అగ్ని మహా పురాణము

Table of Contents

118 - అథ భారతవర్ష వర్ణనమ్

అగ్ని రువాచః-

అగ్ని దేవుడు వలికెను : సముద్రమునకు ఉత్తరమునను, హిమాలయమునకు దక్షిణమునను ఉన్న వర్షము “భారతవర్షము”. దీని విస్తారము తొమ్మిది వేల యోజనములు, స్వర్గాపవర్గములు పొండ గోరువారికి ఇది కర్మభూమి. మహేంద్ర-మలయ–సహ్య-శక్తి మత్-హిమాలయ-వింధ్య-పారియాత్రలు ఈ వర్షమునంద సప్త కులపర్వతములు. ఇంద్రద్వీపక సేరు-తామ్రవర్ణ-గభస్తిమత్-నాగ ద్వీప-సౌమ్య-గాంధర్వ-వారుజామలు ఎనిమిది ద్వీపకలు. సముద్రముచే చుట్టబడి యున్న భారతవర్షము తొమ్మిదవ ద్వీపము. భారతద్వీతము ఉత్తరము నుండి దక్షిణమునకు వేలకొలది యోని వములు పొడ వై నది. భారతమునందు పైన చెప్పిన తొమ్మిది భాగము లున్నవి. భారతము మధ్యమునం దున్నది. ఆ దానికి తూర్పున కిరాతులు, పశ్చిమమున యవనులు ఉందురు. మధ్యభాగమున బ్రాహ్మణాదివర్ణములవా రందడ. వేడి. వృత్యాది నదులు పారియాత్రమునుండియు, నర్మదాదులు వింధ్యాచలమునుండియా, లాఓపయోష్టి-గోదావరీ_భీమరథి. కృష్ణవేణీనదాదుల సహ్యాద్రినుండియ, కృతమాలాదులు మలయమునుండియు, త్రిసామాదులు మహేంద్రపర్వతము నుండియు, కుమార్యాదినదులు శక్తి మత్పర్వతమునుండియు, చంద్రభాగాదులు హిమాలయమునుండియు ఆవిర్భవించినవి. భారతమును పశ్చిమమున కురుపాంచాల-మధ్యదేశాదు లున్నవి.

ఆగ్ని మహాపురాణమునందు భారతవర్షవర్ణనమను నూట పదునెనిమిదవ అధ్యాయము నమాప్తము.