచు కమల దళములపై పూజ చేయవలయును.

దళముల పై విద్యాంగములను పూజించవలెను. ఆగ్నేయము నుండి వామ క్రమమున నైఋతి దిక్కు వరకు హృదయ శిరః శిఖా కవచ, నేత్రములను అన్ని దిక్కు లందును అస్త్రమును పూజించవలెను. గుహ్యాంగ మువ రక్షా పూజను కేసరముల పై వామ దక్షిణ పార్శ్వము లందున ఐదేసి హుతులను వాటి వాటి సోమ మంత్రములతో పూజించవలెను. గర్భ మండము వెలుపల ఎనమండుగురు లోక పాలకుల న్యాసము చేయవలెను. వర్ణాంతమును (క్ష హ) అగ్ని పై (ర) ఎక్కించి దానిని ఆరవ స్వరముతో (ఊ) భిన్నము చేసి పదునై దవ స్వరమును (0) దానిని శిరస్సుపై చేర్చి (క్షూం) లేదా (హూం) ఆ బీజమును ఆది యందుంచి దిక్పాలకులను తమ తమ నామ మంత్రములతో పూజించవలెను. పిదప శీఘ్రముగా సింహాసనముపై కమల కర్ణిక యందు గంధాద్యుప చారములతో పూజ చేయవలయును. దీనిచే ఐశ్వర్యము లభించును. పిదప నూట యెనిమిది మంత్రములతో ఆభి మంత్రితములగు ఎనిమిది కళలను కమలము చుట్టు వుంచి వెయ్యి పర్యాయములు జపము చేసి దశాంశము హోమము చేయవలయును. ముందు ఆగ్ని మంత్రముతో (రం) కుండము దగ్గరకు ఆగ్నిని తీసుకొని పోయి హృదయ మంత్రముతో (నమః) దానిని వుంచవలెను. కుండము నందు ఆగ్ని యుక్త మగు శ క్తిని భావన చేయవలెను. ఆ శక్తి యందు గర్భాధావ, పుంసవన జాతకర్మ సంస్కారములనుద్దేశించి హృదయ మంత్రమతో కూడ యెనిమిది పర్యాయ ములు హోమము చేయవలెను. గుహ్యాంగము నుండి నూతనాగ్ని జన్మించినట్లు భావన చేసి మూలవిద్యను నుచ్చరించుచు పూర్ణాహుతి నివ్వవలెను. దీనితో శివాగ్ని జన్మ సిద్ధించును. పిదప మూల మంత్రముతో దానిలో నూరుహోమములు చేసి అంగములనుద్దేశించి దశాంశ హోమము చేసి శిష్యుని దేవి చేతిలో సమర్పించి వానిని మండపము నందు ప్రవేశ పెట్టవలెను. అస్త్ర మంత్రముతో తాడనము చేసి గుహ్యాంగముల వ్యాసము చేయవలెను. విద్యాంగ ముంచే సన్నద్ధులగు శిష్యుని విద్యాంగము  లందు ని యోగింపవలేను. వానిచే ఒక పుష్పమా విసిరినట్లు చేసి వానిని అగ్ని కుండ సమీపమునకు తీసుకొని వెళ్ళి మూల విద్యను ఉచ్చరించుచు యవధాన్య తిల మృతములతో నూరు హోమలు చేయవలెను. ప్రథమ హోమము స్థావర జన్మము నీచ్చి వానికి ముక్తి నిచ్చును. రెండవది సరిప్రుప జన్మను పిదప వరసగా పక్షి మృగ పశు మానవ జన్మమును ఇచ్చి దాని యందు విముక్తి నిచ్చును. పిదప క్రమముగ బ్రహ్మ విష్ణుపడ, రుద్ర పదము లభించును. ఆంతమున పూర్ణాహుతి ఇవ్వవలెను. ఒక ఆహుతిచే శిష్యుడు మోక్షాధికారి యగును. మోక్షమనగా యెట్లుండునో వినుము.

మంత్రోపాసకుడు సుమేరువు పై సదాశివ పదమునందున్న చో రెండవ దినమున స్వస్థచిత్తుడై కర్మ క్షయనిమి త్తమై వేయి హోమములు చేయవలెను. పిదప పూర్ణాహుతి ఇచ్చిన మంత్రయోగి ధర్మా ధర్మ సంబంధ శూన్యుడై మోక్షమును పొందును. అచ్చటి వెళ్ళి మళ్ళి తిరిగి రాడు జలములో పోసిన జలము దానితో కలసి ఏక రూపమైనట్లు జీవుడు. శివునితో కలసి శివ రూపుడగును. కలశలతో అభిషేకము చేసినవాడు విజయ రాజ్యాదులను పొందును. బ్రాహ్మణ కన్యకను పూజించి గుర్వాదులకు దక్షిణ ఇవ్వవలెను. ప్రతి దినము పూజ చేసి వెయ్యి హోమములు చేయవలెను. తిల ఘృతములతో హోము చేసినచో దేవిలక్ష్మిని, సమస్త కామములను ఇచ్చును. ఆనేక మైన భోగములను ఇచ్చి కోరిన కోరికలన్నియు తీర్చను. మత్రమంలో ఎన్ని అక్షర వలలున్నవో అన్ని లక్షల జపము చేయుటచే నిధులకు ఆధిపతి యగును. రెట్టింపు జపము చేసిన వాడు రాజ్యమును పొందుచు. మూడు రెట్లు జపము చేసినవానికి యక్షిణి సిద్దించును. నాలుగు రెట్లు జపము బ్రహ్మ పదం, ఐదురెట్లు ఎక్కువచేసిన విష్ణు పదము ఆరు రెట్లు ఎక్కువచేసిన మహాసిద్దియు లభించును. ఈ మంత్రమును లక్ష పర్యాయము జపించినచో పాపము నశించును. పది పర్యాయములు జపించినచో దేహశుద్ధి కలుగును. నూరు పర్యాయ ములు జపించినచో తీర్థస్నాన ఫలము లభించును. వేడక పై పటమును గాని, ప్రతిమను గాని వుంచి దాని మొదట లక్ష లేదా పదివేల జపము చేసి హోమము చేయవలెను. ఈ విధముగా జపము చేసి లక్ష హోమములు చేయవలెను. తిల యువ,  లాజ, వ్రీహి గోధూమ, ఆమ్ర ఫలబిల్వ ఫలములను కలిపి వాటి పై నెయ్యిపోసి వాటితో హోమము చేసి వ్రతమును ఆవలంబించవలెను. రాత్రి కవచాదులు ధరించి ఖడ్గ ధన్బూణాదులు గ్రహించి ఏకవస్త్ర ధారియై పైన చెప్పిన వస్తువులతో దేవుని పూజించవలెను. వస్త్రము రంగు రక్తముగాని పీతముగాని కృష్ణము గాని నీలము గాని వుండవలెను. దక్షిణ దిశకు వెళ్ళి మండప ద్వారముపై దూతి మంత్రముతో బలి సమర్పించవలెను. ఈ బలి ద్వారాదులందుగాని, ఒక వృక్షము వున్న శ్మశానము నందుగాని ఇవ్వవచ్చును. ఇట్లు చేసిన సాధకుడు రాజ్యము పొంది సమస్త కామములను అను భవించుచు సకల పృథ్విని ఏలును.

అగ్ని మహాపురాణమున త్వరిలో మూలమంత్రాది వర్ణనయను మూడు వందల పదకొండవ అధ్యాయము సమాప్తము.